(భూతములన్నింటియందు అన్నింటి యడల నేను సమముగా వర్తించుచున్నాను - ప్రవర్తించుచున్నాను - ద్వేషి యనిగాని, ప్రియుడనిగాని లేరు).
వినశ్యత్స్వవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి |
సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరం |
నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిం ||“. (శ్రీమద్భగవద్గీత - 13 - 27, 28)
(భూతములన్నింటియందు సమముగా - ఒకే రీతిగా, గొప్పవి చిన్నవి, యను తేడా చూపక - ఉండునదియు, నశించు స్వభావము గలవన్నియు నశించినను నశింపనిది యగు దానిని పరమేశ్వరుడుగా తెలుసుకొనినవాడే, అట్లు చూచువాడే సమ్యక్ దర్శనుడు - అన్నింటియందు ఇట్లు భేదము లేకుండు అన్నింటియందు ఇట్లు భేదము లేకుండగ అన్నింటియందు సమముగా భగవంతుడున్నాడని చూచువాడు (తన అజ్ఞానమనెడి అవిద్య చేత) పరమాత్మను హింసించుకొనుటలేదు. అందుచేత అతను పరమగతిని - పరమను మోక్షమును - పొందుచున్నాడు)
(అంతట అన్ని భూతములలోను సమానముగా నుండువాడు, భేదము చూపక ఉండువాడు - ఈశ్వరుడు).
(అన్నింటియందు దేవతలు మొదలగువారి శరీరములందు, అవి నశించిపోగా మిగిలియున్న వాడు, వాటికి ఆధారభూతమైనవాడు, అన్నింటికి నియంత - అన్నింటిని నియమించువాడు అయిన ఆత్మను - (దేవతలు మొదలగు వేరువేరు శరీరములు లేనటువంటి ఆత్మను - ఆత్మ ఒక్కటే, ఇన్నింటిలోనున్న ఆత్మ ఒక్కటే యను జ్ఞానముతో అన్నింటినీ సమముగా చూచువాడు).
అంతర్యామితయా తద్వన్న కశ్చిత్ ద్వేష గోచరః |
ప్రియోదా మే ప్రకాశస్య సావిత్రస్యేవ కశ్చన |
కథం ఫలేస్తి వైషమ్యం స్వభా క్తా భక్త యోస్తదా |
సేవంతే యేతుమాం భక్త్యా సర్వ కర్మార్పణాఖ్యయం |
చిత్త శుద్ధ్యాత్మ బోధేన తే మయ్యాత్మని చిద్ఘనే |
స్వభావాత్సంతి తత్త్వైకాకార వృత్యాతి శుద్ధయా |
అహమప్యతి శుద్ధానాం న ద్ధీ వృత్తౌ నిరంతరం |
ప్రతిబింబతయా తేషు వర్త ఏవ స్వభావతః |
యాధాగ్నిర్నాపయతి దూరస్థానాం నృణాం తమః |
సీతం వాతేన న ద్వేష్యా అగ్నేః స్యు ర్దూరగామినః |
శీతం తమో అపనయతి సమీపముపసర్పితాం |
తేన తేన ప్రియాస్తస్య తద్వత్కల్ప తరోరపి |
స్వస్య కామాను సారేణ విచిత్రఫలదాయినః |
న వైషమ్యం న నైర్ఘృణ్యం భవేత్ సర్వ సమస్యమే ||“. (గీతాభావప్రకాశము - 9 - 192 తొ - 199)
(నేను సచ్చిదానందరూపుడనగుట వలనను, అంతర్యామి (అందఱిలోను సంచరించు వాడ నగుటచేతను), ప్రాణులందఱి యడల నేను సమానుడనే - ప్రాణిలందఱిలోను హెచ్చు తక్కువలు చూపక సమానముగా నున్నాను. అందుచేత సూర్యునకువలె నాకు ప్రియుడుకాని, అప్రియుడుకాని లేరు - అట్టి విషయములో నాకు భక్తుడనికాని, భక్తుడు కాడనికాని ఎట్లుండును - సమస్త కర్మలు నాకే అర్పించి ఆత్మజ్ఞానము కలిగియుండుటచేత చిత్త శుద్ధి కలిగి యుండువారు చైతన్యఘనుడనైన నాయందే ధ్యానము కలిగియుందురు. ఎల్లపుడు శుద్ధాంతఃకరణము గలవారలయందు నేను కూడ వారి అంతఃకరణములలో ప్రతిబింబరూపముతో నుండువాడనై వారిలోనే వర్తించెదను - దూరముగానున్న చీకటిని అగ్ని పోగొట్టలేనట్లు, దూరముగానున్నవారి చలిని పోగొట్టలేదు - అంతమాత్రమున అగ్నికి యిష్టులు, అయిష్టులు అని లేరు - ఎవరి కోరిక ప్రకారము కోరికలను కల్ప వృక్షము ఇచ్చునట్లు అందఱియడల సముడైన భగవంతునకు వైషమ్యము లేదు. అతను అందఱి యడల సమానముగానే యుండును).
