(వ్యాహృతులు గాయత్రీ మంత్రమునకు ముందు చేర్చవలసినవి ఏడు - “ఓంభూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓంతపః, ఓం సత్యం” - ‘ఓం’ అను మొదలుగాగల ఈ ఏడును ఏడు లోకములు. వాటి కంటె వ్యతిరిక్తమైనది ఏ కొంచెము లేదు. అవి వ్యాహృతులే అయినను బ్రహ్మ బోధకములు - బ్రహ్మను బోధించునవి, బ్రహ్మనుండు పుట్టినవే, బ్రహ్మ రూపములే - “సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్ - దివంచ, పృధివీం చాంతరిక్ష మధోస్వః”.
(పూర్వకల్పములో వలెనే బ్రహ్మ సూర్యుని, చంద్రుని సృష్టించెను - ప్రకాశస్వరూపములైన సూర్య చంద్రులను చెప్పుటచేత మిగిలిన ప్రకాశరూపములగు నక్షత్రములు మొదలగువాటిని చెప్పినట్లే. సూర్య చంద్రులనే కాక ఆకాశమును, భూమిని, అంతరిక్షమును, అధోలోకములను స్వర్లోకమును కూడ సృష్టించెను -).
(‘భూః’ అనగా సన్మాత్రము. ‘భువః’ అనగా సర్వప్రకాశము - ‘సువః’ అనగా అన్నింటికి ఇష్టమైన సుఖస్వరూపము - ‘మహః’ అనగా అన్నింటికంటె పెద్దది యగుటవలన అన్నింటికంటె గొప్పది, ‘జనః’ అనగా అన్నింటికి కారణమైనది, అన్నింటినీ పుట్టించునది, ‘తపః’ అనగా భగవంతుని రూపము - “తపమనగా మత్స్వరూపము -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - స్కం - 2 - 9 - 245)
’సత్యం’అనగా బ్రహ్మమే - మూడుకాలములందుండువాడు, నాశము లేనివాడు - ఈ వ్యాహృతులు సర్వాత్మ అయిన బ్రహ్మను బోధించును) (ఇవన్నియు బ్రహ్మే యని యర్థము).
(vyāhṛtulu gāyatrī maṃtramunaku muṃdu cērcavalasinavi ēḍu - “ōṃbhūḥ, ōṃ bhuvaḥ, ōṃ suvaḥ, ōṃ mahaḥ, ōṃ janaḥ, ōṃtapaḥ, ōṃ satyaṃ” - ‘ōṃ’ anu modalugāgala ī ēḍunu ēḍu lōkamulu. vāṭi kaṃṭe vyatiriktamainadi ē koṃcemu lēdu. avi vyāhṛtulē ayinanu brahma bōdhakamulu - brahmanu bōdhiṃcunavi, brahmanuṃḍu puṭṭinavē, brahma rūpamulē - “sūryā caṃdramasau dhātā yathā pūrvamakalpayat - divaṃca, pṛdhivīṃ cāṃtarikṣa madhōsvaḥ”.
(pūrvakalpamulō valenē brahma sūryuni, caṃdruni sṛṣṭiṃcenu - prakāśasvarūpamulaina sūrya caṃdrulanu ceppuṭacēta migilina prakāśarūpamulagu nakṣatramulu modalaguvāṭini ceppinaṭlē. sūrya caṃdrulanē kāka ākāśamunu, bhūmini, aṃtarikṣamunu, adhōlōkamulanu svarlōkamunu kūḍa sṛṣṭiṃcenu -).
(‘bhūḥ’ anagā sanmātramu. ‘bhuvaḥ’ anagā sarvaprakāśamu - ‘suvaḥ’ anagā anniṃṭiki iṣṭamaina sukhasvarūpamu - ‘mahaḥ’ anagā anniṃṭikaṃṭe peddadi yaguṭavalana anniṃṭikaṃṭe goppadi, ‘janaḥ’ anagā anniṃṭiki kāraṇamainadi, anniṃṭinī puṭṭiṃcunadi, ‘tapaḥ’ anagā bhagavaṃtuni rūpamu - “tapamanagā matsvarūpamu -” (śrīmadāṃdhramahābhāgavatamu - skaṃ - 2 - 9 - 245)
’satyaṃ’anagā brahmamē - mūḍukālamulaṃduṃḍuvāḍu, nāśamu lēnivāḍu - ī vyāhṛtulu sarvātma ayina brahmanu bōdhiṃcunu) (ivanniyu brahmē yani yarthamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.