← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ భూతాత్మ భూతాత్మా sarva bhūtātma bhūtātmā

Original — తెలుగు
  1. “సర్వేషాం బ్రహ్మదీనాం స్తంబ పర్యంతానాం భూతానాం, ఆత్మ భూతః, ఆత్మా ప్రత్యక్ చేతనో యస్య సః సర్వ భూతాత్మ భూతాత్మా - ప్రత్యక్ దర్శీ ఇత్యర్థః -” (శ్రీ శంకరః)

(చతుర్ముఖ బ్రహ్మ మొదలు స్తంబము వరకు గక భూతములకు ఆత్మ అయినవాడు, ప్రత్యగాత్మ, చైతన్యము నిచ్చువాడు).

  1. సర్వేషాం దేవాది భూతానాం ఆత్మభూతః ఆత్మా యస్త అసౌ సర్వభూతాత్మ భూతాత్మా - ఆత్మ యాధాత్మ్యం అనుసంధానస్య హి దేవాదీనాం స్వస్య చైకాకారః ఆత్మా, దేవాది భేదానాం ప్రకృతి పరిణామ విశేష రూపతయా ఆత్మాకారబ్వా సంభవాత్ - ప్రకృతి వియుక్తః సర్వత్ర దేవాది దేహేషు జ్ఞానైకాకారతయా సమానాకారః. (శ్రీమాన్ రామానుజః)

(దేవతలు మొదలగు భూతమలన్నింటికీ ఆత్మ అయిన ఆత్మ. దేవతలు మొదలగు భూతములన్నింటికీ ఒకటే అయిన ఆత్మ అయినవాడు - దేవతలు మొదలగు భూతములు ప్రకృతి యొక్క పరిణామ విశేషములే - మార్పులే - అయినందున అవి ఆత్మ కావు).

  1. సర్వ భూతాత్మ భూతః పరమేశ్వరః యచ్చాప్నో తీత్యాదేః, స ఆత్మభూతః, స్వసమీప ప్రత్యాదానాది కర్తా యస్య సర్వ భూతాత్మ భూతాత్మా -

(“యచ్చాప్నోతి యదాదత్తే” అను మొదలగు లక్షణములు గలది ఆత్మ - సర్వ బూతములకు ఇట్టి ఆత్మ అయినవాడు పరమేశ్వరుడు. ఆత్మ యాధాత్మ్యమును - యదార్థస్వరూపమును - అనుసంధానము చేయువాడు - దేవతలు మొదలగు భూతములకు తనకు ఆత్మ ఒకటే, దేవతలు మొదలగు భూతములు ప్రకృతి పరిణామములగుటచేత అవి ఆత్మ కావు. ప్రకృతిని కలియక యుండి అంతట దేవాది భూతములందు చైతన్యమే అను ఒకే ఆకారము గలవాడు).

  1. “యస్యాత్మా సర్వభూతానామాత్మ భూతస్స ఈ దృశః |

అఖండాద్వైత నిష్ఠస్సన్ త్యక్త భేదమతిః పుమాన్ |

సర్వ భూత ఆత్మభూతశ్చాత్మా యస్యేతి విగ్రహే |

జడా జడాత్మకం విశ్వం విశ్వం పశ్యన్నాత్మమయం మునిః |

ఉభయత్రాస్యఖండార్థ బోధసిద్ధిరి తీరితా ||“. (గీతాభావప్రకాశము - 5 - 23 to 75)

(ఎవని ఆత్మ సర్వ భూతములకు ఆత్మ భూతమైనదో వాడు సర్వభూతాత్మ భూతాత్మా. అన్ని భూతములకు ఆత్మ రూపముగా నున్నవాడు, అను భావము కలవాడు. “సర్వ భూతః అత్మభూతః ఆత్మా యస్య సః” - అనగా, - జడా జడాత్మకమైన విశ్వము సర్వము ఆత్మ మయముగా భావించువాడు).

  1. సర్వేషాం భూతానాం బ్రహ్మాది స్తంబ పర్యంతానాం, వియదాదీనాంచ చేతనా చేతనానాం ఆత్మ భూతః ఉపాదానత్వేన స్వరూప భూతః కనకమివ, కుండలాదీనాం స్వరూప భూతం - కారణానన్యత్వాత్ కారణస్య సర్వ భూతాత్మ భూతః ఆత్మా ప్రత్యేక్చేతన యస్య సః సర్వ భూతాత్మ భూతాత్మా. (నీలకంఠవ్యాఖ్యా)

(సమస్త భూతములకు ఆత్మ అయినవాడు - అన్నింటియందు బ్రహ్మ సమముగా నుండినట్లు చూచువాడు, తలచువాడు).

(చతుర్ముఖ బ్రహ్మ మొదలగు స్తంబము వఱకు గల సమస్త భూతముల యొక్క - చేతనముల యొక్క అచేతనములయొక్క ఆత్మ అయినవాడు - వాటికి ఉపాదానమైనవాడు కనుక కుండలములకు బంగారము ఉపాదానకారణము అయినట్లు - అవన్నియు స్వరూపములే అయినందున కార్య వస్తువులకు ఇంకొక కారణము లేనందున).

