సంధి
సంధౌ భవా సంధ్యా
(సంధియందైనది సంధ్య)
(సూర్యుడు పరిభ్రమించుచు (తిరుగుచు) లోకములను అలోకములను సంధానము చేయును - కలుపును. అందుచేత ఆ రెండింటికీ మధ్య సంధ్యయని చెప్పబడుచున్నది)
(లోకములు అనగా చూచుటకు వీలగునవి; చూచుటకు వీలుకానివి అలోకములు. అందుచేత పగలు రాత్రి - ఈ రెండింటిని కలుపునది - ఈ రెండింటికి మధ్యనున్నది సంధ్య).
భూత లయ రూపంబంగు రాత్రికిని భూతోత్పత్తి రూపంబగు ఉదయమునకు గల సంధి.
పరబ్రహ్మమునకును జగదుత్పత్తి పూర్వాపరమునకును జగన్నిర్మాణేచ్చారూపంబగు సంధియే సంధ్య.
సంధ్యా శబ్దః సంధ్యాకాలిక కర్మ పరః -
(సంధ్యాకాలమందు చేయుకర్మ)
యా భవేత్ పశ్చిమా సావిజ్ఞేయా సరస్వతి |
స్వేతా భవతి గాయత్రి సావిత్రీ రక్తవర్ణికా |
కృష్ణా సరస్వతీగేయా సంధ్యా త్రయ ముపా హృతం ||”
(ప్రొద్దుట యందలి సంధ్య - రాత్రిని ఉదయమును కలుపు సంధ్య - గాయత్రియనియు; మధ్యాహ్నమందు సంధ్య పూర్వాహ్నమును సాయాహ్నమును కలుపు సంధ్య సావిత్రియనియు, సాయంకాలము సంధ్య - సాయంకాలమును రాత్రిని కలుపు సంధ్య - సరస్వతి యనియు తెలుసుకొనవలెను - గాయత్రి తెల్లగానుండును, సావిత్రి ఎఱ్ఱగానుండును, సరస్వతి నల్లగానుండును)
తదేవ సంధ్యామిత్యుక్తం కర్మ బ్రహ్మణ్య మూలకం ||.
(ఈ సూర్యుడే బ్రహ్మయని ప్రతిరోజు చేయు ధ్యానము సంధ్య - బ్రహ్మ మూలకమైన కర్మ - “యదాదిత్యగతం తేజః - - - తత్తేజోవిద్ధి మామకం”. (శ్రీమద్భగవద్గీత - 15 - 12)
సంధౌ జీవాత్మనో రైక్యం సా సంధ్యా సద్భిరుచ్యతే ||“;
(నీళ్ళు వదలుటచేత గాని, మంత్రములనుచ్చరించుటచేతగాని సంధ్య కలుగదు - జీవాత్మలు ఏకమగుటయే సంధ్యయని సత్పురుషులు చెప్పుదురు -
తత్ర సంధ్యా ముపాసీత సాయంప్రాత సమాహితః ||“.
(సూర్యుడు నక్షత్రములు అగుపడని వేళ పగలు రాత్రికి సంధియగు కాలమందు సంధ్యా దేవిని సమాహిత మనస్కుడై ఉపాసించవలెను)
“ఉత్తమో తారకోపేతా మధ్యమా లుప్త తారకా |
అధమా సూర్యసహితా ప్రాతస్సంధ్యా త్రిథాస్మృతః ||“.
ఇతి స్మృతేః ||.
(నక్షత్రములు కనుపించుచుండగా సంధ్యా దేవిని ఉపాసించుట ఉత్తమము - నక్షత్రములు కనబడకుండునపుడు చేయునది మధ్యమము, సూర్యోదయమైన తర్వాత చేయునది అధమము).
“ఉత్తమా సూర్యసహితా మధ్యమా లుప్తభాస్కరా |
అధమా తారకోపేతా సాయంసంధ్యా త్రిథాస్మృతః ||“.
(సూర్యుడుండగా చేయు సంధ్య ఉత్తమము, సూర్యుడు అస్తమించిన తర్వాత చేయు సంధ్య మధ్యమము, నక్షత్రములు కనుపించినతర్వాత చేయునది అధమము అని సాయం సంధ్య మూడు విధములు).
ఈశ్వరీ కేవలా శక్తి స్తత్వత్రయ సముద్భవా |
ధ్యాత్కార్య మండలగతాం సావిత్రీం వైజసేద్బుధః ||“.
(జగత్తు పుట్టుటకు - సృష్టికి - కారణమైనదిన్నీ, నిష్కల అయినదిన్నీ, తత్వత్రయమువలన కలిగినదిన్నీ, సూర్యమండలమధ్యమందుండినదిన్నీ కేవలము శక్తి స్వరూపము ఈశ్వరి అయిన సావిత్రిని బుధులుపాసించవలెను).