కొందఱు హితులనుచు మేలు కూర్పవు; నిజమీ
వందఱి యందును సముడవు - - - ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 1775)
ధమున దలంచు చైద్య వసుధావర ముఖ్య నృపుల్ ఫణీంద్ర భో
గమువలన నొప్పు బాహువులు కల్గినని న్భజించు గోపికల్
క్రమమున నేమునున్ సరియకామె భవకృపకంబు జోదరా“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1218)
(ఏనుగులు పుస్తికలు మొదలగువాటి యందు ఒకే రూపముతో - (చైతన్య శక్తి రూపముతో) - ప్రవర్తించువాడు)
క్రిమికీట పతంగేషు సమం సర్వత్ర సంస్థితం |
సత్యజ్ఞాన సు సంపూర్ణ సుఖ విజ్ఞాన మవ్యయం |
స్వ ప్రకాశైక సంసిద్ధం స్వవిలక్షణ వర్జితం ||. (సూత సం హిత)
(దేవతులకు దేవుడైనటువంటిన్నీ, జగత్తునకు నాధుడైనటువంటిన్నీ, దేవతులందు సరులయందు, క్రిములందు, కీటకములందు, పతంగములందు, అన్నింటియందు, అన్ని చోట్ల సమముగా నుండువాడున్నూ, సత్యము, జ్ఞానము అను గుణములు కలిగినటువంటిన్నీ, అన్నింటిలోను పూర్తిగా నిండియున్నవాడున్నూ, సుఖరూపుడైనటువంటిన్నీ - మోక్షరూపుడైనటువంటిన్నీ, విజ్ఞాన రూపుడు, అవ్యయుడు (నాశము లేనివాడు) అయినటువంటివాడు భగవంతుడు).
(దేవత్వ, మనుష్యత్వ, బ్రాహ్మణత్వ, క్షత్రియత్వాదేః).
(ఆకారతః (అభిరూప స్త్రీత్వ పుంస్త్వ సమనషమాం గత్వాదేః), స్వభావతః (సాత్విక రాజసత్వాదేః) జ్ఞాన తశ్చాత్యంతో త్కృష్టా పకృష్ట రూపేణ వర్తమానేషు సర్వేషు భూతేషు సమాశ్రయ నీయత్వే సమోహం - అయం జాత్యాకార స్వభావ జ్ఞానాది భిః అత్యంతోత్కృష్టో అయమితి తద్యుక్తతయా సమాశ్రయణేన కశ్చిత్ ప్రియః అస్తి, న సంగ్రహ్యః అస్తి, అపితు అత్యర్థ మత్ప్రియత్వేన మద్భజనేన వినాత్మ ధారణా భొన్మద్భజనైక ప్రయోజనా యేమాం భజంతే తే జాత్యాదిభిః ఉత్కృష్టా, అపకృష్టా వా మత్సమాన మదుత్కృషేషు ఇవ వర్తే-.
(దేవతలుగాను, తిర్యక్ జంతువులుగాను, మనుష్యులుగాను, స్థావరములుగా నుండువాటి యందు, జాతివలన, (అనగా, దేవతలు, మనుష్యులు, బ్రాహ్మణులు. క్షత్రియులు, మొదలగువాటియందును), ఆకారమువలన (సుందరమైన పురుషులు,స్త్రీలు, అంగసౌష్టవము కలవారు, వికలాంగులు, మొదలగువారియందు), స్వభావమువలన (అనగా, సత్వ రజస్తమోగుణ ప్రభావమువలనను). జ్ఞానము వలన (అనగా మిక్కిలి గొప్పవారు, అజ్ఞానలు, ఈ మొదకగువారందఱికి, నేను ఆశ్రయుడనగుటచేత అందఱిలోను సమముగానే ఉంటున్నాను. ఇట్లు పైన కారణములవలన, (అనగా, జాతివలనకాని, రూపమువలనకాని, జ్ఞానమువలనకాని, స్వభావమువలనకాని ఆశ్రయించుటయందు నాకు ద్వేష్యుడు ఎవరూ లేడు - (నేను ద్వేషించువాడు ఎవడునూ లేడు). ఆ ప్రకారముగానే జాతివలన ఉత్కృష్టుడు అయినవాడెవడూ లేడు - అనగా, ఆశ్రయములో నాకు ప్రియుడులేడు, నన్ను భజించకపోయిన జీవించియుండుట కష్టమను అభిప్రాయముతో నా భక్తియే కలిగుయుండువారు గొప్పవారైనను, బీదవారైనను సమానులే).
