← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంకర్షణః saṃkarṣaṇaḥ

Original — తెలుగు
  1. సమ్యక్ కర్షతి ఏకీకరోతి ఇతి సంకర్షణః, ఆకర్షతీతి సంకర్షణః

(అన్నింటినీ బాగుగా ఆకర్షించువాడు. సృష్టిలో అనేక నామరూపములతో నున్న వస్తువులన్నింటినీ ఏకము చేయువాడు, అన్నింటిని సర్వకారణమైన తనలో కలిపివేసుకొనువాడు, తనలో లీనమైనట్లు చేయువాడు. సృష్టిలోని ప్రతివసువులోను తానుండి ఇఒకదానిచే నింకొకదానినాకర్షింపచేసి వాటిని కలుపువాడు. (Every particle of matter attracts every other particle). అణువులను అణువులచే నాకర్షింపచేసి పెద్దవస్తువులుగా మార్చి వాటిని ప్రళయ కాలమందు తనలోనికి ఆకర్షించి తనలో లయింపచేసుకొనువాడు)

  1. “సం ఇత్యేకీకారే - అవిభక్త నమరూపత్వేన కర్షణః, కర్షయతి, ఆకర్షయతి స్వస్మిన్ జగదుపసంహరతి తధా సః సంకర్షణః -”

(‘సం’ అనగా ఒకటిగా చేయుట, ఒకదానితో నొకటి కలుపుట. అనేక నామరూపములతో కూడుకొని విభక్తమైయున్న - విడి విడిగా నున్న - ఈ సృష్టి అంతటిలోను గల వస్తువులన్నింటిని విభక్తము కాని స్థితిలోనికి, తనలోనికి తనలో లీనమగునట్లు ఆకర్షించువాడు - అనగా, తనలోనుండి పుట్టిన జగత్తునంతను తనలోనికి ఉపసంహరించుకొనువాడు)

  1. సంహార సమయే యుగపత్ ప్రజాః సంకర్షతీతి సంకర్షణః ” (శ్రీశంకరః)

(ప్రళయకాలమందు ఒక్కమారుగ ప్రజలను కూటాడువాడు, లేక, తనలోనికి ఆకర్షించువాడు)

  1. శత్రూన్ సంకర్షతీతి సంకర్షణః -

(దంభము, దర్పము మొదలగు శత్రువులను సతతధ్యాన వైరాగ్యములచే సంహరించువాడు)

  1. సమ్యక్ పాపాని దుఃఖాని కర్షతీతి సంకర్షణః -

(పాపములను, దుఃఖములను పోట్టువాడు).

  1. అహంకారాధిష్టాతా -

(అహంకారము నధిష్టించి యుండువాడు)

  1. “మమైవాంశో జీవలోకే జీవ భూతః సనాతనః |

మనః షష్టాణీంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి ||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 7)

(భగవంతుని అంశయే అయిన జీవుడు జీవులలో జీవుడై మనస్సును ఇంద్రియములను - ప్రకృతిలోనున్న వాటిని ఆకర్షించును).

  1. అహం ఇత్యభిమానస్య లక్షణం యం ప్రచక్షతే |

సంకర్షణం సాత్వతీయాః కర్షణం దృష్ట్యదృశ్యయోః ||. (దేవీ భాగవతం)

“దృష్ట్య దృశ్యయోః సమ్యక్ కర్షణం ఏకీకరణం యేన, తత్కృతో అహమిత్యభిమానో లక్షణం చిహ్నం అధిష్ఠాతుః యస్య అహంకారాధిష్ఠానేన చ దృగ్దృశ్య సంకర్షణాత్ సంకర్షణః ఇత్యర్థః”.