(ప్రతిదినము సంధ్యనుపాసించవలెను)
saṃdhi
saṃdhau bhavā saṃdhyā
(saṃdhiyaṃdainadi saṃdhya)
(sūryuḍu paribhramiṃcucu (tirugucu) lōkamulanu alōkamulanu saṃdhānamu cēyunu - kalupunu. aṃducēta ā reṃḍiṃṭikī madhya saṃdhyayani ceppabaḍucunnadi)
(lōkamulu anagā cūcuṭaku vīlagunavi; cūcuṭaku vīlukānivi alōkamulu. aṃducēta pagalu rātri - ī reṃḍiṃṭini kalupunadi - ī reṃḍiṃṭiki madhyanunnadi saṃdhya).
bhūta laya rūpaṃbaṃgu rātrikini bhūtōtpatti rūpaṃbagu udayamunaku gala saṃdhi.
parabrahmamunakunu jagadutpatti pūrvāparamunakunu jagannirmāṇēccārūpaṃbagu saṃdhiyē saṃdhya.
saṃdhyā śabdaḥ saṃdhyākālika karma paraḥ -
(saṃdhyākālamaṃdu cēyukarma)
yā bhavēt paścimā sāvijñēyā sarasvati |
svētā bhavati gāyatri sāvitrī raktavarṇikā |
kṛṣṇā sarasvatīgēyā saṃdhyā traya mupā hṛtaṃ ||”
(prodduṭa yaṃdali saṃdhya - rātrini udayamunu kalupu saṃdhya - gāyatriyaniyu; madhyāhnamaṃdu saṃdhya pūrvāhnamunu sāyāhnamunu kalupu saṃdhya sāvitriyaniyu, sāyaṃkālamu saṃdhya - sāyaṃkālamunu rātrini kalupu saṃdhya - sarasvati yaniyu telusukonavalenu - gāyatri tellagānuṃḍunu, sāvitri eṟṟagānuṃḍunu, sarasvati nallagānuṃḍunu)
tadēva saṃdhyāmityuktaṃ karma brahmaṇya mūlakaṃ ||.
(ī sūryuḍē brahmayani pratirōju cēyu dhyānamu saṃdhya - brahma mūlakamaina karma - “yadādityagataṃ tējaḥ - - - tattējōviddhi māmakaṃ”. (śrīmadbhagavadgīta - 15 - 12)
saṃdhau jīvātmanō raikyaṃ sā saṃdhyā sadbhirucyatē ||“;
(nīḷḷu vadaluṭacēta gāni, maṃtramulanuccariṃcuṭacētagāni saṃdhya kalugadu - jīvātmalu ēkamaguṭayē saṃdhyayani satpuruṣulu ceppuduru -
tatra saṃdhyā mupāsīta sāyaṃprāta samāhitaḥ ||“.
(sūryuḍu nakṣatramulu agupaḍani vēḷa pagalu rātriki saṃdhiyagu kālamaṃdu saṃdhyā dēvini samāhita manaskuḍai upāsiṃcavalenu)
“uttamō tārakōpētā madhyamā lupta tārakā |
adhamā sūryasahitā prātassaṃdhyā trithāsmṛtaḥ ||“.
iti smṛtēḥ ||.
(nakṣatramulu kanupiṃcucuṃḍagā saṃdhyā dēvini upāsiṃcuṭa uttamamu - nakṣatramulu kanabaḍakuṃḍunapuḍu cēyunadi madhyamamu, sūryōdayamaina tarvāta cēyunadi adhamamu).
“uttamā sūryasahitā madhyamā luptabhāskarā |
adhamā tārakōpētā sāyaṃsaṃdhyā trithāsmṛtaḥ ||“.
(sūryuḍuṃḍagā cēyu saṃdhya uttamamu, sūryuḍu astamiṃcina tarvāta cēyu saṃdhya madhyamamu, nakṣatramulu kanupiṃcinatarvāta cēyunadi adhamamu ani sāyaṃ saṃdhya mūḍu vidhamulu).
īśvarī kēvalā śakti statvatraya samudbhavā |
dhyātkārya maṃḍalagatāṃ sāvitrīṃ vaijasēdbudhaḥ ||“.
(jagattu puṭṭuṭaku - sṛṣṭiki - kāraṇamainadinnī, niṣkala ayinadinnī, tatvatrayamuvalana kaliginadinnī, sūryamaṃḍalamadhyamaṃduṃḍinadinnī kēvalamu śakti svarūpamu īśvari ayina sāvitrini budhulupāsiṃcavalenu).
(pratidinamu saṃdhyanupāsiṃcavalenu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.