← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంసార సాగరము saṃsāra sāgaramu

Original — తెలుగు
  1. సంసారమను సముద్రము - సముద్రమువేలెనుండు సంసారము -

  2. సంసారః ఏవ సాగరః ఇవసాగరః, దురుత్తారత్వాత్.

(దాటుట - ఒడ్డు చేరుట అతికష్టమగుటవలన సముద్రమువలెనుండు సంసారము. అందుచేత సంసారమే సాగరము, లేక సాగరమువలె (సముద్రమువలె) దాట శక్యముకానిది సంసారము -

  1. సంసారః మిధ్యాజ్ఞాన తత్కార్య ప్రపంచః, స ఏవ సాగరః ఇవ దురుత్తరః - దురుత్తరత్వాత్ సాగరః ఇవ.

(సంసారము అనగా మిధ్యాజ్ఞానముయొక్క కార్యమైన ప్రపంచము - మిధ్యాజ్ఞానము కలుగుటవలననే ఇది అంతయు ప్రపంచమువలె కనబడుచున్నది. యధార్థముగా ప్రపంచమనునది లేదు - అంతయు భగవంతుడే. అదియే దాట శక్యముకాని (తరించుటకు శక్యముకాని) సముద్రమువలె నుండుటవలన సంసారము సముద్రమని చెప్పబడినది).

  1. “నిద్రాభయ సరీనౄపం హింసాది తరంగం, తృష్ణావర్తం, దారపంకం, సంసార వార్థిం” (మండలబ్రాహ్మణోపనిషత్)

(సముద్రమువలె నుండు సంసారములో నిద్రాభయములే సరీనృపము, హింస మొదలగునవి కెరటములు, తృష్ణ అనునది ఆవర్తము - (సుడి), భార్యయే బురద).

  1. “శ్లో ||. తృష్ణా తోయే మదనపవనోద్ధూత మోహార్మ మాలే |

దారావర్తే తనయ సహజ గ్రాహసం ఘాకులేచ |

సంసారాఖ్యే మహతి జలధౌ మజ్జతామ ప్లవానాం |

భవతు శరణమేకో కృష్ణ పోతోనరాణాం ||“. (ముకుందమాల)

(సంసారమనునది మహాసముద్రము వంటిది. సముద్రము ఒడ్డు చేరుటకు మానవశక్తిని మించిన జలసమూహము - దానిలో పెనుగాలిచే ఉద్ధృతమై మీదపడిన చంపివేయగల పెద్ద పెద్ద కెరటములు, తమ ఆవరణలోనికి వచ్చిన వాటిని తమలోనికి లాగుకొని ముంచివేయగల సుడులు; అమాంతముగా మ్రింగివేయ శక్తిగల మొసళ్ళు, తిమింగలములు, పెద్ద పెద్ద చేపలు ఉండుటచేత వీటన్నింటినీ తప్పించుకొని ఒడ్డు చేరుట బహు కష్టము. సంసారముకూడ సముద్రమువంటిదే. సముద్రములోని జలము వంటిది, సంసారములోని తృష్ణ (ఆశ) కలదు - ఎంత దూరము చూచినను సముద్రము జలమయమే అయినట్లు ఈ సంసారములో సుఖములనెంత అనుభవించినను, ముసలివాడైనను తనివి తీరక ఇంకను అనుభవించవలెననియే యుండును - యయాతి మహారాజు తనభార్యతో కొన్ని వేల సంవత్సరములు సుఖము అనుభవించి ముసలివాడైనను తనివి తీరక, ఇంకను సుఖముననుభవించవలెనను తృష్ణ విడువలేక, తనకుమారుని యౌవనమును నడిగి పుచ్చుకొని మరికొన్ని సవత్సరములు సౌఖ్యమనుభవించెను. వైన్యుడు మొదలగువారు గొప్ప తృష్ణగలవారైనను, ఏమిచేసినను దాని అంతము చూడలేనివారైరి - వారికి సంతుష్టిలేకపోయెను. సముద్రములోని సుడివంటిది సంసారములోభార్య. భార్యా సాంగత్యములోని సుఖములో మునిగిపోవుటయే కాని తేలుట యుండదు. సముద్రములోని తిమింగలములు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు మొదలగు వాటివలె సంసారములో అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, గలరు. ఇటువంటి సంసారములో ఒడ్డు చేరుటకు పడవ వంటిది లేక మునిగిపోవుచున్న మాకు శ్రీకృష్ణుడను (భగవంతుడను) పడవ వీటినన్నింటిని దాటించి సంసారముయొక్క ఒడ్డును చేర్చుగాక - మాకు సంసారము లేకుండునట్లు - జననమరణములు లేకుండునట్లు - మోక్షము కలుగునట్లు చేయుగాక).

