“వ. వానప్రస్థాశ్రమంబు జరపి, సన్యసించి, దేహమాత్రావశిష్టుండును, నిరపేక్షుండును, నిరాశ్రయుండును, అత్మారాముండును, సర్వభూతసముండును, శాంతుండును, నారాయణ పరాయణుండును, సమచిత్తుండును, కౌపీనంబునకు ఆచ్ఛాదిక మాత్రంబైన వస్త్రంబు ధరియించి దండాది వ్యతిరిక్తంబులు విసర్జించి, ఆత్మపరంబులుగాని శాస్త్రంబులు వర్జించి, గ్రహ నక్షత్రాది విద్యల జీవింపక, భేదవాదంబులయిన తర్కంబులు తర్కింపక, యెందును పక్షీపరింపక, శిష్యులకు గ్రంధంబులు వచించి, యుపన్యసింపక, బహు విద్యల జీవింపక, మిత్తాది వ్యాపారంబులను నుల్లసిల్లక, పెక్కు దినంబులొక్క యెడ వసియింపక, యూరూర నొక్కొక్క రాత్రి నిలుచుచు, గార్య కారణ వ్యతిరిక్తంబయిన పరమాత్మయందు విశ్వంబు దర్శించుచు, సదసన్మయంబైన విశ్వంబునందు పరబ్రహ్మంబయిన యాత్మ నవలోకించుచు, జాగరణ స్వప్న సంధి సమయంబుల నాత్మ నిరీక్షణంబు చేయుచు, ఆత్మకు బంధ మోక్షంబులు మయామాత్రంబులుగాని, వస్తు ప్రకారంబున లేనివనియును, దేహంబునకు జీవితంబు ధ్రువంబుకాదనియును, మృత్యువు ధ్రువంబనియును నెఱుంగుచు భూతదేహంబు సంభవ నాశంబులకు మూలంబయిన కాలంబు ప్రతీక్షించుచు, ఇవ్విధంబున జ్ఞానోత్పత్తి పర్యంతంబు చరియించి యటమీద విజ్ఞానవిశేషంబు సంభవించిన పరమహంసుడై దండాది చిహ్నంబులు ధరించి యొండె, ధరింపకయొండె, బహిరంగ వ్యక్త చిహ్నుండుగాక, యంతరంగవ్యక్తంబయిన ఆత్మానుసంధానంబు గలిగి మనీషియై, బాహ్యాను సంధానాభావంబున మనుష్యులకు తలవలన నున్మత్త బాల మూకుల తెఱంగు చూపుచుండవలయును”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 12 - 428)
“va. vānaprasthāśramaṃbu jarapi, sanyasiṃci, dēhamātrāvaśiṣṭuṃḍunu, nirapēkṣuṃḍunu, nirāśrayuṃḍunu, atmārāmuṃḍunu, sarvabhūtasamuṃḍunu, śāṃtuṃḍunu, nārāyaṇa parāyaṇuṃḍunu, samacittuṃḍunu, kaupīnaṃbunaku ācchādika mātraṃbaina vastraṃbu dhariyiṃci daṃḍādi vyatiriktaṃbulu visarjiṃci, ātmaparaṃbulugāni śāstraṃbulu varjiṃci, graha nakṣatrādi vidyala jīviṃpaka, bhēdavādaṃbulayina tarkaṃbulu tarkiṃpaka, yeṃdunu pakṣīpariṃpaka, śiṣyulaku graṃdhaṃbulu vaciṃci, yupanyasiṃpaka, bahu vidyala jīviṃpaka, mittādi vyāpāraṃbulanu nullasillaka, pekku dinaṃbulokka yeḍa vasiyiṃpaka, yūrūra nokkokka rātri nilucucu, gārya kāraṇa vyatiriktaṃbayina paramātmayaṃdu viśvaṃbu darśiṃcucu, sadasanmayaṃbaina viśvaṃbunaṃdu parabrahmaṃbayina yātma navalōkiṃcucu, jāgaraṇa svapna saṃdhi samayaṃbula nātma nirīkṣaṇaṃbu cēyucu, ātmaku baṃdha mōkṣaṃbulu mayāmātraṃbulugāni, vastu prakāraṃbuna lēnivaniyunu, dēhaṃbunaku jīvitaṃbu dhruvaṃbukādaniyunu, mṛtyuvu dhruvaṃbaniyunu neṟuṃgucu bhūtadēhaṃbu saṃbhava nāśaṃbulaku mūlaṃbayina kālaṃbu pratīkṣiṃcucu, ivvidhaṃbuna jñānōtpatti paryaṃtaṃbu cariyiṃci yaṭamīda vijñānaviśēṣaṃbu saṃbhaviṃcina paramahaṃsuḍai daṃḍādi cihnaṃbulu dhariṃci yoṃḍe, dhariṃpakayoṃḍe, bahiraṃga vyakta cihnuṃḍugāka, yaṃtaraṃgavyaktaṃbayina ātmānusaṃdhānaṃbu galigi manīṣiyai, bāhyānu saṃdhānābhāvaṃbuna manuṣyulaku talavalana nunmatta bāla mūkula teṟaṃgu cūpucuṃḍavalayunu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 12 - 428)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.