← Back to స · Booklets 51–60 (digitized file 6)

సన్యాసి sanyāsi

Original — తెలుగు
  1. సన్యాస విద్యా నిష్ఠః -

(సన్యాస విద్యలో నిష్ఠకలవాడు)

  1. సన్యాసాశ్రమములో నుండువాడు.

  2. శ్లో||. కుటీచకో బహుదకో హంసశ్చైవ తృతీయ కః |

చతుర్ధః పరహంసః యోయః పశ్యాత్ న ఉత్తమః ||“.

(సన్యాసులు నాలుగు విధములు - కుటీచకుడు, బహూదకుడు, హంసుడు, పరమహంసుడు - వీరిలో ఒకరికంటె తర్వాత చెప్పబడినవాడు ఉత్తముడు).

  1. సన్యాసులు నాలుగు విధములు - “వైరాగ్య సన్యాసి, జ్ఞాన సన్యాసీ, జ్ఞాన వైరాగ్య సన్యాసీ, కర్మ సన్యాసీచ ఇతి చతుర్విధా”.

(సన్యాసోపనిషత్)

(వైరాగ్య సన్యాసి, కర్మ సన్యాసి, జ్ఞాన వైరాగ్య సన్యాసి, కర్మ సన్యాసి అని సన్యాసులు నాలుగు విధములు).

  1. అధ భిక్షూణాం మోక్షార్థినాం కుటీచక, బహూదక, హంస, పరమహంస శ్చేతి చత్వారః ” (భిక్షుకోపనిషత్)

  2. సన్యాసులు ఆరు విధములు –

“సన్యాసః షడ్విధో భవతి, కుటీచక, బహూదక, హంస, పరమహంస, తురీయాతీత, అవధూత ఇతి”. (సన్యాసోపనిషత్)

(కుటీచకుడు, బహూదకూ, హంసుడు, పరమహంసుడు, తురీయాతీతుడు, అవధూత అని సన్యాసులు ఆరి విధములు).

  1. అధ భిక్షూణాం మోక్షార్థినాం కుటీచక, బహూదక, హంస, పరమహంస శ్చేతి చత్వారః - కుటీచకోనామ గౌతమ, భరద్వాజ, యాజ్ఞ్యవల్క్య, వసిష్ట ప్రభృతయః (అ)ష్టౌ గ్రాసాం శ్చరంతో యోగమార్గే మోక్షమేవ ప్రార్థయంతే. అధ బహూదికానాం త్రిదండ, కమండల శిఖా యజ్ఞోపవీత కాషాయ వస్త్రధారిణో, బ్రహ్మర్షి గృహే మధుమాంసం వర్జయిత్వా, అష్టౌగ్రాసాం బైక్షాచరణం కృత్వా యోగమార్గే మోక్షమేవ ప్రార్థయంతే. అధ హంసానామ గ్రామైక రాత్రం నగరే పంచరాత్రం క్షేత్రే సప్తరాత్రం, తదుపరి నివసేత్. గో మూత్ర గోమయో వారిణో నిత్యం చాంద్రాయణ పరాయణాః యోగ మార్గే మోక్షమేవ ప్రార్థయంతే. అధ పరమహంసోనామ సం వర్తకారుణి, శ్వేతకేతు జడభరిత దత్తాత్రేయ, శుక, వామదేవ, హరీతక ప్రభృతయో (అ)ష్టౌ గ్రాసాన్ చరంతో యోగమార్గే మోక్షమేవ ప్రార్థయంతే- వృక్షమూలే శూన్యగృహే స్మశాన వాసినో నాసాంబరావాది గం చరావా న తేషాం ధర్మా ధర్మే. లాభా లాభే, శుద్ధా శుద్ధే. ద్వైత వర్జితాః,సమలోష్టాశ్మకాం చినాః. సర్వ వర్ణేషు చైక్షాచరణం కృత్వా సర్వత్రాత్మైవేతి పశ్యంతి. అధ జాత రూపధరాః నిర్ద్వంద్వా నిష్పరిగ్రహా శ్శుక్ల ధ్యాన పరాయణాః, ఆత్మ నిష్ఠాః ప్రాణ సంధారణార్థం యధోక్తకాలే భైక్షమాచరంతః, శూన్యాగార, దేవ గృహ తృణ కూట వల్మీక వృక్షమూల కులాల కాలాగ్నిహోత్ర శాలానదీ, పులిన గిరి కందర కుహర కోటర నీర్ఘా దస్థండిరే తత్ర బ్రహ్మమార్గే సమ్యక్సంపన్నా, శుద్ధమానసాః పరమహంసా చరణేన సన్యాసేన దేహత్యాగం కుర్వంతి. తే పరమహంసా నామ - ఇత్యుపనిషత్ “.

