← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంసార కారణము saṃsāra kāraṇamu

Original — తెలుగు
  1. “షోడశ వికారాః కార్యం, సప్త ప్రకృతి వికృతయః కారణం తేషాం కర్తృత్వ హేతుః ప్రకృతిః ఉచ్యతే, ఆరంభకత్వేనైవ అధవా - కార్యం శరీరం, కరణాని తత్ స్థాని త్రయోదశ దేహారంభకాణి భూతాని పంచ. విషయాశ్చ ప్రకృతి సంభవాః వికారాః గ్రహణేన గృహ్యంతే గుణాశ్చ ప్రకృతి సంభవాః. సుఖ దుఃఖ మోహాత్మకాః కరణాశ్రయత్వాత్ కరణ గ్రహణేన గృహ్యంతే. తేషాం కార్య కరణానాం కర్తృత్వం, ఉత్పాదకత్వం యత్ తత్ కార్య కరణ కర్తృత్వం - తస్మిన్ కార్య కరణ కర్తృత్వే హేతుః కారణం ఆరంభికత్వేన ప్రకృతిః ఉచ్యతే - ఏవం కార్యకరణ కర్తృత్వేన సంసారస్య కారణం ప్రకృతిః”. (శ్రీశంకరః).

(పదియారు వికారములు కార్యములు, ప్రకృతియొక్క వికృతులు ఏడు, కారణము. వీటి అన్నింటికి ఆరంభము చేసినది - మొదటిది - ప్రకృతి వీటి అన్నింటికీ కారణము - లేక, శరీరము కార్యము. దానిలో నుండు కారణములు పదమూడు - దేహమును ఆరంభించునవి - వాటిని కలిపి దేహముగా చేయునవి - పృధివి, నీరు, అగ్ని, వాయువు. ఆకాశము అను పంచభూతములు, ప్రకృతివలన పుట్టి వికారములైన విషయములు - సుఖము, దుఃఖము మొదలగు గుణములు ప్రకృతినుండి కలిగినవి. ఈ పైన చెప్పిన కార్యములను, ఉత్పాదించుట కార్యకరణ కర్తృత్వము. ఈ కార్య కరణ కర్తృత్వమునకు కారణము వీటినన్నింటినీ ఆరంభించునదగుటచేత - మొదటిదాని నుండి వీటన్నింటిని పుట్టించుటచేత - ప్రకృతి - ఇట్లు కార్య కరణములకు కర్తృత్వము కలదగుటచేత ప్రకృతి సంసారమునకు కారణమగుచున్నది).

  1. యదా కార్య కరణ సుఖ దుఃఖ రూపేణ హతు ఫలాత్మనా పరిణతయా ప్రకృత్యా భోగ్య యా పురుషస్య తద్విపరీతస్య భోక్తృత్వేన అవిద్యారూపః సం యోగస్యాత్ - తదా సంసారః స్యాదితి.

(కార్య కరణ సుఖ దుఃఖముల రూపములో పరిణమించిన భోగ్య వస్తువులైన ప్రకృతితో ప్రకృతికి విపరీతమైన (ప్రకృతికంటె వేరు లక్షణములుగల) పురుషునితో (భోక్తృత్వము గల - భోక్తయైన - పురుషునితో) ఎప్పుడు అవిద్యారూపమైన సం యోగము (కలియుట) కలుగునో అప్పుడే సంసారమగుచున్నది. భోగ్యవస్తువులుగల ప్రకృతితో భోక్తయగు (దానిని అనుభవించు) పురుషుడు - భోగము కొఱకు ప్రవేశించినపుడు సంసారము ప్రారంభమగుచున్నది. ప్రకృతి పురుషుల సం యోగము వలననే - క్షేత్ర క్షేత్రజ్ఞుల సం యోగము వలననే - combination of matter and Energy వలననే - సృష్టి జరుగుచున్నది. ఇట్లు జరిగిన సృష్టియే సంసారము).