  1. సంసారార్ణవేసంసార సముద్రే మహతి అవిద్యా కామకర్మ ప్రభవ దుఃఖోదకే, తీవ్ర రోగ జరామృత్యు మహాగ్రాహే, అనాదివనంతే, అపారే నిరాలంబే విషయేంద్రియ జనిత సుఖ లవక్షణ విశ్రామే, పంచేంద్రియార్థ తృష్ణా మారుత విక్షోభోత్థితానర్థ శత మహోర్మౌ, మహా రౌరవాద్యనేక నిరయగతహా హేత్యాది కూజితా క్రోశనూద్భూతమహా రవే, సత్యార్జిత దానదయా అహింసా దమ శమ ధృతాద్యాత్మ గుణపాధేయ పూర్ణ జ్ఞానోడుపే, సత్సంగ సర్వత్యాగ మార్గే మోక్ష తీరే, ఏతస్మిన్ మహార్ణవే పతితవంతః. తస్మాత్ అగ్న్యాది దేవతా ప్రియ లక్షణాపి యా గతిః జ్ఞాన కర్మ సముచయానుష్ఠాన ఫలభూతాసాపి నాలం సంసార దుఃఖోపశమాయ. యస్మాత్ ఏవం తస్మాత్ ఏవం విదిత్వా బ్రహ్మ జగదుత్పత్తి స్థితి సంహార హేతుత్వేన సః సర్వ సంసార దుఃఖోపశమనాయ వేది తన్యః (శ్రీ శంకరః)

(సంసారమను మహాసముద్రమునందు అవిద్యవలన కలిగిన దుఃఖమే జలము, తీవ్రమైన రోగము ముసలితనము, మృత్యువు మొదలగునవియే మొసళ్ళు, తత్వజ్ఞానము లేకపోవుటచేత ఈ సంసారము మొదలు లేనిది, అనంతము, అపారము (ఒడ్డు లేనిది, నిరాలంబము, విషయములందు ఇంద్రియములకు కలుగు క్షణమాత్రమైన సుఖలేశమే విశ్రామము; పంచేంద్రియములకు అర్థములందు కలుగు తృష్ణయే పెనుగాలి, దానిచే క్షోభింపబడిన వందలకొలదియైన క్లేశములు అనర్థములు, మహారౌరవము మొదలగు అనేక నరకములలో గల ‘హా హా’ అను బాధలతో చేయు కేకల శబ్దము గలది; సత్యార్జితమైన దానము, దయా, అహింసా, దమము, శమము, ధృతి మొదలగు ఆత్మగుణములుకలది. సత్సంగము సర్వత్యాగము మార్గముగా గలదియు, మోక్షమే తీరము (ఒడ్డు) గా గలదియు నగు మహాసముద్రములో పడినవారికి - అగ్ని మొదలగు దేవతలకు ప్రియమైన మార్గము జ్ఞానకర్మలననుష్టించుట వలన ఫలముగా గలది - సంసార దుఃఖమును శమింపచేయుటకు చాలదు. అందుచేత ఈ విషయమును తెలుసుకొని జగత్తునకు ఉత్పత్తి స్థితి లయములకు కారణమైన బ్రహ్మ సంసారమువలన కలుగు దుఃఖమును శమింప చేయుటకు తెలుసుకొన తగినవాడు - బ్రహ్మజ్ఞానము కలిగియుండవలయును).

