← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంసార తరణము saṃsāra taraṇamu

Original — తెలుగు
  1. మోక్షప్రాప్తి.

  2. “వేదాంతార్థ విచారేణ జాయతే జ్ఞానముత్తమం |

తేనాత్యంతిక సంసార దుఃఖనాశో భవత్యను ||“. (వివేకచూడామణి)

(ఉపనిషత్తులలోని అర్థమును బాగుగా విచారించుటచేత ఉత్తమ జ్ఞానము - బ్రహ్మజ్ఞానము కలుగును - దానివలన సంసారదుఃఖము నశించును)

  1. జన్మ మరణాది యుక్తస్య సంసారస్య తరణం పార గమనం.

(జననము, మరణము మొదలగు వాటితో కూడియుండు సంసారమును తరించుట - అనగా, దాని ఆవల ఒడ్డు చేరుట జనమరణములు లేకుండునట్లు చేసుకొనుట - ముక్తినొందుట).

  1. యః సర్వాన్ సంగాన్ పరిత్యజతి, యో మహానుభావానాం సేవా కరోతి, తథా యో మమతా రహితో భవతి దుస్తరాం మాయాం సంసారం తరతి.

(ఎవడు సర్వసంగపరిత్యాగము చేయునో, ఎవడు మహానుభావులను సేచించునో, ఎవడు మమకారమును (‘నాది’ యను భావమును) వదలివేయునో, అట్టివాడు దాట శక్యముగాని మాయ యను సంసారమును తరించును).

  1. “నిమజ్జతోన్మజ్జ తాం ఘోరే భవాబ్ధౌ పరమాయనం |

సంతో బ్రహ్మవిదః శాంతాః నౌః దృఢే నాప్సు మజ్జతాం ||“. (శ్రీమద్భాగవతం - 11 -26)

“జలే నిమజ్జతాం జనానాం స దృఢనౌ కేవ అస్మిన్ భయంకరే సంసార సాగరే నిమజ్జోన్మజ్జతాం మనుష్యాణాం బ్రహ్మవిదిః శాంత చిత్తాః సంతో జనా ఏవ పరమాశ్రయాః సంతః”.

(నీటిలో మునుగుచు తేలుచునుండు జనులకు దృఢమైన పడవవలె భయంకరమైన ఈ సంసారసాగరమందు మునుగుచు తేలుచునుండు మనుష్యులకు బ్రహ్మజ్ఞానులు శాంతచిత్తులు అయిన సత్పురుషులే ఆశ్రయము).

  1. నద్యాం తరతో మనుష్యస్య సర్వాధికం ఆవశ్యకం కార్యం భవతి. హస్తాభ్యాం పాదాభ్యాంచ జలప్రక్షేపణం కుర్వతః గమనం నిరంతరం జలస్యావసారణం, తధైవ నూనతనస్తరీతా నద్యాః పారంగం తుం శక్నోతి. జలస్య ప్రక్షేపణం త్యజేత్ చేత్ తథా తత్కాలమేవ నిమజ్జేత్. ఏవ మేవ తాం మహా భయంకరీం దుస్తరాం మాయా నదీం ఉత్తీర్య యే పరం పారం గంతు విచ్ఛంతి తైః అహంకార విషయాసక్తిరూపం వారి నిరంతరం పృధక్ క్షేపణీయం, అహం కారాసక్తి లక్షణేన జలేనై వాయం మాయా నదీ పూర్ణాస్తి యో ఆహంకారం ఆసక్తం చ దూరేణ క్షిప్తుం శక్నోతి, నానయోః త్యాగం కర్తు విచ్ఛతి, సో అస్యాః మాయానవ్యాః జలే రమమాణో అతలతరే నిమగ్నోభవిష్యతి. అతో సంగత్యాగో అవశ్యం కరణీయః - - - న తాం సేవినః సాధనస్య స్వబలేన తరణ మాపద్య తే ఏవ, న, నతు సతాం మహానుభావానాం కృపా మయీం సుదృఢాం మహానౌక మారుహ్య అనాయాసేన తరతి. “అత ఏవ దేవర్షిః మహాను భావానాం సేవాం కర్తుమాదిశతి”.

