← Back to స · Booklets 51–60 (digitized file 6)

సంసృతి saṃsṛti

Original — తెలుగు
  1. సంసారః, జన్మమరణాది.

(జన్మము, మరణము మొదలగునవి కలది; గర్భజన్మ జరామరణరూపములు గలది).

  1. జన్మ మృత్యు ప్రవాహః; సం యోగ వియోగ రూప సంసారః; సంసారరూపో బంధః; సుఖ దుఃఖే నానా యోని సంసారః.

(జననమరణములు ప్రవాహరూపముగా గలది; పుట్టుట చనిపోవుట, మరల పుట్టుట మరల చనిపోవుట - ఈ ప్రకారముగా జననమరణములు అంతము లేకుండ కలుగుట. నదీ ప్రవాహములో కొట్టుకొని పోవుచుండు వస్తువులు, ఒక మాటు దగ్గరగా కలసి ఒక మాటు దూరముగా విడిపోవునట్లు కొంతకాలము కావలసిన వారితో కలిసియుండి, కొంతకాలము వారిని విడిచి చనిపోవుట - వియోగము పొందుట - అనగా, పంచభూతముల సం యోగము వలన శరీరమై కొంత కాలముండి ఆ పంచభూతములు వేటికి అవి విడిపోయి వియోగము చెందుట వలన చనిపోవుట, అనేక జన్మలనెత్తి కష్ట సుఖములననుభవించుట)

  1. సమ్యక్ సృతిః సరణం అనయా ఇతి సంసృతిః - బుద్ధిః -

(దీనివలన బాగుగా సంచరించుట యగును - బుద్ధి). (చూడుము సంసారము)

Transliteration
  1. saṃsāraḥ, janmamaraṇādi.

(janmamu, maraṇamu modalagunavi kaladi; garbhajanma jarāmaraṇarūpamulu galadi).

  1. janma mṛtyu pravāhaḥ; saṃ yōga viyōga rūpa saṃsāraḥ; saṃsārarūpō baṃdhaḥ; sukha duḥkhē nānā yōni saṃsāraḥ.

(jananamaraṇamulu pravāharūpamugā galadi; puṭṭuṭa canipōvuṭa, marala puṭṭuṭa marala canipōvuṭa - ī prakāramugā jananamaraṇamulu aṃtamu lēkuṃḍa kaluguṭa. nadī pravāhamulō koṭṭukoni pōvucuṃḍu vastuvulu, oka māṭu daggaragā kalasi oka māṭu dūramugā viḍipōvunaṭlu koṃtakālamu kāvalasina vāritō kalisiyuṃḍi, koṃtakālamu vārini viḍici canipōvuṭa - viyōgamu poṃduṭa - anagā, paṃcabhūtamula saṃ yōgamu valana śarīramai koṃta kālamuṃḍi ā paṃcabhūtamulu vēṭiki avi viḍipōyi viyōgamu ceṃduṭa valana canipōvuṭa, anēka janmalanetti kaṣṭa sukhamulananubhaviṃcuṭa)

  1. samyak sṛtiḥ saraṇaṃ anayā iti saṃsṛtiḥ - buddhiḥ -

(dīnivalana bāgugā saṃcariṃcuṭa yagunu - buddhi). (cūḍumu saṃsāramu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.