  1. సర్వ భూతానాం ఆత్మ భూతం - కుతః? సమం బ్రహ్మైవ పశ్యతి ఇతి.

(సమస్త భూతములకు ఆత్మ అయినవాడు - అన్నింటియందును బ్రహ్మ సమముగా నుండునట్లు తలచువాడు).

Transliteration
  1. “sarvēṣāṃ brahmadīnāṃ staṃba paryaṃtānāṃ bhūtānāṃ, ātma bhūtaḥ, ātmā pratyak cētanō yasya saḥ sarva bhūtātma bhūtātmā - pratyak darśī ityarthaḥ -” (śrī śaṃkaraḥ)

(caturmukha brahma modalu staṃbamu varaku gaka bhūtamulaku ātma ayinavāḍu, pratyagātma, caitanyamu niccuvāḍu).

  1. sarvēṣāṃ dēvādi bhūtānāṃ ātmabhūtaḥ ātmā yasta asau sarvabhūtātma bhūtātmā - ātma yādhātmyaṃ anusaṃdhānasya hi dēvādīnāṃ svasya caikākāraḥ ātmā, dēvādi bhēdānāṃ prakṛti pariṇāma viśēṣa rūpatayā ātmākārabvā saṃbhavāt - prakṛti viyuktaḥ sarvatra dēvādi dēhēṣu jñānaikākāratayā samānākāraḥ. (śrīmān rāmānujaḥ)

(dēvatalu modalagu bhūtamalanniṃṭikī ātma ayina ātma. dēvatalu modalagu bhūtamulanniṃṭikī okaṭē ayina ātma ayinavāḍu - dēvatalu modalagu bhūtamulu prakṛti yokka pariṇāma viśēṣamulē - mārpulē - ayinaṃduna avi ātma kāvu).

  1. sarva bhūtātma bhūtaḥ paramēśvaraḥ yaccāpnō tītyādēḥ, sa ātmabhūtaḥ, svasamīpa pratyādānādi kartā yasya sarva bhūtātma bhūtātmā -

(“yaccāpnōti yadādattē” anu modalagu lakṣaṇamulu galadi ātma - sarva būtamulaku iṭṭi ātma ayinavāḍu paramēśvaruḍu. ātma yādhātmyamunu - yadārthasvarūpamunu - anusaṃdhānamu cēyuvāḍu - dēvatalu modalagu bhūtamulaku tanaku ātma okaṭē, dēvatalu modalagu bhūtamulu prakṛti pariṇāmamulaguṭacēta avi ātma kāvu. prakṛtini kaliyaka yuṃḍi aṃtaṭa dēvādi bhūtamulaṃdu caitanyamē anu okē ākāramu galavāḍu).

  1. “yasyātmā sarvabhūtānāmātma bhūtassa ī dṛśaḥ |

akhaṃḍādvaita niṣṭhassan tyakta bhēdamatiḥ pumān |

sarva bhūta ātmabhūtaścātmā yasyēti vigrahē |

jaḍā jaḍātmakaṃ viśvaṃ viśvaṃ paśyannātmamayaṃ muniḥ |

ubhayatrāsyakhaṃḍārtha bōdhasiddhiri tīritā ||“. (gītābhāvaprakāśamu - 5 - 23 to 75)

(evani ātma sarva bhūtamulaku ātma bhūtamainadō vāḍu sarvabhūtātma bhūtātmā. anni bhūtamulaku ātma rūpamugā nunnavāḍu, anu bhāvamu kalavāḍu. “sarva bhūtaḥ atmabhūtaḥ ātmā yasya saḥ” - anagā, - jaḍā jaḍātmakamaina viśvamu sarvamu ātma mayamugā bhāviṃcuvāḍu).

  1. sarvēṣāṃ bhūtānāṃ brahmādi staṃba paryaṃtānāṃ, viyadādīnāṃca cētanā cētanānāṃ ātma bhūtaḥ upādānatvēna svarūpa bhūtaḥ kanakamiva, kuṃḍalādīnāṃ svarūpa bhūtaṃ - kāraṇānanyatvāt kāraṇasya sarva bhūtātma bhūtaḥ ātmā pratyēkcētana yasya saḥ sarva bhūtātma bhūtātmā. (nīlakaṃṭhavyākhyā)

(samasta bhūtamulaku ātma ayinavāḍu - anniṃṭiyaṃdu brahma samamugā nuṃḍinaṭlu cūcuvāḍu, talacuvāḍu).

(caturmukha brahma modalagu staṃbamu vaṟaku gala samasta bhūtamula yokka - cētanamula yokka acētanamulayokka ātma ayinavāḍu - vāṭiki upādānamainavāḍu kanuka kuṃḍalamulaku baṃgāramu upādānakāraṇamu ayinaṭlu - avanniyu svarūpamulē ayinaṃduna kārya vastuvulaku iṃkoka kāraṇamu lēnaṃduna).

  1. sarva bhūtānāṃ ātma bhūtaṃ - kutaḥ? samaṃ brahmaiva paśyati iti.

(samasta bhūtamulaku ātma ayinavāḍu - anniṃṭiyaṃdunu brahma samamugā nuṃḍunaṭlu talacuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.