(మోక్షము కోరు సన్యాసులు నాలుగు విధములు - కుటీచక, బహూదక, హంస, పరమహంసలు - కుటీచకుడు అనగా గౌతముడు, భరద్వాజుడు, యాజ్ఞవల్క్యుడు, వసిష్టుడు మొదలగువారు - యోగమార్గమందుండి మోక్షమునే కోరువారు - బహూదకులు అనగా - త్రిదండము, కమండలము, శిఖ, యజ్ఞోపవీతము, కషాయవస్త్రము ధరించువారు, బ్రహ్మ ఋషి గృహమందు కల్లు మాంసము, విడిచిపెట్టి, ఎనిమిది ముద్దలు భిక్ష చేసి యోగమార్గమందుండి మోక్షము కోరువారు - హంసులు అనగా - గ్రామమందు ఒకరాత్రి, నగరమందు అయిదు రాత్రులు, క్షేత్ర స్థలమందు ఏడు రాత్రులు ఉండవలెను. గోమూత్రముతోను, గోమయముతోను నీరుతోను చాంద్రాయణవ్రతము చేసి యోగమార్గమందు మోక్షము నన్వేషించువారు - పరమహంసలనగా సం వర్తకుడు, అరణి, శ్వేతకేతు, జడభరతుడు, దత్తాత్రేయుడు, శుకుడు, వామదేవుడు, హరతకుడు మొదలగువారు. యోగమార్గమందు నిష్ఠకలిగియుండు, మోక్షమునే కోరువారు. చెట్టు మొదలనో, శూన్యగృహమందో, లేక, స్మశానమందో నివసించుచు, బట్ట కట్టి అయినను, కట్టక అయినను ఉందురు. వారికి ధర్మము అధర్మము, లాభనష్టములు శుద్ధము, అశుద్ధము, ద్వైతము లేనివారై మట్టి, ఱాయి, బగారమును ఒకే రీతిగా చూచువారు - అన్ని వర్ణములవారినుండి భిక్ష తీసుకొనుచు, అంతటను ఆత్మనే చూచువారు. శీతోష్ణములు మొదలగు ద్వంద్వములు లేనివారు - ఎవరినుండియు దేనినైనను పుచ్చుకొననివారు - ఆత్మయందే నిష్ఠగలవారు. ప్రాణము నిలుపుకొనుటకు మాత్రమే, శాస్త్రములో చెప్ప బడిన కాలమునందే భిక్ష కొఱకు తిరుగుచు, నిర్జన గృహమందుకాని, దేవతా గృహమందుకాని, గడ్డిలో కాని, పుట్టదగ్గరకాని, చెట్టు మొదలనుగాని, కుమ్మరిశాలలోగాని, అగ్నిహోత్రశాలలోగాని, ఏటి ఇసుకతిన్నె మీదకాని, కొండగుహలోకాని, ఉండి, బ్రహ్మమార్గమందుండి మనశ్శుద్ధికలవారై పరమహంసలగు సన్యాసులు దేహమును విడుచుదురు - ఇట్టివారు పరమ హంసలు)

  1. “సర్వధర్మాన్ పరిత్యజ్య నిర్మమో, నిరహంకారో భూత్వా బ్రహ్మేష్టం శరణముప గమ్య తత్వమసి,అహం బ్రహ్మస్మి, సర్వం ఖిల్విదం బ్రహ్మ, నేహనానాస్తి కించన ఇత్యాది మహావాక్యార్థాను భవ జ్ఞానాత్ బ్రహ్మైవాహమస్తి ఇతి నిశ్చిత్య నిర్వికల్పక సమాధినా స్వతంత్రో యతిశ్చరతి. స సన్యాసీ, స ముక్తః, స పూజ్యః, స యోగీ, సరమి హంసః, సోర అవధూతః, స బ్రాహ్మణః ఇతి” (నిరాలంబోధనిషత్)

