← Back to స · Booklets 51–60 (digitized file 6)

సప్త ప్రకృతులు sapta prakṛtulu

Original — తెలుగు
  1. “మూల ప్రకృతివలన మహత్తత్వంబును, అహంకారంబును, తన్మాత్ర ప్రపంచకంబును అనియెడి సప్త ప్రకృతులు గలవు”.

(వివేక చింతామణి)

  1. మహదహంకారః పబ్చతంబ్మాత్రాణీతి సప్త ప్రకృతయః వికృతయశ్చ, తత్ర మహాన్ ప్రకృతస్య వికృతి రహంకారస్య ప్రకృతిః, అహంకారః తామసః పంచతన్మాత్రాణాం శబ్దాదీనాం ప్రకృతిః, సాత్విక ఏకాదశేంద్రియాణాం పంచ తన్మాత్రాశ్చ పంచానాం స్థూల భూతానామాకాశాదీనాం ప్రకృతయః. పంచ భూత స్థూలాన్యేతకా దశేంద్రియాణి చేతి షోడశ సంఖ్యకో గణో విలార ఏవ, న ప్రకృతిః తత్వాంతరోపాదాన త్వా భావాత్. పురుషస్తు ఉదాసీనః -“.

(మహత్తత్వము, అహంకారము, పంచతన్మాత్రలు, అనునవి ఏడు ప్రకృతులు. వాటిలో ప్రకృతియొక్క వికృతి అహంకారమునకు ప్రకృతి. తామసాహంకారము పంచ తన్మాత్రలకు - శబ్దము మొదలగువాటికి - ప్రకృతి. సాత్వికాహంకారము పదకొండు ఇంద్రియములకు ప్రకృతి. పంచ తన్మాత్రలు అయిదు స్థూలభూతములగు ఆకాశము మొదలగువాటికి ప్రకృతులు. పంచ స్థూల భూతములు, పదకొండు ఇంద్రియములు కలిసి పదహారు వికారములు, ప్రకృతికాదు - ఎందుచేతననగా అవి ఇతర తత్వములకు ఉపాదానముకావు, అనగా ఇతర తత్వములు ఏవియు పుట్టలేదు - పురుషుడు ఉదాసీనుడు - అనగా, ప్రకృతి కాడు, వికృతికాడు)

  1. పృధివ్యప్తేజో వాయ్వాకాశ మహదహంకారంబులనియెడి యేడింటిచేత రక్షింపబడ్డ జీవుండునుంబోలె న మాత్య జనపద దుర్గ ద్రవిణసంచయ దండమిత్రంబులనియెడి సప్త ప్రకృతులచేత రక్షితుండవై ప్రకృతి పురుషలందు భారంబు పెట్టి రాజ్య సుఖంబుల నుభవింతువుగదా ! - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 14 -)
Transliteration
  1. “mūla prakṛtivalana mahattatvaṃbunu, ahaṃkāraṃbunu, tanmātra prapaṃcakaṃbunu aniyeḍi sapta prakṛtulu galavu”.

(vivēka ciṃtāmaṇi)

  1. mahadahaṃkāraḥ pabcataṃbmātrāṇīti sapta prakṛtayaḥ vikṛtayaśca, tatra mahān prakṛtasya vikṛti rahaṃkārasya prakṛtiḥ, ahaṃkāraḥ tāmasaḥ paṃcatanmātrāṇāṃ śabdādīnāṃ prakṛtiḥ, sātvika ēkādaśēṃdriyāṇāṃ paṃca tanmātrāśca paṃcānāṃ sthūla bhūtānāmākāśādīnāṃ prakṛtayaḥ. paṃca bhūta sthūlānyētakā daśēṃdriyāṇi cēti ṣōḍaśa saṃkhyakō gaṇō vilāra ēva, na prakṛtiḥ tatvāṃtarōpādāna tvā bhāvāt. puruṣastu udāsīnaḥ -“.

(mahattatvamu, ahaṃkāramu, paṃcatanmātralu, anunavi ēḍu prakṛtulu. vāṭilō prakṛtiyokka vikṛti ahaṃkāramunaku prakṛti. tāmasāhaṃkāramu paṃca tanmātralaku - śabdamu modalaguvāṭiki - prakṛti. sātvikāhaṃkāramu padakoṃḍu iṃdriyamulaku prakṛti. paṃca tanmātralu ayidu sthūlabhūtamulagu ākāśamu modalaguvāṭiki prakṛtulu. paṃca sthūla bhūtamulu, padakoṃḍu iṃdriyamulu kalisi padahāru vikāramulu, prakṛtikādu - eṃducētananagā avi itara tatvamulaku upādānamukāvu, anagā itara tatvamulu ēviyu puṭṭalēdu - puruṣuḍu udāsīnuḍu - anagā, prakṛti kāḍu, vikṛtikāḍu)

  1. pṛdhivyaptējō vāyvākāśa mahadahaṃkāraṃbulaniyeḍi yēḍiṃṭicēta rakṣiṃpabaḍḍa jīvuṃḍunuṃbōle na mātya janapada durga draviṇasaṃcaya daṃḍamitraṃbulaniyeḍi sapta prakṛtulacēta rakṣituṃḍavai prakṛti puruṣalaṃdu bhāraṃbu peṭṭi rājya sukhaṃbula nubhaviṃtuvugadā ! - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 14 -)
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.