(ద్రష్ట = చూచువాడు, దృశ్యం చూడబడుచున్నది, జగత్తు - ఈ రెండింటిని ఒకే మారుగా, బాగుగా, క్రమమైన పద్దతిలో ఆకర్షించువాడు. ఈ పని నేను చేసితిని అను అభిమానము లక్షణముగా గలిగి అధిష్టించియుండువాడు - ప్రపంచములోని వస్తువులన్నింటిలోను అధిష్ఠించియుండి, ఒకదానిచేత ఇంకొక దానిని ఆకర్షింపచేసి, రెండింటినీ ఒకటిగా చేసి, ఈ ప్రకారముగా ప్రపంచములోనున్న వస్తువులన్నింటినీ ఒకటిగా తనలో లీనమగునట్లు చేయువాడు).

  1. అహంకారః భూతేంద్రియ మనోవృత్తి కారణం, తదధిష్ఠాతా సంకర్షణః -- అధిభూత రూపేణ తస్యైవ అహంకారః ఇతి సంజ్ఞాః, అధ్యాత్మరూపేణ మనః ఇతి, ఉపాస్య రూపేణ సంకర్షణః ఇతి అధిష్ఠాతు రుద్రో.

(భూతముల ఇంద్రియమనోవృత్తులకు కారణము అహంకారము - దానిని అధిష్ఠించి యుండువాడు సంకర్షణుడు. అధిభూతరూపం చేతసంకర్షణునికే అహంకారమని, అధ్యాత్మరూపమగుటవలన మనస్సు అని, ఉపాసించబడు దేవత యగుటచేత సంకర్షణుడు అని చెప్పబడుచున్నాడు).

  1. “సీ. అట్టి యహంకారమందధిష్టించి సాహస్రఫణామండలాభిరాము

డై తనరారు ననంతుడు సంకర్షణుండనదగు పురుషుండు ఘనుడు

మహిత భూతేంద్రియ మానసమయుడునై కర్తృత్వ కార్యత్వ

ప్రకట శాంతత్వ ఘోరత్వ, మూఢత్వాది లక్షణ లక్షితోల్లాసియగుచు

నుండు నమ్మేటి రెండవ వ్యూహమనగ - - - ” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 26 - 892)

Transliteration
  1. samyak karṣati ēkīkarōti iti saṃkarṣaṇaḥ, ākarṣatīti saṃkarṣaṇaḥ

(anniṃṭinī bāgugā ākarṣiṃcuvāḍu. sṛṣṭilō anēka nāmarūpamulatō nunna vastuvulanniṃṭinī ēkamu cēyuvāḍu, anniṃṭini sarvakāraṇamaina tanalō kalipivēsukonuvāḍu, tanalō līnamainaṭlu cēyuvāḍu. sṛṣṭilōni prativasuvulōnu tānuṃḍi iokadānicē niṃkokadāninākarṣiṃpacēsi vāṭini kalupuvāḍu. (Every particle of matter attracts every other particle). aṇuvulanu aṇuvulacē nākarṣiṃpacēsi peddavastuvulugā mārci vāṭini praḷaya kālamaṃdu tanalōniki ākarṣiṃci tanalō layiṃpacēsukonuvāḍu)

  1. “saṃ ityēkīkārē - avibhakta namarūpatvēna karṣaṇaḥ, karṣayati, ākarṣayati svasmin jagadupasaṃharati tadhā saḥ saṃkarṣaṇaḥ -”

(‘saṃ’ anagā okaṭigā cēyuṭa, okadānitō nokaṭi kalupuṭa. anēka nāmarūpamulatō kūḍukoni vibhaktamaiyunna - viḍi viḍigā nunna - ī sṛṣṭi aṃtaṭilōnu gala vastuvulanniṃṭini vibhaktamu kāni sthitilōniki, tanalōniki tanalō līnamagunaṭlu ākarṣiṃcuvāḍu - anagā, tanalōnuṃḍi puṭṭina jagattunaṃtanu tanalōniki upasaṃhariṃcukonuvāḍu)

  1. saṃhāra samayē yugapat prajāḥ saṃkarṣatīti saṃkarṣaṇaḥ ” (śrīśaṃkaraḥ)

(praḷayakālamaṃdu okkamāruga prajalanu kūṭāḍuvāḍu, lēka, tanalōniki ākarṣiṃcuvāḍu)

  1. śatrūn saṃkarṣatīti saṃkarṣaṇaḥ -

(daṃbhamu, darpamu modalagu śatruvulanu satatadhyāna vairāgyamulacē saṃhariṃcuvāḍu)

  1. samyak pāpāni duḥkhāni karṣatīti saṃkarṣaṇaḥ -

(pāpamulanu, duḥkhamulanu pōṭṭuvāḍu).

