ప్రకృతి పురుష కాలాన్ కార్యోత్పత్తి యోగ్యన్ కరో తీత్యర్థః - మహదాది సృష్టిః అండరూప కార్యోత్పత్త్యుపయుక్తా సంభరణమితి వా వివక్షా -
(ప్రకృతి, పురుషుడు, కాలము అను మూడింటిని - మూడు శక్తులను (కారణవస్తులను) - కార్యములను (కార్య వస్తువులను) సృష్టించుటకు యోగ్యమగువాటినిగా చేయునది, మహత్తత్త్వము మొదలగు వాటి సృష్టి, బ్రహ్మాండము మొదలగు కార్యవస్తువులను పుట్టించుటకు ఉపయోగపడునట్లు చేయువాడు).
(ప్రకృతి పురుష సం యోగమువలననే సృష్టి ప్రారంభమై ఇప్పటివరకును జరుగుచున్నది. ఇటుపైన కూడ నిట్లే జరుగును. ఇది కాలక్రమమును బట్టి జరుగుచున్నది. అందుచేత ఈ మూడు శక్తులు చెప్పబడినవి. ప్రకృతిలో పురుషుడు అనగా పరబ్రహ్మ తన పరాశక్తి తో - చైతన్య శక్తితో ప్రవేశించిన మీదట జడమైన ప్రకృతికి చైతన్యము కలిగి, తనలోనుండి యింకొక వస్తువును పుట్టించును, లేక, తానే యింకొక వస్తువుగా మారును. ఇట్లు జరుగుటకు పురుషుడు (పరబ్రహ్మ - పురమందు శయనించువాడు) కారణమగుటవలన - పరబ్రహ్మ “సంభర్తా”, లేక, భర్త అని చెప్పబడుచున్నాడు).
“యావత్సంజాయతే కించిత్సత్వం స్థావర జంగమం |
క్షేత్ర క్షేత్ర సం యోగాత్ తద్విద్ధి భరతర్షభ ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 26)
(చరాచరములయిన వస్తువులలో ఏదైనను పుట్టినట్లయిన అది క్షేత్రము (ప్రకృతి) క్షేత్రజ్ఞుడు (పరబ్రహ్మ) అను రెండింటి సం యోగము (కలయిక) వలననే కలుగుచున్నదని తెలియుము)
prakṛti puruṣa kālān kāryōtpatti yōgyan karō tītyarthaḥ - mahadādi sṛṣṭiḥ aṃḍarūpa kāryōtpattyupayuktā saṃbharaṇamiti vā vivakṣā -
(prakṛti, puruṣuḍu, kālamu anu mūḍiṃṭini - mūḍu śaktulanu (kāraṇavastulanu) - kāryamulanu (kārya vastuvulanu) sṛṣṭiṃcuṭaku yōgyamaguvāṭinigā cēyunadi, mahattattvamu modalagu vāṭi sṛṣṭi, brahmāṃḍamu modalagu kāryavastuvulanu puṭṭiṃcuṭaku upayōgapaḍunaṭlu cēyuvāḍu).
(prakṛti puruṣa saṃ yōgamuvalananē sṛṣṭi prāraṃbhamai ippaṭivarakunu jarugucunnadi. iṭupaina kūḍa niṭlē jarugunu. idi kālakramamunu baṭṭi jarugucunnadi. aṃducēta ī mūḍu śaktulu ceppabaḍinavi. prakṛtilō puruṣuḍu anagā parabrahma tana parāśakti tō - caitanya śaktitō pravēśiṃcina mīdaṭa jaḍamaina prakṛtiki caitanyamu kaligi, tanalōnuṃḍi yiṃkoka vastuvunu puṭṭiṃcunu, lēka, tānē yiṃkoka vastuvugā mārunu. iṭlu jaruguṭaku puruṣuḍu (parabrahma - puramaṃdu śayaniṃcuvāḍu) kāraṇamaguṭavalana - parabrahma “saṃbhartā”, lēka, bharta ani ceppabaḍucunnāḍu).
“yāvatsaṃjāyatē kiṃcitsatvaṃ sthāvara jaṃgamaṃ |
kṣētra kṣētra saṃ yōgāt tadviddhi bharatarṣabha ||“. (śrīmadbhagavadgīta - 13 - 26)
(carācaramulayina vastuvulalō ēdainanu puṭṭinaṭlayina adi kṣētramu (prakṛti) kṣētrajñuḍu (parabrahma) anu reṃḍiṃṭi saṃ yōgamu (kalayika) valananē kalugucunnadani teliyumu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.