← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ మంగళా sarva maṃgaḷā

Original — తెలుగు
  1. పార్వతి.

  2. సకల శుభములు తన స్వరూపముగా గలది.

  3. సర్వాణి హృదయస్థాని మంగళాని శుభానిచ ఈప్సితాని దదాతీతి తేనసా సర్వమంగళా -

(సర్వ భూత హృదయస్థయై చైతన్య స్వరూపంబగు మంగళ స్వరూపిణియై ఐహికాముష్టిక అభీష్టంబుల నొసగునట్టిది గాన సర్వ మంగళా).

  1. సర్వాణి మంగళాని శుభాని యస్యాస్సా సర్వమంగళా.

(సమస్తమైన మంగళములు - శుభములు - గలది గాన సర్వమంగళా).

  1. సర్వేషాం ప్రాణినాం మంగళ సాధన భూతా యోషాః -

(సమస్తమైన ప్రాణులకు మంగళమును - శుభమును కలుగచేయునది).

  1. “శోభనాని శ్రేష్టాని యా దేవీ దదతే హరే |

భక్తానామార్తి హరణీ తేనేయం సర్వ మంగళా ||“.

(ఓ విష్ణూ ! శ్రేష్టమైన శుభములను కలుగచేయునది భక్తుల పాపములను పోగొట్టునది కనుక సర్వ మంగళా).

  1. సర్వైః ప్రకారైః ధ్యాన కీర్తన పూజా నమస్కారర్చన భక్తతః జడానామపి మంగళం సుఖం తనోతి ఇతి సర్వ మంగళా

(ధ్యానము, కీర్తనము, పూజ, నమస్కారము, అర్చన, భక్తి మొదలగు అన్ని ప్రకారములతో తనను ఆరాధించిన జడ వస్తువులకైనను మంగళమును సుఖమును కలుగ చేయునది కనుక సర్వమంగళా).

Transliteration
  1. pārvati.

  2. sakala śubhamulu tana svarūpamugā galadi.

  3. sarvāṇi hṛdayasthāni maṃgaḷāni śubhānica īpsitāni dadātīti tēnasā sarvamaṃgaḷā -

(sarva bhūta hṛdayasthayai caitanya svarūpaṃbagu maṃgaḷa svarūpiṇiyai aihikāmuṣṭika abhīṣṭaṃbula nosagunaṭṭidi gāna sarva maṃgaḷā).

  1. sarvāṇi maṃgaḷāni śubhāni yasyāssā sarvamaṃgaḷā.

(samastamaina maṃgaḷamulu - śubhamulu - galadi gāna sarvamaṃgaḷā).

  1. sarvēṣāṃ prāṇināṃ maṃgaḷa sādhana bhūtā yōṣāḥ -

(samastamaina prāṇulaku maṃgaḷamunu - śubhamunu kalugacēyunadi).

  1. “śōbhanāni śrēṣṭāni yā dēvī dadatē harē |

bhaktānāmārti haraṇī tēnēyaṃ sarva maṃgaḷā ||“.

(ō viṣṇū ! śrēṣṭamaina śubhamulanu kalugacēyunadi bhaktula pāpamulanu pōgoṭṭunadi kanuka sarva maṃgaḷā).

  1. sarvaiḥ prakāraiḥ dhyāna kīrtana pūjā namaskārarcana bhaktataḥ jaḍānāmapi maṃgaḷaṃ sukhaṃ tanōti iti sarva maṃgaḷā

(dhyānamu, kīrtanamu, pūja, namaskāramu, arcana, bhakti modalagu anni prakāramulatō tananu ārādhiṃcina jaḍa vastuvulakainanu maṃgaḷamunu sukhamunu kaluga cēyunadi kanuka sarvamaṃgaḷā).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.