← Back to స · Booklets 51–60 (digitized file 6)

సాంఖ్య యోగము sāṃkhya yōgamu

Original — తెలుగు
  1. సమ్యక్ జ్ఞానం సాంఖ్యం, తదేవ యోగః ప్రాప్యస్వీకరణోపాయం -

(సమ్యక్ జ్ఞానము సాంఖ్యము, అదియే యోగము - పొందతగిన వస్తువును పొందు ఉపాయము)

  1. ఆత్మ జ్ఞాన నిష్ట

(ఆత్మ జ్ఞానమందు నిష్ట కలిగియుండుట).

  1. శోకమోహాది సంసారహేతు దోష నివృత్తి కారణ జ్ఞాన ప్రాప్త్యుపాయః -

(శోకము, మోహము, మొదలగు సంసారమునకు కారణమైన దోషముల నివృత్తికి కారణమైన జ్ఞానమును పొందుటకు ఉపాయము).

  1. “లోకే అస్మిన్ ద్వివిధానిష్ఠా పురాప్రోక్తా మయా నఘ |

జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మ యోగేన యోగినాం ||“. (శ్రీమద్భగవద్గీత - 3 -3)

(ఈ లోకములో నేను పూర్వము రెండు యోగములు చెప్పియుంటిని - సాంఖ్యులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము.)

“చిత్త శుద్ధ్య శుద్ధిభ్యాం జనే(అ)స్మిన్నదికారిణి |

ద్వివిధా ద్విపకారైవ పూర్వాధ్యాయే స్ఫుటం మయా |

జ్ఞాన కర్మా పరత్వాఖ్యానిష్ఠోక్తా తేహి తైషిణా ||“. (గీతాభావప్రకాశము - 3 - 28. 29)

(చిత్తశుద్ధి కలిగినవారికి సాంఖ్య యోగము (జ్ఞానయోగము), చిత్తశుద్ధి లేనివారికి కర్మయోగము (నిష్కామకర్మయోగము) క్రిందటి అధ్యాయములో (శ్రీమద్భగవద్గీత - 2 లో) నాచే (శ్రీకృష్ణభగవానునిచే) చెప్పబడినది.

“సన్యాస కర్మణోర్మధ్య స్వాధికారానురూపతః |

కృతవా న్యన్యథా శాస్త్ర మేకమప్యాదిరాత్సుధీః |

జ్ఞానోత్పత్తి ముభేనైవ మేకం నిఃశ్రేయసం ఫలం |

ఉభయోర్విందతే తస్మాన్న విరోధిః ఫలౌ |

తయోః ||“. (గీతాభావప్రకాశము - 5 - 48, 49)

తమ తమ అధికార యోగ్యత ననుసరించి జ్ఞానయోగము (సాంఖ్యయోగము), కర్మయోగము (నిష్కామకర్మయోగము) అను రెండింటిలో దేనిని శాస్త్రపరకారము చేసినయడల అది జ్ఞానమును (బ్రహ్మజ్ఞానమును) కలుగచేయుటవలన ఫలము ఒకటే కలుగును - నిఃశ్రేయసఫలము లభించును. అందుచేత ఆ రెండింటికి భేదము లేదు).

  1. “యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యో గైరపి గమ్యతే |

ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యంతి స పశ్యతి ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 5)

(సాంఖ్యులు - సాంఖ్యయోగులు, జ్ఞానయోగులు ఏ స్థానమును పొందుదురో ఆ స్థానమునే కర్మయోగులు పొందుదురు. ఈ రెండు యోగములను ఒకటిగానే చూచువాడే పండితుడు, జ్ఞాని).

కథ వేకస్య కారణా దు భయోర్విందతే ఫలం |

శ్రుణు సన్యాశిభిః పుణ్యోః పూర్వజన్మ స్వమష్ఠితైః |

శుద్ధాంతఃకరణైః సమ్యగ్వేదాంత శ్రవణాదిభిః |

అవాప్తాత్మావ బోధైః యన్మోక్షాఖ్యం ప్రాప్యతే ఫలం ||

ఈశార్పణ ధియా యోగాః శాస్త్రీయాణి కృతానిచ |

కర్మాణి సంతి యేషాం తే యోగా స్తైరపి యోగిభిః |

సత్వ శుద్ధ్యాచ సన్యాస పూర్వయా జ్ఞాన నిష్ఠయా |

తత్స్థానం గమ్యతే వర్తమానే భావిని వా భివే |

అతః ఏక ఫల త్వాద్యః పశ్యత్యేకం విశుద్ధ ధీః |

సాంఖ్యం యోగం స ఏవేహ సమ్యక్పశ్యతి నాపరః ||. (గీతాభావప్రకాశము - 5 - 50 to 54)