  1. సుఖ దుఃఖ భోగః సంసారః - పురుషస్య సుఖదుఃఖానాం సంభోక్తృత్వం సాంసారత్వం (శ్రీశంకరః)

(సుఖదుఃఖముల ననుభవించుటయే సంసారము - పురుషుని సుఖదుఃఖముల భోక్తృత్వమే - అనుభవించుటయే సంసారము).

  1. “కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే |

పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే ||

పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ |

కారణం గుణసంగో(అ)స్య సదసద్యోని జన్మసు ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 20, 21)

(పూర్వ పూర్వ ప్రకృతి పరిణామ రూప దేవ మనుష్యాది యోని విశేషేషు స్థితో అయం పురుషః తత్తద్యోని ప్రయుక్త సత్వాది గుణమయేషు సుఖాదిషు సక్తః తత్సాధన భూతేషు పుణ్యపాపకర్మసు ప్రవర్తతే - తతః తత్పుణ్యపాప ఫలానుభవాయ సదసద్యోనిషు సాధ్వ సాధుషు యోనిషు జాయతే. తతశ్చ కర్మారభతే; తతశ్చ జాయతే యావదమానిత్వాధి కా ననాత్మ ప్రాప్తి సాధన భూతాన్ గుణాన్ సేవతే. తావ దేవ సంసరతి) (శ్రీమాన్ రామానుజః)

(ప్రకృతి పరిణామములైన పూర్వము గతించిపోయిన దేవ మనుష్యాది జన్మములలో ఆయా జన్మలకు చెందిన సత్వరజస్తమోగుణములతో నిండిన సుఖములందాసక్తుడై వాటికి సాధనములైన పుణ్యపాప కర్మల చేయుచుండును - అట్లు చేసిన పుణ్యపాప కర్మల ఫలమనుభ వవించు సదసద్యోనులందు (దేవతులు, మనుష్యులు మొదలగు సద్యోనులందును, పశువులు క్రిమికీటకములు మొదలగు కినిద్యోనులందు) జన్మించును - పుట్టినవాడు కర్మచేయ ప్రారంభించును - దానివలన మరల జన్మించును - ఆత్మప్రాప్తి సాధనములైన అమానిత్వము, అదంభిత్వము మొదలగు గుణములు ఎప్పుడవలంభించునో అంతవరకు సంసారములో నుండును)

(శ్రీమద్భగవద్గీత - 13 - 8 to 11)

  1. సావిద్యా సంసృతేర్బీజం తన్నాశో ముక్తిరాత్మనః |

(జీవుడు పరబ్రహ్మ ఒకడే అను వాని ఐక్యము తెలియని యజ్ఞానము సంసారమునకు కారణము - అట్టి అజ్ఞానము నశించి బ్రహ్మజ్ఞానము కలిగిన ఆత్మకు ముక్తి కలుగును).

  1. “క. విను జీవుని చిత్తము దా

ఘన భవ బంధాప వర్గ కారణము మదియే

చిన ద్రిగుణాసక్తంబయి

నను సంసృతి బంధ కారణంబగు; మఱియున్ “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - స్కం.3 - అధ్యా - 25 - 872)

  1. “శ్లో ||. దుఃఖ రాశేర్విచిత్రస్య సేయం భ్రాంతిశ్చిరంతినీ |

మూలం సంసార వృక్షస్య తద్బాధస్తత్వ దర్శనాత్ ||“. (నైష్కర్మ్యసిద్ధి - 2 - 103)

(అనాదినుండి వచ్చుచున్న ఆత్మ అనాత్మల విచక్షణ తెలుసుకొనకుండచేయు ఈ భ్రాంతియే చిత్ర విచిత్రములకు స్థానమగును - దుఃఖరాశియగు ఈ సంసార వృక్షమునకు మూలము - కారణము - తత్వము - భగవత్తత్వము - తెలిసినంతనే ఈ అజ్ఞానము పోయి దానితో కూడ ఈ సంసారము నశించును).