  1. ahaṃkārādhiṣṭātā -

(ahaṃkāramu nadhiṣṭiṃci yuṃḍuvāḍu)

  1. “mamaivāṃśō jīvalōkē jīva bhūtaḥ sanātanaḥ |

manaḥ ṣaṣṭāṇīṃdriyāṇi prakṛti sthāni karṣati ||“. (śrīmadbhagavadgīta - 15 - 7)

(bhagavaṃtuni aṃśayē ayina jīvuḍu jīvulalō jīvuḍai manassunu iṃdriyamulanu - prakṛtilōnunna vāṭini ākarṣiṃcunu).

  1. ahaṃ ityabhimānasya lakṣaṇaṃ yaṃ pracakṣatē |

saṃkarṣaṇaṃ sātvatīyāḥ karṣaṇaṃ dṛṣṭyadṛśyayōḥ ||. (dēvī bhāgavataṃ)

“dṛṣṭya dṛśyayōḥ samyak karṣaṇaṃ ēkīkaraṇaṃ yēna, tatkṛtō ahamityabhimānō lakṣaṇaṃ cihnaṃ adhiṣṭhātuḥ yasya ahaṃkārādhiṣṭhānēna ca dṛgdṛśya saṃkarṣaṇāt saṃkarṣaṇaḥ ityarthaḥ”.

(draṣṭa = cūcuvāḍu, dṛśyaṃ cūḍabaḍucunnadi, jagattu - ī reṃḍiṃṭini okē mārugā, bāgugā, kramamaina paddatilō ākarṣiṃcuvāḍu. ī pani nēnu cēsitini anu abhimānamu lakṣaṇamugā galigi adhiṣṭiṃciyuṃḍuvāḍu - prapaṃcamulōni vastuvulanniṃṭilōnu adhiṣṭhiṃciyuṃḍi, okadānicēta iṃkoka dānini ākarṣiṃpacēsi, reṃḍiṃṭinī okaṭigā cēsi, ī prakāramugā prapaṃcamulōnunna vastuvulanniṃṭinī okaṭigā tanalō līnamagunaṭlu cēyuvāḍu).

  1. ahaṃkāraḥ bhūtēṃdriya manōvṛtti kāraṇaṃ, tadadhiṣṭhātā saṃkarṣaṇaḥ -- adhibhūta rūpēṇa tasyaiva ahaṃkāraḥ iti saṃjñāḥ, adhyātmarūpēṇa manaḥ iti, upāsya rūpēṇa saṃkarṣaṇaḥ iti adhiṣṭhātu rudrō.

(bhūtamula iṃdriyamanōvṛttulaku kāraṇamu ahaṃkāramu - dānini adhiṣṭhiṃci yuṃḍuvāḍu saṃkarṣaṇuḍu. adhibhūtarūpaṃ cētasaṃkarṣaṇunikē ahaṃkāramani, adhyātmarūpamaguṭavalana manassu ani, upāsiṃcabaḍu dēvata yaguṭacēta saṃkarṣaṇuḍu ani ceppabaḍucunnāḍu).

  1. “sī. aṭṭi yahaṃkāramaṃdadhiṣṭiṃci sāhasraphaṇāmaṃḍalābhirāmu

ḍai tanarāru nanaṃtuḍu saṃkarṣaṇuṃḍanadagu puruṣuṃḍu ghanuḍu

mahita bhūtēṃdriya mānasamayuḍunai kartṛtva kāryatva

prakaṭa śāṃtatva ghōratva, mūḍhatvādi lakṣaṇa lakṣitōllāsiyagucu

nuṃḍu nammēṭi reṃḍava vyūhamanaga - - - ” (śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 26 - 892)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.