(ధర్మములన్నింటిని విడిచిపెట్టి, ‘నాది’ అను మమకారమును, ‘నేను’ అను అహంకారమును విడిచి, బ్రహ్మమును మాత్రము శరణుపొంది “తత్వ మసి” (నీవు బ్రహ్మవు), “సర్వం ఖిల్విదం బ్రహ్మ” (ఇది అంతయు బ్రహ్మ మాత్రమే కదా), “నేహనానాస్తికించన” (పూర్ణుడగు బ్రహ్మమునందు భిన్నత్వం ఇంచుకయును లేదు), ఇత్యాది మహా వాక్యముల అనుభవమే రూపముగా గల జ్ఞానము వలన “అహం బ్రహ్మస్మి” (నేను బ్రహ్మనే అయితిని) అను నిశ్చయమునొంది నిర్వికల్పమగు సమాధి (యోగము) చేతనే యతి స్వతంత్రుడై సంచరించుచుండునో ఆ యతియే సన్యాసి, అతనే ముక్తినొందిన వాడు, అతనే పరమహంస, అతనే అవధూత, అతనే బ్రాహ్మణుడు).

  1. “అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతియః |

స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్ని చా క్రియః ||”

యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ |

న హ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన ||“. శ్రీమద్భగవద్గీత - 6 - 1, 2)

“ఫలాభి సంధి శూన్యస్సన్నిత్యం కర్మకరోతి యః |

శ్రౌతం స్మార్తం న సన్యాస యోగయోః ఫలమశ్నుతే ||

నిరగ్నిర క్రియా యస్తు సన్యాసః తుర్య ఆశ్రమః || “.

(ఫలమునాసించక ఎవడు చేయవలసిన కార్యము చేయునో వాడె సన్యాసి, వాడె యోగి, అట్టివాడు అగ్నిహోత్రము లేనివాడైనను, కర్మ చేయనివాడు కాకపోయినను సన్యాసియే, యోగియే. సన్యాసమని యేది చెప్పబడినదో అది యోగము. సన్యసించు సంకల్పము లేనివాడు ఎవడునూ యోగి కాలేడు. ఫలమును కోరక శ్రౌత కర్మ, స్మార్త కర్మ అను నిత్యకర్మలు ఎవడు చేయునో అటివాడు సన్యాసము యొక్క ఫలమును యోగము యొక్క ఫలమును పొందును. అట్టివాడు అగ్నిహోత్రములేక కర్మలు చేయనివాడైనచో అతడు తురీయాశ్రమమునకు చెందినవాడగును)

  1. “ఆ. - - - సన్యాసికి తరుణి తోడి పొత్తు తగదు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 463)

Transliteration
  1. sanyāsa vidyā niṣṭhaḥ -

(sanyāsa vidyalō niṣṭhakalavāḍu)

  1. sanyāsāśramamulō nuṃḍuvāḍu.

  2. ślō||. kuṭīcakō bahudakō haṃsaścaiva tṛtīya kaḥ |

caturdhaḥ parahaṃsaḥ yōyaḥ paśyāt na uttamaḥ ||“.

(sanyāsulu nālugu vidhamulu - kuṭīcakuḍu, bahūdakuḍu, haṃsuḍu, paramahaṃsuḍu - vīrilō okarikaṃṭe tarvāta ceppabaḍinavāḍu uttamuḍu).

  1. sanyāsulu nālugu vidhamulu - “vairāgya sanyāsi, jñāna sanyāsī, jñāna vairāgya sanyāsī, karma sanyāsīca iti caturvidhā”.

(sanyāsōpaniṣat)

(vairāgya sanyāsi, karma sanyāsi, jñāna vairāgya sanyāsi, karma sanyāsi ani sanyāsulu nālugu vidhamulu).

  1. adha bhikṣūṇāṃ mōkṣārthināṃ kuṭīcaka, bahūdaka, haṃsa, paramahaṃsa ścēti catvāraḥ ” (bhikṣukōpaniṣat)

  2. sanyāsulu āru vidhamulu –

“sanyāsaḥ ṣaḍvidhō bhavati, kuṭīcaka, bahūdaka, haṃsa, paramahaṃsa, turīyātīta, avadhūta iti”. (sanyāsōpaniṣat)

(kuṭīcakuḍu, bahūdakū, haṃsuḍu, paramahaṃsuḍu, turīyātītuḍu, avadhūta ani sanyāsulu āri vidhamulu).