  1. “న చోప చితానాం కర్మణా మయత్తా (అ)స్తి సంసారస్యానిదిత్వాత్”. (నైష్కర్మ్యసిద్ధి - 1 - 221)

(సంసారము అనాదియగుటవలన కర్మలకు ఆది లేదు)

  1. “అసారః ఖలు సంసారః”

(సంసారము సారము లేనిది)

  1. “త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞై రిష్ట్వా స్వర్గతం ప్రార్థయంతే |

తే పుణ్యమాసాద్యసురేంద్ర లోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ |

తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |

ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామ కామా లభంతే ||“. (శ్రీమద్భగవద్గీత - 9 - 20, 21)

“యే స కామాః కథం చిన్న భగవంత ముపాసతే, |

కింతు కామ్యాని కర్మాణ్యసు తిష్టంతి స్వ కామతః |

తే సత్వ శుద్ధ్యభావేన తత్వజ్ఞాన పరాఙ్ముఖాః |

పునపునర్జరామృత్యు ప్రబంధే నైవ సర్వధా |

సంసార దుఃఖభాజః స్యురిత్యాహ భగవాన్ స్వయం ||“. (గీతాభావ ప్రకాశము - 9 - 135, 136)

(ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము చదివి వాటిలో చెప్పిన ఆ యజ్ఞయాగాది కర్మలు ఫలమును కోరి చేయువారు - స్వర్గలోకమును పొందకోరినవారు - సోమపానము చేసి పాపములను పోగొట్టుకొనినవారై ఇంద్రలోకమునకేగి అచ్చట దివ్యమైన భోగములననుభవించి ఆ లోకానుభవముచేత పుణ్యఫలము క్షీణించగా మరల భూలోకము ప్రవేశింతురు, మరల కామ్య కర్మలను చేయుదురు. అట్టివారు సత్వశుద్ధి లేకుండుటవలన తత్వజ్ఞానపరాఙ్ముఖులై మరల మరల జన్మ జరామృత్యువులు గలవారై సంసార దుఃఖమును అనుభవింతురు).

  1. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప |

అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని ||. (శ్రీమద్భగవద్గీత - 9 - 3)

“అజ్ఞానాఖ్యధర్మస్య స్వరూపే సాధనే ఫలే |

నాస్తికా అప్రమత్వాది శంకయా పాపకారిణః |

ఆసురీం సంపదం రూడా వేద మాన విరోధినః |

మత్ప్రాప్తి సాధనం భేద భక్తి మప్యనవాప్య చ |

తే మా భూమానమప్రాప్య సంసారే మృత్యు సం యుతే |

నారకీ యాతనా దౌ చ భ్రమంత్యాకల్ప మాసురాః |

అతస్తే మనుజాకారా వానరా గర్ధ భశ్చవా |

ఉపేక్ష్యాః సర్వదా సద్భిరితి హార్ధం రమా పతేః ||“. (గీతాభావప్రకాశము - 9 - 26 to 30)

(అజ్ఞానమువలన వేదములు మొదలగునవి ప్రమాణగ్రంధములు కావని వాటియందు నమ్మకము లేని నాస్తికులు, ఆసుర ప్రవృత్తి గలవారు భగవత్ప్రాప్తికి సాధనమైన భక్తిని పొందలేక - భగవంతుడనైన నన్ను పొందలేక, మృత్యువుతో కూడి యుండినదిన్నీ, నరకయాతన కలిగించునదిన్నీ అయిన సంసారమందు కల్పాంతము వరకు తిరుగుచు - (భ్రమించుచు - భ్రమణము చేయుచు) నుందురు - అట్టివారిని సత్పురుషులు ఎల్లపుడు మానవాకారముతో నుండు వానరులని లేక గాడిదలని ఉపేక్షించుదురు).

