- మాయాయాః ఆశ్రయ భూతం చైతన్యం సామాన్యచైతన్యం -
(మాయ ఆశ్రయించియుండు చైతన్యము)
- వ్యాపకమైన చైతన్యమునే సామాన్య చైతన్యమందురు - వృత్తియందుండు చైతన్యమును విశేష చైతన్య
మందురు. కాష్టమునందుండు సామాన్యాగ్ని వ్యాపకమైన సామాన్య చైతన్యము. ఇది అంధకారమునకు విరోధికాదు -
మంథనమువలన ప్రకటితమైన అగ్ని వర్తియందు స్థితమై అంధకారమునకు విరోధియగును - అది విశేష చైతన్యము -
అట్లే వ్యాకమగు సామాన్యచైతన్యము అజ్ఞానమునకు విరోధికాదు. వేదాంత విచారమువలన ఏ అంతఃకరణ వృత్తి
బ్రహ్మాకారమగునో దానియందుండిన విశేష చైతన్యము విరోధిగా నున్నది.
“ఈ రీతిగా సర్వులకు ప్రతీతమైన ఏ ఆత్మయొక్క సద్రూపముగలదో అది సామాన్య స్వరూపము - మఱియు, కేవల
జ్ఞానికి ప్రతీతమైన ఏ చైతన్యానందాదిక రూపము గలదో అది విశేషరూపము”.
Transliteration
- māyāyāḥ āśraya bhūtaṃ caitanyaṃ sāmānyacaitanyaṃ -
(māya āśrayiṃciyuṃḍu caitanyamu)
- vyāpakamaina caitanyamunē sāmānya caitanyamaṃduru - vṛttiyaṃduṃḍu
caitanyamunu viśēṣa caitanya maṃduru. kāṣṭamunaṃduṃḍu sāmānyāgni
vyāpakamaina sāmānya caitanyamu. idi aṃdhakāramunaku virōdhikādu -
maṃthanamuvalana prakaṭitamaina agni vartiyaṃdu sthitamai
aṃdhakāramunaku virōdhiyagunu - adi viśēṣa caitanyamu - aṭlē vyākamagu
sāmānyacaitanyamu ajñānamunaku virōdhikādu. vēdāṃta vicāramuvalana ē
aṃtaḥkaraṇa vṛtti brahmākāramagunō dāniyaṃduṃḍina viśēṣa caitanyamu
virōdhigā nunnadi.
“ī rītigā sarvulaku pratītamaina ē ātmayokka sadrūpamugaladō adi
sāmānya svarūpamu - maṟiyu, kēvala jñāniki pratītamaina ē
caitanyānaṃdādika rūpamu galadō adi viśēṣarūpamu”.
English
English translation not yet available for this entry. Let us know if you'd like to help.