పురుషుడు అసంగుడగుటవలన వానియందు భోగమోక్షములు ఘటిల్లవు. జ్ఞాన సుఖ దుఃఖ రాగ ద్వేషములు మొదలుకొని ఇవి బుద్ధి యొక్క పరిణామములు. ఆ బుద్ధికి ఆత్మ విషయమందు అవివేకముండును, వివేకము కాదు. ఉక్త ప్రకారము అవివేక సిద్ధ భోగము ఆత్మయందు గలదు - దానివలన ఆత్మను భోక్త యందురు - పరమార్థముచే ఆత్మ భోక్త కాదు - మఱేమనగా బుద్ధియే భోక్త, ఆ బుద్ధి ఆత్మకన్న భిన్నము. ఈ జ్ఞానమునకు పేరు వివేకము, తదభావమునకు పేరు అవివేకము. ఈ రీతిగా సాంఖ్యమతమందు ఆత్మ అసంగుడు. సుఖాదికములు బుద్ధి యొక్క ధర్మములు -
ఇట్లనుట ఆత్మా నానా యనుట అత్యంత విరుద్ధము”
“ఈశ్వరుడున్నాడనియు, నతని సాన్నిధ్యవశమున ప్రథానము జగదాకారముగా పరిణమించుచున్నదనియు పురుషులు వేరుగా నున్నారనియు, యోగాభ్యాసమువలన వారికణిమాద్యష్టైశ్వర్య సిద్ధి కలిగి విదేహ కైవల్య ప్రాప్తి యగుచున్నదనియు, హైరణ్యగర్భ్దవాదము”.
(మాయనుండి మహత్తత్త్వము పుట్టినది, మహత్తత్వమునుండి సత్వరజస్తమో గుణభేదముగల అహంకారము పుట్టునది).
ప్రకృతి మార్పులు గలది. తనలోనుండి ప్రపంచములోని వస్తువులను సృష్టించుచున్నది. ప్రకృతి పురుష సం యోగమువలన సృష్టి జరుగుచున్నది. ఇరువది నాలుగు తత్వములవలన శరీరము కలుగును - 25వ తత్వము జీవుడు:.
కర్దమ దేవహూత్యోః పుత్రః భవవదనతారః కపిలః సేశ్వర సాంఖ్య మతమంగీ కరోతి
అన్యోపి కపిలః అభూత్ - స నిరీశ్వర సాంఖ్య మతం అంగీకృతవాన్ - తస్య మతే ఈశ్వరో నాంగీ క్రియతే. కింతు ప్రథానమే చ జగతః కారణమితి, పురుషస్య భోగమోక్ష కారణమితి చ అంగీ క్రియతే -“.
(ఈశ్వరుడున్నాడు అను సాంఖ్యమతము, ఈశ్వరుడు లేడను సాంఖ్యమతము అని సాంఖ్యమతము రెండు విధములు. కర్దమ ప్రజాపతికి దేవహుతికి పుట్టున కపిలుడు భగవంతుని అవతారమమూర్తి ఈశ్వరుడు గలడు అను సాంఖ్యమతము నంగీకరించెను. ఈ కపిల మహర్షి తన సాంఖ్యమతమును తన తల్లికి చెప్పెను - దాని సారాంశము శ్రీమద్భాగవములో తృతీయ స్కంధములో ఇరువది యారవ అధ్యాయములో చెప్పబడియున్నది.
నిరీశ్వర సాంఖ్యమతములో ప్రధానమగునది జగత్కారణమని అదియే పురుషుని భోగమోక్షములకు కారణమని చెప్పబడినది. మట్టితో చేయబడు కుండ, మూకుడు మట్టి మయములే అనియు, బంగారముతో చేయబడి ఆభరణములు అన్నియు బంగారుమయములే అయినట్లు, బ్రహ్మాండమంతయు సుఖదుఃఖములతో నిండియున్నదనియు, ఆ సుఖదుఃఖములు అసమానముగానున్న రజస్తమోగుణములవలన కలుగుచున్నవనియు, ఆ రజస్తమోగుణములు ప్రధానమైనవి.అందుచేత ఆ ప్రథానమే జగత్కారణమని సాంఖ్యమతవాదము.