(పూర్వ జన్మలో చేసిన పుణ్యములవలన, వేదాంతశ్రవణము మొదలగువాటివలన కలిగిన శుద్ధాంతఃకరణముగలవారు ఆత్మజ్ఞానము గలవారు పొందినటువంటి మోక్షము అను పేరుగల ఫలమును పొందుదురో భగవదర్పణబుద్ధితో శాస్త్రములో విహితమైన కర్మలు చేయు యోగులు సత్వ బుద్ధి చేత సన్యాసము కూడిన జ్ఞాననిష్ఠచేత ఈ జన్మలో గాని, రాబోవు జన్మలో గాని ఆ ఫలమునే - ఆ స్థానమునే పొందుదురు - ఈ కారణమువలన సాంఖ్యము, యోగము అను రెండింటిని ఒకే ఫలము నిచ్చునవి యగుటవల్ల ఒకటిగానే చూచునట్టి శుద్ధాంతఃకరణముగలవాడు సమ్యక్ దృష్టి కలవాడు).

  1. “పుంసస్సాం ఖ్యాభిదం జ్ఞానం పార్వత్యాస్తు ప్రసాదతః |”

(పురుషుడు సాంఖ్యమను జ్ఞానమును పార్వతీ దేవి యొక్క అనుగ్రహము వలననే పొందును).

  1. “సాంఖ్యస్య వేలాయాం మోచకస్య శివస్యతు |

ప్రసాదో జాయతే తేన సంసారస్య విమర్శనం సంసార మోచకస్సాక్షా చ్చివ ఏవ న చాపరః ||“.

(సాంఖ్యజ్ఞానము కలుగు సమయమందు మోక్షము నిచ్చు శివుని దయకలుగును - అట్లు శివుని దయ కలుగుటచేత సంసారమును విమర్శింపనగును. సంసారమునుండి మోక్షమునిచ్చువాడు శివుడు - ఇతరుడు ఎవడును కాడు).

  1. “నాస్తి సాంఖ్య సమం జ్ఞానం నాస్తి యోగ సమం బలం |

అత్ర వస్సశయామా భూత్ యోగస్యాంఖ్యం పరం మతం ||“.

(సాంఖ్యముతో సమానమైన జ్ఞానము లేదు - యోగముతో సమానమైన బలము లేదు - ఇందు విషయమై సంశయమక్కరలేదు. యోగమే సాంఖ్యము సాంఖ్యమే యోగము. రెండునూ ఒకటే - ఇదే ఉత్తమమైన యోగము).

  1. సాంఖ్య యోగ ప్రవర్తకాచార్య వర్యుండగు కపిలుని యవతారంబు వినుమని యిట్లనియె –

“చ. ధృతమతి దేవహూతికిని దివ్యవిభుండగు కర్ణమ ప్రజా

పతికి బ్రమోదమొప్ప నవ భామలతో గపి లుండు బుట్టి, యే

గతి హరి పొందునట్టి శుభగంబగు సాంఖ్యముపన్యసించి దు

ష్కృతమువాపి చూపె మునిసేవితమై తనరారు మోక్షమున్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 7 - 118, 119)

  1. ఉద్ధవుండిట్లనియె - “సనక సనందనాది యోగీంద్రులకు యోగ మార్గమార్గం బేరీతి నానతిచ్చితివదియే విధంబానతీయవేయని యభ్యర్థించిన నతండు (యాదవేంద్రుండు - శ్రీకృష్ణుడు) ఇట్లనియె - వారలు చతుర్ముఖునడిగిన నతండు నేనును తెలియనేరననిన వారలు విస్మయంబందుచుండ నేనా సమయంబున హంస స్వరూపుండనై వారకెఱింగించిన తెఱంగు వినుము - పంచేంద్రియములకు దృష్టంబైన పదార్థంబులనిత్యంబులు, నిత్య దృష్టి బ్రహ్మంబని తెలియవలయు, దేహి కర్మార్జిత దేహుండై సంసారమమతలు నిరసించి నిశ్చల జ్ఞాన యుక్తుండై మత్పద ప్రాప్తుండగు. స్వప్న లబ్ద పదార్థంబు నిజంబుకాని క్రియ కర్మానుభవ పర్యంతంబు కళేబరంబు వర్తించునని సాంఖ్య యోగంబును సనకాదుల కెఱింగించిన విని బ్రహ్మ మొదలైన దేవత లెఱింగిరి”.