  1. “ఆమయో యశ్చ భూతానాం జాయతే యేన సువ్రత |

తదేవ హ్యామయం ద్రవ్యం న పునాతి చికిత్సితం ||

ఏవం నృణాం క్రియా యోగాః సర్వే సంసృతి హేతువః |

తయేదాత్మ వినాశాయ కల్పంతే కల్పితావరే ||“. (శ్రీమద్భాగవతం - 1 - 5 - 33, 34)

(ఏ ద్రవ్యంబు వలన నే రోగంబు జనియించె నా ద్రవ్యం బా రోగంబు మానుప నేరదు. ద్రవ్యాంతరంబులచేత నైన చికిత్సంబు మానుప నోపు. ఇవ్విధంబున గర్మంబులు సంసార హేతుకంబులయ్యు నీశ్వరార్చితంబులై తాము తమ్ము జెఱుపుకొన నోపియుండు).

(శ్రీమదాంధ్రహాభాగవతము - 1 - 5 - 73)

  1. “అక్రియే కర్తృతా ధ్యాసా దాత్మ జ్ఞానా వృతో జనః |

జన్మ మృత్యు మయీం ఘోరం సంసృతిం యాతి దుస్సహం” ||. (గీతాభావప్రకాశము - 3 - 176)

(అక్రియుడగు = ఏ పనినైనను చేయనివాడగు - ఆత్మయందు కర్తయను అధ్యాసము కలుగుటచేత - ఆత్మజ్ఞానము లేకపోవుటచేత - అజ్ఞానము చేత ఆవరింపబడినవాడు దుస్సహమైన (సహించుటకు శక్యముకాని) జననమరణములతో నిండియుండు సంసారమును పొందుచున్నాడు)

  1. “మ. మిము సద్భక్తి భజింప నొల్లకిల దుర్థేం బ్రవర్తించు నీ

చమతి వ్రాతము నేర్పునం బనుల పాస శ్రేణి బంధించు చం

దమునం బెక్కగు నామరూపముల చేతన్ వారి బంధించి దు

ర్గమ సంసార పయోధి దోతువు దళత్కింజాత పత్రేక్షణా “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ,భా. - 1222)

  1. సృష్టి భగవంతుని వలన కలిగినను సంసారములోని జన్మలలోను, వాటిలోని అనుభవములోను తేడాకు - ఉత్తమ, మధ్యమాధమ జన్మలకు, కష్ట సుఖములకు భగవంతుడు కారణము కాదు. అతనికి వైషమ్యము - విషమ స్వభావము, పక్షపాతము, ఒకరినొకరీతిని, ఇంకొకరిని ఇంకొక రీతిని చూచుట - గాని నైర్ఘృణ్యము - నిర్దయ - కాని లేదు –

“వైషమ్య నైర్ఘృణ్యేన సాపేక్షత్వాత్ తధాహి దర్శయతి” (బ్రహ్మసూత్రములు - 12 - 36)

ఇదంతయు జీవుల కర్మ ఫలమే. సృష్టి ప్రారంభములో కర్మ లేదు కదా అనిన సంసారము అనాది, ఎప్పుడు ప్రారంభమైనదో తెలియదు - ప్రారంభము లేనిది కనుక “న కర్మా విభాగాతి చేన్న అనాదిత్వాత్” (బ్రహ్మసూత్రములు - 2 - 1 - 35)

ఎందుచేతననగా ప్రతి సృష్టియు అంతకు పూర్వపు సృష్టివలెనే - ‘థాతా యధా పూర్వమకల్పయత్’ - (ఋ - సం - 10 - 190 - 3)

అని శ్రుతి చెప్పుచున్నది. ఈ సంసారమునకు రూపము గాని, మొదలుగాని, మధ్యగాని, అంతముగాని తెలియదు - “న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాది న చ సంప్రతిష్టా”. అని శ్రుతి చెప్పుచున్నది. (శ్రీమద్భగవద్గీత - 15 - 3)

