సంసారమను వృక్షము - వృక్షమువలెనుండు సంసారము –
శ్లో ||. ఊర్ధ్వమూలమధఃశాఖమశ్వత్థం ప్రాహురివ్యయం |
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ ||
అధిశ్చోర్థ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్థా విషయ ప్రవాలాః |
అథశ్చ మాలాన్యనుసంతతాని |
కర్మాను బంధీని మనుష్యలోకే ||
న రూప మస్యేహ తధోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా |
అశ్వత్థమేనం సువిరూఢ మూలమసంగ శస్త్రేణ దృఢేన భిత్త్వా |
తతః పదం తత్పరిమార్గ తవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః |
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణీ ||. (శ్రీమద్భగవద్గీత - 15 - 1 to 4)
(సంసారమును వృక్షముతో పోల్చినారు. ఈ సంసార వృక్షమునకు అవ్యక్తమగు మాయతో కూడిన పరబ్రహ్మమే మూలము - కారణము, వేళ్ళు - ఈ వేళ్ళు పైన గలవనుట వలన అన్నింటికీ మీదనున్న పరబ్రహ్మమే. సాధారణముగ చెట్టునకు వేళ్ళు క్రిందనుండును. కాని, ఈ సంసారమను వృక్షమునకు వేళ్ళు పైన గలవు. అక్కడనుండి క్రిందగా ఈ చెట్టు వ్యాపించినది - అనగా పరబ్రహ్మనుండి సంసారమను ఈ వృక్షమంతయు కలిగినది. భగవంతునివలె అంత ఉత్కృష్టమైనదికాదు. కనుక క్రిందకు పెరిగినదని చెప్పబడినది. ఇది అవ్యయము - చిరకాలమునుండి వచ్చుచున్నది, కనుక ఆది - మొదలు - లేనిది, అంతము లేనిది, ఈ చెట్టు అశ్వత్థమని చెప్పబడినది - అనగా - అ + శ్వః + స్థః = రేపటివఱకు ఉండునని చెప్పుటకు వీలుకానిది, నమ్మజాలనిది, క్షణభంగురము - దీని కొమ్మలు క్రిందనున్నవి, పరబ్రహ్మము వేళ్ళు కనుక పరబ్రహ్మలోనుండి పుట్టిన మహత్తత్వము, అహంకారము, తన్మాత్రలు మొదలగునవి కొమ్మలు. దీనికి ఛందస్సులు - (కర్మ కాండరూపమగు వేదములు ఆకులు). వేదములలో ధర్మాధర్మములు, వాటికి సంబంధించిన కర్మలు, వాటి ఫలములు బోధించునవి - ప్రవృత్తి ధర్మమును బోధించునవి. ఆకులు చెట్లను పెంచునట్లు వేదములు సంసారమును సాగునట్లు చేయునవి. ఇట్టి సంసారమను వృక్షమును తెలుసుకొనినవాడే వేదము గుఱించి చెప్పునది ఈ సంసారము గుఱించియే. ఇట్టి సంసారవృక్షమును తెలుసుకొనినవాడు వేదమును తెలుసుకొనినవాడే యగును).
(ఈ సంసారమను చెట్టు యొక్క కొమ్మలు సత్వరజస్తమోగుణములచేత వృద్ధిపొందినవై మీదకు, క్రిందకు వ్యాపించియున్నవి. ఇవియే కర్మానుసారము ఫలముననుభవించు జీవులు - విషయములే ఈ చెట్టుయొక్క చిగుళ్ళు. మానవ లోకములో క్రింద పాతుకొనబడి కర్మల మూలమున బంధించునవి. ఇవియే నికృష్ట జన్మకల జీవులు).
(ఈ సంసారమను చెట్టు యొక్క ఈ రూపముగాని, నిజరూపము గాని, ఆది గాని, అంతము గాని మధ్యస్థితి గాని తెలుసుకొనబడలేదు - తెలియదు. బాగుగా వేళ్ళు నాటుకొనిపోయిన ఈ అశ్వత్థమను సంసారవృక్షమును దృఢమైన వైరాగ్యమను శస్త్రముతో మొదలంట నరికివేసి, ఏ పదమును చేరిన వారు మరలి తిరిగిరారో మరల జన్మించరో, అట్టి పరమపదమగు వైకుంఠమును పొందుటకు (“తద్విష్ణోః పరమం పదం” అని చెప్పబడిన దానిని పొందుటకు యత్నము చేయవలయును. ఎవని నుండి ఈ అనాదియైన సంసారమను వృక్షము పుట్టి వ్యాపించినదో అట్టి ఆది పురుషుని నేను ఆశ్రయించుచున్నాను).
(ఈ అశ్వత్థమను సంసారవృక్షము మీదికి వేళ్ళు, (పరబ్రహ్మ మూలము), కిందకు శాఖలు - కొమ్మలు - సృష్టిలోని వస్తువులుగా గలది).
