← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంసార చక్రము saṃsāra cakramu

Original — తెలుగు
  1. అనేక తడవలు జన్మ మెత్తుట, అనేక తడవలు మరణము చెందుట యను నది నిశ్చయము - ఇట్లు మరల మరల చేయుపనికి చక్రసేవ యని పేరు. బండ్లు నడచునపుడు చక్రము తిరిగుచుండును. ఒక నిమిషము అత్యున్నత స్థితిలోనుండిన చక్రభాగము మఱియొక నిమిషమునందు అడుగు భాగముగా నగును. అడుగు భాగముగానుండినది పైభాగముగను. ఈ చర్యకు సరణము అని పేరు - “సమ్యక్ సరతీతి సంసారః”, లేక, ఒక చీమ చక్రముయొక్క కట్టు వెంబడి నడచుచున్నయడల ఆరంభమెక్కడ, కొన ఎక్కడ అని తెలియక సంచరించునట్లు జీవాత్మ సంసార చక్రమందు సంచరించు చుండును. “ఆవర్తాంతర కీటవత్” అని ఉపనిషత్తులలో చెప్పబడియున్నది. సంసృతి చక్రము లేక సంసారచక్రము అనగా సమసారము అను చక్రము - “సంసరతి అనయా జీవః” ఇతి సంసృతిః అహంకారాది ప్రపంచః, స ఏవ చక్రం భ్రమతి ప్రత్యహం ఆవిర్భావ తిరోభావా భ్యాం పునః పునః ఆవర్తతే అనగా, అహంకారతత్వము మొదలు పృధివీతత్వము వఱకును గల తత్వముల మేళనమువల్ల సృష్టి అయిన లోకములు చక్రమనబడును. ఈ చక్రమందు సంచరించుటకు సంసృతి అని పేరు - ఈ చక్రమునకే బ్రహ్మచక్రమని పేరు.

  2. “శ్లో ||. సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం |

చక్రనేమి రివైకం తన్న భవేత్ రఘునందన ||“. (దేవీ భాగవతం)

(సుఖము తర్వాత దుఃఖము, దుఃఖముతర్వాత సుఖము గల చక్రమువలె తిరుగుచుండు సంసారము; ఎప్పుడూ ఒకే రీతిగనుండనిది),

  1. “శ్లో ||. సంసారేస్మిన్ మహాఘోరే భ్రమణం నభచక్రవత్ |

నచ విశ్రమణం క్వాపి సూర్యస్యేవ్న దివానిశి” |. (దేవీభాగవతము)

(సూర్యుడు రాత్రి, పగలు అనక సంచరించుచున్నట్లు మహాఘోరమైన సంసారచక్రము నక్షత్ర చక్రమువలె జననమరణములతో ఆగక తిరుగుచునే యుండును).

  1. నీవలన వశీకృత కార్యసాధనశక్తి అయిన కాలంబు మాయతోడం గూడి షోడశవికారయుక్తంబయిన సంసార చక్రంబు చేయుచుండు).

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 -.)

  1. “వ. చిత్తంబెంతకాలంబు విషయాసక్తంబగు నంత తడవు సంసార చక్రంబునందు సంచరించు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 11 -)

  2. “నాహం బిభేమ్యజితతే(అ)తి భయానకాస్య జిహ్వార్కనేత్ర భృకుటీ రభోసోగ్ర దంష్ట్రాత్ |

- - - త్రస్తో మ్యహం కృపణవత్సల దుస్సహోగ్రసంసార చక్రకథనాత్ ||“. (శ్రీమద్భాగవతం -)

“మ. ఖరదంష్ట్రా భ్రుకుటీ నటా నఖయు నగ్రధ్వానమున్ రక్తకే

సరియున్ దీర్ఘ తరాంత్రమాలికయు భాస్వన్నేత్రయు న్నెన నీ

నరసింహాకృతి జూచి నే వెఱవఁ బూర్ణ క్రూరదుర్వార దు

ర్భర సంసారదవాగ్నికిన్ నెఱతు, నీ పాదశ్రయుం జేయవే.” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 7 - 355)

