← Back to స · Booklets 51–60 (digitized file 6)

సన్యాసం sanyāsaṃ

Original — తెలుగు
  1. పరిత్యాగం; కర్మణాం పరిత్యాగం సన్యాసం.

(విడిచి పెట్టుట; కర్మలను విడిచిపెట్టుట)

  1. కర్మఫలత్యాగము

  2. “కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం క వయో విదుః”. (శ్రీమద్భగవద్గీత - 18 - 2)

(కామ్య కర్మలను వదలివేయుట సన్యాస న్యాసమని కవులు చెప్పుదురు)

  1. కామ్యానాం అశ్వమేధాదీనాం కర్మణాం న్యాసం, పరిత్యాగం సన్యాసం” (శ్రీశంకరః)

(కామ్యకర్మలు - కోరికతో చేయు కర్మలు - అశ్వమేధయాగము మొదలగు కర్మలను విడిచిపెట్టుట) (ఫలమును కోరి చేయు కర్మలను వదలివేయుట).

  1. “ఫలానిచ్ఛయా అకరణేన నా కామ్యకర్మణో న్యాసః” (శ్రీ ఆనందతీర్థః)

(కామ్య కర్మలను ఫలాభిలాష లేక చేయుటగాని, చేయుట మానివేయుటగాని సన్యాసము)

  1. “కర్మఫల సంకల్ప సన్యాసాత్ సన్యాసిత్వం -”.

(కర్మఫల సంకల్పమును వదలివేయుటయే సన్యాసము).

  1. ఎప్పుడు సన్యసించవలయును : -

    1. “యదా మనసి వైరాగ్యం జాయతే సర్వ వస్తుషు |

తదైన సన్యసేత్ విద్వాన్ అన్యథా పతితో భవేత్ ||“.

(అన్ని వస్తువులందు వైరాగ్యము - అనురాగము లేకుండుట - ఎప్పుడు కలుగునో - అప్పుడే విద్వాంసుడైనవాడు సన్యసించవలెను. ఇంకొక రీతిగ సన్యసించిన పతితుడగును.) - (భ్రష్టుడగును).

  1. “బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్, గృహద్వనీ భూత్వా ప్రవ్రజేత్” ఇతి శ్రుతిః -

(బ్రహ్మచర్యాశ్రమమును పూర్తి చేసుకొని గృహస్థాశ్రమమును స్వీకరించవలెను - గృహస్థాశ్రమమును పూర్తిచేసుకొని వానప్రస్థాశ్రమమును చేపట్టవలెను - ఆపైని సన్యసించవలెను - ఇట్లు ఒక ఆశ్రమము తర్వాత నింకొక ఆశ్రమమును చేపట్టవలెనని శ్రుతి చెప్పుచున్నది).

  1. ” - - - యదివా ఇతరథా బ్రహ్మచర్యారేవ ప్రవ్రజేత్, గృహాత్, వనాద్వా” ఇతి శ్రుతిః -

(ఒక ఆశ్రమము తర్వాత నింకొక ఆశ్రమమును చేపట్టకుండ బ్రహ్మచర్యములోనుండి యైనను, గృహస్థాశ్రమములో నుండి యైనను, వానప్రస్థాశ్రమములో నుండి అయినను సన్యసించవలెను)

  1. “యది జన్మాంతర కృతైః కర్మభిః శుద్ధం చిత్తం తదా బ్రహ్మచర్యాదేవ సన్యస్య బ్రహ్మ జిజ్ఞాసి తవ్యం; యది న శుద్ధమితి రాగేణ జ్ఞాయతే తదా గృహీ భవేత్. తత్రాప్యశుద్ధౌ వనీ భవేత్, తత్రాప్యశుద్ధౌ తదైవ కాల మాకల యేత్ వనే శుద్ధౌ ప్రవ్రజేత్ - య దహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్”.

(పూర్వ జన్మలలో చేసిన కర్మలవలన చిత్తము శుద్ధమైనయడల - చిత్తశుద్ధి కలిగియున్నయడల - బ్రహ్మచర్యాశ్రమములోనుండగనే సన్యసించి బ్రహ్మజ్ఞానము సంపాదింపవలెను - కాని చిత్త శుద్ధి అప్పటికి కలుగని యడల - విషయముల యడల అనురాగముండుట బట్టి తెలిసినయడల - అప్పుడు విషయవాంఛ తీరుటకు గృహస్థాశ్రమమును స్వీకరించవలెను. విషయములందు అనురాగమున్నంతకాలము సన్యసించకూడదు. గృహస్థాశ్రమములోనుండగ కూడ చిత్తము శుద్ధము కాలేదని తెలిసినయడల అప్పుడు వనమునకు పోయి వానప్రస్థాశ్రమమును స్వీకరించవలెను. ఆ వానప్రస్థాశ్రమములో నుండినను చిత్తము శుద్ధము కానియడల ఆ ఆశ్రమములోనే కాలము గడపవలెను - ఎప్పుడు చిత్తశుద్ధి కలిగిన అప్పుడు సన్యసించవలయును - ఏ దినమున చిత్తము శుద్ధి యగునో, రజము లేకయుండునో ఆ దినముననే సన్యసింపవలయును -

