← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంస్కారము saṃskāramu

Original — తెలుగు
  1. సంస్క్రియతే, జ్ఞానయోగ్యతాదుపద్యతే- పురుషస్య చిత్తం అనేన ఇతి సంస్కారః -

(దీనిచే పురుషుని చిత్తము బ్రహ్మజ్ఞానమును పొందుటకు యోగ్యమగునట్లు - తగినట్లు - సంస్కరింపబడును - అందుచేత సంస్కారమని చెప్పబడినది - చిత్త శుద్ధియే సంస్కారమువలన కలుగునది).

  1. “సంస్కారమనగా చక్కబెట్టుట. జీవాత్మయందలి స్పందములకును శరీరమునందలి స్పందములకును ఐకమత్యము కలుగచేయుట. జీవాత్మ యొక్క స్పందములకును క్రొత్తగా సంపాదించుకొనబోవు శరీరములయొక్క స్పందములకును సమన్వయము కలుగచేయునది కనుక సంస్కారము”.

  2. గతించిన జీవితములోని అనుభవము మనసులో దాగియుండి ఇప్పుడు దాని ప్రకారము పని చేయుంచునది.

  3. “సంస్కారమను పదమునకు సంస్కృతభాషయందు మార్పు అని అర్థము - కామ, క్రోధాది దుర్గుణములనుండి శాంత శమ దమాది గుణములకు సంస్కరింపబడుటయే నిజమైన సంస్కారము - సంస్కారము బాహ్యమనియు ఆంతరంగికమనియు రెండు విధములు. బాహ్య సంస్కారమన ప్రారబ్దమనియు, దాని తప్పించుకొనుట అసంభవమనియు (తెలిసిన విషయమే) - దుష్టగుణములను నశింపచేసి శిష్టగుణముల నవలంభించుటయే ఆంతరంగిక సంస్కారము. పేరాశ, గర్వము, మోహము, దొంగతనము, దంభము, దర్పము, అన్యాయము, అసూయ, రాగము, ద్వేషము, అభిమానము, కోపము, కాఠిన్యము, వ్యభిచారము, ఆత్మ స్తుతి, పరనింద, లోభము, మదము, కపటము, చాపల్యము, అసత్యము, అశ్రద్ధ, హింస, సంఘము, ధూమపానము, మధ్యపానము, అతృప్తి, భయము, మాంసభక్షణము, అతినిద్ర, ఆలస్యము, ప్రమాదము, అతిభోజనము, పిశునత్వము మున్నగునవి దుర్గుణములు - సంతృప్తి, వినయము, వైరాగ్యము, ప్రేమ, నమ్రత, న్యాయము, అనసూయ, విరక్తి, భూతదయ, నిస్సంగత్వము, శాంతము, త్యాగము, బ్రహ్మచర్యము, సర్వాత్మభావము, కలుపుగోలుతనము, ఉదారము, ఓర్పు, నిష్కాపట్యము, స్థిరత్వము, సత్యము, శ్రద్ధ, సాత్వికాహారసేవనము, ఆర్జవము, మితనిద్ర, ఉత్సాహము, జాగరూకత, మితాహారము, ఔదార్యము, మొదలగునవి సద్గుణములు. పైన చెప్పబడిన దుర్గుణములనుండి సద్గుణములకు మారుటయే సంస్కారము”.

పూర్వజన్మ సంస్కారము సత్వరజస్తమోగుణముల బట్టి త్రివిధములుగనుండును. ఇంతియేగాక సత్వరజస్తమోగుణముల మిశ్రమమువలన సంస్కారము నవ విధములుగనుండును - సత్వసత్వము, సత్వరజము, సత్వతమము, రజస్సత్వము, రజోరజము, రజస్తమము, తమస్సత్వము, తమోరజము, తమోతమము అని నవ విధములు. త్రిగుణములలో ఏ గుణము వృద్ధియై యుండమరణము సంభవించునో మరుజన్మమున అట్టి స్వభవములేర్పడును.

