(చేయు కర్మలయందు ఇది నాది యని అభిమానము, ఆసక్తి, ప్రీతి కలిగియుండుట).
(పుత్రులు, మిత్రులు, బంధువులు - వీరి యందు సంశ్లేష స్పృహ)
(కర్మల ఫలమందు అత్యంతమైన ఆశ, నేను కర్మను అను అభిమానము)
(ఫలము కలుగవలెనను అభిలాష, కోరిక, నేనే కర్తను అను అభినివేశము)
తనకు లభించిన దానియందు లేక ఉన్నదానియందు అభిమానము, తగులము -
సంపర్కము, సాంగత్యము, సహవాసము - సంబంధము; విషయాసక్తి.
సంగోనామ మమ అత్యంత సుఖహేతవః ఏతే అత్యేవం శోభనాధ్యాస లక్షణః, ప్రీతివిశేషః.
(ఇవినాకు మిక్కిలి సుఖమును కలిగించునవి అను శుభలక్షషణములుగల ప్రీతి విశేషము) 0
దేహమాత్రేహి విశ్వాసః సంగో బంధాయ కల్పతే ||” (అన్నపూర్ణోపనిషత్)
(దేహము వేరు, దేహి అయిన ఆత్మ వేరు అను భావమును వదలి అంతా దేహమే యను విశ్వాసము కలిగియుండుట సంగము - దానివలన బంధము కలుగును).
(సంగమనగా సంబంధము - ఈ సంబంధము స్వజాతీయ విజాతీయ స్వగత పదార్థములతో కలుగును - కుండకు ఇంకొక కుండతో సంబంధము స్వజాతీయ సంబంధము - రెండు కుండలు ఒకే జాతికి సంబంధించినవి కనుక కుండకు బట్టతో కలుగు సంబంధము విజాతీయ సంబంధము - ఇంకొక జాతి పదార్థముతో కలుగు సంబంధము, రెండును ఒకే జాతికి సంబంధించినవి కావుకనుక. స్వగతము అనగా తనలోనున్నవి - అవయవములు. అందుచేత బట్టకు దాని దారములతో కలుగు సంబంధము - దారములు బట్టలోనివే కనుక స్వగతసంబంధము) ఆత్మలు రెండుకాని, అనంతములు - లెక్కలేనన్ని - కాని అయిన యడల ఆత్మకు సజాతీయ సంబంధము కలుగును - ఆత్మ ఒకటే కనుక ఆత్మకు సజాతీయమైన ఆత్మతో సంబంధము లేదు - ఆత్మవంటిది ఇంకొక ఆత్మ లేదు కనుక ఆత్మకు విజాతీయమైనది అనాత్మ. అనాత్మ యనునది ఎండమావుల నీరు వలె ఆత్మయందు కల్పించబడినది - కల్పితమైన ఆత్మతో సంబంధము ఘటించదు. ఎండమావుల నీరుతో అక్కడ భూమికి సంబంధములేదు - అది నిజముగా నీరు కాదు కనుక, సంబంధమే ఉండినట్లైన అక్కడ భూమి ఎండమావుల నీరు చేత తడిసియుండును. ఎండమావుల నీటితో అక్కడ భూమికి సంబంధము లేనట్లే ఆత్మ కల్పితమైన విజాతీయమైన అనాత్మతో ఆత్మకు సంబంధములేదు - ఆత్మకు అవయవములుండిన యడల ఆత్మకు తన అవయవములతో స్వగత భేదముండియుండును - ఆత్మ నిత్యమైనది, అందుచేత అవయవములు లేనిది. అవయవములు పుట్టి నశించునవి కనుక ఆత్మలో లేవు - అందుచేత ఆత్మకి గత సంబంధములేదు - పైన చెప్పిన ప్రకారముగా ఆత్మకు సజాతీయ, విజాతీయ స్వగత సంబంధము లేదు. అందుచేత ఆత్మ అసంగుడు).
సంగాత్ సంజాయతే కామః కామాత్కృధోప జాయతే ||. (శ్రీమద్భగవద్గీత - 2 - 62)
(ఈ సుఖానుభవము నాకు కావలయును - అని విషయముల గుఱించి ధ్యానించు పురుషునకు వాటియందు సంగము - ఆసక్తి - కలుగును. అట్టి సంగమువలన కామము కలుగును, కామము వలన (ఆ కోరిక నెరవేరనిచో) కోపము కలుగును).
ఘన సుఖాసక్తుడగుచునే మనుజుడేని
అర్థి జరియించువాడు భవాబ్ధిలోన
జెంది యోనాళ్ళకును దరి జేరలేడు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ,భ. - 228)
(cēyu karmalayaṃdu idi nādi yani abhimānamu, āsakti, prīti kaligiyuṃḍuṭa).