  1. adha bhikṣūṇāṃ mōkṣārthināṃ kuṭīcaka, bahūdaka, haṃsa, paramahaṃsa ścēti catvāraḥ - kuṭīcakōnāma gautama, bharadvāja, yājñyavalkya, vasiṣṭa prabhṛtayaḥ (a)ṣṭau grāsāṃ ścaraṃtō yōgamārgē mōkṣamēva prārthayaṃtē. adha bahūdikānāṃ tridaṃḍa, kamaṃḍala śikhā yajñōpavīta kāṣāya vastradhāriṇō, brahmarṣi gṛhē madhumāṃsaṃ varjayitvā, aṣṭaugrāsāṃ baikṣācaraṇaṃ kṛtvā yōgamārgē mōkṣamēva prārthayaṃtē. adha haṃsānāma grāmaika rātraṃ nagarē paṃcarātraṃ kṣētrē saptarātraṃ, tadupari nivasēt. gō mūtra gōmayō vāriṇō nityaṃ cāṃdrāyaṇa parāyaṇāḥ yōga mārgē mōkṣamēva prārthayaṃtē. adha paramahaṃsōnāma saṃ vartakāruṇi, śvētakētu jaḍabharita dattātrēya, śuka, vāmadēva, harītaka prabhṛtayō (a)ṣṭau grāsān caraṃtō yōgamārgē mōkṣamēva prārthayaṃtē- vṛkṣamūlē śūnyagṛhē smaśāna vāsinō nāsāṃbarāvādi gaṃ carāvā na tēṣāṃ dharmā dharmē. lābhā lābhē, śuddhā śuddhē. dvaita varjitāḥ,samalōṣṭāśmakāṃ cināḥ. sarva varṇēṣu caikṣācaraṇaṃ kṛtvā sarvatrātmaivēti paśyaṃti. adha jāta rūpadharāḥ nirdvaṃdvā niṣparigrahā śśukla dhyāna parāyaṇāḥ, ātma niṣṭhāḥ prāṇa saṃdhāraṇārthaṃ yadhōktakālē bhaikṣamācaraṃtaḥ, śūnyāgāra, dēva gṛha tṛṇa kūṭa valmīka vṛkṣamūla kulāla kālāgnihōtra śālānadī, pulina giri kaṃdara kuhara kōṭara nīrghā dasthaṃḍirē tatra brahmamārgē samyaksaṃpannā, śuddhamānasāḥ paramahaṃsā caraṇēna sanyāsēna dēhatyāgaṃ kurvaṃti. tē paramahaṃsā nāma - ityupaniṣat “.

(mōkṣamu kōru sanyāsulu nālugu vidhamulu - kuṭīcaka, bahūdaka, haṃsa, paramahaṃsalu - kuṭīcakuḍu anagā gautamuḍu, bharadvājuḍu, yājñavalkyuḍu, vasiṣṭuḍu modalaguvāru - yōgamārgamaṃduṃḍi mōkṣamunē kōruvāru - bahūdakulu anagā - tridaṃḍamu, kamaṃḍalamu, śikha, yajñōpavītamu, kaṣāyavastramu dhariṃcuvāru, brahma ṛṣi gṛhamaṃdu kallu māṃsamu, viḍicipeṭṭi, enimidi muddalu bhikṣa cēsi yōgamārgamaṃduṃḍi mōkṣamu kōruvāru - haṃsulu anagā - grāmamaṃdu okarātri, nagaramaṃdu ayidu rātrulu, kṣētra sthalamaṃdu ēḍu rātrulu uṃḍavalenu. gōmūtramutōnu, gōmayamutōnu nīrutōnu cāṃdrāyaṇavratamu cēsi yōgamārgamaṃdu mōkṣamu nanvēṣiṃcuvāru - paramahaṃsalanagā saṃ vartakuḍu, araṇi, śvētakētu, jaḍabharatuḍu, dattātrēyuḍu, śukuḍu, vāmadēvuḍu, haratakuḍu modalaguvāru. yōgamārgamaṃdu niṣṭhakaligiyuṃḍu, mōkṣamunē kōruvāru. ceṭṭu modalanō, śūnyagṛhamaṃdō, lēka, smaśānamaṃdō nivasiṃcucu, baṭṭa kaṭṭi ayinanu, kaṭṭaka ayinanu uṃduru. vāriki dharmamu adharmamu, lābhanaṣṭamulu śuddhamu, aśuddhamu, dvaitamu lēnivārai maṭṭi, ṟāyi, bagāramunu okē rītigā cūcuvāru - anni varṇamulavārinuṃḍi bhikṣa tīsukonucu, aṃtaṭanu ātmanē cūcuvāru. śītōṣṇamulu modalagu dvaṃdvamulu lēnivāru - evarinuṃḍiyu dēninainanu puccukonanivāru - ātmayaṃdē niṣṭhagalavāru. prāṇamu nilupukonuṭaku mātramē, śāstramulō ceppa baḍina kālamunaṃdē bhikṣa koṟaku tirugucu, nirjana gṛhamaṃdukāni, dēvatā gṛhamaṃdukāni, gaḍḍilō kāni, puṭṭadaggarakāni, ceṭṭu modalanugāni, kummariśālalōgāni, agnihōtraśālalōgāni, ēṭi isukatinne mīdakāni, koṃḍaguhalōkāni, uṃḍi, brahmamārgamaṃduṃḍi manaśśuddhikalavārai paramahaṃsalagu sanyāsulu dēhamunu viḍucuduru - iṭṭivāru parama haṃsalu)