(ఈ సంసార వృక్షమునకు అన్నింటికంటె ఉత్కృష్టమైనటువంటిన్నీ, మాయతో కూడినటువంటిన్నీ పరబ్రహ్మ మూలము (వేరు); దీనికి అంకురము (మొలక) మహత్తత్వము; అహంకారము స్కందము; (బోదె), పంచ తన్మాత్రలు దీని శాఖలు; ఈ చెప్పిన మహత్తత్వము, అహంకారము, కార్యములగుటవలన నికృష్టమైనవి కనుక ఈ వృక్షమునకు క్రింది కొమ్మలు - వేదములు మొదలగు శాస్త్రములు మధురమైన మాటలతో ప్రవృత్తి మార్గమును బోధించుటవలన, అట్తి ప్రవృత్తి మార్గము నిత్యము కానిది కనుక అవియే ఈ వృక్షమునకు ఆకులు (ఆకులు ఎండి రాలిపోవునవి) ధర్మాధర్మ కామ మోక్షములను చతుర్విధ పురుషార్థములు దాని రసములు, ధర్మము, అధర్మము (పుణ్యము, పాపము) దాని పుష్పము; చావు పుట్టుకలు మొదలగువాటివలన కలుగు దుఃఖము దాని ఫలము - అజ్ఞాని - (బ్రహ్మజ్ఞానము లేనివాడు - తానే బ్రహ్మమని తెలియనివాడు) అయిన జీవుడు అను పక్షి (ఆ పండు యొక్క) భోక్త. వైరాగ్యముచేత బాగుగా జారు పెట్టబడిన జ్ఞానము (బ్రహ్మజ్ఞానమే) అను కుఠారము (కత్తి) ఆ వృక్షమును ఛేధించునది. ఈ విధముగా నుండునది అశ్వత్థమని చెప్పబడు సంసారవృక్షము - ఈ ప్రకారముగా సంసారరూపమగు వృక్షము అనేక విధములుగా వర్ణింపబడినది).
(శ్రీశంకరః - కఠోపనిషత్ వ్యాఖ్యే)
(శ్రీమహావిష్ణువుయొక్క ఉత్కృష్టస్థానమైన పరమపదము - “తద్విష్ణో పరమం పదం” - అను వైకుంఠము ఈ సంసారవృక్షమునకు మూలము - వేరు. దీనివలన అవ్యక్తము మొదలు స్థావరములవరకు గలదంతయు కలిసి సంసారము అను వృక్షము - వృక్షమువలెనుండు సంసారము, వృక్షముతో పోల్చబడిన సంసారము నశించు స్వభావము కలది కనుక వృక్షమని చెప్పబడినది. పుట్టుట, చనిపోవుట, ముసలితనము, దుఃఖము మొదలగు అనేక అనర్థములుగలదియు, క్షణక్షణమునకు మార్పు చెందుచుండునది కనుకను, ఎండమావులు, గంధర్వనగరము మొదలగు వాటివలెకనబడి మాయమగునదియు, వృక్షమువలె ఆఖరున లేకుండునదియు, అరటిబోదెవలె సారము లేనిదియు, తత్వమును తెలియగోరెడువారికి దీని తత్వము ఇటువంటిది యని తెలియబడనిదియు, అవిద్యకనుక కర్మావ్యక్త బీజమువలన కలిగినదియు, పరబ్రహ్మయొక్క జ్ఞానశక్తి, క్రియాశక్తి అను రెండు శక్తులుగల హిరణ్యగర్భుడు అను మొలక కలదియు, ప్రాణులందఱి శరీరభేదములే స్కందముగా గలదియు, తృష్ణ యనెడి మహాసముద్రమువలన కలిగెడు దర్పము కలదియు, బుద్ధి పంచేంద్రియములు, విషయములు చిగుళ్ళుగా గలదియు, శ్రుతి, స్మృతి, న్యాయశాస్త్రము, ఉపదేశము పలాశముగా గలదియు, యజ్ఞము, దానము, తపస్సు మొదలగు అనేక క్రియలచేత పుట్టి బలిసినదియు, సుఖము, దుఃఖము, వేదనములు (బాధలు) గల అనేక పుణ్యపాప రస ప్రాణుల జీవింపచేయు అనంతఫలము కలదియు, తృష్ణ యను నీరుచే పెరిగి ధృఢముగా నున్న వేళ్ళు కలదియు, సత్యలోకము మొదలు ఏడు లోకములందును బ్రహ్మ మొదలగు వారగు పక్షులచే కట్టబడిన గూడు కలదియు, ప్రాణుల యొక్క సుఖ దుఃఖముల వలన కలుగు సంతోషము, కష్టము, నృత్యము, గీతము, వాద్యములు మొదలగు వాటివలన కలుగు హాసము, రోదనము మొదలగు శబ్దములుగల మహారవము కలదియు, వేదాంతములలో - ఉపనిషత్తులలో - చెప్పబడిన బ్రహ్మ సాక్షాత్కారము అను శస్త్రముచేత నరికివేయబడునది - ఈ విధముగ నుండునది అశ్వత్థమను సంసారవృక్షము)
