← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ భూతస్థః sarva bhūtasthaḥ

Original — తెలుగు
  1. సమస్త భూతములందు అంతరాత్మయై - అంతర్యామియై యుండువాడు.

  2. భవతీతి భూతం, పృధివ్యంతేషుఇ సర్వ తత్వేషు అవస్థితం.

(పుట్టునది - జన్మ కలది - భూతము. భూమి ఆఖరు తత్వముగా గల సమస్త తత్వములందు ఉన్నవాడు).

  1. భూత భౌతిక ప్రపంచస్య ప్రతిభాసావస్థామపి సర్వత్ర కారణత్వేనావ స్థితః.

(భూతములు, భూతములనుండి పుట్టినవి గల ప్రపంచము యొక్క స్థితి అవస్థలో కూడా అంతటా వాటన్నింటికీ (పుట్టుటకు) కారణమైనవాడు.

  1. “సర్వ భూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని” - (శ్రీమద్భగవద్గీత - 6 - 29)

“సర్వభూతస్థితం యోమాం భజత్వేజత్వ మాస్థితః” (శ్రీమద్భగవద్గీత - 6 - 31)

(భూతములన్నింటిలోను ఆత్మగా నున్నవాడు - ఆత్మ అయిన ప్రపంచమందు (ప్రపంచరూపుడైన - విశ్వరూపుడైన - పరమాత్మ యందు) తనయందు సమస్త భూతములు కలవాడు, లేక, ప్రళయకాలమందు సమస్త భూతములను తనలో లయము చేసుకొనుటచేత తనలో సమస్తభూతములు సూక్ష్మ రూపములో కలవాడు)

Transliteration
  1. samasta bhūtamulaṃdu aṃtarātmayai - aṃtaryāmiyai yuṃḍuvāḍu.

  2. bhavatīti bhūtaṃ, pṛdhivyaṃtēṣui sarva tatvēṣu avasthitaṃ.

(puṭṭunadi - janma kaladi - bhūtamu. bhūmi ākharu tatvamugā gala samasta tatvamulaṃdu unnavāḍu).

  1. bhūta bhautika prapaṃcasya pratibhāsāvasthāmapi sarvatra kāraṇatvēnāva sthitaḥ.

(bhūtamulu, bhūtamulanuṃḍi puṭṭinavi gala prapaṃcamu yokka sthiti avasthalō kūḍā aṃtaṭā vāṭanniṃṭikī (puṭṭuṭaku) kāraṇamainavāḍu.

  1. “sarva bhūtastha mātmānaṃ sarvabhūtāni cātmani” - (śrīmadbhagavadgīta - 6 - 29)

“sarvabhūtasthitaṃ yōmāṃ bhajatvējatva māsthitaḥ” (śrīmadbhagavadgīta - 6 - 31)

(bhūtamulanniṃṭilōnu ātmagā nunnavāḍu - ātma ayina prapaṃcamaṃdu (prapaṃcarūpuḍaina - viśvarūpuḍaina - paramātma yaṃdu) tanayaṃdu samasta bhūtamulu kalavāḍu, lēka, praḷayakālamaṃdu samasta bhūtamulanu tanalō layamu cēsukonuṭacēta tanalō samastabhūtamulu sūkṣma rūpamulō kalavāḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.