Transliteration
  1. “ṣōḍaśa vikārāḥ kāryaṃ, sapta prakṛti vikṛtayaḥ kāraṇaṃ tēṣāṃ kartṛtva hētuḥ prakṛtiḥ ucyatē, āraṃbhakatvēnaiva adhavā - kāryaṃ śarīraṃ, karaṇāni tat sthāni trayōdaśa dēhāraṃbhakāṇi bhūtāni paṃca. viṣayāśca prakṛti saṃbhavāḥ vikārāḥ grahaṇēna gṛhyaṃtē guṇāśca prakṛti saṃbhavāḥ. sukha duḥkha mōhātmakāḥ karaṇāśrayatvāt karaṇa grahaṇēna gṛhyaṃtē. tēṣāṃ kārya karaṇānāṃ kartṛtvaṃ, utpādakatvaṃ yat tat kārya karaṇa kartṛtvaṃ - tasmin kārya karaṇa kartṛtvē hētuḥ kāraṇaṃ āraṃbhikatvēna prakṛtiḥ ucyatē - ēvaṃ kāryakaraṇa kartṛtvēna saṃsārasya kāraṇaṃ prakṛtiḥ”. (śrīśaṃkaraḥ).

(padiyāru vikāramulu kāryamulu, prakṛtiyokka vikṛtulu ēḍu, kāraṇamu. vīṭi anniṃṭiki āraṃbhamu cēsinadi - modaṭidi - prakṛti vīṭi anniṃṭikī kāraṇamu - lēka, śarīramu kāryamu. dānilō nuṃḍu kāraṇamulu padamūḍu - dēhamunu āraṃbhiṃcunavi - vāṭini kalipi dēhamugā cēyunavi - pṛdhivi, nīru, agni, vāyuvu. ākāśamu anu paṃcabhūtamulu, prakṛtivalana puṭṭi vikāramulaina viṣayamulu - sukhamu, duḥkhamu modalagu guṇamulu prakṛtinuṃḍi kaliginavi. ī paina ceppina kāryamulanu, utpādiṃcuṭa kāryakaraṇa kartṛtvamu. ī kārya karaṇa kartṛtvamunaku kāraṇamu vīṭinanniṃṭinī āraṃbhiṃcunadaguṭacēta - modaṭidāni nuṃḍi vīṭanniṃṭini puṭṭiṃcuṭacēta - prakṛti - iṭlu kārya karaṇamulaku kartṛtvamu kaladaguṭacēta prakṛti saṃsāramunaku kāraṇamagucunnadi).

  1. yadā kārya karaṇa sukha duḥkha rūpēṇa hatu phalātmanā pariṇatayā prakṛtyā bhōgya yā puruṣasya tadviparītasya bhōktṛtvēna avidyārūpaḥ saṃ yōgasyāt - tadā saṃsāraḥ syāditi.

(kārya karaṇa sukha duḥkhamula rūpamulō pariṇamiṃcina bhōgya vastuvulaina prakṛtitō prakṛtiki viparītamaina (prakṛtikaṃṭe vēru lakṣaṇamulugala) puruṣunitō (bhōktṛtvamu gala - bhōktayaina - puruṣunitō) eppuḍu avidyārūpamaina saṃ yōgamu (kaliyuṭa) kalugunō appuḍē saṃsāramagucunnadi. bhōgyavastuvulugala prakṛtitō bhōktayagu (dānini anubhaviṃcu) puruṣuḍu - bhōgamu koṟaku pravēśiṃcinapuḍu saṃsāramu prāraṃbhamagucunnadi. prakṛti puruṣula saṃ yōgamu valananē - kṣētra kṣētrajñula saṃ yōgamu valananē - combination of matter and Energy valananē - sṛṣṭi jarugucunnadi. iṭlu jarigina sṛṣṭiyē saṃsāramu).

