← Back to స · Booklets 51–60 (digitized file 6)

సప్తావస్థలు saptāvasthalu

Original — తెలుగు
  1. చిదాభాసస్య సప్తావస్థాః - (1) అజ్ఞానం (2.) ఆవరణం (3) భ్రాంతిః (విక్షేపః) (4)పరోక్షజ్ఞానం (5) అపరోక్షజ్ఞానం (6) శోకనాశః (అనర్థ నివృత్తిః) (7) అతిహర్షః (నిరతిశయానంద ప్రాప్తిః).

(1) దశమ పురుషాఖ్యాయికాయాం దశమః ఆత్మానం విహాయ ఇతరాన్ ననైవ పురుషాన్ గణయన్ స్వస్య దశమత్వం న జానాతీతి యత్ తదేవ అజ్ఞానం

(2) “దశమో నాస్తి న భాతి” ఇత్యేత్ ఆవరణం

(3) దశమో మడూరేతి కల్పయిత్వా రోదనం శోకః అయమేవ భ్రాంతిః - విక్షేపః ఇతి చ కధ్యతే

(4) “దశమో నమృతః, జీవితి సః” ఇత్యాప్రోక్త్యా దశమ సత్త్వ వేదనం పరోక్షజ్ఞానం

(5) “త్వమేవ దశమోసి” ఇతి సాక్షాదుపదిష్టః సన్ పునరపి గణన సమయే స్వాత్మానాం దశమత్వేన గణయిత్వా, ఆత్మానం దశమత్వేన జనాతీతి యత్ తదేవ అపరోక్షజ్ఞానం.

(6) ఈదృశాత్ అపరోక్షజ్ఞానాత్ రోదన నివృత్తిరేవ భ్రాంతి నాశః (శోకనాసః)

(7) స్వస్యైవ దశమత్వ జ్ఞానాత్ జాయమాన సంతోషః అతి హర్షః - ఆస్వవస్థాసు “అజ్ఞానం. ఆవరణం, విక్షేపః ఇత్యిమాః తిస్రో అవస్థాః బంధికారణాని భవంతి. అవిశిష్టాః తు అవస్థాశ్చ తస్రోపి మోక్షసాదనాని భవంతి”.

(చిదాభాసునికి అవస్థలు ఏడు కలుగుచుండును: - (1) అజ్ఞానము (2) ఆవరణము (3) భ్రాంతి (విక్షేపము) (4) - పరోక్షజ్ఞానము (5) అపరోక్షజ్ఞానము (6) శోకనాశము - (అనగా అనర్థము లేకుండపోవుట (7) అతిహర్షము - (నిరతిశయానందము పొందుట) ఇవి యీ క్రింద స్పష్టము చేయబడినవి: -

(1) పదిమంది ఒక నదిని దాటి, పదిమందియున్నారో లేదో అని సరిచూచుకొను కథలో లెక్కపెట్టినవాడు మిగతా తొమ్మిదిమందిని లెక్క పెట్టి, తనను లెక్కపెట్టక, తను పదియవవాడు అని తెలియకుండుట అజ్ఞానము –

(2) పదియవవాడు లేడు అనుకొనుట ఆవరణము

(3) అయ్యో, పదియవవాడు చనిపోయెనే, యేటిలో మునిగిపోయెనే యని ఏడ్చుట శోకము. ఇదియే భ్రాంతి లేక విక్షేపము

(4) నాల్గవవాడు చనిపోవలేదు, బ్రతికియేయున్నాడు అని ఆప్తులవలన విని తెలుసుకొనుట పరోక్షజ్ఞానము

(5) నీవే పదియవవాడవు అని ఆప్తునివలన తెలుపబడినవాడై, తిరిగి అందఱిని లెక్కపెట్టినపుడు తనను కూడ లెక్కపెట్టుటచేతనే పదియవవాడు అని తెలుసుకొనుట అపరోక్షజ్ఞానము –

(6) ఇట్లు కలిగినటువంటి అపరోక్షజ్ఞానము వలన శోకము లేకయుండుటయే భ్రాంతి నాశము (శోకనాశము)

(7) తానే పదియవవాడు యని తెలుసుకొనుటవలన కలిగిన సంతోషమే అతిహర్షము. పైన చెప్పిన యీ యేడు అవస్థలలోను అజ్ఞానము, ఆవరనము, విక్షేపము అను మూడు అవస్థలు బంధమునకు కారణమైనవి. మిగిలిన నాలుగు అవస్థలు మోక్షము పొందుటకు కారణములగును -).

  1. “శ్లో||. అజ్ఞానమావృత్తిస్త ద్వద్విక్షేపశ్చ పరోక్ష ధీః |

అపరోక్షమితి శ్శోక మోక్ష స్తృప్నిర్నిరంకుశా ||“.