(కాళ్ళతోను చేతులతోను నీళ్ళను తోసుకొనుచు వెళ్ళు వాడు కొసకు చేరుకొనును - నీటిని ఈ రీతిగా తోసుకొనుట ఎప్పుడు మానివేయునో అప్పుడే జలములో మునిగిపోవును. ఆ ప్రకారముగానే గొప్ప భయమును కలుగచేయు నదియును, దాటశక్యముకానిదియు మాయా నదియు నగు సంసారమును ఎవరు దాటకోరునో వారు అహంకారము, విషయాసక్తి అను జలమును నిరంతరము (ఎల్లపుడు) త్రోసివేయుచుండవలెను. అహంకారాసక్తియను జలము చేతనే ఈ సంసార సముద్రము నిండియున్నది. ఈ అహంకారమును ఆసక్తిని ఎవడు తనకు దూరముగా నుంచలేడో - వీటిని వదలివేయుటకు ఇష్టపడడో అట్టివాడు ఈ మాయా నదియగు సంసారజలములో రమించుచు పాతాళమునకు మునిగిపోవును. అందుచేత సంగము వదలివేయవలెను - దేనియందును ఆసక్తి కలిగియుండ కూడదు. సత్పురుషులను సేవించువారికి వారి స్వంత బలముచేత ఈ సంసార జలమును తరించుట జరగదు. కాని అట్టి సత్పురుషుల దయ యనెడి పడవను ఎక్కుటవలన ఆయాసము లేకుండగనే దాట కలుగును. అందుచేతనే దేవర్షి అయిన నారదుడు మహానుభావులగు సత్పురుషుల సేవ చేయవలసినదని ఆదేశించెను -

  1. “తరతి శోకమాత్మవిత్” (ఛాందోగ్యోపనిషత్ - 7 - 1 - 3)

(ఆత్మను తెలుసుకొనినవాడు - ఆత్మజ్ఞానము కలవాడు - శోకమును (సంసారమువలన కలుగు శోకమును) తరించును - దాట కలుగును - “జ్ఞానేనైవతు కైవల్యం” (జ్ఞానము చేతనే - బ్రహ్మజ్ఞానము - కలుగుట చేతనే మోక్షము - సంసారము వదలిపోవుట - అని చెప్పబడినది).

  1. “యథావ స్థితాత్మ వస్తు విషయ కేవల జ్ఞానమాత్రాదేవ సకల సంసారానర్థ నివృత్తిః” (నైష్కర్మ్యసిద్ధి - 1 - 74)

(ఆత్మయొక్క యదార్థ జ్ఞానం వలననే సకల సంసారనర్థములు నివృతి యగును -)

  1. “భృఊమధ్యే సచ్చిదానంద తేజః కూటం రూపం తారకం బ్రహ్మ” (మండలబ్రాహ్మణోపనిషత్)

“నాసాగ్ర దర్శినో భ్రూమధ్యే జ్యోతిర్దృశ్యతే - సచ్చిదానందస్య సర్వ వ్యాపకత్వేన చక్షుర్మునో వికల్పిత తేజః కూటరూపత్వేన స్వభజతి. భక్త పటల స్వాతిరిక్తా స్తిత్వలక్షణ సంసార సాగర సంతారణాత్ తారకత్వం - వస్తుతః స్వమాత్రతయా బృంహణాత్ తారకం బ్రహ్మ ఇతి వ్యపదిశ్యతే.”

