← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమవాయి కారణము samavāyi kāraṇamu

Original — తెలుగు
  1. “యత్సమవేతం కార్యముత్పద్యతే తత్సమవాయి కారణం - యథా తంతవః పటస్య, పటశ్చ స్వగతి రూపాదేః -”. (తర్క సంగ్రహే)

(ఏది కలియుటవల్ల కార్యము కలుగుచున్నదో అది సమవాయికారణము - దారములు కలిసి బట్ట యగు చున్నవి.)

  1. “కార్యం యస్మిన్ సమవాయి సంబంధేనవర్తమానం సదుత్పద్యతే తత్సమవాయికారణ మిత్యర్థః - దృష్టాంత ముఖే స్పష్టయతి - యథా తంతవః పటస్యేతి - - - అత్రహి పటాత్మకం కార్యం తంతుషు సమవాయి సంబంధేన విద్యతే అవయవా యవినో సమవాయాత్” (నిరుక్తి)

(దేని సమవాయ సంబంధమువలన కార్యవస్తువు కలుగుచున్నదో అది సమవాయికారణము - ఇది దృష్టాంతముచే దృఢస్పష్టము చేయబడుచున్నది - దారములు కలిసి బట్టకు కారణమైనట్లు - బట్త కార్యము, దారములు సమవాయికారణము - అవయవములకు అవయవములు కలదానికి సమవాయి సంబంధము కలుగుటచేత).

  1. యస్మిన్ సమవేతం సత్సమవాయి సంబంధేన వర్తమానం సత్కార్య ముత్పద్యతే తత్సమవాయి కారణమిత్యర్థః - ఉదాహరతి - యథా తంతవః ఇతి. ఏషు తంతుషు సమవాయేన సంబద్ధం సత్పటాత్మక కార్యముత్పద్యతే తత్తంతవః సమవాయి కారణమిత్యర్థః.

(దేనియందు కొన్ని కలియుటచేత ఒక కార్యవస్తువు కలియుచున్నదో అది సమవాయికారణము - దీనికి ఉదాహరణ - దారముల సమూహముచేత - దారములు కూడుటచేత - బట్ట అను కార్యము కలుగుచున్నది. ఆ దారములు సమవాయి కారణము.)

  1. ఒక వస్తువుల సముదాయముచేత కార్యరూపముగా మారు కారణము. నూలు దారములు ఒకదానితో ఒకటి కలిసి బట్టను కలుగచేయుచున్నవి - బట్తగా మారుచున్నవి. అందుచేత నూలుదారములు బట్టకు సమవాయి కారణము -

  2. మేళనం (కూడిన సంబంధము)

  3. సముదాయః (సముదాయః = సమూహము)

  4. నిత్య సంబంధః సమవాయః - న్యాయమితే గుణగుణినోః జాతి వ్యక్త్యోః క్రియాక్రియవతోః, కారణ కార్యయోః - అవయవావయవినోశ్చ సంబంధః సమవాయః -

(నిత్యసంబంధము - న్యాయశాస్త్ర ప్రకారము గుణమునకు గుణము కలదానికి, క్రియకు క్రియ చేయువానికి, కారణమునకు కార్యమునకు, అవయవములకు అవయవములు గలదానికి గల సంబంధము; గుణములు, అవి గలవాడు గుణి, ఈ రెండింటికి గల సంబంధము, పని, ఆ పని చేయువానికి గల సంబంధము విశేషణమునకు విశేష్యమునకు గల సంబంధము - నీల ఘటము అనునప్పుడు నీల రంగును ఘటమునకు గల సంబంధము - దారములకు వాటితో నేయబడిన బట్టకు గల సంబంధము - ఇటువంటి సంబంధమును సాంఖ్యులు సమవాయి సంబంధమని చెప్పుదురు).