“అవిద్యాది ప్రభవం దుఃఖమేవ దుష్ప్రవేశత్వ గుణేన ఉదకమివ ఉదకం యస్మిన్, తీవ్రరోగాదయః ఏవ భయంకరత్వేన గ్రాహాః, నక్రాదయః యస్మిన్; తత్వజ్ఞానమంతరేణ వినాశా భావాదనంతే అజ్ఞానాముత్తరావద్య భావే నాపారే, విశ్రామస్థానా భావేన నిరాలంబే, సమీచీన విశ్రామ స్థానా భావేపితదా భాసో అస్తీ త్యాహ విషయేంద్రియేతి; విషయేంద్రియ సంబంధజనిత సుఖ లేశ రూపో విశ్రామో యస్మిన్; పంచేంద్రియాణా మర్థేషు విషయేషు శబ్దాదిషు యా తృష్ణా సైవమారుతః; తత్కృతో యో విక్షోభః తేన ఉత్థతాని అనర్థశతాని విషయ సంపాదితాః క్లేశాః తే ఏవో ర్మయః యస్మిన్ మహారౌరవాదయః ఏవానేక నిరయాః నరక విశేషాః; తద్గతానాం గర్భవాస తన్నిష్క్రణబాల్యాదయః మరణాంతాః తే అనేకనిరయాః, దుఃఖ జనకత్వాత్, తద్గతానా చ యాని హా హేత్యాదీని కూజితాని స్వల్పద్వనయః ఆక్రోశనాని, మహాద్వనయః, తదుద్భూతో మహారవో యస్మిన్ మహాపాత కాధ్యనేక నిరయేతి పారే, మహాపాతక జన్యా నిరయా ఇతి ద్రష్టవ్యం సంసారార్ణవస్య ఏవం భూతత్వే తస్య తరణా సంభవాత్ మోక్ష శాస్త్రానర్థక్యమిత్యాశంక్య అవివేకినాం తథాత్వేపి వివేకినాం తత్తరుణో పాయో అస్తి”. (శ్రీ ఆనందతీర్థః)

(ఈ సంసార మహాసముద్రములో అవిద్యవలన కలిగినటువంటి దుఃఖమే ప్రవేశించుటకు అతి కష్టమైనదగుటచేత నీరువలె నున్న ఆ సముద్రములోని నీరు; భయమును కలుగచేయు తీవ్రమైన రోగము మొదలగునవియే అందులోని మొసళ్ళు, తత్వజ్ఞానము కలిగియుండుటవలన వినాశము లేనందువలన అంతము లేనిదిన్నీ, అజ్ఞులు తరించుటకు వీలుకానందున అపారమైనదిన్నీ (ఒడ్డు లేనిదిన్నీ) - ఉన్నదంతా సముద్రమువలెనున్నదిన్నీ, విశ్రమించుటకు స్థానము లేకుండుటవలన ఆలంభనము (పట్టుకొని వ్రేలాడుటకు అవకాశము) లేనిదిన్నీ, ఇంద్రియములు వీషయములతో సంబంధము కలిగియుండుటవలన లేశమాత్ర సుఖము విశ్రామస్థానముగా గలది, పంచేంద్రియములకు విషయములగు శబ్దము మొదలగువాటియందు గల తృష్ణయే గాలి, ఆ గాలిచేత క్షుభితమగుటవలన కలుగనవిన్నీ, విషయములవల్ల కలుగనవిన్నీ, వందలకొలది యగు అనర్థములే క్లేశములు; మహా రౌరవము మొదలగు అనేక నరకములు, - నరక విశేషములు, గర్భవాసము, దానినుండి బయటపడిన తర్వాత బాల్యము మొదలు మరణమువరకు గల అనేక నరకములు (దుఃఖమును కలిగించుటచేత నరకములైనవి); ఆ నరకములలో ‘హ’ ‘హ’ అని కేకలు వేయు స్వల్పమైన ధ్వనులు, ఆక్రోశము మొదలగు పెద్ద పెద్ద కేకలు గలగి - మహాపాపములవలన కలుగు నరకముల వంటివి - గలవి - ఇటువంటిది సంసారమగుటచేత దానిని తరించుట సాధ్యముకాదుకనుక మోక్షశాస్త్ర మనర్థము అని అవివేకులకు శంకించినందువల్ల, వివేకవంతులకు తరుణోపాయము కలదు).

  1. “తే. పుత్ర దార గృహ క్షేత్ర భూరి విషయ

ఘన సుఖాసక్తుడగుచునే మనుజుడేని

నర్థి జరియించువాడు భవాబ్ధిలోన

జెంది యెన్నాళ్ళకును దరిజేరలేడు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. || 1228)

  1. “సంసారార్ణవకర్ణథారక హరే కృష్ణాయ తుభ్యం నమః” (శ్రీరామకర్ణామృతం - 1 - 14)

(సంసారమనుమహా సముద్రమును దాటించి కర్ణధారుడవైన శ్రీహరీ, కృష్ణా | నీకు నమస్కారము చయుచున్నాను).