(ఈ సంసార వృక్షమునకు విత్తనములు రెండు - పుణ్యము పాపము. దానికి వాసనలు వేలకొలది వేళ్ళు; సత్వరజస్తమోగుణములు మూడు కాండములు, పంచభూతములు స్కంధములు, పంచభూతములవలన కలుగు శబ్దము మొదలగు విషయములు పంచరసములు పదకొండు ఇంద్రియములు దాని కొమ్మలు, జీవుడు పరమాత్మయను రెండు ఆకులు; వాత పిత్త శ్లేష్మములు మూడు దాని చర్మములు; సుఖ దుఃఖములు రెండు దాని ఫలములు, ఈ వృక్షము సూర్యమండలమువరకు వ్యాపించియున్నది, సుఖ దుఃఖములు రెండు దీని ఫలములు; ఒక ఫలమగు దుఃఖమును గృహస్థులు (పక్షులు) తినుచున్నారు - అనుభవించుచున్నారు. (స్వర్గముకూడ దుఃఖఫలమే అని చెప్పబడినది - ఆ అనుభవమైనతర్వాత తిరిగి భూలోకమున జన్మించవలసియున్నది కనుక); హంసలు రెండు అనగా, అరణ్యములో సన్యాసులు, వివేకముగలవారగుటచేత ఒక ఫలమగు సుఖముననుభవించుచున్నారు) .
(అశ్వత్థమను ఈ సంసార వృక్షమునకు మీదను చతుర్ముఖ బ్రహ్మ మొదలగువారు సృష్టికి మూలము అయినవారు ఉండుటవలన మీదను మూలము (వేళ్ళు) కలది - ఊర్థ్వమూలము మూలము అని చెప్పబడినది. ఆ చతుర్ముఖ బ్రహ్మ మొదలగు వాటి సంతానమగుటచేత వాటిలోనుండి ఒకదానిలోనుండి ఒకటిగా పుట్టినదగుటచేత వాటిలో మొదట పుట్టిన మనుష్యులు శాఖలుగా చెప్పబడినందున “అధిశ్సాఖః” (ఈ వృక్షము క్రిందవైపు శాఖలు గలది) అని చెప్పబడినది. మనుష్యులై పుట్టినవారు కర్మలు చేయుటవలన అదే మూలము అయి క్రిందను మీదను శాఖలుగలవిగా పెరిగినందున “అధిశ్చోర్ధ్వం ప్రసృతా స్తస్య శాఖాః” అని చెప్పబడినది. ఈ వృక్షము పైన నిర్దేశించి చెప్పపబడిన రూపముతో సంసారులకు - సంసారములో నున్నవారికి - కనబడదు - “నేను దేవదత్తుని కుమారుడను” (పలానవారి కుమారుడను) అనికాని, యజ్ఞదత్తుని తండ్రిని అని కాని తోచును).
బుద్ధిః స్కందమయ శ్చైవ ఇంద్రియాంతర కోటరః |
మహాభూత విశాఖశ్చ విషయైః పత్ర శాఖవాన్ |
ధర్మాధర్మ సుపుష్పశ్చ సుఖ దుఃఖ ఫలోదయః |
ఆ జీవ్య సర్వ భూతానాం బ్రహ్మవృక్షస్సనాతనః |
ఏతత్ బ్రహ్మవనం చైవ బ్రహ్మవృక్షస్య తస్య తత్ |
ఏతచ్చిత్వా చ భిత్వాచ జ్ఞానేన పరమాస్తినా |
తతశ్చాత్మరతిం ప్రాప్య యస్మాన్నా వర్తతే పునః || ఇత్యాది.
“పునశ్చ అన్యధా ఆహుః -” తదిదం వ్యష్టిక్షేత్రం అధి సమష్టి క్షేత్రముచ్యతే కృత్స్నమిదం బ్రహ్మాండం హిరణ్య గర్భ శరీరం విరాడిత్యుచ్యతే “తస్య ద్యౌః శిరః చక్షుషీ చంద్ర సూర్యౌ దిశశ్రోత్రే, మధ్యమాకాశం, శరీరం పృధివీ, పాదౌ తస్మిన్న స్యూర్థ్వ మూల మథః శాఖం” ఇతి యోజయితవ్యం.
“ప్రాణి వంశోవా అశ్వత్థో వృక్షః తస్య మూలం బ్రహ్మ ఉపరిష్టా స్థితిః” ఇత్యాది.