(కనుబొమల మధ్యమందు సచ్చిదానంద తేజస్సు కూటరూపముగానున్నతారక బ్రహ్మ)

(నాసాగ్రమందు దృష్టినుంచువారికి కనుబొమల మధ్యమందు జ్యోతి కనబడును - సచ్చిదానందుడగు పరబ్రహ్మ అన్నింటియందును వ్యాపించియుండువాడగుటచేత కంటికి మనస్సునకు కల్పితమైన తేజస్సు కూటరూపములో కనబడును - భక్తులను సంసారసాగరమునుండి తరింపచేయునదగుటచేత తారకము - వస్తురూపములో స్వమాత్రముగనే వృద్ధి పొందునది, కనుక బ్రహ్మ - ఈ రెండును కలిసి తారకం బ్రహ్మ)

  1. “యో వివిక్తస్థానం సేవతే, యే లోకబంధం, ఉన్మూలయతి, నిస్త్రైగుణ్యోభవతి, యోగక్షేమం త్యజతి, సో సంసార తథాయో యోగల్షేమం పరిత్యజతి, సాగరం తరతి”.

“యో వివిక్త స్థానే నివసతి, యే లౌకికాని బంధనాని సమున్మూలయతి, య స్త్రీన్ గుణాన్ అతీతో భవతి, తథాయో యోగక్షేమం పరిత్యజతి, స సంసారసాగరం తరతి”.

(ఎవడు నిర్జన ప్రదేశమున నివసించునో ఎవడు లోకమునకు సంబంధించిన బంధములను తెంచుకొనునో, ఎవడు సత్వరజస్తమములను మూడు గుణములకు అతీతుడగునో (వాటి ప్రభావమునకు మించినవాడగునో) ఎవడు యోగక్షేమములను వదలివేయునో, అట్టివాడు సంసారసాగరమును తరించును, దాటును, జనమరణములులేకుండునట్లు చేసుకొనును - ముక్తిని పొందును).

  1. రామ, రామ, తవనామ జపంతః పామరా అపి తరంతి భవాబ్ధీఇం |

అంగనంగిభవదంగుళి ముద్రః కిం విచిత్ర మతర త్కపి రబ్ధిం || (శ్రీరామకర్ణామృతం - 4 - 77)

(పామరులైనను - అజ్ఞానులైనను - రామా! నీ నామము జపించునంతమాత్రమున జననమరణరూపమైన సంసారసముద్రమును తరించుచున్నారు - దాటుచున్నారు. అట్టి విషయములో నీ శరీరస్పర్శగలనీ వేలి ఉంగరము పట్టుకొని వెళ్ళినంతమాత్రమున హనుమంతుడు ప్రాకృత సముద్రమును దాటుట ఒక విచిత్రమా?)

  1. “సంసార సాగర భయా పహ విశ్వమంత్రం”. (శ్రీరామకర్ణామృతం- 2 - 101)

(సంసారమను మహాసముద్రమువలన కలుగు భయమును పోగొట్టునట్టి విశ్వమంత్రము - శ్రీరామమంత్రము)

  1. “జీవుండు భవదీయ మాయా పరిభ్రామ్యమాణుండై యాత్మ వేఱని యెప్పుడు తెలియునంతకాలంబు నిరర్థకంబై దుస్తరంబైన సంసారసాగరంబు దఱియింప జాలకుండు నన్మునీంద్రులయినను భవదీయ నామస్మరణంబు మఱచి ఇతర విషయాసక్తులైరేని వారలు దినంబులందు వృథాప్రయత్నులై సంచరించుచు, రాత్రియందు నిద్రాసక్తులై స్వప్న గోచరంబులైన బహువిధ సంపదలను నానందించుచు, శరీరపరిణామాది పీడలకు దుఃఖించుచుం బ్రతిహతంబులైన యుద్యోగంబుల భూలోకంబున సంసారులై వర్తింతురు” –

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 9 - 297)