Transliteration
  1. saṃsāramanu samudramu - samudramuvēlenuṃḍu saṃsāramu -

  2. saṃsāraḥ ēva sāgaraḥ ivasāgaraḥ, duruttāratvāt.

(dāṭuṭa - oḍḍu cēruṭa atikaṣṭamaguṭavalana samudramuvalenuṃḍu saṃsāramu. aṃducēta saṃsāramē sāgaramu, lēka sāgaramuvale (samudramuvale) dāṭa śakyamukānidi saṃsāramu -

  1. saṃsāraḥ midhyājñāna tatkārya prapaṃcaḥ, sa ēva sāgaraḥ iva duruttaraḥ - duruttaratvāt sāgaraḥ iva.

(saṃsāramu anagā midhyājñānamuyokka kāryamaina prapaṃcamu - midhyājñānamu kaluguṭavalananē idi aṃtayu prapaṃcamuvale kanabaḍucunnadi. yadhārthamugā prapaṃcamanunadi lēdu - aṃtayu bhagavaṃtuḍē. adiyē dāṭa śakyamukāni (tariṃcuṭaku śakyamukāni) samudramuvale nuṃḍuṭavalana saṃsāramu samudramani ceppabaḍinadi).

  1. “nidrābhaya sarīnṝpaṃ hiṃsādi taraṃgaṃ, tṛṣṇāvartaṃ, dārapaṃkaṃ, saṃsāra vārthiṃ” (maṃḍalabrāhmaṇōpaniṣat)

(samudramuvale nuṃḍu saṃsāramulō nidrābhayamulē sarīnṛpamu, hiṃsa modalagunavi keraṭamulu, tṛṣṇa anunadi āvartamu - (suḍi), bhāryayē burada).

  1. “ślō ||. tṛṣṇā tōyē madanapavanōddhūta mōhārma mālē |

dārāvartē tanaya sahaja grāhasaṃ ghākulēca |

saṃsārākhyē mahati jaladhau majjatāma plavānāṃ |

bhavatu śaraṇamēkō kṛṣṇa pōtōnarāṇāṃ ||“. (mukuṃdamāla)

(saṃsāramanunadi mahāsamudramu vaṃṭidi. samudramu oḍḍu cēruṭaku mānavaśaktini miṃcina jalasamūhamu - dānilō penugālicē uddhṛtamai mīdapaḍina caṃpivēyagala pedda pedda keraṭamulu, tama āvaraṇalōniki vaccina vāṭini tamalōniki lāgukoni muṃcivēyagala suḍulu; amāṃtamugā mriṃgivēya śaktigala mosaḷḷu, timiṃgalamulu, pedda pedda cēpalu uṃḍuṭacēta vīṭanniṃṭinī tappiṃcukoni oḍḍu cēruṭa bahu kaṣṭamu. saṃsāramukūḍa samudramuvaṃṭidē. samudramulōni jalamu vaṃṭidi, saṃsāramulōni tṛṣṇa (āśa) kaladu - eṃta dūramu cūcinanu samudramu jalamayamē ayinaṭlu ī saṃsāramulō sukhamulaneṃta anubhaviṃcinanu, musalivāḍainanu tanivi tīraka iṃkanu anubhaviṃcavalenaniyē yuṃḍunu - yayāti mahārāju tanabhāryatō konni vēla saṃvatsaramulu sukhamu anubhaviṃci musalivāḍainanu tanivi tīraka, iṃkanu sukhamunanubhaviṃcavalenanu tṛṣṇa viḍuvalēka, tanakumāruni yauvanamunu naḍigi puccukoni marikonni savatsaramulu saukhyamanubhaviṃcenu. vainyuḍu modalaguvāru goppa tṛṣṇagalavārainanu, ēmicēsinanu dāni aṃtamu cūḍalēnivārairi - vāriki saṃtuṣṭilēkapōyenu. samudramulōni suḍivaṃṭidi saṃsāramulōbhārya. bhāryā sāṃgatyamulōni sukhamulō munigipōvuṭayē kāni tēluṭa yuṃḍadu. samudramulōni timiṃgalamulu, mosaḷḷu, pedda pedda cēpalu modalagu vāṭivale saṃsāramulō annadammulu, akkacelleḷḷu, galaru. iṭuvaṃṭi saṃsāramulō oḍḍu cēruṭaku paḍava vaṃṭidi lēka munigipōvucunna māku śrīkṛṣṇuḍanu (bhagavaṃtuḍanu) paḍava vīṭinanniṃṭini dāṭiṃci saṃsāramuyokka oḍḍunu cērcugāka - māku saṃsāramu lēkuṃḍunaṭlu - jananamaraṇamulu lēkuṃḍunaṭlu - mōkṣamu kalugunaṭlu cēyugāka).

