శరీరము అనినను శరీరకము అనినను ఒకటే. ‘క’ అను అక్షరము పదము కొసను చేర్చుటవలన అర్థభేదముండదు - బాల, బాలిక, బాలుడు, బాలకుడు - బాలా, బాలికా; బాలకః వలె - శరీరమందుండువాడు, పుట్టినవాడు; జీవుడు - అతని గుఱించి వ్రాసిన గ్రంధము శారీరిక మీమాంస)
శరీరమే శరీరకము - అందులో నివసించువాడు శరీరకుడు, జీవాత్మ, అనగా “తత్వమసి” అను మహావాక్యములోని ‘త్వం’ పదమునకు అర్థమైన జీవాత్మయే ‘తత్’ (ఆది) అను పదమునకు అర్థమైన పరమాత్మయను విషయము గుఱించి మీమాంస యేది కలదో అది శారీరక మీమాంస (యని పేరుగల గ్రంధము) - అనగా, జీవ బ్రహ్మలు ఒకటే యను బోధించునది).
(జగత్తు సరీరముగా గలవాడు పరమాత్మ శారీరుడు. ‘ఇది అతనికి శరీరము’ అని శ్రుతి చెప్పుచున్నది. ఈ విషయము చెప్పుశాస్త్రము శారీరకము అని చెప్పబడుచున్నది).
(శరీరమే శరీరకము, అందులో నివసించువాడు శరీరకుడు - జీవుడు. ఆ జీవుడే బ్రహ్మ అవును, కాదా, ఎందుచేత అను మీమాంస)
śarīramu aninanu śarīrakamu aninanu okaṭē. ‘ka’ anu akṣaramu padamu kosanu cērcuṭavalana arthabhēdamuṃḍadu - bāla, bālika, bāluḍu, bālakuḍu - bālā, bālikā; bālakaḥ vale - śarīramaṃduṃḍuvāḍu, puṭṭinavāḍu; jīvuḍu - atani guṟiṃci vrāsina graṃdhamu śārīrika mīmāṃsa)
śarīramē śarīrakamu - aṃdulō nivasiṃcuvāḍu śarīrakuḍu, jīvātma, anagā “tatvamasi” anu mahāvākyamulōni ‘tvaṃ’ padamunaku arthamaina jīvātmayē ‘tat’ (ādi) anu padamunaku arthamaina paramātmayanu viṣayamu guṟiṃci mīmāṃsa yēdi kaladō adi śārīraka mīmāṃsa (yani pērugala graṃdhamu) - anagā, jīva brahmalu okaṭē yanu bōdhiṃcunadi).
(jagattu sarīramugā galavāḍu paramātma śārīruḍu. ‘idi ataniki śarīramu’ ani śruti ceppucunnadi. ī viṣayamu ceppuśāstramu śārīrakamu ani ceppabaḍucunnadi).
(śarīramē śarīrakamu, aṃdulō nivasiṃcuvāḍu śarīrakuḍu - jīvuḍu. ā jīvuḍē brahma avunu, kādā, eṃducēta anu mīmāṃsa)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.