” ఏవం సర్వాస్వపి యోజనా సుసంసార హేయతా ప్రతిపాదనే తాత్పర్యం వక్తవ్యం తితిః పరం సంసారస్యైవ సాక్షాత్ వృక్షత్వేన కల్పనం”
(శ్రీవేదాంత దేశికః)
(అవ్యక్తమను మూలము (వేరు) కలది, అందుచేతనే వృక్షమని పేరు కలది; బుద్ధి దాని స్కందము; ఇంద్రియములు ఆ చెట్టులోని కోటరములు, మహాభూతములు దాని కొమ్మలు, విషయములు దాని శాఖలు, ఆకులు; ధర్మా ధర్మములు (పుణ్య పాపములు) పుష్పములు; సుఖ దుఃఖములు ఫలములు, సమస్త భూతములను జీవింపచేయునది. ఇది బ్రహ్మ వృక్షము - చతుర్ముఖ బ్రహ్మ వేరుగా గలది, క్రిందకు ప్రాణులవఱకు వ్యాపించియుండు వృక్షము. దీనిని బ్రహ్మజ్ఞానమను ఖడ్గముచే ఛేదించి ఆత్మయందు రతి కలిగియుండిన మరల జననము కలుగకుండ నుండును).
(ఈ వృక్షమును గుఱించి ఇంకొక రీతిగా కూడ చెప్పబడినది - ఇది వ్యష్టిక్షేత్రము, సమష్టిక్షేత్రము. ఈ బ్రహ్మాండమంతయు హిరణ్యగర్భుని - చతుర్ముఖ బ్రహ్మయొక్క శరీరము ఇది విరాట్ అని చెప్పబడినది. ఆ విరాడ్రూపునకు ఆకాశము శిరస్సు, సూర్యచంద్రులు కండ్లు, దిక్కులు చెవులు, మధ్య శరీరము ఆకాశము; భూమి పాదములు ఇదికూడ ఊర్ధ్వ మూలము - మీదను వేళ్ళు గలది - అధశ్శాఖము - క్రిందను శాఖలు గలది (కొమ్మలు గలది) అని యోచించవలెను).
(అశ్వత్థము అను వృక్షము ప్రాణుల వంశము, దానికి మూలము, - వేరు - బ్రహ్మ (మీదను ఉన్నది). (ఈ ప్రకారముగా అనేక విధములుగా సంసారము అనునది హేయమైనదని ప్రతిపాదించబడినది - చెప్పబడినది). (సంసారము వృక్షమని కల్పన చేయబడినది)
తగు రసంబులు నాల్గు ధర్మా ధర్మ ముఖరంబులు; ఎఱిగెడి విధములైదింద్రియంబు
లాఱు; స్వభావంబులా శోకమోహాదులూర్ములు, ధాతువులొక్క ఏడు
పైపొరలెనిమిది ప్రంగలు; భూతంబు లైదు, బుద్ధియు మనోహంకృతులును
తే. రంధ్రములు తొమ్మిదియు గోటరములు; ప్రాణ
పత్ర దశకంబు; జీవేశ పక్షియుగము
గలుగు సంసార వృక్షంబు గలుగజేయ,
గావ, నడగింప రాజవొక్కరుడవీవు“. (శ్రీమదాంధ్రహాభాగవతము - 10 - 91)
(ఇట్లు వర్ణించబడిన సంసారవృక్షము యొక్క రూపము వర్ణించబడినట్లు వ్యవహారములో కానరాదు - కల, ఎండమావులు, మాయాగంధర్వనగరము - వీటితో సమానమైనదగుటచేత కనబడి మరుగుపడు స్వరూపము కలది).
(శ్రీ ఆనందతీర్థః)
(ఈ సంసార వృక్షము యొక్క రూపము వికారములు చెందునది - మార్పులు చెందునది - యగుటచేత ఎలాగున్నదో అట్లు కానరాదు - దీనికి మొదలు అంతము శ్రీమహావిష్ణువే - అతనే సృష్టి చేయువాడు, పోషించువాడు, అంతము చేయువాడుకనుక).
(ఇటువంటి అశ్వత్థమను సంసార వృక్షమును దృఢమైన సమ్యక్ జ్ఞానము మూలముగాగల త్రిగుణమయమైన భోగములందు ఆసక్తి లేకుండుట అను శస్త్రముచేత నరికివేసి తత్పదం - విష్ణువుయొక్క ఆ పరమపదమను వైకుంఠమును గుఱించి అన్వేషింపవలయును).