  1. “ఆదిని బ్రహ్మచర్యము ననంతరమందు గృహస్థధర్మమా |

మీద వనప్రవాసమట మీద యతిత్వమటంచు బ్రహ్మ వి |

ద్యా ధరులండ్రుగాదె; తనయా ! వినయమ్ముగలాడ వాగమా |

పాదితమైన ధర్మము నెపమ్మున సమ్మానరింప బాడియే” (శ్రీదేవీ భాగవతము)

  1. “సద్గురు సమీపే సకల విద్యా పరిశ్రమ జో భూత్వా విద్వాన్ సర్వమైహికాముష్మిక సుఖ శ్రమం జ్ఞాత్వా ఈషణాత్రయ, వాసనా త్రయ మమత్వాహం కారాదికం పాంతాన్నమివ హేయ మధి గమ్య మోక్షమార్గైక సాధనో బ్రహ్మచర్యం సమాప్య గృహీ భవేత్ గృహద్వనీభూత్వా ప్రవ్రజేత్ యదివా ఇతరథా బ్రహ్మచర్యా దేవ; గృహద్వా, వనాద్వా, అధ పునరప్రతీవా, ప్రతీవా, స్నాతకోపోత్సవాగ్నిస్సాగ్నిరనగ్నికోవా యదహరేవ విరజ్యేత్ తదహరేవ ప్రవ్రజేత్”. (పరమహంస పరివ్రాజకోపనిషత్)

(సద్గురువు దగ్గర సకల విద్యలను నేర్చుకొని పండితుడైనవాడు ఈ లోకములోను, పరలోకములోను కలుగు సుఖశ్రమములను తెలుసుకొని ఈషణత్రయమును - (దారేషణ, ధనేషణ, పుత్రేషణ) - వాసనా త్రయమును, మమత్వము (ఇది నాది యనుకొనుట), అహంకారము మొదలగువాటిని వాంతి చేసుకొనిన అన్నము వలె, హేయమగువాటిని వదలి, మోక్షమార్గమునకు ఒకే సాధనమైన బ్రహ్మచర్యము పూర్తిచేసుకొని గృహస్థుడు కావలెను - (గృహస్థాశ్రమమును స్వీకరించవలెను). గృహస్థాశ్రమమునుండి వానప్రస్థాశ్రమమును స్వీకరించవలెను - అప్పుదు సన్యసించవలెను, లేకున్న బ్రహ్మచర్యమునుండియే సన్యసించవచ్చును, గృహస్థాశ్రమమునుండి సన్యసించ వచ్చును - లేక వానప్రస్థాశ్రమమునుండి సన్యసించవచ్చును. ఏ దినమున శుద్ధ చిత్తుడగునో ఆ రోజునే సన్యసించవచ్చును)

  1. చత్వారింశత్ సంస్కార సంపన్నస్సర్వతో విరక్త చిత్త శుద్ధి మేత్య ఆశాసూ యే ర్ష్యాహంకారం దగ్ధ్వ సాధన చతుష్టయ సంపన్నః ఏవ సన్యస్తు మర్హతి, అధః షండః పతితో అంగవికలః స్త్రైణో పాధి రోర్భకో, మూకః పాషండశ్చక్రీ, లింగీ, కుష్టీ వైఖానస హరద్విజాభృత కాధ్యాపక శిపి విష్టో, అనగ్నికో, నాస్తికో, వైరాగ్య రహితో అప్యేతే సన్యాసా నర్హాః. సన్యస్తా యద్యపి మహా వాక్యోపదేశే నాధికారిణః |“. (సన్యాసోపనిషత్)

(ఇరువదినాలుగు సంస్కారములు పొందినవాడు అన్నింటియందును విరక్తిని పొంది, చిత్తశుద్ధిని పొంది, ఆశ,అసూయ, ఈర్ష, అహంకారము, అనువాటిని దహించుకొని, సాధన చతుష్టయ సంపన్నుడు అయినవాడే సన్యసించవలెను - షండుడు, పతితుడు, అంగవైకల్యముకలవాడు, స్త్రైణుడు, చెవిటివాడు, అర్భకుడు, మూగవాడు, పాషాండుడు, చక్రీ, లింగి, కుష్టువ్యాధిగలవాడు, నాస్తికుడు, వైరాగ్యము లేనివాడు, - వీరు సన్యాసమున కర్హులుకారు. అట్టివారు సన్యసించినను మహావాక్యోపదేశమునకు అర్హులు కారు).

  1. “సకలాంగా నామేవ కథం చిత్కర్మణ్యధికృతానాం సన్యాసో యుక్తః - వికలాంగానాం అంధా దీనాం న జ్ఞానప్రదానే సన్యాసే అధికారః-”.

(అన్ని అవయవములు కలవాడు, కర్మలందు అధికారము కలవాడే సన్యాసమునకు తగినవాడు. వికలాంగులు, గుడ్డువారు, జ్ఞానోపదేశమునకు సన్యాసమునకు అధికారులు కారు).