  1. బాలుని దలిదండ్రులును, రోగిని వైద్య దత్తంబైన యౌషధంబును, సముద్రంబున మునిగెడివాని నావ యును, ద క్కొరులు రక్షింపనేరని తెఱంగున సంసార తాప సంతస్య మానుండై నీచేత నుపేక్షితుండయినవాని నుద్దరింప నీవు దక్క నన్యుండు సమర్థుండు గాడు

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 9 - 356)

  1. “శా. శోధింపంబడె సర్వశాస్త్రములు, రక్షోనాథ! వేయేటికిన్

గాధల్ మాధవశేముషీతరణి సాంగత్యంబునం గాక, దు

ర్మేధన్ దాటగ వచ్చునే సుతవధూమనోగ్ర వాంఛా మద

క్రోధోల్లోల విశాక సంశృతి మహా ఘోరామితాంభోనిధిన్“. (శ్రీమదాంధ్రమహాభాగవరము - 7 - 5 - 183)

  1. “మ. వినుమదిగాక యీ భువి దివంబులు మారు జరించు నాత్మ దా

ధన పశు పుత్ర మిత్ర వనితా తతిపై దగులంబు మాని న

న్ననఘని విశ్వతోముఖ ననన్యగతిన్ భజియించెనేని, వా

నిని ఘన మృత్యురూప భవనీరధినే దరియింప జేయుదున్“. (శ్రీమహాభాగవతము - 3 - 25 - 876)

  1. “జనునకు గృహ క్షేత్ర సుతాప్త విత్తంబులందు నేను నాయది యనియెడి మోహంబు గలుగును - అట్టి స్త్రీపురుష మిధునీబావంబుచేత సంతానంబు గలుగును - ఆ సంతాన కారణంబున గృహ క్షేత్ర విత్తాదులు సంపాదింప బడును - అందు మోహం బధికంబగుటం జేసి మోక్ష మార్గంబు దవ్వగును - ఇట్లు సంసారంబునందుండియు మనంబున నెప్పుడు ముక్తి చింతంజేయు నప్పుడు సంసారంబునుం బాయు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 1 -)

Transliteration
  1. mōkṣaprāpti.

  2. “vēdāṃtārtha vicārēṇa jāyatē jñānamuttamaṃ |

tēnātyaṃtika saṃsāra duḥkhanāśō bhavatyanu ||“. (vivēkacūḍāmaṇi)

(upaniṣattulalōni arthamunu bāgugā vicāriṃcuṭacēta uttama jñānamu - brahmajñānamu kalugunu - dānivalana saṃsāraduḥkhamu naśiṃcunu)

  1. janma maraṇādi yuktasya saṃsārasya taraṇaṃ pāra gamanaṃ.

(jananamu, maraṇamu modalagu vāṭitō kūḍiyuṃḍu saṃsāramunu tariṃcuṭa - anagā, dāni āvala oḍḍu cēruṭa janamaraṇamulu lēkuṃḍunaṭlu cēsukonuṭa - muktinoṃduṭa).

  1. yaḥ sarvān saṃgān parityajati, yō mahānubhāvānāṃ sēvā karōti, tathā yō mamatā rahitō bhavati dustarāṃ māyāṃ saṃsāraṃ tarati.

(evaḍu sarvasaṃgaparityāgamu cēyunō, evaḍu mahānubhāvulanu sēciṃcunō, evaḍu mamakāramunu (‘nādi’ yanu bhāvamunu) vadalivēyunō, aṭṭivāḍu dāṭa śakyamugāni māya yanu saṃsāramunu tariṃcunu).

  1. “nimajjatōnmajja tāṃ ghōrē bhavābdhau paramāyanaṃ |

saṃtō brahmavidaḥ śāṃtāḥ nauḥ dṛḍhē nāpsu majjatāṃ ||“. (śrīmadbhāgavataṃ - 11 -26)

“jalē nimajjatāṃ janānāṃ sa dṛḍhanau kēva asmin bhayaṃkarē saṃsāra sāgarē nimajjōnmajjatāṃ manuṣyāṇāṃ brahmavidiḥ śāṃta cittāḥ saṃtō janā ēva paramāśrayāḥ saṃtaḥ”.

