← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ ధర్మ పరిత్యాగః sarva dharma parityāgaḥ

Original — తెలుగు
  1. సర్వేచ తే ధర్మాశ్చ తాన్ సర్వ ధర్మాన్ పరిత్యజ్య సన్యస్య సర్వకర్మాణి ఇత్యేతత్.

(సమస్త ధర్మములను పరిత్యజించుట - విడిచి పెట్టుట - అనగా, అన్ని కర్మలను విడిచిపెట్టుట, సర్వ కర్మ సన్యాసము).

  1. కర్మ యోగ జ్ఞానయోగ భక్తియోగ రూపాన్ సర్వాన్ ధర్మాన్ పరమ నిశ్రేయస సాధన భూతాన్ మదారాధనత్వేన అతి మాత్ర ప్రీత్యా యథాథికారం కుర్వాణః - ఏవ ఉక్త రీత్యా ఫలకర్మ కర్తృత్వాది పరిత్యాగేన పరిత్రజ్య మామేకం ఏవ కర్తారం ఆరాధ్యం ప్రాప్యం ఉపాయం చ అను సంధత్స్వ - ఏష ఏవ సర్వ ధర్మాణాం శాస్త్రీయ పరిత్యాగః -. (శ్రీమాన్ రామానుజః)

(సర్వ ధర్మములు అనగా కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ రూపములైనవిన్నీ పరమ నిశ్రేయస సాధనములైనవిన్నీ (మోక్షసాధనములైన విన్నీ), భగవంతుఇని ఆరాధించుటచేత భగవత్ప్రీతికి అర్హత కలవిన్నీ అయిన సకల ధర్మములను, వాటి ఫలమును, క్ర్తృత్వాభిమానమును మొదలగువాటిని వదలివేసి నన్ను ఒక్కనినే కర్మల కర్తగాను, ఆరాధించ తగినవాడినిగాను, పొందతగిన వాడిని గాను, అందుకు ఉపాయముగాను భావించి, నన్నే శరణుపొందుము - అని శ్రీకృష్ణభగవానుడు అర్జనునకు భక్తి మార్గము బోధించెను). (చూడుము - “సర్వ త్యాగము”).

Transliteration
  1. sarvēca tē dharmāśca tān sarva dharmān parityajya sanyasya sarvakarmāṇi ityētat.

(samasta dharmamulanu parityajiṃcuṭa - viḍici peṭṭuṭa - anagā, anni karmalanu viḍicipeṭṭuṭa, sarva karma sanyāsamu).

  1. karma yōga jñānayōga bhaktiyōga rūpān sarvān dharmān parama niśrēyasa sādhana bhūtān madārādhanatvēna ati mātra prītyā yathāthikāraṃ kurvāṇaḥ - ēva ukta rītyā phalakarma kartṛtvādi parityāgēna paritrajya māmēkaṃ ēva kartāraṃ ārādhyaṃ prāpyaṃ upāyaṃ ca anu saṃdhatsva - ēṣa ēva sarva dharmāṇāṃ śāstrīya parityāgaḥ -. (śrīmān rāmānujaḥ)

(sarva dharmamulu anagā karmayōga, jñānayōga, bhakti yōga rūpamulainavinnī parama niśrēyasa sādhanamulainavinnī (mōkṣasādhanamulaina vinnī), bhagavaṃtuini ārādhiṃcuṭacēta bhagavatprītiki arhata kalavinnī ayina sakala dharmamulanu, vāṭi phalamunu, krtṛtvābhimānamunu modalaguvāṭini vadalivēsi nannu okkaninē karmala kartagānu, ārādhiṃca taginavāḍinigānu, poṃdatagina vāḍini gānu, aṃduku upāyamugānu bhāviṃci, nannē śaraṇupoṃdumu - ani śrīkṛṣṇabhagavānuḍu arjanunaku bhakti mārgamu bōdhiṃcenu). (cūḍumu - “sarva tyāgamu”).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.