తద్వ దేవ మహేశస్య నియంతుర్గుణ దోషయోః ||“.
(పిల్లవాడిని లాలించినను, కొట్టినను, తల్లికి పిల్ల యడల వైషమ్యము లేదు - తేడాభావము లేదు. అట్లే, నియంత (అన్నింటిని నియమించువాడు) అయిన మహేశ్వరునకు గుణ దోషముల విషయములో వైషమ్యము లేదు. సుగుణములున్నవాని యడల, దుర్గుణములున్నవాని యడల వైషమ్యము లేదు - వేఱు వేఱు భావము లేదు).
జననీ జనక దార సఖి పుత్రా బాంధవ శత్రు ప్రియా ప్రియ జనులు లేరు“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10. - పూ. భా. - 1451)
“వ. సుజనులయిన బ్రహ్మాదులందును, దుర్జనులైన మా యందును సేవానురూపంబుగల బక్షపాతంబులు లేక కల్పవృక్షంబు చందంబున ఫలప్రదానంబు సేయుదువు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 9 - 360)
“రాగాది శూన్యుండు, నిరహంకారుండు, సద్వయుండు, సమదర్శనుండు, సర్వాత్మకుండు నైన ఈశ్వరున కున్నతోన్నత భావ మతి విషమ్యంబులెక్కడివి? లేవు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 9 -
“సుహృదం సర్వ భూతానాం” (శ్రీమద్భగవద్గీత - 5 - 29)
(సర్వ భూతములకు భగవంతుడు మిత్రుడు)
(bhūtamulanniṃṭiyaṃdu anniṃṭi yaḍala nēnu samamugā vartiṃcucunnānu - pravartiṃcucunnānu - dvēṣi yanigāni, priyuḍanigāni lēru).
vinaśyatsvavinaśyaṃtaṃ yaḥ paśyati sa paśyati |
samaṃ paśyanhi sarvatra samavasthitamīśvaraṃ |
nahi nastyātmanātmānaṃ tatō yāti parāṃ gatiṃ ||“. (śrīmadbhagavadgīta - 13 - 27, 28)
(bhūtamulanniṃṭiyaṃdu samamugā - okē rītigā, goppavi cinnavi, yanu tēḍā cūpaka - uṃḍunadiyu, naśiṃcu svabhāvamu galavanniyu naśiṃcinanu naśiṃpanidi yagu dānini paramēśvaruḍugā telusukoninavāḍē, aṭlu cūcuvāḍē samyak darśanuḍu - anniṃṭiyaṃdu iṭlu bhēdamu lēkuṃḍu anniṃṭiyaṃdu iṭlu bhēdamu lēkuṃḍaga anniṃṭiyaṃdu samamugā bhagavaṃtuḍunnāḍani cūcuvāḍu (tana ajñānamaneḍi avidya cēta) paramātmanu hiṃsiṃcukonuṭalēdu. aṃducēta atanu paramagatini - paramanu mōkṣamunu - poṃducunnāḍu)
(aṃtaṭa anni bhūtamulalōnu samānamugā nuṃḍuvāḍu, bhēdamu cūpaka uṃḍuvāḍu - īśvaruḍu).