(putrulu, mitrulu, baṃdhuvulu - vīri yaṃdu saṃślēṣa spṛha)
(karmala phalamaṃdu atyaṃtamaina āśa, nēnu karmanu anu abhimānamu)
(phalamu kalugavalenanu abhilāṣa, kōrika, nēnē kartanu anu abhinivēśamu)
tanaku labhiṃcina dāniyaṃdu lēka unnadāniyaṃdu abhimānamu, tagulamu -
saṃparkamu, sāṃgatyamu, sahavāsamu - saṃbaṃdhamu; viṣayāsakti.
saṃgōnāma mama atyaṃta sukhahētavaḥ ētē atyēvaṃ śōbhanādhyāsa lakṣaṇaḥ, prītiviśēṣaḥ.
(ivināku mikkili sukhamunu kaligiṃcunavi anu śubhalakṣaṣaṇamulugala prīti viśēṣamu) 0
dēhamātrēhi viśvāsaḥ saṃgō baṃdhāya kalpatē ||” (annapūrṇōpaniṣat)
(dēhamu vēru, dēhi ayina ātma vēru anu bhāvamunu vadali aṃtā dēhamē yanu viśvāsamu kaligiyuṃḍuṭa saṃgamu - dānivalana baṃdhamu kalugunu).
(saṃgamanagā saṃbaṃdhamu - ī saṃbaṃdhamu svajātīya vijātīya svagata padārthamulatō kalugunu - kuṃḍaku iṃkoka kuṃḍatō saṃbaṃdhamu svajātīya saṃbaṃdhamu - reṃḍu kuṃḍalu okē jātiki saṃbaṃdhiṃcinavi kanuka kuṃḍaku baṭṭatō kalugu saṃbaṃdhamu vijātīya saṃbaṃdhamu - iṃkoka jāti padārthamutō kalugu saṃbaṃdhamu, reṃḍunu okē jātiki saṃbaṃdhiṃcinavi kāvukanuka. svagatamu anagā tanalōnunnavi - avayavamulu. aṃducēta baṭṭaku dāni dāramulatō kalugu saṃbaṃdhamu - dāramulu baṭṭalōnivē kanuka svagatasaṃbaṃdhamu) ātmalu reṃḍukāni, anaṃtamulu - lekkalēnanni - kāni ayina yaḍala ātmaku sajātīya saṃbaṃdhamu kalugunu - ātma okaṭē kanuka ātmaku sajātīyamaina ātmatō saṃbaṃdhamu lēdu - ātmavaṃṭidi iṃkoka ātma lēdu kanuka ātmaku vijātīyamainadi anātma. anātma yanunadi eṃḍamāvula nīru vale ātmayaṃdu kalpiṃcabaḍinadi - kalpitamaina ātmatō saṃbaṃdhamu ghaṭiṃcadu. eṃḍamāvula nīrutō akkaḍa bhūmiki saṃbaṃdhamulēdu - adi nijamugā nīru kādu kanuka, saṃbaṃdhamē uṃḍinaṭlaina akkaḍa bhūmi eṃḍamāvula nīru cēta taḍisiyuṃḍunu. eṃḍamāvula nīṭitō akkaḍa bhūmiki saṃbaṃdhamu lēnaṭlē ātma kalpitamaina vijātīyamaina anātmatō ātmaku saṃbaṃdhamulēdu - ātmaku avayavamuluṃḍina yaḍala ātmaku tana avayavamulatō svagata bhēdamuṃḍiyuṃḍunu - ātma nityamainadi, aṃducēta avayavamulu lēnidi. avayavamulu puṭṭi naśiṃcunavi kanuka ātmalō lēvu - aṃducēta ātmaki gata saṃbaṃdhamulēdu - paina ceppina prakāramugā ātmaku sajātīya, vijātīya svagata saṃbaṃdhamu lēdu. aṃducēta ātma asaṃguḍu).
saṃgāt saṃjāyatē kāmaḥ kāmātkṛdhōpa jāyatē ||. (śrīmadbhagavadgīta - 2 - 62)
(ī sukhānubhavamu nāku kāvalayunu - ani viṣayamula guṟiṃci dhyāniṃcu puruṣunaku vāṭiyaṃdu saṃgamu - āsakti - kalugunu. aṭṭi saṃgamuvalana kāmamu kalugunu, kāmamu valana (ā kōrika neravēranicō) kōpamu kalugunu).
ghana sukhāsaktuḍagucunē manujuḍēni
arthi jariyiṃcuvāḍu bhavābdhilōna
jeṃdi yōnāḷḷakunu dari jēralēḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u,bha. - 228)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.