← Back to స · Booklets 51–60 (digitized file 6)

సప్తావరణములు saptāvaraṇamulu

Original — తెలుగు
  1. మహదహంకార సహితాః పృధువ్యాది భూతాత్మకాః -

(మహత్తత్త్వము, అహంకారము, పృధివీ,మొదలగు పంచభూతాత్మకములు కలిసి సప్తావరణములు).

  1. “వ. ధరణీ సలిల తేజస్సమీరణగగనాహంకార మహత్తత్త్వంబులనియెడు సప్తావరణంబులచేత నావృతంబగు మహాండకోశంబైన శరీరంబునందు ధారణాశ్రయంబయిన వైరాజ పురుషుండు తేజరిల్లు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 16)

  2. “వ. - - - చతుర్దశభువనాత్మకంబైన విరాడ్రూపంబునకు కోటి యోజన విశాలంబైన యండకటాహంబు ప్రధమావరణంబైన పృధ్వియగు - అయ్యావరణంబు మీద సలిల తేజస్సమీరణ గగనాహంకార మహత్తత్త్వంబులనియెడి యావరణంబులు క్రమంబున నొండొకటి దశగుణోత్తరాధికంబులై యుండు - అట్టి యేడింటిమీద ప్రకృత్యావరణంబున మహావ్యాపకంబగు - బ్రహ్మాండంబు - - -”

(శ్రీమదాంధ్రమహాభాగవతము - స్కం - 2 - 32)

  1. “అండకోశే శరీరే అస్మిన్ సప్తావరణ సం యతే” - (శ్రీమద్భాగవతం - 2 - 1 - 25)

(పృధివ్యావరణం, తతః అప్తేజఓవాయ్వాకాశాహంకార మహత్తత్త్వాదీని సప్త. (శ్రీధరీయవ్యాఖ్య)

(సప్తావరణములతో కూడియున్న అందకోశమైన ఈ శరీరమందు - -).

  1. సుఖ దుఃఖములు అందఱికి అనుభవమువలన తెలిసినవే. దుఃఖము లేకున్న సుఖమే కనుక దుఃఖము మొదటి ఆవరణము - జన్మమువలన దుఃఖము కలుగును - కనుక జన్మము రెండవ ఆవరణము - జన్మమునకు కారణము కర్మ కనుక కర్మ మూడవ ఆవరణము - ఒకవస్తువు నందభిమానముండుట వలన కర్మ చేయుదుము కనుక అభిమానము నాల్గవ ఆవరణము. అభిమానము విక్షేపమైన అవిద్యవలన కలిగిన దగుటచేత అవిద్య అయిదవ ఆవరణము - అవిద్యవలన అజ్ఞానము కలుగును - కనుక అజ్ఞానము ఆరవ ఆవరణము - అజ్ఞానము మాయవలన కలిగినది కనుక మాయ ఏడవ ఆవరణము. ముందు చెప్పబడిన ఆరు ఆవరణములు మాయనుండియే కలిగినవియే కనుక అన్నింటికీ మాయయే మూలకారణము).
Transliteration
  1. mahadahaṃkāra sahitāḥ pṛdhuvyādi bhūtātmakāḥ -

(mahattattvamu, ahaṃkāramu, pṛdhivī,modalagu paṃcabhūtātmakamulu kalisi saptāvaraṇamulu).

  1. “va. dharaṇī salila tējassamīraṇagaganāhaṃkāra mahattattvaṃbulaniyeḍu saptāvaraṇaṃbulacēta nāvṛtaṃbagu mahāṃḍakōśaṃbaina śarīraṃbunaṃdu dhāraṇāśrayaṃbayina vairāja puruṣuṃḍu tējarillu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 16)

  2. “va. - - - caturdaśabhuvanātmakaṃbaina virāḍrūpaṃbunaku kōṭi yōjana viśālaṃbaina yaṃḍakaṭāhaṃbu pradhamāvaraṇaṃbaina pṛdhviyagu - ayyāvaraṇaṃbu mīda salila tējassamīraṇa gaganāhaṃkāra mahattattvaṃbulaniyeḍi yāvaraṇaṃbulu kramaṃbuna noṃḍokaṭi daśaguṇōttarādhikaṃbulai yuṃḍu - aṭṭi yēḍiṃṭimīda prakṛtyāvaraṇaṃbuna mahāvyāpakaṃbagu - brahmāṃḍaṃbu - - -”

(śrīmadāṃdhramahābhāgavatamu - skaṃ - 2 - 32)

  1. “aṃḍakōśē śarīrē asmin saptāvaraṇa saṃ yatē” - (śrīmadbhāgavataṃ - 2 - 1 - 25)

(pṛdhivyāvaraṇaṃ, tataḥ aptējaōvāyvākāśāhaṃkāra mahattattvādīni sapta. (śrīdharīyavyākhya)

(saptāvaraṇamulatō kūḍiyunna aṃdakōśamaina ī śarīramaṃdu - -).

  1. sukha duḥkhamulu aṃdaṟiki anubhavamuvalana telisinavē. duḥkhamu lēkunna sukhamē kanuka duḥkhamu modaṭi āvaraṇamu - janmamuvalana duḥkhamu kalugunu - kanuka janmamu reṃḍava āvaraṇamu - janmamunaku kāraṇamu karma kanuka karma mūḍava āvaraṇamu - okavastuvu naṃdabhimānamuṃḍuṭa valana karma cēyudumu kanuka abhimānamu nālgava āvaraṇamu. abhimānamu vikṣēpamaina avidyavalana kaligina daguṭacēta avidya ayidava āvaraṇamu - avidyavalana ajñānamu kalugunu - kanuka ajñānamu ārava āvaraṇamu - ajñānamu māyavalana kaliginadi kanuka māya ēḍava āvaraṇamu. muṃdu ceppabaḍina āru āvaraṇamulu māyanuṃḍiyē kaliginaviyē kanuka anniṃṭikī māyayē mūlakāraṇamu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.