  1. విరక్తః ప్రవ్రజేత ధీమాన్సరక్తస్తు గృహే వసేత్ |

సరాగో నరకం యాతి ప్రవ్రజన్హిద్విజాధమః |

యథా మనసి సంజాతం వైతృష్ణ్యం సర్వ వస్తుషు |

తదా సన్యాసమిచ్ఛంతి పతితస్స్యాద్విపర్యయే |

ప్రవృత్తి లక్షణం కర్మ జ్ఞానం సన్యా సన్యాస లక్షణం |

తస్మాత్ జ్ఞానం పురస్కృత్య సన్యసేదిహ బుద్ధిమాన్ |

యదాతు విదుతుం తత్వం పరంబ్రహ్మ సనాతనం |

తదైక దండం సంగృహ్య సోపనీతాం శిఖాం త్యజేత్. |

అహమేవ పరబ్రహ్మ వాసుదేవాఖమ వ్యయం |

ఇతి బోధో దృఢో యస్య తథా భవతి భైక్షుభుక్ |

” - - - “ప్రాణే గతే యథా దేహ సుఖం దుఃఖం నవిందతి |

తథా చేత్ప్రాణ యుక్తోపి స కైవల్యాశ్రమే వసేత్ |

అనధీ త్వాఖిలాన్ వేదాన్ అనిష్ట్వైవా ఖిలాన్ సురాన్ |

అను త్పాద్య సుతాన్ విప్రో న సన్యాసితు మిచ్ఛతి |

అకుర్వ న్విహితం కర్మ నిందితం చ సమాచరన్ |

ప్రచరన్నింద్రియార్థేషు నరః పతన మృచ్ఛతి |

జ్ఞాత్వా నైష్కర్మ్య మాచారేత్ స శిఖం వపనం కృత్వా బహిస్సూత్రం త్యజేద్భుధః |

- - - ” తేహస్మ ప్రత్రైషణాం యాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యత్థా యాధ భిక్షాచరం చరంతి

- - - పరం బ్రహ్మతు విజ్ఞాయ ప్రవ్రజేద్బ్రాహ్మణోత్తమః |

అన్యథా కర్మ కుర్వీత న ప్రమాద్యేత కర్హిచిత్ |

స్వే స్వే అధికారే యానిష్ఠా సగుణః పరికీర్తితః |

విపరీతస్తు దోషస్యాత్ ఉభయో రేష నిశ్చయః ||”

(దేనియందును అనురాగము లేక ధీమంతుడైనవాడు సన్యసించవలెను - అనురాగము వదలుకోలేనివాడు గృహమందే ఉండవలెను - గృహస్థాశ్రమమందే ఉండవలెను - విషయములందనురాగముగల బ్రాహ్మణాధముడు సన్యసించినయడల నరకమును పొందును - సమస్త వస్తువులందు ఎప్పుడు తృష్ణ లేకుండునో అప్పుడు సన్యసించవలెను. అట్లుగాక, దీనికి వీపరీతముగా సన్యసించిన - విషయములందనురాగముండగనే సన్యసించినయడల - పతితుడగును. పర్మ ప్త్రవృత్తి లక్షణము - జ్ఞానము సన్యాస లక్షణము - అందుచేత బుద్ధిమంతుడైనవాడు జ్ఞానము (బ్రహ్మజ్ఞానము) ముందు సంపాదించి అటు తర్వాత సన్యసించవలెను - ఎప్పుడు సనాతనమైన పరబ్రహ్మ తత్వమును తెలుసుకొనునో అప్పుడు ఒక దండమును గ్రహించి ఉపనయనమప్పటి శిఖను - విడిచి పెట్టవలెను - అవ్యయుడు, వాసుదేవుడు అను పేర్లుగల పరబ్రహ్మ నేనే అను భావము గట్టిగా ఎప్పుడు కలుగునో అప్పుడు సన్యాసి యగును - ప్రాణము పోయిన తర్వాత దేహములో సుఖము దుఃఖము ఉండనట్లే ప్రాణమున్నను ఆ సన్యాసాశ్రమములో నుండవలెను - వేదములన్నింటిని అధ్యయనము చేయనిదే, దేవతలగుఱించి యజ్ఞా యాగములు చేయకనే, పుత్రులను కనకుండగనే సన్యసించుట కోరకూడదు. శాస్త్రములో విధించిన కార్యములను చేయక, చేయకూడదని నిషేధించబడిన కార్యములను చేయుచు, ఇంద్రియ విషయములను అనుభవించుచుండువాడు పతితుడగును - బ్రహ్మజ్ఞానము కలిగినమీదట సన్యసించవలెను - అట్లుకానియడల కర్మ చేయుచు నుండవలెను, అంతే గాని సన్యసించి పతితుడు కాకూడదు - ఎవరికి ఏ నిష్ఠ మంచిదగునో - యే నిష్ఠకు అధికారి యగునో దానినే చేయవలయును - అట్లు చేయనియడల దోషమగును).

  1. “న కర్మణా, న ప్రజయా, ధనేన త్యాగేనైకేన అమృతత్వమాన శుః”. (కైవల్యోపనిషత్ - 12)

(కర్మవలనగాని, పుత్రులద్వారాకాని, ధనమువలనకగాని మోక్షము కలుగదు - సన్యాసము వలననే మోక్షము కలుగును).