(nīṭilō munugucu tēlucunuṃḍu janulaku dṛḍhamaina paḍavavale bhayaṃkaramaina ī saṃsārasāgaramaṃdu munugucu tēlucunuṃḍu manuṣyulaku brahmajñānulu śāṃtacittulu ayina satpuruṣulē āśrayamu).

  1. nadyāṃ taratō manuṣyasya sarvādhikaṃ āvaśyakaṃ kāryaṃ bhavati. hastābhyāṃ pādābhyāṃca jalaprakṣēpaṇaṃ kurvataḥ gamanaṃ niraṃtaraṃ jalasyāvasāraṇaṃ, tadhaiva nūnatanastarītā nadyāḥ pāraṃgaṃ tuṃ śaknōti. jalasya prakṣēpaṇaṃ tyajēt cēt tathā tatkālamēva nimajjēt. ēva mēva tāṃ mahā bhayaṃkarīṃ dustarāṃ māyā nadīṃ uttīrya yē paraṃ pāraṃ gaṃtu vicchaṃti taiḥ ahaṃkāra viṣayāsaktirūpaṃ vāri niraṃtaraṃ pṛdhak kṣēpaṇīyaṃ, ahaṃ kārāsakti lakṣaṇēna jalēnai vāyaṃ māyā nadī pūrṇāsti yō āhaṃkāraṃ āsaktaṃ ca dūrēṇa kṣiptuṃ śaknōti, nānayōḥ tyāgaṃ kartu vicchati, sō asyāḥ māyānavyāḥ jalē ramamāṇō atalatarē nimagnōbhaviṣyati. atō saṃgatyāgō avaśyaṃ karaṇīyaḥ - - - na tāṃ sēvinaḥ sādhanasya svabalēna taraṇa māpadya tē ēva, na, natu satāṃ mahānubhāvānāṃ kṛpā mayīṃ sudṛḍhāṃ mahānauka māruhya anāyāsēna tarati. “ata ēva dēvarṣiḥ mahānu bhāvānāṃ sēvāṃ kartumādiśati”.

(kāḷḷatōnu cētulatōnu nīḷḷanu tōsukonucu veḷḷu vāḍu kosaku cērukonunu - nīṭini ī rītigā tōsukonuṭa eppuḍu mānivēyunō appuḍē jalamulō munigipōvunu. ā prakāramugānē goppa bhayamunu kalugacēyu nadiyunu, dāṭaśakyamukānidiyu māyā nadiyu nagu saṃsāramunu evaru dāṭakōrunō vāru ahaṃkāramu, viṣayāsakti anu jalamunu niraṃtaramu (ellapuḍu) trōsivēyucuṃḍavalenu. ahaṃkārāsaktiyanu jalamu cētanē ī saṃsāra samudramu niṃḍiyunnadi. ī ahaṃkāramunu āsaktini evaḍu tanaku dūramugā nuṃcalēḍō - vīṭini vadalivēyuṭaku iṣṭapaḍaḍō aṭṭivāḍu ī māyā nadiyagu saṃsārajalamulō ramiṃcucu pātāḷamunaku munigipōvunu. aṃducēta saṃgamu vadalivēyavalenu - dēniyaṃdunu āsakti kaligiyuṃḍa kūḍadu. satpuruṣulanu sēviṃcuvāriki vāri svaṃta balamucēta ī saṃsāra jalamunu tariṃcuṭa jaragadu. kāni aṭṭi satpuruṣula daya yaneḍi paḍavanu ekkuṭavalana āyāsamu lēkuṃḍaganē dāṭa kalugunu. aṃducētanē dēvarṣi ayina nāraduḍu mahānubhāvulagu satpuruṣula sēva cēyavalasinadani ādēśiṃcenu -