(ఈ ప్రకారముగా అశ్వత్థమను సంసారవృక్షమును, బాగుగా వేళ్ళు తన్నుకొని పాతుకుపోయినదానిని, పుత్ర మిత్రాదులందు ఈషణ వదలుకొనుటవలన దేనియందు సంగము లేనివాడై పరమాత్మయందు అభిముఖుడై మరల మరల వివేకము అభ్యాసము అను పదునైన కత్తితో సంసారవృక్షమును, దాని మూలముతో - విత్తనముతో సహా, మొదలంట నరికి, పైకి పెకలించివేసి ఆ మహావిష్ణువుయొక్క ఉత్కృష్టమైన స్థానమగు మోక్షపదము గుఱించి అన్వేషింపవలయును - తెలుసుకొనవలెను -).
saṃsāramanu vṛkṣamu - vṛkṣamuvalenuṃḍu saṃsāramu –
ślō ||. ūrdhvamūlamadhaḥśākhamaśvatthaṃ prāhurivyayaṃ |
chaṃdāṃsi yasya parṇāni yastaṃ vēda sa vēdavit ||
adhiścōrthvaṃ prasṛtāstasya śākhā guṇa pravṛdthā viṣaya pravālāḥ |
athaśca mālānyanusaṃtatāni |
karmānu baṃdhīni manuṣyalōkē ||
na rūpa masyēha tadhōpalabhyatē nāṃtō na cādirna ca saṃpratiṣṭhā |
aśvatthamēnaṃ suvirūḍha mūlamasaṃga śastrēṇa dṛḍhēna bhittvā |
tataḥ padaṃ tatparimārga tavyaṃ yasmin gatā na nivartaṃti bhūyaḥ |
tamēva cādyaṃ puruṣaṃ prapadyē yataḥ pravṛttiḥ prasṛtā purāṇī ||. (śrīmadbhagavadgīta - 15 - 1 to 4)
(saṃsāramunu vṛkṣamutō pōlcināru. ī saṃsāra vṛkṣamunaku avyaktamagu māyatō kūḍina parabrahmamē mūlamu - kāraṇamu, vēḷḷu - ī vēḷḷu paina galavanuṭa valana anniṃṭikī mīdanunna parabrahmamē. sādhāraṇamuga ceṭṭunaku vēḷḷu kriṃdanuṃḍunu. kāni, ī saṃsāramanu vṛkṣamunaku vēḷḷu paina galavu. akkaḍanuṃḍi kriṃdagā ī ceṭṭu vyāpiṃcinadi - anagā parabrahmanuṃḍi saṃsāramanu ī vṛkṣamaṃtayu kaliginadi. bhagavaṃtunivale aṃta utkṛṣṭamainadikādu. kanuka kriṃdaku periginadani ceppabaḍinadi. idi avyayamu - cirakālamunuṃḍi vaccucunnadi, kanuka ādi - modalu - lēnidi, aṃtamu lēnidi, ī ceṭṭu aśvatthamani ceppabaḍinadi - anagā - a + śvaḥ + sthaḥ = rēpaṭivaṟaku uṃḍunani ceppuṭaku vīlukānidi, nammajālanidi, kṣaṇabhaṃguramu - dīni kommalu kriṃdanunnavi, parabrahmamu vēḷḷu kanuka parabrahmalōnuṃḍi puṭṭina mahattatvamu, ahaṃkāramu, tanmātralu modalagunavi kommalu. dīniki chaṃdassulu - (karma kāṃḍarūpamagu vēdamulu ākulu). vēdamulalō dharmādharmamulu, vāṭiki saṃbaṃdhiṃcina karmalu, vāṭi phalamulu bōdhiṃcunavi - pravṛtti dharmamunu bōdhiṃcunavi. ākulu ceṭlanu peṃcunaṭlu vēdamulu saṃsāramunu sāgunaṭlu cēyunavi. iṭṭi saṃsāramanu vṛkṣamunu telusukoninavāḍē vēdamu guṟiṃci ceppunadi ī saṃsāramu guṟiṃciyē. iṭṭi saṃsāravṛkṣamunu telusukoninavāḍu vēdamunu telusukoninavāḍē yagunu).
(ī saṃsāramanu ceṭṭu yokka kommalu satvarajastamōguṇamulacēta vṛddhipoṃdinavai mīdaku, kriṃdaku vyāpiṃciyunnavi. iviyē karmānusāramu phalamunanubhaviṃcu jīvulu - viṣayamulē ī ceṭṭuyokka ciguḷḷu. mānava lōkamulō kriṃda pātukonabaḍi karmala mūlamuna baṃdhiṃcunavi. iviyē nikṛṣṭa janmakala jīvulu).
(ī saṃsāramanu ceṭṭu yokka ī rūpamugāni, nijarūpamu gāni, ādi gāni, aṃtamu gāni madhyasthiti gāni telusukonabaḍalēdu - teliyadu. bāgugā vēḷḷu nāṭukonipōyina ī aśvatthamanu saṃsāravṛkṣamunu dṛḍhamaina vairāgyamanu śastramutō modalaṃṭa narikivēsi, ē padamunu cērina vāru marali tirigirārō marala janmiṃcarō, aṭṭi paramapadamagu vaikuṃṭhamunu poṃduṭaku (“tadviṣṇōḥ paramaṃ padaṃ” ani ceppabaḍina dānini poṃduṭaku yatnamu cēyavalayunu. evani nuṃḍi ī anādiyaina saṃsāramanu vṛkṣamu puṭṭi vyāpiṃcinadō aṭṭi ādi puruṣuni nēnu āśrayiṃcucunnānu).