ప్రథానము (ప్రకృతి జడము), స్వయముగా ఏమియు చేయలేదు. ఈశ్వరుడు తన చైతన్య శక్తితో ప్రధానములో ప్రవేశించగా దానికి చైతన్యము కలిగి సృష్టి కారణమయ్యెను.
puruṣuḍu asaṃguḍaguṭavalana vāniyaṃdu bhōgamōkṣamulu ghaṭillavu. jñāna sukha duḥkha rāga dvēṣamulu modalukoni ivi buddhi yokka pariṇāmamulu. ā buddhiki ātma viṣayamaṃdu avivēkamuṃḍunu, vivēkamu kādu. ukta prakāramu avivēka siddha bhōgamu ātmayaṃdu galadu - dānivalana ātmanu bhōkta yaṃduru - paramārthamucē ātma bhōkta kādu - maṟēmanagā buddhiyē bhōkta, ā buddhi ātmakanna bhinnamu. ī jñānamunaku pēru vivēkamu, tadabhāvamunaku pēru avivēkamu. ī rītigā sāṃkhyamatamaṃdu ātma asaṃguḍu. sukhādikamulu buddhi yokka dharmamulu -
iṭlanuṭa ātmā nānā yanuṭa atyaṃta viruddhamu”
“īśvaruḍunnāḍaniyu, natani sānnidhyavaśamuna prathānamu jagadākāramugā pariṇamiṃcucunnadaniyu puruṣulu vērugā nunnāraniyu, yōgābhyāsamuvalana vārikaṇimādyaṣṭaiśvarya siddhi kaligi vidēha kaivalya prāpti yagucunnadaniyu, hairaṇyagarbhdavādamu”.
(māyanuṃḍi mahattattvamu puṭṭinadi, mahattatvamunuṃḍi satvarajastamō guṇabhēdamugala ahaṃkāramu puṭṭunadi).
prakṛti mārpulu galadi. tanalōnuṃḍi prapaṃcamulōni vastuvulanu sṛṣṭiṃcucunnadi. prakṛti puruṣa saṃ yōgamuvalana sṛṣṭi jarugucunnadi. iruvadi nālugu tatvamulavalana śarīramu kalugunu - 25va tatvamu jīvuḍu:.
kardama dēvahūtyōḥ putraḥ bhavavadanatāraḥ kapilaḥ sēśvara sāṃkhya matamaṃgī karōti
anyōpi kapilaḥ abhūt - sa nirīśvara sāṃkhya mataṃ aṃgīkṛtavān - tasya matē īśvarō nāṃgī kriyatē. kiṃtu prathānamē ca jagataḥ kāraṇamiti, puruṣasya bhōgamōkṣa kāraṇamiti ca aṃgī kriyatē -“.
(īśvaruḍunnāḍu anu sāṃkhyamatamu, īśvaruḍu lēḍanu sāṃkhyamatamu ani sāṃkhyamatamu reṃḍu vidhamulu. kardama prajāpatiki dēvahutiki puṭṭuna kapiluḍu bhagavaṃtuni avatāramamūrti īśvaruḍu galaḍu anu sāṃkhyamatamu naṃgīkariṃcenu. ī kapila maharṣi tana sāṃkhyamatamunu tana talliki ceppenu - dāni sārāṃśamu śrīmadbhāgavamulō tṛtīya skaṃdhamulō iruvadi yārava adhyāyamulō ceppabaḍiyunnadi.
nirīśvara sāṃkhyamatamulō pradhānamagunadi jagatkāraṇamani adiyē puruṣuni bhōgamōkṣamulaku kāraṇamani ceppabaḍinadi. maṭṭitō cēyabaḍu kuṃḍa, mūkuḍu maṭṭi mayamulē aniyu, baṃgāramutō cēyabaḍi ābharaṇamulu anniyu baṃgārumayamulē ayinaṭlu, brahmāṃḍamaṃtayu sukhaduḥkhamulatō niṃḍiyunnadaniyu, ā sukhaduḥkhamulu asamānamugānunna rajastamōguṇamulavalana kalugucunnavaniyu, ā rajastamōguṇamulu pradhānamainavi.aṃducēta ā prathānamē jagatkāraṇamani sāṃkhyamatavādamu.
prathānamu (prakṛti jaḍamu), svayamugā ēmiyu cēyalēdu. īśvaruḍu tana caitanya śaktitō pradhānamulō pravēśiṃcagā dāniki caitanyamu kaligi sṛṣṭi kāraṇamayyenu.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.