చిచ్ఛక్తి రూపదేవతా; ఆదిత్యరూపము; గాయత్రీరూపము అగు బ్రహ్మచైతన్యమే సంధ్యాదేవత.
“ఉపాస్తే సంధి వేళాయాం నిశాయాం దివసస్యచ |
తామేవ సంధ్యాం తస్మాత్తు ప్రవదంతి మనీషిణః ||“.
(రాత్రికి పగటికి సంధ్య కాలమందు దేనిని ఉపాసించుదురో దానినే సంధ్యాదేవి యని పండితులు చెప్పుదురు),.
(అన్ని వర్ణములతోను ప్రకాశించు మహాదేవియైన సంధ్యా విద్యయగు ఓ సరస్వతీ, నీవే ఓజస్సు, నీవే సహః, నీవే బలము, భ్రాజము, దేవతుల ధామము (నెలవు) పేరున్నూ, ప్రపంచము నీవే, ప్రపంచముయొక్క ఆయువు నీవే, అన్నీ నీవే, అన్నింటి ఆయువు నీవే).
(ఆ పరమాత్మ రూపుడైన సవిత దేవతయొక్క తేజస్సును ధ్యానము చేయుచున్నాను ” ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తీ- - - ప్రోద్యదాత్య వర్గాబహః నారాయణః - - - సూర్యమండల మధ్య గతః”
(సూర్యమండలమందున్న ఆ సూర్యతేజో రూపుడైన ఆ శ్రీమన్నారాయణుని ఎల్లపుడు ధ్యానించవలెను)
“యదాదిత్యగతం తేజః - - - తత్తేజో విద్ధిమామకం -” (శ్రీమద్భగవద్గీత - 15 - 12)
(సూర్యమండలములో నున్న తేజస్సు నాదే) అని చెప్పుటవలన పరబ్రహ్మ తేజోరూపుడనిన్నీ, అతని తేజస్సు సూర్యమండలములోనున్నందువలన అది పరబ్రహ్మ రూపమని ఆ తేజస్సే సంధ్యా దేవి యని, గాయత్రియని ఉపాసించవలెను - ఇందుచేతనే సూర్య నమస్కారములు చేయుచున్నారు - ఆదిత్య హృదయము అనగా సూర్యునిలోనున్న పరబ్రహ్మ తేజస్సును ఉపాసించుచున్నారు - జపించుచున్నారు.
cicchakti rūpadēvatā; ādityarūpamu; gāyatrīrūpamu agu brahmacaitanyamē saṃdhyādēvata.
“upāstē saṃdhi vēḷāyāṃ niśāyāṃ divasasyaca |
tāmēva saṃdhyāṃ tasmāttu pravadaṃti manīṣiṇaḥ ||“.
(rātriki pagaṭiki saṃdhya kālamaṃdu dēnini upāsiṃcudurō dāninē saṃdhyādēvi yani paṃḍitulu ceppuduru),.
(anni varṇamulatōnu prakāśiṃcu mahādēviyaina saṃdhyā vidyayagu ō sarasvatī, nīvē ōjassu, nīvē sahaḥ, nīvē balamu, bhrājamu, dēvatula dhāmamu (nelavu) pērunnū, prapaṃcamu nīvē, prapaṃcamuyokka āyuvu nīvē, annī nīvē, anniṃṭi āyuvu nīvē).
(ā paramātma rūpuḍaina savita dēvatayokka tējassunu dhyānamu cēyucunnānu ” dhyēyassadā savitṛmaṃḍala madhyavartī- - - prōdyadātya vargābahaḥ nārāyaṇaḥ - - - sūryamaṃḍala madhya gataḥ”
(sūryamaṃḍalamaṃdunna ā sūryatējō rūpuḍaina ā śrīmannārāyaṇuni ellapuḍu dhyāniṃcavalenu)
“yadādityagataṃ tējaḥ - - - tattējō viddhimāmakaṃ -” (śrīmadbhagavadgīta - 15 - 12)
(sūryamaṃḍalamulō nunna tējassu nādē) ani ceppuṭavalana parabrahma tējōrūpuḍaninnī, atani tējassu sūryamaṃḍalamulōnunnaṃduvalana adi parabrahma rūpamani ā tējassē saṃdhyā dēvi yani, gāyatriyani upāsiṃcavalenu - iṃducētanē sūrya namaskāramulu cēyucunnāru - āditya hṛdayamu anagā sūryunilōnunna parabrahma tējassunu upāsiṃcucunnāru - japiṃcucunnāru.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.