  1. త్యజ ధర్మ మధర్మంచ ఉభే సత్యానృతే త్యజ |

ఉభె సత్యానృతే త్యక్త్వా యేన త్యజి తత్త్యజ ||“. (మహాభారతము - శాంతి పర్వము - 329 - 40)

(ధర్మము, అధర్మము, సత్యము, అసత్యము - వీటిని వదలివేయుము - వాటిని విడచితిని యను అహంభావము వదలివేయుము).

  1. “సంసారమేవ నిస్సారం దృష్ట్వా సారవిదృ క్షయా |

ప్రవ్రజంత్యకృతో ద్వాహః పరం వైరాగ్యమాశ్రితాః ||“.

(సంసారము సారములేనిది - మోక్షము కలుగచేయనిది అను విషయము తెలుసుకొని సారమగు మోక్షమును పొందుటకు వివాహము చేసుకొనక బ్రహ్మచర్యాశ్రమములోనుండియే పరమవైరాగ్యము గలవారై సన్యసింతురు).

  1. “యం కర్మ తత్ఫల త్యాగం ప్రాహుః సన్యాసమాగమాః |

ఫలాభిలాష కర్తృత్వాభిమాన త్యాగ యోర్గతః ||.

యోగంతం విద్ధి తత్ప్రాప్తౌ సాధనత్వస్య సామ్యతః ||” (గీతాభావప్రకాశము - 6 - 13, 14)

(కర్మఫలత్యాగము సన్యాసమని శాస్త్రములు చెప్పుచున్నవి. ఫలాభిలాష లేనందున కర్తృత్వాభిమానము కూడ లేదు - అది యోగమని చెప్పబడినది).

  1. ఫలాభికాష సం త్యాగీ విష్ణ్వారాధన తత్పరః |

న సన్యాసీ ఫలత్యాగాత్ యోగీ చిత్త సమాధితః ||“. (గీతాభావప్రకాశము - 6 - 9,10)

(ఫలమందు అభిలాష వదలి విష్ణుని ఆరాధించువాడు సన్యాసి. అతడే చిత్తసమాధానము గలవాడగుటచేత, ఫలమును విడుచువాడగుటచేత యోగియగును).

  1. “నిఃశ్రేయ సకరౌ కర్మసన్యాసౌ శ్రుతి సమ్మతౌ |

మోక్షోపయోగినౌ జ్ఞానోత్పత్తి హేతుతయా హ్యుభౌ ||“. (గీతాభావప్రకాశము - 5 - 36,37)

(కర్మ, సన్యాసము రెండున్నూ నిఃశ్రేయస్కరములు; శ్రుతిలో చెప్పబడినవే. జ్ఞానమును కలిగించుటకు కారణమగుటచేత రెండునూ మోక్షమునకుపయోగించునవే).

  1. “న కర్మణా మనా రంభాత్ నైష్కర్మ్యం పురుషోశ్నుతే |

న చ సన్యసనాదేవ సిద్ధం సమధిగచ్ఛతి ||“.

(కర్మలు చేయుట మానివేసినంతమాత్రమున నైష్కర్మ్యము సిద్ధింపదు. సన్యాసము వలననే సిద్ధిని పొందలేడు).

  1. సన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరా వుభౌ |

తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 2)

(సన్యాసము - కర్మసన్యాసము -, కర్మ యోగము - నిష్కామ కర్మయోగము - ఈ రెండును నిఃశ్రేయస్కరములు. వీటిలో కర్మసన్యాసము కంటె (ఏ పనియును చేయకుండుటకంటె) కర్మయోగము - నిష్కామ కర్మయోగము (కోరికలు లేక కర్మలు చేయుట) మేలు, శ్రేష్టమైనది).

  1. “సన్యాసవిది వాక్యేహి బ్రాహ్మణత్వం వివక్షితం |

సన్యాసా భావ ఏవాస్తి యతః క్షత్రియ వైశ్యయోః |

చత్వా ఆశ్రమా విప్రే, క్షత్రియస్య త్రయః స్మృతాః |

ద్వే వైశ్యస్య స్మృతౌ సిద్ధౌ పురాణే భారతే తథా |

ముఖజానా మయం ధర్మ యద్విష్ణోర్లింగధారణం |

బాహు జా తోరు జాతానాం నాయం ధర్మః ప్రశస్యతే ||“. (గీతాభావప్రకాశము - 3 - 141 to 143)

(సన్యాసము గుఱించి శాస్త్రములో ఈ క్రింద విధముగా చెప్పబడినది - “బ్రాహ్మణాః పుత్రైషణాయాశ్చ, విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ అధి బిక్షాచర్యాం చరంతి” దీనిని బట్టి బ్రాహ్మణులకే సన్యాసము చెప్పబడినది. క్షత్రియులు, వైశ్యులు సన్యసించ కూడదు - బ్రాహ్మణులకు నాలుగు ఆశ్రమములు - బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసము - చెప్పబడినవి. క్షత్రియులకు బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము, వానప్రస్థము చెప్పబడినవి. వైశ్యులకు బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము చెప్పబడినవి. ఈ విషయము స్మృతులలోను భారతములోను చెప్పబడియున్నది. బ్రహ్మముఖమునందు పుట్టినవారికే యీ సన్యాసధర్మము చెప్పబడినది, బ్రహ్మ బాహువులవలన, తొడలవలన పుట్టిన క్షత్రియులకు, వైశ్యులకు సన్యాసధర్మము చెప్పబడియుండలేదు).