(ī aśvatthamanu saṃsāravṛkṣamu mīdiki vēḷḷu, (parabrahma mūlamu), kiṃdaku śākhalu - kommalu - sṛṣṭilōni vastuvulugā galadi).
(ī saṃsāra vṛkṣamunaku anniṃṭikaṃṭe utkṛṣṭamainaṭuvaṃṭinnī, māyatō kūḍinaṭuvaṃṭinnī parabrahma mūlamu (vēru); dīniki aṃkuramu (molaka) mahattatvamu; ahaṃkāramu skaṃdamu; (bōde), paṃca tanmātralu dīni śākhalu; ī ceppina mahattatvamu, ahaṃkāramu, kāryamulaguṭavalana nikṛṣṭamainavi kanuka ī vṛkṣamunaku kriṃdi kommalu - vēdamulu modalagu śāstramulu madhuramaina māṭalatō pravṛtti mārgamunu bōdhiṃcuṭavalana, aṭti pravṛtti mārgamu nityamu kānidi kanuka aviyē ī vṛkṣamunaku ākulu (ākulu eṃḍi rālipōvunavi) dharmādharma kāma mōkṣamulanu caturvidha puruṣārthamulu dāni rasamulu, dharmamu, adharmamu (puṇyamu, pāpamu) dāni puṣpamu; cāvu puṭṭukalu modalaguvāṭivalana kalugu duḥkhamu dāni phalamu - ajñāni - (brahmajñānamu lēnivāḍu - tānē brahmamani teliyanivāḍu) ayina jīvuḍu anu pakṣi (ā paṃḍu yokka) bhōkta. vairāgyamucēta bāgugā jāru peṭṭabaḍina jñānamu (brahmajñānamē) anu kuṭhāramu (katti) ā vṛkṣamunu chēdhiṃcunadi. ī vidhamugā nuṃḍunadi aśvatthamani ceppabaḍu saṃsāravṛkṣamu - ī prakāramugā saṃsārarūpamagu vṛkṣamu anēka vidhamulugā varṇiṃpabaḍinadi).
(śrīśaṃkaraḥ - kaṭhōpaniṣat vyākhyē)
(śrīmahāviṣṇuvuyokka utkṛṣṭasthānamaina paramapadamu - “tadviṣṇō paramaṃ padaṃ” - anu vaikuṃṭhamu ī saṃsāravṛkṣamunaku mūlamu - vēru. dīnivalana avyaktamu modalu sthāvaramulavaraku galadaṃtayu kalisi saṃsāramu anu vṛkṣamu - vṛkṣamuvalenuṃḍu saṃsāramu, vṛkṣamutō pōlcabaḍina saṃsāramu naśiṃcu svabhāvamu kaladi kanuka vṛkṣamani ceppabaḍinadi. puṭṭuṭa, canipōvuṭa, musalitanamu, duḥkhamu modalagu anēka anarthamulugaladiyu, kṣaṇakṣaṇamunaku mārpu ceṃducuṃḍunadi kanukanu, eṃḍamāvulu, gaṃdharvanagaramu modalagu vāṭivalekanabaḍi māyamagunadiyu, vṛkṣamuvale ākharuna lēkuṃḍunadiyu, araṭibōdevale sāramu lēnidiyu, tatvamunu teliyagōreḍuvāriki dīni tatvamu iṭuvaṃṭidi yani teliyabaḍanidiyu, avidyakanuka karmāvyakta bījamuvalana kaliginadiyu, parabrahmayokka jñānaśakti, kriyāśakti anu reṃḍu śaktulugala hiraṇyagarbhuḍu anu molaka kaladiyu, prāṇulaṃdaṟi śarīrabhēdamulē skaṃdamugā galadiyu, tṛṣṇa yaneḍi mahāsamudramuvalana kaligeḍu darpamu kaladiyu, buddhi paṃcēṃdriyamulu, viṣayamulu ciguḷḷugā galadiyu, śruti, smṛti, nyāyaśāstramu, upadēśamu palāśamugā galadiyu, yajñamu, dānamu, tapassu modalagu anēka kriyalacēta puṭṭi balisinadiyu, sukhamu, duḥkhamu, vēdanamulu (bādhalu) gala anēka puṇyapāpa rasa prāṇula jīviṃpacēyu anaṃtaphalamu kaladiyu, tṛṣṇa yanu nīrucē perigi dhṛḍhamugā nunna vēḷḷu kaladiyu, satyalōkamu modalu ēḍu lōkamulaṃdunu brahma modalagu vāragu pakṣulacē kaṭṭabaḍina gūḍu kaladiyu, prāṇula yokka sukha duḥkhamula valana kalugu saṃtōṣamu, kaṣṭamu, nṛtyamu, gītamu, vādyamulu modalagu vāṭivalana kalugu hāsamu, rōdanamu modalagu śabdamulugala mahāravamu kaladiyu, vēdāṃtamulalō - upaniṣattulalō - ceppabaḍina brahma sākṣātkāramu anu śastramucēta narikivēyabaḍunadi - ī vidhamuga nuṃḍunadi aśvatthamanu saṃsāravṛkṣamu)