(శ్రీమద్భాగవతం - 11 - 105). (చూడుము - శ్రీమద్భగవద్గీత - 2 -12 to 30)

Transliteration
  1. samyak jñānaṃ sāṃkhyaṃ, tadēva yōgaḥ prāpyasvīkaraṇōpāyaṃ -

(samyak jñānamu sāṃkhyamu, adiyē yōgamu - poṃdatagina vastuvunu poṃdu upāyamu)

  1. ātma jñāna niṣṭa

(ātma jñānamaṃdu niṣṭa kaligiyuṃḍuṭa).

  1. śōkamōhādi saṃsārahētu dōṣa nivṛtti kāraṇa jñāna prāptyupāyaḥ -

(śōkamu, mōhamu, modalagu saṃsāramunaku kāraṇamaina dōṣamula nivṛttiki kāraṇamaina jñānamunu poṃduṭaku upāyamu).

  1. “lōkē asmin dvividhāniṣṭhā purāprōktā mayā nagha |

jñānayōgēna sāṃkhyānāṃ karma yōgēna yōgināṃ ||“. (śrīmadbhagavadgīta - 3 -3)

(ī lōkamulō nēnu pūrvamu reṃḍu yōgamulu ceppiyuṃṭini - sāṃkhyulaku jñānayōgamu, yōgulaku karmayōgamu.)

“citta śuddhya śuddhibhyāṃ janē(a)sminnadikāriṇi |

dvividhā dvipakāraiva pūrvādhyāyē sphuṭaṃ mayā |

jñāna karmā paratvākhyāniṣṭhōktā tēhi taiṣiṇā ||“. (gītābhāvaprakāśamu - 3 - 28. 29)

(cittaśuddhi kaliginavāriki sāṃkhya yōgamu (jñānayōgamu), cittaśuddhi lēnivāriki karmayōgamu (niṣkāmakarmayōgamu) kriṃdaṭi adhyāyamulō (śrīmadbhagavadgīta - 2 lō) nācē (śrīkṛṣṇabhagavānunicē) ceppabaḍinadi.

“sanyāsa karmaṇōrmadhya svādhikārānurūpataḥ |

kṛtavā nyanyathā śāstra mēkamapyādirātsudhīḥ |

jñānōtpatti mubhēnaiva mēkaṃ niḥśrēyasaṃ phalaṃ |

ubhayōrviṃdatē tasmānna virōdhiḥ phalau |

tayōḥ ||“. (gītābhāvaprakāśamu - 5 - 48, 49)

tama tama adhikāra yōgyata nanusariṃci jñānayōgamu (sāṃkhyayōgamu), karmayōgamu (niṣkāmakarmayōgamu) anu reṃḍiṃṭilō dēnini śāstraparakāramu cēsinayaḍala adi jñānamunu (brahmajñānamunu) kalugacēyuṭavalana phalamu okaṭē kalugunu - niḥśrēyasaphalamu labhiṃcunu. aṃducēta ā reṃḍiṃṭiki bhēdamu lēdu).

  1. “yatsāṃkhyaiḥ prāpyatē sthānaṃ tadyō gairapi gamyatē |

ēkaṃ sāṃkhyaṃ ca yōgaṃ ca yaḥ paśyaṃti sa paśyati ||“. (śrīmadbhagavadgīta - 5 - 5)

(sāṃkhyulu - sāṃkhyayōgulu, jñānayōgulu ē sthānamunu poṃdudurō ā sthānamunē karmayōgulu poṃduduru. ī reṃḍu yōgamulanu okaṭigānē cūcuvāḍē paṃḍituḍu, jñāni).

katha vēkasya kāraṇā du bhayōrviṃdatē phalaṃ |

śruṇu sanyāśibhiḥ puṇyōḥ pūrvajanma svamaṣṭhitaiḥ |

śuddhāṃtaḥkaraṇaiḥ samyagvēdāṃta śravaṇādibhiḥ |

avāptātmāva bōdhaiḥ yanmōkṣākhyaṃ prāpyatē phalaṃ ||

īśārpaṇa dhiyā yōgāḥ śāstrīyāṇi kṛtānica |

karmāṇi saṃti yēṣāṃ tē yōgā stairapi yōgibhiḥ |

satva śuddhyāca sanyāsa pūrvayā jñāna niṣṭhayā |

tatsthānaṃ gamyatē vartamānē bhāvini vā bhivē |

ataḥ ēka phala tvādyaḥ paśyatyēkaṃ viśuddha dhīḥ |

sāṃkhyaṃ yōgaṃ sa ēvēha samyakpaśyati nāparaḥ ||. (gītābhāvaprakāśamu - 5 - 50 to 54)