  1. సన్యాసోపి యోగాంతర్భూతః.

(సన్యాసము యోగాభ్యాసములోని భాగమే)

  1. “జ్ఞానం సన్యాస లక్షణం”

(జ్ఞానము - భగవత్ జ్ఞానము - భగవంతుని గుఱించి తెలుసుకొనియుండుట - సన్యాసి యొక్క లక్షణము).

Transliteration
  1. parityāgaṃ; karmaṇāṃ parityāgaṃ sanyāsaṃ.

(viḍici peṭṭuṭa; karmalanu viḍicipeṭṭuṭa)

  1. karmaphalatyāgamu

  2. “kāmyānāṃ karmaṇāṃ nyāsaṃ sanyāsaṃ ka vayō viduḥ”. (śrīmadbhagavadgīta - 18 - 2)

(kāmya karmalanu vadalivēyuṭa sanyāsa nyāsamani kavulu ceppuduru)

  1. kāmyānāṃ aśvamēdhādīnāṃ karmaṇāṃ nyāsaṃ, parityāgaṃ sanyāsaṃ” (śrīśaṃkaraḥ)

(kāmyakarmalu - kōrikatō cēyu karmalu - aśvamēdhayāgamu modalagu karmalanu viḍicipeṭṭuṭa) (phalamunu kōri cēyu karmalanu vadalivēyuṭa).

  1. “phalānicchayā akaraṇēna nā kāmyakarmaṇō nyāsaḥ” (śrī ānaṃdatīrthaḥ)

(kāmya karmalanu phalābhilāṣa lēka cēyuṭagāni, cēyuṭa mānivēyuṭagāni sanyāsamu)

  1. “karmaphala saṃkalpa sanyāsāt sanyāsitvaṃ -”.

(karmaphala saṃkalpamunu vadalivēyuṭayē sanyāsamu).

  1. eppuḍu sanyasiṃcavalayunu : -

    1. “yadā manasi vairāgyaṃ jāyatē sarva vastuṣu |

tadaina sanyasēt vidvān anyathā patitō bhavēt ||“.

(anni vastuvulaṃdu vairāgyamu - anurāgamu lēkuṃḍuṭa - eppuḍu kalugunō - appuḍē vidvāṃsuḍainavāḍu sanyasiṃcavalenu. iṃkoka rītiga sanyasiṃcina patituḍagunu.) - (bhraṣṭuḍagunu).

  1. “brahmacaryaṃ samāpya gṛhī bhavēt, gṛhadvanī bhūtvā pravrajēt” iti śrutiḥ -

(brahmacaryāśramamunu pūrti cēsukoni gṛhasthāśramamunu svīkariṃcavalenu - gṛhasthāśramamunu pūrticēsukoni vānaprasthāśramamunu cēpaṭṭavalenu - āpaini sanyasiṃcavalenu - iṭlu oka āśramamu tarvāta niṃkoka āśramamunu cēpaṭṭavalenani śruti ceppucunnadi).

  1. ” - - - yadivā itarathā brahmacaryārēva pravrajēt, gṛhāt, vanādvā” iti śrutiḥ -

(oka āśramamu tarvāta niṃkoka āśramamunu cēpaṭṭakuṃḍa brahmacaryamulōnuṃḍi yainanu, gṛhasthāśramamulō nuṃḍi yainanu, vānaprasthāśramamulō nuṃḍi ayinanu sanyasiṃcavalenu)

  1. “yadi janmāṃtara kṛtaiḥ karmabhiḥ śuddhaṃ cittaṃ tadā brahmacaryādēva sanyasya brahma jijñāsi tavyaṃ; yadi na śuddhamiti rāgēṇa jñāyatē tadā gṛhī bhavēt. tatrāpyaśuddhau vanī bhavēt, tatrāpyaśuddhau tadaiva kāla mākala yēt vanē śuddhau pravrajēt - ya daharēva virajēt tadaharēva pravrajēt”.

(pūrva janmalalō cēsina karmalavalana cittamu śuddhamainayaḍala - cittaśuddhi kaligiyunnayaḍala - brahmacaryāśramamulōnuṃḍaganē sanyasiṃci brahmajñānamu saṃpādiṃpavalenu - kāni citta śuddhi appaṭiki kalugani yaḍala - viṣayamula yaḍala anurāgamuṃḍuṭa baṭṭi telisinayaḍala - appuḍu viṣayavāṃcha tīruṭaku gṛhasthāśramamunu svīkariṃcavalenu. viṣayamulaṃdu anurāgamunnaṃtakālamu sanyasiṃcakūḍadu. gṛhasthāśramamulōnuṃḍaga kūḍa cittamu śuddhamu kālēdani telisinayaḍala appuḍu vanamunaku pōyi vānaprasthāśramamunu svīkariṃcavalenu. ā vānaprasthāśramamulō nuṃḍinanu cittamu śuddhamu kāniyaḍala ā āśramamulōnē kālamu gaḍapavalenu - eppuḍu cittaśuddhi kaligina appuḍu sanyasiṃcavalayunu - ē dinamuna cittamu śuddhi yagunō, rajamu lēkayuṃḍunō ā dinamunanē sanyasiṃpavalayunu -