(ī saṃsāra vṛkṣamunaku vittanamulu reṃḍu - puṇyamu pāpamu. dāniki vāsanalu vēlakoladi vēḷḷu; satvarajastamōguṇamulu mūḍu kāṃḍamulu, paṃcabhūtamulu skaṃdhamulu, paṃcabhūtamulavalana kalugu śabdamu modalagu viṣayamulu paṃcarasamulu padakoṃḍu iṃdriyamulu dāni kommalu, jīvuḍu paramātmayanu reṃḍu ākulu; vāta pitta ślēṣmamulu mūḍu dāni carmamulu; sukha duḥkhamulu reṃḍu dāni phalamulu, ī vṛkṣamu sūryamaṃḍalamuvaraku vyāpiṃciyunnadi, sukha duḥkhamulu reṃḍu dīni phalamulu; oka phalamagu duḥkhamunu gṛhasthulu (pakṣulu) tinucunnāru - anubhaviṃcucunnāru. (svargamukūḍa duḥkhaphalamē ani ceppabaḍinadi - ā anubhavamainatarvāta tirigi bhūlōkamuna janmiṃcavalasiyunnadi kanuka); haṃsalu reṃḍu anagā, araṇyamulō sanyāsulu, vivēkamugalavāraguṭacēta oka phalamagu sukhamunanubhaviṃcucunnāru) .
(aśvatthamanu ī saṃsāra vṛkṣamunaku mīdanu caturmukha brahma modalaguvāru sṛṣṭiki mūlamu ayinavāru uṃḍuṭavalana mīdanu mūlamu (vēḷḷu) kaladi - ūrthvamūlamu mūlamu ani ceppabaḍinadi. ā caturmukha brahma modalagu vāṭi saṃtānamaguṭacēta vāṭilōnuṃḍi okadānilōnuṃḍi okaṭigā puṭṭinadaguṭacēta vāṭilō modaṭa puṭṭina manuṣyulu śākhalugā ceppabaḍinaṃduna “adhiśsākhaḥ” (ī vṛkṣamu kriṃdavaipu śākhalu galadi) ani ceppabaḍinadi. manuṣyulai puṭṭinavāru karmalu cēyuṭavalana adē mūlamu ayi kriṃdanu mīdanu śākhalugalavigā periginaṃduna “adhiścōrdhvaṃ prasṛtā stasya śākhāḥ” ani ceppabaḍinadi. ī vṛkṣamu paina nirdēśiṃci ceppapabaḍina rūpamutō saṃsārulaku - saṃsāramulō nunnavāriki - kanabaḍadu - “nēnu dēvadattuni kumāruḍanu” (palānavāri kumāruḍanu) anikāni, yajñadattuni taṃḍrini ani kāni tōcunu).
buddhiḥ skaṃdamaya ścaiva iṃdriyāṃtara kōṭaraḥ |
mahābhūta viśākhaśca viṣayaiḥ patra śākhavān |
dharmādharma supuṣpaśca sukha duḥkha phalōdayaḥ |
ā jīvya sarva bhūtānāṃ brahmavṛkṣassanātanaḥ |
ētat brahmavanaṃ caiva brahmavṛkṣasya tasya tat |
ētaccitvā ca bhitvāca jñānēna paramāstinā |
tataścātmaratiṃ prāpya yasmānnā vartatē punaḥ || ityādi.
“punaśca anyadhā āhuḥ -” tadidaṃ vyaṣṭikṣētraṃ adhi samaṣṭi kṣētramucyatē kṛtsnamidaṃ brahmāṃḍaṃ hiraṇya garbha śarīraṃ virāḍityucyatē “tasya dyauḥ śiraḥ cakṣuṣī caṃdra sūryau diśaśrōtrē, madhyamākāśaṃ, śarīraṃ pṛdhivī, pādau tasminna syūrthva mūla mathaḥ śākhaṃ” iti yōjayitavyaṃ.
“prāṇi vaṃśōvā aśvatthō vṛkṣaḥ tasya mūlaṃ brahma upariṣṭā sthitiḥ” ityādi.