  1. sukha duḥkha bhōgaḥ saṃsāraḥ - puruṣasya sukhaduḥkhānāṃ saṃbhōktṛtvaṃ sāṃsāratvaṃ (śrīśaṃkaraḥ)

(sukhaduḥkhamula nanubhaviṃcuṭayē saṃsāramu - puruṣuni sukhaduḥkhamula bhōktṛtvamē - anubhaviṃcuṭayē saṃsāramu).

  1. “kāryakāraṇa kartṛtvē hētuḥ prakṛtirucyatē |

puruṣaḥ sukhaduḥkhānāṃ bhōktṛtvē hēturucyatē ||

puruṣaḥ prakṛtisthō hi bhuṃktē prakṛtijān guṇān |

kāraṇaṃ guṇasaṃgō(a)sya sadasadyōni janmasu ||“. (śrīmadbhagavadgīta - 13 - 20, 21)

(pūrva pūrva prakṛti pariṇāma rūpa dēva manuṣyādi yōni viśēṣēṣu sthitō ayaṃ puruṣaḥ tattadyōni prayukta satvādi guṇamayēṣu sukhādiṣu saktaḥ tatsādhana bhūtēṣu puṇyapāpakarmasu pravartatē - tataḥ tatpuṇyapāpa phalānubhavāya sadasadyōniṣu sādhva sādhuṣu yōniṣu jāyatē. tataśca karmārabhatē; tataśca jāyatē yāvadamānitvādhi kā nanātma prāpti sādhana bhūtān guṇān sēvatē. tāva dēva saṃsarati) (śrīmān rāmānujaḥ)

(prakṛti pariṇāmamulaina pūrvamu gatiṃcipōyina dēva manuṣyādi janmamulalō āyā janmalaku ceṃdina satvarajastamōguṇamulatō niṃḍina sukhamulaṃdāsaktuḍai vāṭiki sādhanamulaina puṇyapāpa karmala cēyucuṃḍunu - aṭlu cēsina puṇyapāpa karmala phalamanubha vaviṃcu sadasadyōnulaṃdu (dēvatulu, manuṣyulu modalagu sadyōnulaṃdunu, paśuvulu krimikīṭakamulu modalagu kinidyōnulaṃdu) janmiṃcunu - puṭṭinavāḍu karmacēya prāraṃbhiṃcunu - dānivalana marala janmiṃcunu - ātmaprāpti sādhanamulaina amānitvamu, adaṃbhitvamu modalagu guṇamulu eppuḍavalaṃbhiṃcunō aṃtavaraku saṃsāramulō nuṃḍunu)

(śrīmadbhagavadgīta - 13 - 8 to 11)

  1. sāvidyā saṃsṛtērbījaṃ tannāśō muktirātmanaḥ |

(jīvuḍu parabrahma okaḍē anu vāni aikyamu teliyani yajñānamu saṃsāramunaku kāraṇamu - aṭṭi ajñānamu naśiṃci brahmajñānamu kaligina ātmaku mukti kalugunu).

  1. “ka. vinu jīvuni cittamu dā

ghana bhava baṃdhāpa varga kāraṇamu madiyē

cina driguṇāsaktaṃbayi

nanu saṃsṛti baṃdha kāraṇaṃbagu; maṟiyun “. (śrīmadāṃdhramahābhāgavatamu - skaṃ.3 - adhyā - 25 - 872)

  1. “ślō ||. duḥkha rāśērvicitrasya sēyaṃ bhrāṃtiściraṃtinī |

mūlaṃ saṃsāra vṛkṣasya tadbādhastatva darśanāt ||“. (naiṣkarmyasiddhi - 2 - 103)

(anādinuṃḍi vaccucunna ātma anātmala vicakṣaṇa telusukonakuṃḍacēyu ī bhrāṃtiyē citra vicitramulaku sthānamagunu - duḥkharāśiyagu ī saṃsāra vṛkṣamunaku mūlamu - kāraṇamu - tatvamu - bhagavattatvamu - telisinaṃtanē ī ajñānamu pōyi dānitō kūḍa ī saṃsāramu naśiṃcunu).