  1. “ādini brahmacaryamu nanaṃtaramaṃdu gṛhasthadharmamā |

mīda vanapravāsamaṭa mīda yatitvamaṭaṃcu brahma vi |

dyā dharulaṃḍrugāde; tanayā ! vinayammugalāḍa vāgamā |

pāditamaina dharmamu nepammuna sammānariṃpa bāḍiyē” (śrīdēvī bhāgavatamu)

  1. “sadguru samīpē sakala vidyā pariśrama jō bhūtvā vidvān sarvamaihikāmuṣmika sukha śramaṃ jñātvā īṣaṇātraya, vāsanā traya mamatvāhaṃ kārādikaṃ pāṃtānnamiva hēya madhi gamya mōkṣamārgaika sādhanō brahmacaryaṃ samāpya gṛhī bhavēt gṛhadvanībhūtvā pravrajēt yadivā itarathā brahmacaryā dēva; gṛhadvā, vanādvā, adha punarapratīvā, pratīvā, snātakōpōtsavāgnissāgniranagnikōvā yadaharēva virajyēt tadaharēva pravrajēt”. (paramahaṃsa parivrājakōpaniṣat)

(sadguruvu daggara sakala vidyalanu nērcukoni paṃḍituḍainavāḍu ī lōkamulōnu, paralōkamulōnu kalugu sukhaśramamulanu telusukoni īṣaṇatrayamunu - (dārēṣaṇa, dhanēṣaṇa, putrēṣaṇa) - vāsanā trayamunu, mamatvamu (idi nādi yanukonuṭa), ahaṃkāramu modalaguvāṭini vāṃti cēsukonina annamu vale, hēyamaguvāṭini vadali, mōkṣamārgamunaku okē sādhanamaina brahmacaryamu pūrticēsukoni gṛhasthuḍu kāvalenu - (gṛhasthāśramamunu svīkariṃcavalenu). gṛhasthāśramamunuṃḍi vānaprasthāśramamunu svīkariṃcavalenu - appudu sanyasiṃcavalenu, lēkunna brahmacaryamunuṃḍiyē sanyasiṃcavaccunu, gṛhasthāśramamunuṃḍi sanyasiṃca vaccunu - lēka vānaprasthāśramamunuṃḍi sanyasiṃcavaccunu. ē dinamuna śuddha cittuḍagunō ā rōjunē sanyasiṃcavaccunu)

  1. catvāriṃśat saṃskāra saṃpannassarvatō virakta citta śuddhi mētya āśāsū yē rṣyāhaṃkāraṃ dagdhva sādhana catuṣṭaya saṃpannaḥ ēva sanyastu marhati, adhaḥ ṣaṃḍaḥ patitō aṃgavikalaḥ straiṇō pādhi rōrbhakō, mūkaḥ pāṣaṃḍaścakrī, liṃgī, kuṣṭī vaikhānasa haradvijābhṛta kādhyāpaka śipi viṣṭō, anagnikō, nāstikō, vairāgya rahitō apyētē sanyāsā narhāḥ. sanyastā yadyapi mahā vākyōpadēśē nādhikāriṇaḥ |“. (sanyāsōpaniṣat)

(iruvadinālugu saṃskāramulu poṃdinavāḍu anniṃṭiyaṃdunu viraktini poṃdi, cittaśuddhini poṃdi, āśa,asūya, īrṣa, ahaṃkāramu, anuvāṭini dahiṃcukoni, sādhana catuṣṭaya saṃpannuḍu ayinavāḍē sanyasiṃcavalenu - ṣaṃḍuḍu, patituḍu, aṃgavaikalyamukalavāḍu, straiṇuḍu, ceviṭivāḍu, arbhakuḍu, mūgavāḍu, pāṣāṃḍuḍu, cakrī, liṃgi, kuṣṭuvyādhigalavāḍu, nāstikuḍu, vairāgyamu lēnivāḍu, - vīru sanyāsamuna karhulukāru. aṭṭivāru sanyasiṃcinanu mahāvākyōpadēśamunaku arhulu kāru).

  1. “sakalāṃgā nāmēva kathaṃ citkarmaṇyadhikṛtānāṃ sanyāsō yuktaḥ - vikalāṃgānāṃ aṃdhā dīnāṃ na jñānapradānē sanyāsē adhikāraḥ-”.

(anni avayavamulu kalavāḍu, karmalaṃdu adhikāramu kalavāḍē sanyāsamunaku taginavāḍu. vikalāṃgulu, guḍḍuvāru, jñānōpadēśamunaku sanyāsamunaku adhikārulu kāru).