” ēvaṃ sarvāsvapi yōjanā susaṃsāra hēyatā pratipādanē tātparyaṃ vaktavyaṃ titiḥ paraṃ saṃsārasyaiva sākṣāt vṛkṣatvēna kalpanaṃ”
(śrīvēdāṃta dēśikaḥ)
(avyaktamanu mūlamu (vēru) kaladi, aṃducētanē vṛkṣamani pēru kaladi; buddhi dāni skaṃdamu; iṃdriyamulu ā ceṭṭulōni kōṭaramulu, mahābhūtamulu dāni kommalu, viṣayamulu dāni śākhalu, ākulu; dharmā dharmamulu (puṇya pāpamulu) puṣpamulu; sukha duḥkhamulu phalamulu, samasta bhūtamulanu jīviṃpacēyunadi. idi brahma vṛkṣamu - caturmukha brahma vērugā galadi, kriṃdaku prāṇulavaṟaku vyāpiṃciyuṃḍu vṛkṣamu. dīnini brahmajñānamanu khaḍgamucē chēdiṃci ātmayaṃdu rati kaligiyuṃḍina marala jananamu kalugakuṃḍa nuṃḍunu).
(ī vṛkṣamunu guṟiṃci iṃkoka rītigā kūḍa ceppabaḍinadi - idi vyaṣṭikṣētramu, samaṣṭikṣētramu. ī brahmāṃḍamaṃtayu hiraṇyagarbhuni - caturmukha brahmayokka śarīramu idi virāṭ ani ceppabaḍinadi. ā virāḍrūpunaku ākāśamu śirassu, sūryacaṃdrulu kaṃḍlu, dikkulu cevulu, madhya śarīramu ākāśamu; bhūmi pādamulu idikūḍa ūrdhva mūlamu - mīdanu vēḷḷu galadi - adhaśśākhamu - kriṃdanu śākhalu galadi (kommalu galadi) ani yōciṃcavalenu).
(aśvatthamu anu vṛkṣamu prāṇula vaṃśamu, dāniki mūlamu, - vēru - brahma (mīdanu unnadi). (ī prakāramugā anēka vidhamulugā saṃsāramu anunadi hēyamainadani pratipādiṃcabaḍinadi - ceppabaḍinadi). (saṃsāramu vṛkṣamani kalpana cēyabaḍinadi)
tagu rasaṃbulu nālgu dharmā dharma mukharaṃbulu; eṟigeḍi vidhamulaidiṃdriyaṃbu
lāṟu; svabhāvaṃbulā śōkamōhādulūrmulu, dhātuvulokka ēḍu
paiporalenimidi praṃgalu; bhūtaṃbu laidu, buddhiyu manōhaṃkṛtulunu
tē. raṃdhramulu tommidiyu gōṭaramulu; prāṇa
patra daśakaṃbu; jīvēśa pakṣiyugamu
galugu saṃsāra vṛkṣaṃbu galugajēya,
gāva, naḍagiṃpa rājavokkaruḍavīvu”. (śrīmadāṃdhrahābhāgavatamu - 10 - 91)
(iṭlu varṇiṃcabaḍina saṃsāravṛkṣamu yokka rūpamu varṇiṃcabaḍinaṭlu vyavahāramulō kānarādu - kala, eṃḍamāvulu, māyāgaṃdharvanagaramu - vīṭitō samānamainadaguṭacēta kanabaḍi marugupaḍu svarūpamu kaladi).
(śrī ānaṃdatīrthaḥ)
(ī saṃsāra vṛkṣamu yokka rūpamu vikāramulu ceṃdunadi - mārpulu ceṃdunadi - yaguṭacēta elāgunnadō aṭlu kānarādu - dīniki modalu aṃtamu śrīmahāviṣṇuvē - atanē sṛṣṭi cēyuvāḍu, pōṣiṃcuvāḍu, aṃtamu cēyuvāḍukanuka).
(iṭuvaṃṭi aśvatthamanu saṃsāra vṛkṣamunu dṛḍhamaina samyak jñānamu mūlamugāgala triguṇamayamaina bhōgamulaṃdu āsakti lēkuṃḍuṭa anu śastramucēta narikivēsi tatpadaṃ - viṣṇuvuyokka ā paramapadamanu vaikuṃṭhamunu guṟiṃci anvēṣiṃpavalayunu).
(ī prakāramugā aśvatthamanu saṃsāravṛkṣamunu, bāgugā vēḷḷu tannukoni pātukupōyinadānini, putra mitrādulaṃdu īṣaṇa vadalukonuṭavalana dēniyaṃdu saṃgamu lēnivāḍai paramātmayaṃdu abhimukhuḍai marala marala vivēkamu abhyāsamu anu padunaina kattitō saṃsāravṛkṣamunu, dāni mūlamutō - vittanamutō sahā, modalaṃṭa nariki, paiki pekaliṃcivēsi ā mahāviṣṇuvuyokka utkṛṣṭamaina sthānamagu mōkṣapadamu guṟiṃci anvēṣiṃpavalayunu - telusukonavalenu -).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.