  1. “sarvadharmān parityajya nirmamō, nirahaṃkārō bhūtvā brahmēṣṭaṃ śaraṇamupa gamya tatvamasi,ahaṃ brahmasmi, sarvaṃ khilvidaṃ brahma, nēhanānāsti kiṃcana ityādi mahāvākyārthānu bhava jñānāt brahmaivāhamasti iti niścitya nirvikalpaka samādhinā svataṃtrō yatiścarati. sa sanyāsī, sa muktaḥ, sa pūjyaḥ, sa yōgī, sarami haṃsaḥ, sōra avadhūtaḥ, sa brāhmaṇaḥ iti” (nirālaṃbōdhaniṣat)

(dharmamulanniṃṭini viḍicipeṭṭi, ‘nādi’ anu mamakāramunu, ‘nēnu’ anu ahaṃkāramunu viḍici, brahmamunu mātramu śaraṇupoṃdi “tatva masi” (nīvu brahmavu), “sarvaṃ khilvidaṃ brahma” (idi aṃtayu brahma mātramē kadā), “nēhanānāstikiṃcana” (pūrṇuḍagu brahmamunaṃdu bhinnatvaṃ iṃcukayunu lēdu), ityādi mahā vākyamula anubhavamē rūpamugā gala jñānamu valana “ahaṃ brahmasmi” (nēnu brahmanē ayitini) anu niścayamunoṃdi nirvikalpamagu samādhi (yōgamu) cētanē yati svataṃtruḍai saṃcariṃcucuṃḍunō ā yatiyē sanyāsi, atanē muktinoṃdina vāḍu, atanē paramahaṃsa, atanē avadhūta, atanē brāhmaṇuḍu).

  1. “anāśritaḥ karmaphalaṃ kāryaṃ karma karōtiyaḥ |

sa sanyāsī ca yōgī ca na niragnirni cā kriyaḥ ||”

yaṃ sanyāsamiti prāhuryōgaṃ taṃ viddhi pāṃḍava |

na hya sanyasta saṃkalpō yōgī bhavati kaścana ||“. śrīmadbhagavadgīta - 6 - 1, 2)

“phalābhi saṃdhi śūnyassannityaṃ karmakarōti yaḥ |

śrautaṃ smārtaṃ na sanyāsa yōgayōḥ phalamaśnutē ||

niragnira kriyā yastu sanyāsaḥ turya āśramaḥ || “.

(phalamunāsiṃcaka evaḍu cēyavalasina kāryamu cēyunō vāḍe sanyāsi, vāḍe yōgi, aṭṭivāḍu agnihōtramu lēnivāḍainanu, karma cēyanivāḍu kākapōyinanu sanyāsiyē, yōgiyē. sanyāsamani yēdi ceppabaḍinadō adi yōgamu. sanyasiṃcu saṃkalpamu lēnivāḍu evaḍunū yōgi kālēḍu. phalamunu kōraka śrauta karma, smārta karma anu nityakarmalu evaḍu cēyunō aṭivāḍu sanyāsamu yokka phalamunu yōgamu yokka phalamunu poṃdunu. aṭṭivāḍu agnihōtramulēka karmalu cēyanivāḍainacō ataḍu turīyāśramamunaku ceṃdinavāḍagunu)

  1. “ā. - - - sanyāsiki taruṇi tōḍi pottu tagadu” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 463)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.