← Back to స · Booklets 51–60 (digitized file 6)

సమ్యక్ జ్ఞానం samyak jñānaṃ

Original — తెలుగు
  1. తత్వజ్ఞానము. బ్రహ్మతత్వము, పరమాత్మ తత్వము గుఱించి అయిన జ్ఞానము.

  2. సాక్షాత్ మోక్షప్రాప్తి సాధనం

(మోక్షప్రాప్తికి సాక్షాత్సాధనము).

“సమ్యక్ జ్ఞాన మిదం సాక్షాన్మోక్షసంప్రాప్తి సాధనం” (గీతాభావప్రకాశము - 9 - 13)

(సమ్యక్ జ్ఞానము - మోక్షము ప్రాప్తించుటకు సాక్షాత్సాధనము).

  1. యధా భూతాత్మ దర్శనం.

(ఆత్మ నిజమైన రూపమును దర్శింప చేయునది)

  1. వేదాంత మహావాక్యముల విచారముచేత, శ్రవణముచేత అంతఃకరణమందు చిదాత్మ ప్రతిబింబము అను వృత్తి కలుగును. అదియే సమ్యక్ జ్ఞానము -

  2. అశేషా నర్థహే త్వా త్మానవ బోధ విషయస్య చ అనాగమిక ప్రత్యక్షాది లౌకిక ప్రమానా విషయత్వాత్ వేదాంతాగమ వాక్యా దేవ సమ్యక్ జ్ఞానం

(సర్వానర్థ కారణమైన ఆత్మజ్ఞానముచే కప్పబడియున్న యాత్మ స్వరూపము - వేదములకంటె భిన్నములగు ప్రత్యక్షానుమానాది లౌకిక ప్రమాణములకు గోచరింపనందున వేదాంత శాస్త్రమునందున్న వాక్యములవలననే సమ్యక్ జ్ఞానము కలుగును)

  1. ఇది కుండ, ఇది బట్ట అని వస్తువులగుఱించి నిశ్చయము చేసుకొనిన జ్ఞానము -

  2. పరమేశ్వరుడొక్కడే, ఇతర వస్తువేదియు లేదు అని తెలుసుకొనుట.

Transliteration
  1. tatvajñānamu. brahmatatvamu, paramātma tatvamu guṟiṃci ayina jñānamu.

  2. sākṣāt mōkṣaprāpti sādhanaṃ

(mōkṣaprāptiki sākṣātsādhanamu).

“samyak jñāna midaṃ sākṣānmōkṣasaṃprāpti sādhanaṃ” (gītābhāvaprakāśamu - 9 - 13)

(samyak jñānamu - mōkṣamu prāptiṃcuṭaku sākṣātsādhanamu).

  1. yadhā bhūtātma darśanaṃ.

(ātma nijamaina rūpamunu darśiṃpa cēyunadi)

  1. vēdāṃta mahāvākyamula vicāramucēta, śravaṇamucēta aṃtaḥkaraṇamaṃdu cidātma pratibiṃbamu anu vṛtti kalugunu. adiyē samyak jñānamu -

  2. aśēṣā narthahē tvā tmānava bōdha viṣayasya ca anāgamika pratyakṣādi laukika pramānā viṣayatvāt vēdāṃtāgama vākyā dēva samyak jñānaṃ

(sarvānartha kāraṇamaina ātmajñānamucē kappabaḍiyunna yātma svarūpamu - vēdamulakaṃṭe bhinnamulagu pratyakṣānumānādi laukika pramāṇamulaku gōcariṃpanaṃduna vēdāṃta śāstramunaṃdunna vākyamulavalananē samyak jñānamu kalugunu)

  1. idi kuṃḍa, idi baṭṭa ani vastuvulaguṟiṃci niścayamu cēsukonina jñānamu -

  2. paramēśvaruḍokkaḍē, itara vastuvēdiyu lēdu ani telusukonuṭa.

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.