(అజ్ఞానము, ఆవరనము, విక్షేపము, పరోక్షజ్ఞానము, అపరోక్షజ్ఞానము, నిరంకుశమైన తృప్తి, దుఃఖనివృత్తి - ఈ సప్తావస్థలు చిదాభాసుడగు జీవునియందు కల్పించబడుతవి- ఆత్మకు ఏ అవస్థాభేదము లేదు).

Transliteration
  1. cidābhāsasya saptāvasthāḥ - (1) ajñānaṃ (2.) āvaraṇaṃ (3) bhrāṃtiḥ (vikṣēpaḥ) (4)parōkṣajñānaṃ (5) aparōkṣajñānaṃ (6) śōkanāśaḥ (anartha nivṛttiḥ) (7) atiharṣaḥ (niratiśayānaṃda prāptiḥ).

(1) daśama puruṣākhyāyikāyāṃ daśamaḥ ātmānaṃ vihāya itarān nanaiva puruṣān gaṇayan svasya daśamatvaṃ na jānātīti yat tadēva ajñānaṃ

(2) “daśamō nāsti na bhāti” ityēt āvaraṇaṃ

(3) daśamō maḍūrēti kalpayitvā rōdanaṃ śōkaḥ ayamēva bhrāṃtiḥ - vikṣēpaḥ iti ca kadhyatē

(4) “daśamō namṛtaḥ, jīviti saḥ” ityāprōktyā daśama sattva vēdanaṃ parōkṣajñānaṃ

(5) “tvamēva daśamōsi” iti sākṣādupadiṣṭaḥ san punarapi gaṇana samayē svātmānāṃ daśamatvēna gaṇayitvā, ātmānaṃ daśamatvēna janātīti yat tadēva aparōkṣajñānaṃ.

(6) īdṛśāt aparōkṣajñānāt rōdana nivṛttirēva bhrāṃti nāśaḥ (śōkanāsaḥ)

(7) svasyaiva daśamatva jñānāt jāyamāna saṃtōṣaḥ ati harṣaḥ - āsvavasthāsu “ajñānaṃ. āvaraṇaṃ, vikṣēpaḥ ityimāḥ tisrō avasthāḥ baṃdhikāraṇāni bhavaṃti. aviśiṣṭāḥ tu avasthāśca tasrōpi mōkṣasādanāni bhavaṃti”.

(cidābhāsuniki avasthalu ēḍu kalugucuṃḍunu: - (1) ajñānamu (2) āvaraṇamu (3) bhrāṃti (vikṣēpamu) (4) - parōkṣajñānamu (5) aparōkṣajñānamu (6) śōkanāśamu - (anagā anarthamu lēkuṃḍapōvuṭa (7) atiharṣamu - (niratiśayānaṃdamu poṃduṭa) ivi yī kriṃda spaṣṭamu cēyabaḍinavi: -

(1) padimaṃdi oka nadini dāṭi, padimaṃdiyunnārō lēdō ani saricūcukonu kathalō lekkapeṭṭinavāḍu migatā tommidimaṃdini lekka peṭṭi, tananu lekkapeṭṭaka, tanu padiyavavāḍu ani teliyakuṃḍuṭa ajñānamu –

(2) padiyavavāḍu lēḍu anukonuṭa āvaraṇamu

(3) ayyō, padiyavavāḍu canipōyenē, yēṭilō munigipōyenē yani ēḍcuṭa śōkamu. idiyē bhrāṃti lēka vikṣēpamu

(4) nālgavavāḍu canipōvalēdu, bratikiyēyunnāḍu ani āptulavalana vini telusukonuṭa parōkṣajñānamu

(5) nīvē padiyavavāḍavu ani āptunivalana telupabaḍinavāḍai, tirigi aṃdaṟini lekkapeṭṭinapuḍu tananu kūḍa lekkapeṭṭuṭacētanē padiyavavāḍu ani telusukonuṭa aparōkṣajñānamu –

(6) iṭlu kaliginaṭuvaṃṭi aparōkṣajñānamu valana śōkamu lēkayuṃḍuṭayē bhrāṃti nāśamu (śōkanāśamu)

(7) tānē padiyavavāḍu yani telusukonuṭavalana kaligina saṃtōṣamē atiharṣamu. paina ceppina yī yēḍu avasthalalōnu ajñānamu, āvaranamu, vikṣēpamu anu mūḍu avasthalu baṃdhamunaku kāraṇamainavi. migilina nālugu avasthalu mōkṣamu poṃduṭaku kāraṇamulagunu -).

  1. “ślō||. ajñānamāvṛttista dvadvikṣēpaśca parōkṣa dhīḥ |

aparōkṣamiti śśōka mōkṣa stṛpnirniraṃkuśā ||“.

(ajñānamu, āvaranamu, vikṣēpamu, parōkṣajñānamu, aparōkṣajñānamu, niraṃkuśamaina tṛpti, duḥkhanivṛtti - ī saptāvasthalu cidābhāsuḍagu jīvuniyaṃdu kalpiṃcabaḍutavi- ātmaku ē avasthābhēdamu lēdu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.