  1. “tarati śōkamātmavit” (chāṃdōgyōpaniṣat - 7 - 1 - 3)

(ātmanu telusukoninavāḍu - ātmajñānamu kalavāḍu - śōkamunu (saṃsāramuvalana kalugu śōkamunu) tariṃcunu - dāṭa kalugunu - “jñānēnaivatu kaivalyaṃ” (jñānamu cētanē - brahmajñānamu - kaluguṭa cētanē mōkṣamu - saṃsāramu vadalipōvuṭa - ani ceppabaḍinadi).

  1. “yathāva sthitātma vastu viṣaya kēvala jñānamātrādēva sakala saṃsārānartha nivṛttiḥ” (naiṣkarmyasiddhi - 1 - 74)

(ātmayokka yadārtha jñānaṃ valananē sakala saṃsāranarthamulu nivṛti yagunu -)

  1. “bhṛūmadhyē saccidānaṃda tējaḥ kūṭaṃ rūpaṃ tārakaṃ brahma” (maṃḍalabrāhmaṇōpaniṣat)

“nāsāgra darśinō bhrūmadhyē jyōtirdṛśyatē - saccidānaṃdasya sarva vyāpakatvēna cakṣurmunō vikalpita tējaḥ kūṭarūpatvēna svabhajati. bhakta paṭala svātiriktā stitvalakṣaṇa saṃsāra sāgara saṃtāraṇāt tārakatvaṃ - vastutaḥ svamātratayā bṛṃhaṇāt tārakaṃ brahma iti vyapadiśyatē.”

(kanubomala madhyamaṃdu saccidānaṃda tējassu kūṭarūpamugānunnatāraka brahma)

(nāsāgramaṃdu dṛṣṭinuṃcuvāriki kanubomala madhyamaṃdu jyōti kanabaḍunu - saccidānaṃduḍagu parabrahma anniṃṭiyaṃdunu vyāpiṃciyuṃḍuvāḍaguṭacēta kaṃṭiki manassunaku kalpitamaina tējassu kūṭarūpamulō kanabaḍunu - bhaktulanu saṃsārasāgaramunuṃḍi tariṃpacēyunadaguṭacēta tārakamu - vasturūpamulō svamātramuganē vṛddhi poṃdunadi, kanuka brahma - ī reṃḍunu kalisi tārakaṃ brahma)

  1. “yō viviktasthānaṃ sēvatē, yē lōkabaṃdhaṃ, unmūlayati, nistraiguṇyōbhavati, yōgakṣēmaṃ tyajati, sō saṃsāra tathāyō yōgalṣēmaṃ parityajati, sāgaraṃ tarati”.

“yō vivikta sthānē nivasati, yē laukikāni baṃdhanāni samunmūlayati, ya strīn guṇān atītō bhavati, tathāyō yōgakṣēmaṃ parityajati, sa saṃsārasāgaraṃ tarati”.

(evaḍu nirjana pradēśamuna nivasiṃcunō evaḍu lōkamunaku saṃbaṃdhiṃcina baṃdhamulanu teṃcukonunō, evaḍu satvarajastamamulanu mūḍu guṇamulaku atītuḍagunō (vāṭi prabhāvamunaku miṃcinavāḍagunō) evaḍu yōgakṣēmamulanu vadalivēyunō, aṭṭivāḍu saṃsārasāgaramunu tariṃcunu, dāṭunu, janamaraṇamululēkuṃḍunaṭlu cēsukonunu - muktini poṃdunu).