శక్తికినీ, శక్తిగలవానికి గల సంబంధము ఇట్టిదే - పరబ్రహ్మకును, అతని శక్తికిని గల సంబంధము - శివును విడువకుండనున్న, అతని శరీరములో సగము భాగము అయిన అతని శక్తి అయిన పార్వతికిన్నీ, శివునకు నున్న సంబంధము అతనినుండి విడదీయలేని సంబంధము - అంబ అనగా పార్వతి, సాంబశివుడు అనగా (స + అంబ - సాంబ) అంబతో కలిసియున్న శివుడు అని చెప్పబడుచున్నాడు. శ్రీమహాలక్ష్మి శ్రీమహావిష్ణువు యొక్క శక్తి. ఆమె శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలమందు నిత్యము ఉండునది. అందుచేత ‘నిత్యానపాయిని’ - ఎప్పుడును అతనిని విడువకుండునది - నిత్యము అతనితో కలిసి యుండునది.

“క. అమలుడగు నితని సాన్ని

ధ్యమువలన సృజింతు జగము తంద్రితనై; ఇ

ట్లమర జడులచే దత్సృ

ష్టము కల్పింపబడు నీ యసంగుని యందున్ “. (శ్రీసీతారామాంజనేయ సంవాదము - 1 - 30)

(శ్రీరామచంద్రునితో నేను (శ్రీ సీతామహలక్ష్మి) కలిసియుండుట చేతనే నేను ఈ జగత్తును సృష్టించుచున్నాను. కాని శ్రీరామచంద్రుడు - రామచంద్ర పరబ్రహ్మ - అసంగుడు (దేనితోను కలియనివాడు). అజ్ఞానులు ఈ సృష్టి పరబ్రహ్మయే (శ్రీరామచంద్రుడే) చేయుచున్నాడని భావించెదరు -

- శ్రీసీతామహలక్ష్మి శ్రీరామచంద్రపరబ్రహ్మ యొక్క శక్తియే. ఆమెయే ప్రకృతి - జడశక్తి. ఈ శక్తి శ్రీరామచంద్రునితో ఎడతెగక కలిసియుండుటచేతనే ప్రకృతిలోనుండి ఈ జగత్తులోని వస్తువులన్నియు సృష్టింప బడుచున్నవి. దీనినే ప్రకృతి పురుష సంయోగమని చెప్పుదురు - (combination of matter and Energy).

Transliteration
  1. “yatsamavētaṃ kāryamutpadyatē tatsamavāyi kāraṇaṃ - yathā taṃtavaḥ paṭasya, paṭaśca svagati rūpādēḥ -”. (tarka saṃgrahē)

(ēdi kaliyuṭavalla kāryamu kalugucunnadō adi samavāyikāraṇamu - dāramulu kalisi baṭṭa yagu cunnavi.)

  1. “kāryaṃ yasmin samavāyi saṃbaṃdhēnavartamānaṃ sadutpadyatē tatsamavāyikāraṇa mityarthaḥ - dṛṣṭāṃta mukhē spaṣṭayati - yathā taṃtavaḥ paṭasyēti - - - atrahi paṭātmakaṃ kāryaṃ taṃtuṣu samavāyi saṃbaṃdhēna vidyatē avayavā yavinō samavāyāt” (nirukti)

(dēni samavāya saṃbaṃdhamuvalana kāryavastuvu kalugucunnadō adi samavāyikāraṇamu - idi dṛṣṭāṃtamucē dṛḍhaspaṣṭamu cēyabaḍucunnadi - dāramulu kalisi baṭṭaku kāraṇamainaṭlu - baṭta kāryamu, dāramulu samavāyikāraṇamu - avayavamulaku avayavamulu kaladāniki samavāyi saṃbaṃdhamu kaluguṭacēta).

  1. yasmin samavētaṃ satsamavāyi saṃbaṃdhēna vartamānaṃ satkārya mutpadyatē tatsamavāyi kāraṇamityarthaḥ - udāharati - yathā taṃtavaḥ iti. ēṣu taṃtuṣu samavāyēna saṃbaddhaṃ satpaṭātmaka kāryamutpadyatē tattaṃtavaḥ samavāyi kāraṇamityarthaḥ.

(dēniyaṃdu konni kaliyuṭacēta oka kāryavastuvu kaliyucunnadō adi samavāyikāraṇamu - dīniki udāharaṇa - dāramula samūhamucēta - dāramulu kūḍuṭacēta - baṭṭa anu kāryamu kalugucunnadi. ā dāramulu samavāyi kāraṇamu.)