  1. “na cōpa citānāṃ karmaṇā mayattā (a)sti saṃsārasyāniditvāt”. (naiṣkarmyasiddhi - 1 - 221)

(saṃsāramu anādiyaguṭavalana karmalaku ādi lēdu)

  1. “asāraḥ khalu saṃsāraḥ”

(saṃsāramu sāramu lēnidi)

  1. “traividyā māṃ sōmapāḥ pūtapāpāḥ yajñai riṣṭvā svargataṃ prārthayaṃtē |

tē puṇyamāsādyasurēṃdra lōkaṃ aśnaṃti divyān divi dēva bhōgān |

tē taṃ bhuktvā svargalōkaṃ viśālaṃ kṣīṇē puṇyē martyalōkaṃ viśaṃti |

ēvaṃ trayīdharmamanuprapannā gatāgataṃ kāma kāmā labhaṃtē ||“. (śrīmadbhagavadgīta - 9 - 20, 21)

“yē sa kāmāḥ kathaṃ cinna bhagavaṃta mupāsatē, |

kiṃtu kāmyāni karmāṇyasu tiṣṭaṃti sva kāmataḥ |

tē satva śuddhyabhāvēna tatvajñāna parāṅmukhāḥ |

punapunarjarāmṛtyu prabaṃdhē naiva sarvadhā |

saṃsāra duḥkhabhājaḥ syurityāha bhagavān svayaṃ ||“. (gītābhāva prakāśamu - 9 - 135, 136)

(ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu cadivi vāṭilō ceppina ā yajñayāgādi karmalu phalamunu kōri cēyuvāru - svargalōkamunu poṃdakōrinavāru - sōmapānamu cēsi pāpamulanu pōgoṭṭukoninavārai iṃdralōkamunakēgi accaṭa divyamaina bhōgamulananubhaviṃci ā lōkānubhavamucēta puṇyaphalamu kṣīṇiṃcagā marala bhūlōkamu pravēśiṃturu, marala kāmya karmalanu cēyuduru. aṭṭivāru satvaśuddhi lēkuṃḍuṭavalana tatvajñānaparāṅmukhulai marala marala janma jarāmṛtyuvulu galavārai saṃsāra duḥkhamunu anubhaviṃturu).

  1. aśraddhadhānāḥ puruṣāḥ dharmasyāsya paraṃtapa |

aprāpya māṃ nivartaṃtē mṛtyu saṃsāra vartmani ||. (śrīmadbhagavadgīta - 9 - 3)

“ajñānākhyadharmasya svarūpē sādhanē phalē |

nāstikā apramatvādi śaṃkayā pāpakāriṇaḥ |

āsurīṃ saṃpadaṃ rūḍā vēda māna virōdhinaḥ |

matprāpti sādhanaṃ bhēda bhakti mapyanavāpya ca |

tē mā bhūmānamaprāpya saṃsārē mṛtyu saṃ yutē |

nārakī yātanā dau ca bhramaṃtyākalpa māsurāḥ |

atastē manujākārā vānarā gardha bhaścavā |

upēkṣyāḥ sarvadā sadbhiriti hārdhaṃ ramā patēḥ ||“. (gītābhāvaprakāśamu - 9 - 26 to 30)

(ajñānamuvalana vēdamulu modalagunavi pramāṇagraṃdhamulu kāvani vāṭiyaṃdu nammakamu lēni nāstikulu, āsura pravṛtti galavāru bhagavatprāptiki sādhanamaina bhaktini poṃdalēka - bhagavaṃtuḍanaina nannu poṃdalēka, mṛtyuvutō kūḍi yuṃḍinadinnī, narakayātana kaligiṃcunadinnī ayina saṃsāramaṃdu kalpāṃtamu varaku tirugucu - (bhramiṃcucu - bhramaṇamu cēyucu) nuṃduru - aṭṭivārini satpuruṣulu ellapuḍu mānavākāramutō nuṃḍu vānarulani lēka gāḍidalani upēkṣiṃcuduru).