  1. rāma, rāma, tavanāma japaṃtaḥ pāmarā api taraṃti bhavābdhīiṃ |

aṃganaṃgibhavadaṃguḷi mudraḥ kiṃ vicitra matara tkapi rabdhiṃ || (śrīrāmakarṇāmṛtaṃ - 4 - 77)

(pāmarulainanu - ajñānulainanu - rāmā! nī nāmamu japiṃcunaṃtamātramuna jananamaraṇarūpamaina saṃsārasamudramunu tariṃcucunnāru - dāṭucunnāru. aṭṭi viṣayamulō nī śarīrasparśagalanī vēli uṃgaramu paṭṭukoni veḷḷinaṃtamātramuna hanumaṃtuḍu prākṛta samudramunu dāṭuṭa oka vicitramā?)

  1. “saṃsāra sāgara bhayā paha viśvamaṃtraṃ”. (śrīrāmakarṇāmṛtaṃ- 2 - 101)

(saṃsāramanu mahāsamudramuvalana kalugu bhayamunu pōgoṭṭunaṭṭi viśvamaṃtramu - śrīrāmamaṃtramu)

  1. “jīvuṃḍu bhavadīya māyā paribhrāmyamāṇuṃḍai yātma vēṟani yeppuḍu teliyunaṃtakālaṃbu nirarthakaṃbai dustaraṃbaina saṃsārasāgaraṃbu daṟiyiṃpa jālakuṃḍu nanmunīṃdrulayinanu bhavadīya nāmasmaraṇaṃbu maṟaci itara viṣayāsaktulairēni vāralu dinaṃbulaṃdu vṛthāprayatnulai saṃcariṃcucu, rātriyaṃdu nidrāsaktulai svapna gōcaraṃbulaina bahuvidha saṃpadalanu nānaṃdiṃcucu, śarīrapariṇāmādi pīḍalaku duḥkhiṃcucuṃ bratihataṃbulaina yudyōgaṃbula bhūlōkaṃbuna saṃsārulai vartiṃturu” –

(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 9 - 297)

  1. bāluni dalidaṃḍrulunu, rōgini vaidya dattaṃbaina yauṣadhaṃbunu, samudraṃbuna munigeḍivāni nāva yunu, da kkorulu rakṣiṃpanērani teṟaṃguna saṃsāra tāpa saṃtasya mānuṃḍai nīcēta nupēkṣituṃḍayinavāni nuddariṃpa nīvu dakka nanyuṃḍu samarthuṃḍu gāḍu

(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 9 - 356)

  1. “śā. śōdhiṃpaṃbaḍe sarvaśāstramulu, rakṣōnātha! vēyēṭikin

gādhal mādhavaśēmuṣītaraṇi sāṃgatyaṃbunaṃ gāka, du

rmēdhan dāṭaga vaccunē sutavadhūmanōgra vāṃchā mada

krōdhōllōla viśāka saṃśṛti mahā ghōrāmitāṃbhōnidhin”. (śrīmadāṃdhramahābhāgavaramu - 7 - 5 - 183)

  1. “ma. vinumadigāka yī bhuvi divaṃbulu māru jariṃcu nātma dā

dhana paśu putra mitra vanitā tatipai dagulaṃbu māni na

nnanaghani viśvatōmukha nananyagatin bhajiyiṃcenēni, vā

nini ghana mṛtyurūpa bhavanīradhinē dariyiṃpa jēyudun”. (śrīmahābhāgavatamu - 3 - 25 - 876)

  1. “janunaku gṛha kṣētra sutāpta vittaṃbulaṃdu nēnu nāyadi yaniyeḍi mōhaṃbu galugunu - aṭṭi strīpuruṣa midhunībāvaṃbucēta saṃtānaṃbu galugunu - ā saṃtāna kāraṇaṃbuna gṛha kṣētra vittādulu saṃpādiṃpa baḍunu - aṃdu mōhaṃ badhikaṃbaguṭaṃ jēsi mōkṣa mārgaṃbu davvagunu - iṭlu saṃsāraṃbunaṃduṃḍiyu manaṃbuna neppuḍu mukti ciṃtaṃjēyu nappuḍu saṃsāraṃbunuṃ bāyu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 1 -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.