  1. saṃsārārṇavēsaṃsāra samudrē mahati avidyā kāmakarma prabhava duḥkhōdakē, tīvra rōga jarāmṛtyu mahāgrāhē, anādivanaṃtē, apārē nirālaṃbē viṣayēṃdriya janita sukha lavakṣaṇa viśrāmē, paṃcēṃdriyārtha tṛṣṇā māruta vikṣōbhōtthitānartha śata mahōrmau, mahā rauravādyanēka nirayagatahā hētyādi kūjitā krōśanūdbhūtamahā ravē, satyārjita dānadayā ahiṃsā dama śama dhṛtādyātma guṇapādhēya pūrṇa jñānōḍupē, satsaṃga sarvatyāga mārgē mōkṣa tīrē, ētasmin mahārṇavē patitavaṃtaḥ. tasmāt agnyādi dēvatā priya lakṣaṇāpi yā gatiḥ jñāna karma samucayānuṣṭhāna phalabhūtāsāpi nālaṃ saṃsāra duḥkhōpaśamāya. yasmāt ēvaṃ tasmāt ēvaṃ viditvā brahma jagadutpatti sthiti saṃhāra hētutvēna saḥ sarva saṃsāra duḥkhōpaśamanāya vēdi tanyaḥ (śrī śaṃkaraḥ)

(saṃsāramanu mahāsamudramunaṃdu avidyavalana kaligina duḥkhamē jalamu, tīvramaina rōgamu musalitanamu, mṛtyuvu modalagunaviyē mosaḷḷu, tatvajñānamu lēkapōvuṭacēta ī saṃsāramu modalu lēnidi, anaṃtamu, apāramu (oḍḍu lēnidi, nirālaṃbamu, viṣayamulaṃdu iṃdriyamulaku kalugu kṣaṇamātramaina sukhalēśamē viśrāmamu; paṃcēṃdriyamulaku arthamulaṃdu kalugu tṛṣṇayē penugāli, dānicē kṣōbhiṃpabaḍina vaṃdalakoladiyaina klēśamulu anarthamulu, mahārauravamu modalagu anēka narakamulalō gala ‘hā hā’ anu bādhalatō cēyu kēkala śabdamu galadi; satyārjitamaina dānamu, dayā, ahiṃsā, damamu, śamamu, dhṛti modalagu ātmaguṇamulukaladi. satsaṃgamu sarvatyāgamu mārgamugā galadiyu, mōkṣamē tīramu (oḍḍu) gā galadiyu nagu mahāsamudramulō paḍinavāriki - agni modalagu dēvatalaku priyamaina mārgamu jñānakarmalananuṣṭiṃcuṭa valana phalamugā galadi - saṃsāra duḥkhamunu śamiṃpacēyuṭaku cāladu. aṃducēta ī viṣayamunu telusukoni jagattunaku utpatti sthiti layamulaku kāraṇamaina brahma saṃsāramuvalana kalugu duḥkhamunu śamiṃpa cēyuṭaku telusukona taginavāḍu - brahmajñānamu kaligiyuṃḍavalayunu).