  1. viraktaḥ pravrajēta dhīmānsaraktastu gṛhē vasēt |

sarāgō narakaṃ yāti pravrajanhidvijādhamaḥ |

yathā manasi saṃjātaṃ vaitṛṣṇyaṃ sarva vastuṣu |

tadā sanyāsamicchaṃti patitassyādviparyayē |

pravṛtti lakṣaṇaṃ karma jñānaṃ sanyā sanyāsa lakṣaṇaṃ |

tasmāt jñānaṃ puraskṛtya sanyasēdiha buddhimān |

yadātu vidutuṃ tatvaṃ paraṃbrahma sanātanaṃ |

tadaika daṃḍaṃ saṃgṛhya sōpanītāṃ śikhāṃ tyajēt. |

ahamēva parabrahma vāsudēvākhama vyayaṃ |

iti bōdhō dṛḍhō yasya tathā bhavati bhaikṣubhuk |

” - - - “prāṇē gatē yathā dēha sukhaṃ duḥkhaṃ naviṃdati |

tathā cētprāṇa yuktōpi sa kaivalyāśramē vasēt |

anadhī tvākhilān vēdān aniṣṭvaivā khilān surān |

anu tpādya sutān viprō na sanyāsitu micchati |

akurva nvihitaṃ karma niṃditaṃ ca samācaran |

pracaranniṃdriyārthēṣu naraḥ patana mṛcchati |

jñātvā naiṣkarmya mācārēt sa śikhaṃ vapanaṃ kṛtvā bahissūtraṃ tyajēdbhudhaḥ |

- - - ” tēhasma pratraiṣaṇāṃ yāśca vittaiṣaṇāyāśca lōkaiṣaṇāyāśca vyatthā yādha bhikṣācaraṃ caraṃti

- - - paraṃ brahmatu vijñāya pravrajēdbrāhmaṇōttamaḥ |

anyathā karma kurvīta na pramādyēta karhicit |

svē svē adhikārē yāniṣṭhā saguṇaḥ parikīrtitaḥ |

viparītastu dōṣasyāt ubhayō rēṣa niścayaḥ ||”

(dēniyaṃdunu anurāgamu lēka dhīmaṃtuḍainavāḍu sanyasiṃcavalenu - anurāgamu vadalukōlēnivāḍu gṛhamaṃdē uṃḍavalenu - gṛhasthāśramamaṃdē uṃḍavalenu - viṣayamulaṃdanurāgamugala brāhmaṇādhamuḍu sanyasiṃcinayaḍala narakamunu poṃdunu - samasta vastuvulaṃdu eppuḍu tṛṣṇa lēkuṃḍunō appuḍu sanyasiṃcavalenu. aṭlugāka, dīniki vīparītamugā sanyasiṃcina - viṣayamulaṃdanurāgamuṃḍaganē sanyasiṃcinayaḍala - patituḍagunu. parma ptravṛtti lakṣaṇamu - jñānamu sanyāsa lakṣaṇamu - aṃducēta buddhimaṃtuḍainavāḍu jñānamu (brahmajñānamu) muṃdu saṃpādiṃci aṭu tarvāta sanyasiṃcavalenu - eppuḍu sanātanamaina parabrahma tatvamunu telusukonunō appuḍu oka daṃḍamunu grahiṃci upanayanamappaṭi śikhanu - viḍici peṭṭavalenu - avyayuḍu, vāsudēvuḍu anu pērlugala parabrahma nēnē anu bhāvamu gaṭṭigā eppuḍu kalugunō appuḍu sanyāsi yagunu - prāṇamu pōyina tarvāta dēhamulō sukhamu duḥkhamu uṃḍanaṭlē prāṇamunnanu ā sanyāsāśramamulō nuṃḍavalenu - vēdamulanniṃṭini adhyayanamu cēyanidē, dēvatalaguṟiṃci yajñā yāgamulu cēyakanē, putrulanu kanakuṃḍaganē sanyasiṃcuṭa kōrakūḍadu. śāstramulō vidhiṃcina kāryamulanu cēyaka, cēyakūḍadani niṣēdhiṃcabaḍina kāryamulanu cēyucu, iṃdriya viṣayamulanu anubhaviṃcucuṃḍuvāḍu patituḍagunu - brahmajñānamu kaliginamīdaṭa sanyasiṃcavalenu - aṭlukāniyaḍala karma cēyucu nuṃḍavalenu, aṃtē gāni sanyasiṃci patituḍu kākūḍadu - evariki ē niṣṭha maṃcidagunō - yē niṣṭhaku adhikāri yagunō dāninē cēyavalayunu - aṭlu cēyaniyaḍala dōṣamagunu).

  1. “na karmaṇā, na prajayā, dhanēna tyāgēnaikēna amṛtatvamāna śuḥ”. (kaivalyōpaniṣat - 12)

(karmavalanagāni, putruladvārākāni, dhanamuvalanakagāni mōkṣamu kalugadu - sanyāsamu valananē mōkṣamu kalugunu).

  1. tyaja dharma madharmaṃca ubhē satyānṛtē tyaja |

ubhe satyānṛtē tyaktvā yēna tyaji tattyaja ||“. (mahābhāratamu - śāṃti parvamu - 329 - 40)

(dharmamu, adharmamu, satyamu, asatyamu - vīṭini vadalivēyumu - vāṭini viḍacitini yanu ahaṃbhāvamu vadalivēyumu).

  1. “saṃsāramēva nissāraṃ dṛṣṭvā sāravidṛ kṣayā |

pravrajaṃtyakṛtō dvāhaḥ paraṃ vairāgyamāśritāḥ ||“.