  1. “జాయతే మృతయే, మ్రియతే జననాయచం” (యోగవాశిష్టము - 12 - 7)
Transliteration
  1. anēka taḍavalu janma mettuṭa, anēka taḍavalu maraṇamu ceṃduṭa yanu nadi niścayamu - iṭlu marala marala cēyupaniki cakrasēva yani pēru. baṃḍlu naḍacunapuḍu cakramu tirigucuṃḍunu. oka nimiṣamu atyunnata sthitilōnuṃḍina cakrabhāgamu maṟiyoka nimiṣamunaṃdu aḍugu bhāgamugā nagunu. aḍugu bhāgamugānuṃḍinadi paibhāgamuganu. ī caryaku saraṇamu ani pēru - “samyak saratīti saṃsāraḥ”, lēka, oka cīma cakramuyokka kaṭṭu veṃbaḍi naḍacucunnayaḍala āraṃbhamekkaḍa, kona ekkaḍa ani teliyaka saṃcariṃcunaṭlu jīvātma saṃsāra cakramaṃdu saṃcariṃcu cuṃḍunu. “āvartāṃtara kīṭavat” ani upaniṣattulalō ceppabaḍiyunnadi. saṃsṛti cakramu lēka saṃsāracakramu anagā samasāramu anu cakramu - “saṃsarati anayā jīvaḥ” iti saṃsṛtiḥ ahaṃkārādi prapaṃcaḥ, sa ēva cakraṃ bhramati pratyahaṃ āvirbhāva tirōbhāvā bhyāṃ punaḥ punaḥ āvartatē anagā, ahaṃkāratatvamu modalu pṛdhivītatvamu vaṟakunu gala tatvamula mēḷanamuvalla sṛṣṭi ayina lōkamulu cakramanabaḍunu. ī cakramaṃdu saṃcariṃcuṭaku saṃsṛti ani pēru - ī cakramunakē brahmacakramani pēru.

  2. “ślō ||. sukhasyānaṃtaraṃ duḥkhaṃ duḥkhasyānaṃtaraṃ sukhaṃ |

cakranēmi rivaikaṃ tanna bhavēt raghunaṃdana ||“. (dēvī bhāgavataṃ)

(sukhamu tarvāta duḥkhamu, duḥkhamutarvāta sukhamu gala cakramuvale tirugucuṃḍu saṃsāramu; eppuḍū okē rītiganuṃḍanidi),

  1. “ślō ||. saṃsārēsmin mahāghōrē bhramaṇaṃ nabhacakravat |

naca viśramaṇaṃ kvāpi sūryasyēvna divāniśi” |. (dēvībhāgavatamu)

(sūryuḍu rātri, pagalu anaka saṃcariṃcucunnaṭlu mahāghōramaina saṃsāracakramu nakṣatra cakramuvale jananamaraṇamulatō āgaka tirugucunē yuṃḍunu).

  1. nīvalana vaśīkṛta kāryasādhanaśakti ayina kālaṃbu māyatōḍaṃ gūḍi ṣōḍaśavikārayuktaṃbayina saṃsāra cakraṃbu cēyucuṃḍu).

(śrīmadāṃdhramahābhāgavatamu - 7 -.)

  1. “va. cittaṃbeṃtakālaṃbu viṣayāsaktaṃbagu naṃta taḍavu saṃsāra cakraṃbunaṃdu saṃcariṃcu” (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 11 -)

  2. “nāhaṃ bibhēmyajitatē(a)ti bhayānakāsya jihvārkanētra bhṛkuṭī rabhōsōgra daṃṣṭrāt |

- - - trastō myahaṃ kṛpaṇavatsala dussahōgrasaṃsāra cakrakathanāt ||“. (śrīmadbhāgavataṃ -)

“ma. kharadaṃṣṭrā bhrukuṭī naṭā nakhayu nagradhvānamun raktakē

sariyun dīrgha tarāṃtramālikayu bhāsvannētrayu nnena nī

narasiṃhākṛti jūci nē veṟavam̐ būrṇa krūradurvāra du

rbhara saṃsāradavāgnikin neṟatu, nī pādaśrayuṃ jēyavē.” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 7 - 355)

  1. “jāyatē mṛtayē, mriyatē jananāyacaṃ” (yōgavāśiṣṭamu - 12 - 7)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.