  1. ఆత్మనస్సన్శోధనము - (ఆత్మ శుద్ధి - చిత్తశుద్ధి చేసుకొనుట).
Transliteration
  1. saṃskriyatē, jñānayōgyatādupadyatē- puruṣasya cittaṃ anēna iti saṃskāraḥ -

(dīnicē puruṣuni cittamu brahmajñānamunu poṃduṭaku yōgyamagunaṭlu - taginaṭlu - saṃskariṃpabaḍunu - aṃducēta saṃskāramani ceppabaḍinadi - citta śuddhiyē saṃskāramuvalana kalugunadi).

  1. “saṃskāramanagā cakkabeṭṭuṭa. jīvātmayaṃdali spaṃdamulakunu śarīramunaṃdali spaṃdamulakunu aikamatyamu kalugacēyuṭa. jīvātma yokka spaṃdamulakunu krottagā saṃpādiṃcukonabōvu śarīramulayokka spaṃdamulakunu samanvayamu kalugacēyunadi kanuka saṃskāramu”.

  2. gatiṃcina jīvitamulōni anubhavamu manasulō dāgiyuṃḍi ippuḍu dāni prakāramu pani cēyuṃcunadi.

  3. “saṃskāramanu padamunaku saṃskṛtabhāṣayaṃdu mārpu ani arthamu - kāma, krōdhādi durguṇamulanuṃḍi śāṃta śama damādi guṇamulaku saṃskariṃpabaḍuṭayē nijamaina saṃskāramu - saṃskāramu bāhyamaniyu āṃtaraṃgikamaniyu reṃḍu vidhamulu. bāhya saṃskāramana prārabdamaniyu, dāni tappiṃcukonuṭa asaṃbhavamaniyu (telisina viṣayamē) - duṣṭaguṇamulanu naśiṃpacēsi śiṣṭaguṇamula navalaṃbhiṃcuṭayē āṃtaraṃgika saṃskāramu. pērāśa, garvamu, mōhamu, doṃgatanamu, daṃbhamu, darpamu, anyāyamu, asūya, rāgamu, dvēṣamu, abhimānamu, kōpamu, kāṭhinyamu, vyabhicāramu, ātma stuti, paraniṃda, lōbhamu, madamu, kapaṭamu, cāpalyamu, asatyamu, aśraddha, hiṃsa, saṃghamu, dhūmapānamu, madhyapānamu, atṛpti, bhayamu, māṃsabhakṣaṇamu, atinidra, ālasyamu, pramādamu, atibhōjanamu, piśunatvamu munnagunavi durguṇamulu - saṃtṛpti, vinayamu, vairāgyamu, prēma, namrata, nyāyamu, anasūya, virakti, bhūtadaya, nissaṃgatvamu, śāṃtamu, tyāgamu, brahmacaryamu, sarvātmabhāvamu, kalupugōlutanamu, udāramu, ōrpu, niṣkāpaṭyamu, sthiratvamu, satyamu, śraddha, sātvikāhārasēvanamu, ārjavamu, mitanidra, utsāhamu, jāgarūkata, mitāhāramu, audāryamu, modalagunavi sadguṇamulu. paina ceppabaḍina durguṇamulanuṃḍi sadguṇamulaku māruṭayē saṃskāramu”.

pūrvajanma saṃskāramu satvarajastamōguṇamula baṭṭi trividhamuluganuṃḍunu. iṃtiyēgāka satvarajastamōguṇamula miśramamuvalana saṃskāramu nava vidhamuluganuṃḍunu - satvasatvamu, satvarajamu, satvatamamu, rajassatvamu, rajōrajamu, rajastamamu, tamassatvamu, tamōrajamu, tamōtamamu ani nava vidhamulu. triguṇamulalō ē guṇamu vṛddhiyai yuṃḍamaraṇamu saṃbhaviṃcunō marujanmamuna aṭṭi svabhavamulērpaḍunu.

  1. ātmanassanśōdhanamu - (ātma śuddhi - cittaśuddhi cēsukonuṭa).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.