(saṃsāramu sāramulēnidi - mōkṣamu kalugacēyanidi anu viṣayamu telusukoni sāramagu mōkṣamunu poṃduṭaku vivāhamu cēsukonaka brahmacaryāśramamulōnuṃḍiyē paramavairāgyamu galavārai sanyasiṃturu).

  1. “yaṃ karma tatphala tyāgaṃ prāhuḥ sanyāsamāgamāḥ |

phalābhilāṣa kartṛtvābhimāna tyāga yōrgataḥ ||.

yōgaṃtaṃ viddhi tatprāptau sādhanatvasya sāmyataḥ ||” (gītābhāvaprakāśamu - 6 - 13, 14)

(karmaphalatyāgamu sanyāsamani śāstramulu ceppucunnavi. phalābhilāṣa lēnaṃduna kartṛtvābhimānamu kūḍa lēdu - adi yōgamani ceppabaḍinadi).

  1. phalābhikāṣa saṃ tyāgī viṣṇvārādhana tatparaḥ |

na sanyāsī phalatyāgāt yōgī citta samādhitaḥ ||“. (gītābhāvaprakāśamu - 6 - 9,10)

(phalamaṃdu abhilāṣa vadali viṣṇuni ārādhiṃcuvāḍu sanyāsi. ataḍē cittasamādhānamu galavāḍaguṭacēta, phalamunu viḍucuvāḍaguṭacēta yōgiyagunu).

  1. “niḥśrēya sakarau karmasanyāsau śruti sammatau |

mōkṣōpayōginau jñānōtpatti hētutayā hyubhau ||“. (gītābhāvaprakāśamu - 5 - 36,37)

(karma, sanyāsamu reṃḍunnū niḥśrēyaskaramulu; śrutilō ceppabaḍinavē. jñānamunu kaligiṃcuṭaku kāraṇamaguṭacēta reṃḍunū mōkṣamunakupayōgiṃcunavē).

  1. “na karmaṇā manā raṃbhāt naiṣkarmyaṃ puruṣōśnutē |

na ca sanyasanādēva siddhaṃ samadhigacchati ||“.

(karmalu cēyuṭa mānivēsinaṃtamātramuna naiṣkarmyamu siddhiṃpadu. sanyāsamu valananē siddhini poṃdalēḍu).

  1. sanyāsaḥ karmayōgaśca niḥśrēyasakarā vubhau |

tayōstu karma sanyāsāt karmayōgō viśiṣyatē ||“. (śrīmadbhagavadgīta - 5 - 2)

(sanyāsamu - karmasanyāsamu -, karma yōgamu - niṣkāma karmayōgamu - ī reṃḍunu niḥśrēyaskaramulu. vīṭilō karmasanyāsamu kaṃṭe (ē paniyunu cēyakuṃḍuṭakaṃṭe) karmayōgamu - niṣkāma karmayōgamu (kōrikalu lēka karmalu cēyuṭa) mēlu, śrēṣṭamainadi).

  1. “sanyāsavidi vākyēhi brāhmaṇatvaṃ vivakṣitaṃ |

sanyāsā bhāva ēvāsti yataḥ kṣatriya vaiśyayōḥ |

catvā āśramā viprē, kṣatriyasya trayaḥ smṛtāḥ |

dvē vaiśyasya smṛtau siddhau purāṇē bhāratē tathā |

mukhajānā mayaṃ dharma yadviṣṇōrliṃgadhāraṇaṃ |

bāhu jā tōru jātānāṃ nāyaṃ dharmaḥ praśasyatē ||“. (gītābhāvaprakāśamu - 3 - 141 to 143)

(sanyāsamu guṟiṃci śāstramulō ī kriṃda vidhamugā ceppabaḍinadi - “brāhmaṇāḥ putraiṣaṇāyāśca, vittaiṣaṇāyāśca lōkaiṣaṇāyāśca vyutthāya adhi bikṣācaryāṃ caraṃti” dīnini baṭṭi brāhmaṇulakē sanyāsamu ceppabaḍinadi. kṣatriyulu, vaiśyulu sanyasiṃca kūḍadu - brāhmaṇulaku nālugu āśramamulu - brahmacaryamu, gṛhasthāśramamu, vānaprasthāśramamu, sanyāsamu - ceppabaḍinavi. kṣatriyulaku brahmacaryamu gṛhasthāśramamu, vānaprasthamu ceppabaḍinavi. vaiśyulaku brahmacaryamu, gṛhasthāśramamu ceppabaḍinavi. ī viṣayamu smṛtulalōnu bhāratamulōnu ceppabaḍiyunnadi. brahmamukhamunaṃdu puṭṭinavārikē yī sanyāsadharmamu ceppabaḍinadi, brahma bāhuvulavalana, toḍalavalana puṭṭina kṣatriyulaku, vaiśyulaku sanyāsadharmamu ceppabaḍiyuṃḍalēdu).

  1. sanyāsōpi yōgāṃtarbhūtaḥ.

(sanyāsamu yōgābhyāsamulōni bhāgamē)

  1. “jñānaṃ sanyāsa lakṣaṇaṃ”

(jñānamu - bhagavat jñānamu - bhagavaṃtuni guṟiṃci telusukoniyuṃḍuṭa - sanyāsi yokka lakṣaṇamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.