← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంభవః saṃbhavaḥ

Original — తెలుగు
  1. ఉత్పత్తిః; జన్మ; సమ్యక్ భవతీతి సంభవః.

(పుట్టుట, ఒకవస్తువులోనుండి ఇంకొకటి పుట్టుట. ఒక వస్తువు ఇంకొక వస్తువుగా మారుట)

  1. “మమ యోని ర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దిధామ్యహం |

సంభవః సర్వ భూతానాం తతో భవతి భారత ||” (శ్రీమద్భగవద్గీత - 14 - 3)

(మహద్బ్రహ్మ - చతుర్ముఖబ్రహ్మ, లేక ప్రకృతి నాకు యోని స్థానము - (గర్భము ధరించునది). దానిలో నేను సృష్టి బీజమునుంచుచున్నాను. అది గర్భము ధరించునట్లు చేయుచున్నాను. దాని నుండి సమస్త భూతముల సంభవము - పుట్టుక కలుగుచున్నది.

“సర్వ యోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః |

తానాం బ్రహ్మ మహద్యోని రహం బీజ ప్రదః పితా ||“. (శ్రీమద్భగవద్గీత - 14 - 4)

(ఏ యే యోనులందు - ఏ యే మూర్తులు పుట్టుచున్నవో వాటి అన్నింటికి చతుర్ముఖబ్రహ్మ మహద్యోని, తండ్రివలె వాటి అన్నింటికి బీజమునిచ్చువాడను నేను - పుట్టిన వస్తువులన్నింటిలోన ప్రకృతియొక్క అంశ (material cause - which supplies material for building body) ఉపాదానము, భగవంతుని అంశ నిమిత్తకారణము - ఈ రెండును ప్రతి వస్తువులో నుండును - అట్లుండుటవలననే ఒక వస్తువులోనుండి యింకొక వస్తువు సంభవించుచున్నది - పుట్టుచున్నది)

Transliteration
  1. utpattiḥ; janma; samyak bhavatīti saṃbhavaḥ.

(puṭṭuṭa, okavastuvulōnuṃḍi iṃkokaṭi puṭṭuṭa. oka vastuvu iṃkoka vastuvugā māruṭa)

  1. “mama yōni rmahadbrahma tasmin garbhaṃ didhāmyahaṃ |

saṃbhavaḥ sarva bhūtānāṃ tatō bhavati bhārata ||” (śrīmadbhagavadgīta - 14 - 3)

(mahadbrahma - caturmukhabrahma, lēka prakṛti nāku yōni sthānamu - (garbhamu dhariṃcunadi). dānilō nēnu sṛṣṭi bījamunuṃcucunnānu. adi garbhamu dhariṃcunaṭlu cēyucunnānu. dāni nuṃḍi samasta bhūtamula saṃbhavamu - puṭṭuka kalugucunnadi.

“sarva yōniṣu kauṃtēya mūrtayaḥ saṃbhavaṃti yāḥ |

tānāṃ brahma mahadyōni rahaṃ bīja pradaḥ pitā ||“. (śrīmadbhagavadgīta - 14 - 4)

(ē yē yōnulaṃdu - ē yē mūrtulu puṭṭucunnavō vāṭi anniṃṭiki caturmukhabrahma mahadyōni, taṃḍrivale vāṭi anniṃṭiki bījamuniccuvāḍanu nēnu - puṭṭina vastuvulanniṃṭilōna prakṛtiyokka aṃśa (material cause - which supplies material for building body) upādānamu, bhagavaṃtuni aṃśa nimittakāraṇamu - ī reṃḍunu prati vastuvulō nuṃḍunu - aṭluṃḍuṭavalananē oka vastuvulōnuṃḍi yiṃkoka vastuvu saṃbhaviṃcucunnadi - puṭṭucunnadi)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.