“avidyādi prabhavaṃ duḥkhamēva duṣpravēśatva guṇēna udakamiva udakaṃ yasmin, tīvrarōgādayaḥ ēva bhayaṃkaratvēna grāhāḥ, nakrādayaḥ yasmin; tatvajñānamaṃtarēṇa vināśā bhāvādanaṃtē ajñānāmuttarāvadya bhāvē nāpārē, viśrāmasthānā bhāvēna nirālaṃbē, samīcīna viśrāma sthānā bhāvēpitadā bhāsō astī tyāha viṣayēṃdriyēti; viṣayēṃdriya saṃbaṃdhajanita sukha lēśa rūpō viśrāmō yasmin; paṃcēṃdriyāṇā marthēṣu viṣayēṣu śabdādiṣu yā tṛṣṇā saivamārutaḥ; tatkṛtō yō vikṣōbhaḥ tēna utthatāni anarthaśatāni viṣaya saṃpāditāḥ klēśāḥ tē ēvō rmayaḥ yasmin mahārauravādayaḥ ēvānēka nirayāḥ naraka viśēṣāḥ; tadgatānāṃ garbhavāsa tanniṣkraṇabālyādayaḥ maraṇāṃtāḥ tē anēkanirayāḥ, duḥkha janakatvāt, tadgatānā ca yāni hā hētyādīni kūjitāni svalpadvanayaḥ ākrōśanāni, mahādvanayaḥ, tadudbhūtō mahāravō yasmin mahāpāta kādhyanēka nirayēti pārē, mahāpātaka janyā nirayā iti draṣṭavyaṃ saṃsārārṇavasya ēvaṃ bhūtatvē tasya taraṇā saṃbhavāt mōkṣa śāstrānarthakyamityāśaṃkya avivēkināṃ tathātvēpi vivēkināṃ tattaruṇō pāyō asti”. (śrī ānaṃdatīrthaḥ)

(ī saṃsāra mahāsamudramulō avidyavalana kaliginaṭuvaṃṭi duḥkhamē pravēśiṃcuṭaku ati kaṣṭamainadaguṭacēta nīruvale nunna ā samudramulōni nīru; bhayamunu kalugacēyu tīvramaina rōgamu modalagunaviyē aṃdulōni mosaḷḷu, tatvajñānamu kaligiyuṃḍuṭavalana vināśamu lēnaṃduvalana aṃtamu lēnidinnī, ajñulu tariṃcuṭaku vīlukānaṃduna apāramainadinnī (oḍḍu lēnidinnī) - unnadaṃtā samudramuvalenunnadinnī, viśramiṃcuṭaku sthānamu lēkuṃḍuṭavalana ālaṃbhanamu (paṭṭukoni vrēlāḍuṭaku avakāśamu) lēnidinnī, iṃdriyamulu vīṣayamulatō saṃbaṃdhamu kaligiyuṃḍuṭavalana lēśamātra sukhamu viśrāmasthānamugā galadi, paṃcēṃdriyamulaku viṣayamulagu śabdamu modalaguvāṭiyaṃdu gala tṛṣṇayē gāli, ā gālicēta kṣubhitamaguṭavalana kaluganavinnī, viṣayamulavalla kaluganavinnī, vaṃdalakoladi yagu anarthamulē klēśamulu; mahā rauravamu modalagu anēka narakamulu, - naraka viśēṣamulu, garbhavāsamu, dāninuṃḍi bayaṭapaḍina tarvāta bālyamu modalu maraṇamuvaraku gala anēka narakamulu (duḥkhamunu kaligiṃcuṭacēta narakamulainavi); ā narakamulalō ‘ha’ ‘ha’ ani kēkalu vēyu svalpamaina dhvanulu, ākrōśamu modalagu pedda pedda kēkalu galagi - mahāpāpamulavalana kalugu narakamula vaṃṭivi - galavi - iṭuvaṃṭidi saṃsāramaguṭacēta dānini tariṃcuṭa sādhyamukādukanuka mōkṣaśāstra manarthamu ani avivēkulaku śaṃkiṃcinaṃduvalla, vivēkavaṃtulaku taruṇōpāyamu kaladu).

  1. “tē. putra dāra gṛha kṣētra bhūri viṣaya

ghana sukhāsaktuḍagucunē manujuḍēni

narthi jariyiṃcuvāḍu bhavābdhilōna

jeṃdi yennāḷḷakunu darijēralēḍu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. || 1228)

  1. “saṃsārārṇavakarṇathāraka harē kṛṣṇāya tubhyaṃ namaḥ” (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 14)

(saṃsāramanumahā samudramunu dāṭiṃci karṇadhāruḍavaina śrīharī, kṛṣṇā | nīku namaskāramu cayucunnānu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.