  1. “āmayō yaśca bhūtānāṃ jāyatē yēna suvrata |

tadēva hyāmayaṃ dravyaṃ na punāti cikitsitaṃ ||

ēvaṃ nṛṇāṃ kriyā yōgāḥ sarvē saṃsṛti hētuvaḥ |

tayēdātma vināśāya kalpaṃtē kalpitāvarē ||“. (śrīmadbhāgavataṃ - 1 - 5 - 33, 34)

(ē dravyaṃbu valana nē rōgaṃbu janiyiṃce nā dravyaṃ bā rōgaṃbu mānupa nēradu. dravyāṃtaraṃbulacēta naina cikitsaṃbu mānupa nōpu. ivvidhaṃbuna garmaṃbulu saṃsāra hētukaṃbulayyu nīśvarārcitaṃbulai tāmu tammu jeṟupukona nōpiyuṃḍu).

(śrīmadāṃdhrahābhāgavatamu - 1 - 5 - 73)

  1. “akriyē kartṛtā dhyāsā dātma jñānā vṛtō janaḥ |

janma mṛtyu mayīṃ ghōraṃ saṃsṛtiṃ yāti dussahaṃ” ||. (gītābhāvaprakāśamu - 3 - 176)

(akriyuḍagu = ē paninainanu cēyanivāḍagu - ātmayaṃdu kartayanu adhyāsamu kaluguṭacēta - ātmajñānamu lēkapōvuṭacēta - ajñānamu cēta āvariṃpabaḍinavāḍu dussahamaina (sahiṃcuṭaku śakyamukāni) jananamaraṇamulatō niṃḍiyuṃḍu saṃsāramunu poṃducunnāḍu)

  1. “ma. mimu sadbhakti bhajiṃpa nollakila durthēṃ bravartiṃcu nī

camati vrātamu nērpunaṃ banula pāsa śrēṇi baṃdhiṃcu caṃ

damunaṃ bekkagu nāmarūpamula cētan vāri baṃdhiṃci du

rgama saṃsāra payōdhi dōtuvu daḷatkiṃjāta patrēkṣaṇā “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u,bhā. - 1222)

  1. sṛṣṭi bhagavaṃtuni valana kaliginanu saṃsāramulōni janmalalōnu, vāṭilōni anubhavamulōnu tēḍāku - uttama, madhyamādhama janmalaku, kaṣṭa sukhamulaku bhagavaṃtuḍu kāraṇamu kādu. ataniki vaiṣamyamu - viṣama svabhāvamu, pakṣapātamu, okarinokarītini, iṃkokarini iṃkoka rītini cūcuṭa - gāni nairghṛṇyamu - nirdaya - kāni lēdu –

“vaiṣamya nairghṛṇyēna sāpēkṣatvāt tadhāhi darśayati” (brahmasūtramulu - 12 - 36)

idaṃtayu jīvula karma phalamē. sṛṣṭi prāraṃbhamulō karma lēdu kadā anina saṃsāramu anādi, eppuḍu prāraṃbhamainadō teliyadu - prāraṃbhamu lēnidi kanuka “na karmā vibhāgāti cēnna anāditvāt” (brahmasūtramulu - 2 - 1 - 35)

eṃducētananagā prati sṛṣṭiyu aṃtaku pūrvapu sṛṣṭivalenē - ‘thātā yadhā pūrvamakalpayat’ - (ṛ - saṃ - 10 - 190 - 3)

ani śruti ceppucunnadi. ī saṃsāramunaku rūpamu gāni, modalugāni, madhyagāni, aṃtamugāni teliyadu - “na rūpamasyēha tathōpalabhyatē nāṃtō na cādi na ca saṃpratiṣṭā”. ani śruti ceppucunnadi. (śrīmadbhagavadgīta - 15 - 3)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.