(anniṃṭiyaṃdu dēvatalu modalaguvāri śarīramulaṃdu, avi naśiṃcipōgā migiliyunna vāḍu, vāṭiki ādhārabhūtamainavāḍu, anniṃṭiki niyaṃta - anniṃṭini niyamiṃcuvāḍu ayina ātmanu - (dēvatalu modalagu vēruvēru śarīramulu lēnaṭuvaṃṭi ātmanu - ātma okkaṭē, inniṃṭilōnunna ātma okkaṭē yanu jñānamutō anniṃṭinī samamugā cūcuvāḍu).
aṃtaryāmitayā tadvanna kaścit dvēṣa gōcaraḥ |
priyōdā mē prakāśasya sāvitrasyēva kaścana |
kathaṃ phalēsti vaiṣamyaṃ svabhā ktā bhakta yōstadā |
sēvaṃtē yētumāṃ bhaktyā sarva karmārpaṇākhyayaṃ |
citta śuddhyātma bōdhēna tē mayyātmani cidghanē |
svabhāvātsaṃti tattvaikākāra vṛtyāti śuddhayā |
ahamapyati śuddhānāṃ na ddhī vṛttau niraṃtaraṃ |
pratibiṃbatayā tēṣu varta ēva svabhāvataḥ |
yādhāgnirnāpayati dūrasthānāṃ nṛṇāṃ tamaḥ |
sītaṃ vātēna na dvēṣyā agnēḥ syu rdūragāminaḥ |
śītaṃ tamō apanayati samīpamupasarpitāṃ |
tēna tēna priyāstasya tadvatkalpa tarōrapi |
svasya kāmānu sārēṇa vicitraphaladāyinaḥ |
na vaiṣamyaṃ na nairghṛṇyaṃ bhavēt sarva samasyamē ||“. (gītābhāvaprakāśamu - 9 - 192 to - 199)
(nēnu saccidānaṃdarūpuḍanaguṭa valananu, aṃtaryāmi (aṃdaṟilōnu saṃcariṃcu vāḍa naguṭacētanu), prāṇulaṃdaṟi yaḍala nēnu samānuḍanē - prāṇilaṃdaṟilōnu heccu takkuvalu cūpaka samānamugā nunnānu. aṃducēta sūryunakuvale nāku priyuḍukāni, apriyuḍukāni lēru - aṭṭi viṣayamulō nāku bhaktuḍanikāni, bhaktuḍu kāḍanikāni eṭluṃḍunu - samasta karmalu nākē arpiṃci ātmajñānamu kaligiyuṃḍuṭacēta citta śuddhi kaligi yuṃḍuvāru caitanyaghanuḍanaina nāyaṃdē dhyānamu kaligiyuṃduru. ellapuḍu śuddhāṃtaḥkaraṇamu galavāralayaṃdu nēnu kūḍa vāri aṃtaḥkaraṇamulalō pratibiṃbarūpamutō nuṃḍuvāḍanai vārilōnē vartiṃcedanu - dūramugānunna cīkaṭini agni pōgoṭṭalēnaṭlu, dūramugānunnavāri calini pōgoṭṭalēdu - aṃtamātramuna agniki yiṣṭulu, ayiṣṭulu ani lēru - evari kōrika prakāramu kōrikalanu kalpa vṛkṣamu iccunaṭlu aṃdaṟiyaḍala samuḍaina bhagavaṃtunaku vaiṣamyamu lēdu. atanu aṃdaṟi yaḍala samānamugānē yuṃḍunu).
koṃdaṟu hitulanucu mēlu kūrpavu; nijamī
vaṃdaṟi yaṃdunu samuḍavu - - - ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 1775)
dhamuna dalaṃcu caidya vasudhāvara mukhya nṛpul phaṇīṃdra bhō
gamuvalana noppu bāhuvulu kalginani nbhajiṃcu gōpikal
kramamuna nēmunun sariyakāme bhavakṛpakaṃbu jōdarā”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1218)
(ēnugulu pustikalu modalaguvāṭi yaṃdu okē rūpamutō - (caitanya śakti rūpamutō) - pravartiṃcuvāḍu)
krimikīṭa pataṃgēṣu samaṃ sarvatra saṃsthitaṃ |
satyajñāna su saṃpūrṇa sukha vijñāna mavyayaṃ |
sva prakāśaika saṃsiddhaṃ svavilakṣaṇa varjitaṃ ||. (sūta saṃ hita)
(dēvatulaku dēvuḍainaṭuvaṃṭinnī, jagattunaku nādhuḍainaṭuvaṃṭinnī, dēvatulaṃdu sarulayaṃdu, krimulaṃdu, kīṭakamulaṃdu, pataṃgamulaṃdu, anniṃṭiyaṃdu, anni cōṭla samamugā nuṃḍuvāḍunnū, satyamu, jñānamu anu guṇamulu kaliginaṭuvaṃṭinnī, anniṃṭilōnu pūrtigā niṃḍiyunnavāḍunnū, sukharūpuḍainaṭuvaṃṭinnī - mōkṣarūpuḍainaṭuvaṃṭinnī, vijñāna rūpuḍu, avyayuḍu (nāśamu lēnivāḍu) ayinaṭuvaṃṭivāḍu bhagavaṃtuḍu).