  1. oka vastuvula samudāyamucēta kāryarūpamugā māru kāraṇamu. nūlu dāramulu okadānitō okaṭi kalisi baṭṭanu kalugacēyucunnavi - baṭtagā mārucunnavi. aṃducēta nūludāramulu baṭṭaku samavāyi kāraṇamu -

  2. mēḷanaṃ (kūḍina saṃbaṃdhamu)

  3. samudāyaḥ (samudāyaḥ = samūhamu)

  4. nitya saṃbaṃdhaḥ samavāyaḥ - nyāyamitē guṇaguṇinōḥ jāti vyaktyōḥ kriyākriyavatōḥ, kāraṇa kāryayōḥ - avayavāvayavinōśca saṃbaṃdhaḥ samavāyaḥ -

(nityasaṃbaṃdhamu - nyāyaśāstra prakāramu guṇamunaku guṇamu kaladāniki, kriyaku kriya cēyuvāniki, kāraṇamunaku kāryamunaku, avayavamulaku avayavamulu galadāniki gala saṃbaṃdhamu; guṇamulu, avi galavāḍu guṇi, ī reṃḍiṃṭiki gala saṃbaṃdhamu, pani, ā pani cēyuvāniki gala saṃbaṃdhamu viśēṣaṇamunaku viśēṣyamunaku gala saṃbaṃdhamu - nīla ghaṭamu anunappuḍu nīla raṃgunu ghaṭamunaku gala saṃbaṃdhamu - dāramulaku vāṭitō nēyabaḍina baṭṭaku gala saṃbaṃdhamu - iṭuvaṃṭi saṃbaṃdhamunu sāṃkhyulu samavāyi saṃbaṃdhamani ceppuduru).

śaktikinī, śaktigalavāniki gala saṃbaṃdhamu iṭṭidē - parabrahmakunu, atani śaktikini gala saṃbaṃdhamu - śivunu viḍuvakuṃḍanunna, atani śarīramulō sagamu bhāgamu ayina atani śakti ayina pārvatikinnī, śivunaku nunna saṃbaṃdhamu ataninuṃḍi viḍadīyalēni saṃbaṃdhamu - aṃba anagā pārvati, sāṃbaśivuḍu anagā (sa + aṃba - sāṃba) aṃbatō kalisiyunna śivuḍu ani ceppabaḍucunnāḍu. śrīmahālakṣmi śrīmahāviṣṇuvu yokka śakti. āme śrīmahāviṣṇuvu yokka vakṣasthalamaṃdu nityamu uṃḍunadi. aṃducēta ‘nityānapāyini’ - eppuḍunu atanini viḍuvakuṃḍunadi - nityamu atanitō kalisi yuṃḍunadi.

“ka. amaluḍagu nitani sānni

dhyamuvalana sṛjiṃtu jagamu taṃdritanai; i

ṭlamara jaḍulacē datsṛ

ṣṭamu kalpiṃpabaḍu nī yasaṃguni yaṃdun “. (śrīsītārāmāṃjanēya saṃvādamu - 1 - 30)

(śrīrāmacaṃdrunitō nēnu (śrī sītāmahalakṣmi) kalisiyuṃḍuṭa cētanē nēnu ī jagattunu sṛṣṭiṃcucunnānu. kāni śrīrāmacaṃdruḍu - rāmacaṃdra parabrahma - asaṃguḍu (dēnitōnu kaliyanivāḍu). ajñānulu ī sṛṣṭi parabrahmayē (śrīrāmacaṃdruḍē) cēyucunnāḍani bhāviṃcedaru -

- śrīsītāmahalakṣmi śrīrāmacaṃdraparabrahma yokka śaktiyē. āmeyē prakṛti - jaḍaśakti. ī śakti śrīrāmacaṃdrunitō eḍategaka kalisiyuṃḍuṭacētanē prakṛtilōnuṃḍi ī jagattulōni vastuvulanniyu sṛṣṭiṃpa baḍucunnavi. dīninē prakṛti puruṣa saṃyōgamani ceppuduru - (combination of matter and Energy).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.