(pūrva janmalō cēsina puṇyamulavalana, vēdāṃtaśravaṇamu modalaguvāṭivalana kaligina śuddhāṃtaḥkaraṇamugalavāru ātmajñānamu galavāru poṃdinaṭuvaṃṭi mōkṣamu anu pērugala phalamunu poṃdudurō bhagavadarpaṇabuddhitō śāstramulō vihitamaina karmalu cēyu yōgulu satva buddhi cēta sanyāsamu kūḍina jñānaniṣṭhacēta ī janmalō gāni, rābōvu janmalō gāni ā phalamunē - ā sthānamunē poṃduduru - ī kāraṇamuvalana sāṃkhyamu, yōgamu anu reṃḍiṃṭini okē phalamu niccunavi yaguṭavalla okaṭigānē cūcunaṭṭi śuddhāṃtaḥkaraṇamugalavāḍu samyak dṛṣṭi kalavāḍu).

  1. “puṃsassāṃ khyābhidaṃ jñānaṃ pārvatyāstu prasādataḥ |”

(puruṣuḍu sāṃkhyamanu jñānamunu pārvatī dēvi yokka anugrahamu valananē poṃdunu).

  1. “sāṃkhyasya vēlāyāṃ mōcakasya śivasyatu |

prasādō jāyatē tēna saṃsārasya vimarśanaṃ saṃsāra mōcakassākṣā cciva ēva na cāparaḥ ||“.

(sāṃkhyajñānamu kalugu samayamaṃdu mōkṣamu niccu śivuni dayakalugunu - aṭlu śivuni daya kaluguṭacēta saṃsāramunu vimarśiṃpanagunu. saṃsāramunuṃḍi mōkṣamuniccuvāḍu śivuḍu - itaruḍu evaḍunu kāḍu).

  1. “nāsti sāṃkhya samaṃ jñānaṃ nāsti yōga samaṃ balaṃ |

atra vassaśayāmā bhūt yōgasyāṃkhyaṃ paraṃ mataṃ ||“.

(sāṃkhyamutō samānamaina jñānamu lēdu - yōgamutō samānamaina balamu lēdu - iṃdu viṣayamai saṃśayamakkaralēdu. yōgamē sāṃkhyamu sāṃkhyamē yōgamu. reṃḍunū okaṭē - idē uttamamaina yōgamu).

  1. sāṃkhya yōga pravartakācārya varyuṃḍagu kapiluni yavatāraṃbu vinumani yiṭlaniye –

“ca. dhṛtamati dēvahūtikini divyavibhuṃḍagu karṇama prajā

patiki bramōdamoppa nava bhāmalatō gapi luṃḍu buṭṭi, yē

gati hari poṃdunaṭṭi śubhagaṃbagu sāṃkhyamupanyasiṃci du

ṣkṛtamuvāpi cūpe munisēvitamai tanarāru mōkṣamun”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 7 - 118, 119)

  1. uddhavuṃḍiṭlaniye - “sanaka sanaṃdanādi yōgīṃdrulaku yōga mārgamārgaṃ bērīti nānaticcitivadiyē vidhaṃbānatīyavēyani yabhyarthiṃcina nataṃḍu (yādavēṃdruṃḍu - śrīkṛṣṇuḍu) iṭlaniye - vāralu caturmukhunaḍigina nataṃḍu nēnunu teliyanērananina vāralu vismayaṃbaṃducuṃḍa nēnā samayaṃbuna haṃsa svarūpuṃḍanai vārakeṟiṃgiṃcina teṟaṃgu vinumu - paṃcēṃdriyamulaku dṛṣṭaṃbaina padārthaṃbulanityaṃbulu, nitya dṛṣṭi brahmaṃbani teliyavalayu, dēhi karmārjita dēhuṃḍai saṃsāramamatalu nirasiṃci niścala jñāna yuktuṃḍai matpada prāptuṃḍagu. svapna labda padārthaṃbu nijaṃbukāni kriya karmānubhava paryaṃtaṃbu kaḷēbaraṃbu vartiṃcunani sāṃkhya yōgaṃbunu sanakādula keṟiṃgiṃcina vini brahma modalaina dēvata leṟiṃgiri”.

(śrīmadbhāgavataṃ - 11 - 105). (cūḍumu - śrīmadbhagavadgīta - 2 -12 to 30)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.