(dēvatva, manuṣyatva, brāhmaṇatva, kṣatriyatvādēḥ).
(ākārataḥ (abhirūpa strītva puṃstva samanaṣamāṃ gatvādēḥ), svabhāvataḥ (sātvika rājasatvādēḥ) jñāna taścātyaṃtō tkṛṣṭā pakṛṣṭa rūpēṇa vartamānēṣu sarvēṣu bhūtēṣu samāśraya nīyatvē samōhaṃ - ayaṃ jātyākāra svabhāva jñānādi bhiḥ atyaṃtōtkṛṣṭō ayamiti tadyuktatayā samāśrayaṇēna kaścit priyaḥ asti, na saṃgrahyaḥ asti, apitu atyartha matpriyatvēna madbhajanēna vinātma dhāraṇā bhonmadbhajanaika prayōjanā yēmāṃ bhajaṃtē tē jātyādibhiḥ utkṛṣṭā, apakṛṣṭā vā matsamāna madutkṛṣēṣu iva vartē-.
(dēvatalugānu, tiryak jaṃtuvulugānu, manuṣyulugānu, sthāvaramulugā nuṃḍuvāṭi yaṃdu, jātivalana, (anagā, dēvatalu, manuṣyulu, brāhmaṇulu. kṣatriyulu, modalaguvāṭiyaṃdunu), ākāramuvalana (suṃdaramaina puruṣulu,strīlu, aṃgasauṣṭavamu kalavāru, vikalāṃgulu, modalaguvāriyaṃdu), svabhāvamuvalana (anagā, satva rajastamōguṇa prabhāvamuvalananu). jñānamu valana (anagā mikkili goppavāru, ajñānalu, ī modakaguvāraṃdaṟiki, nēnu āśrayuḍanaguṭacēta aṃdaṟilōnu samamugānē uṃṭunnānu. iṭlu paina kāraṇamulavalana, (anagā, jātivalanakāni, rūpamuvalanakāni, jñānamuvalanakāni, svabhāvamuvalanakāni āśrayiṃcuṭayaṃdu nāku dvēṣyuḍu evarū lēḍu - (nēnu dvēṣiṃcuvāḍu evaḍunū lēḍu). ā prakāramugānē jātivalana utkṛṣṭuḍu ayinavāḍevaḍū lēḍu - anagā, āśrayamulō nāku priyuḍulēḍu, nannu bhajiṃcakapōyina jīviṃciyuṃḍuṭa kaṣṭamanu abhiprāyamutō nā bhaktiyē kaliguyuṃḍuvāru goppavārainanu, bīdavārainanu samānulē).
tadva dēva mahēśasya niyaṃturguṇa dōṣayōḥ ||“.
(pillavāḍini lāliṃcinanu, koṭṭinanu, talliki pilla yaḍala vaiṣamyamu lēdu - tēḍābhāvamu lēdu. aṭlē, niyaṃta (anniṃṭini niyamiṃcuvāḍu) ayina mahēśvarunaku guṇa dōṣamula viṣayamulō vaiṣamyamu lēdu. suguṇamulunnavāni yaḍala, durguṇamulunnavāni yaḍala vaiṣamyamu lēdu - vēṟu vēṟu bhāvamu lēdu).
jananī janaka dāra sakhi putrā bāṃdhava śatru priyā priya janulu lēru”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10. - pū. bhā. - 1451)
“va. sujanulayina brahmādulaṃdunu, durjanulaina mā yaṃdunu sēvānurūpaṃbugala bakṣapātaṃbulu lēka kalpavṛkṣaṃbu caṃdaṃbuna phalapradānaṃbu sēyuduvu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 9 - 360)
“rāgādi śūnyuṃḍu, nirahaṃkāruṃḍu, sadvayuṃḍu, samadarśanuṃḍu, sarvātmakuṃḍu naina īśvaruna kunnatōnnata bhāva mati viṣamyaṃbulekkaḍivi? lēvu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 9 -
“suhṛdaṃ sarva bhūtānāṃ” (śrīmadbhagavadgīta - 5 - 29)
(sarva bhūtamulaku bhagavaṃtuḍu mitruḍu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.