“నభో అసాధారణ గుణశబ్ద విశేష గ్రాహకంబగు శ్రోత్రంబును, వాయ్వ్సాధారణ విశేషా గ్రాహకంబు స్పర్శంబును, దేజో అసాధారణగుణ విశేషగ్రాహకంబు చక్షురింద్రియంబును, నంభో (అ)సాధారణ గుణలును విశేష గ్రాహకంబు రసనేంద్రియంబును, భూమ్యసాధారణ గుణ విశేష గ్రాహకంబు ఘ్రానేంద్రియంబును, నాకాశాది గుణంబులగుచు, శబ్దాది కార్యంబులగు వాయ్వాదులందు గారణాన్వయంబున నన్నింటికిం బృధ్వీ సంబంధంబు గలుగుటం జేసి భూమియందు శబ్ద స్పర్శ రూప రస గంధంబులు గలుగుట, మహదాది పృధివ్యంతంబులగు నీ యేడు తత్వంబులు పరస్పర మిళితంబులై భోగాయతనంబగు పురుషునిం గల్పింప సమర్థంబులై యున్నం జూచి గాలాదృష్ట సత్వాదులం గూడి జగత్కారణుండును త్రైగుణ్య విశిష్టుండును నశేష నియామకుండును నిరంజనాకారుండునగు సర్వేశ్వరుండందు బ్రవేశించె. అంత నన్యోన్య క్షుభితంబులయి మిళితంబులైన మహదాదులవలన నధిస్ఠాతృచేతన రహితంబగు నొక యండంబు పుట్టె”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 26 -)
“nabhō asādhāraṇa guṇaśabda viśēṣa grāhakaṃbagu śrōtraṃbunu, vāyvsādhāraṇa viśēṣā grāhakaṃbu sparśaṃbunu, dējō asādhāraṇaguṇa viśēṣagrāhakaṃbu cakṣuriṃdriyaṃbunu, naṃbhō (a)sādhāraṇa guṇalunu viśēṣa grāhakaṃbu rasanēṃdriyaṃbunu, bhūmyasādhāraṇa guṇa viśēṣa grāhakaṃbu ghrānēṃdriyaṃbunu, nākāśādi guṇaṃbulagucu, śabdādi kāryaṃbulagu vāyvādulaṃdu gāraṇānvayaṃbuna nanniṃṭikiṃ bṛdhvī saṃbaṃdhaṃbu galuguṭaṃ jēsi bhūmiyaṃdu śabda sparśa rūpa rasa gaṃdhaṃbulu galuguṭa, mahadādi pṛdhivyaṃtaṃbulagu nī yēḍu tatvaṃbulu paraspara miḷitaṃbulai bhōgāyatanaṃbagu puruṣuniṃ galpiṃpa samarthaṃbulai yunnaṃ jūci gālādṛṣṭa satvādulaṃ gūḍi jagatkāraṇuṃḍunu traiguṇya viśiṣṭuṃḍunu naśēṣa niyāmakuṃḍunu niraṃjanākāruṃḍunagu sarvēśvaruṃḍaṃdu bravēśiṃce. aṃta nanyōnya kṣubhitaṃbulayi miḷitaṃbulaina mahadādulavalana nadhisṭhātṛcētana rahitaṃbagu noka yaṃḍaṃbu puṭṭe”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 26 -)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.