(అంతయు, అన్నింటిని తెలిసినవాడు).
(విశేషముగా అన్నింటిని తెలిసినవాడు)
(అన్నింటి స్వరూపమును అన్ని ప్రకారములుగను తెలిసిన వాడు).
(సర్వమును తెలిసినవాడు - దేహము, ఇంద్రియములు, మనస్సు ప్రాణము మొదలగు వాటిని తెలిసిన వాడు)
(అన్నింటిని పొందియుండు వాడు - అన్నింటిలోనుండు వాడు).
(అన్ని చోట్ల అన్నింటిని పొంది యుండువాడు).
(తను కానిది అసంభవము అని తెలిసిన వాడు).
(ఈ ప్రపంచమంతయు నేనే అని స్వభావము వలన తెలుసుకొనినవాడు సర్వజ్ఞుడు - “సర్వజ్ఞుడు, సర్వవిత్” అని శ్రుతి చెప్పుచున్నది. అనంత సుఖమును. శాశ్వత సుఖమును మోక్షమును అనుభవించినవాడే సర్వవిత్).
(పరబ్రహ్మ అన్నింటిలోను వ్యాపించియుండువాడు కనుక పరబ్రహ్మను తెలిసిన యడల సర్వమును తెలిసినట్లే యగును - బ్రహ్మ విదుడగును. బ్రహ్మను తెలిసినవాడు బ్రహ్మమే యగును - “బ్రహ్మ విద్బ్రహ్మైవ భవతి”).
త్రికాల భావినో భవాన్ స్థూలాన్ సూక్ష్మాన శేషతః |
అణవో చైవ జానంతి మాయా భవమలావృతః |
అసత్స్వపి చ సర్వేషు సర్వార్థ జ్ఞాన హేతుషు |
యద్యధావస్థితం వస్తు తత్తదైవ సదాశివః |
అయత్నే నైవ జానాతి తస్మాత్సర్వజ్ఞ ఉచ్యతే ||“. (వాయవీయ సంహిత)
(శబ్దముల - పదముల - అర్థజ్ఞానము లభించుటకు భూత భవిష్యద్వర్తమాన కాలములందుండు సూక్ష్మ భావములను నిశ్శేషముగా తెలుసుకొనుటకు, అణువులు మాయ వలన కలిగిన మలము చేత ఆవరించబడినవై శక్తి లేనివి యై యున్నవి. సమస్త వస్తువులు ఎప్పుడు ఏది యేలాగుండునో సదాశివుడు ప్రయత్నము చేయ కుండగనే తెలుసుకొనగలడు - అందుచేత సదాశివుడు సర్వజ్ఞుడు, లేక, ‘సర్వవిత్’ అని చెప్పబడుచున్నాడు).
అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః |
యో మామేవమసమ్మూడో జానాతి పురుషోత్తమం |
స సర్వ విద్భజతి మాం సర్వ భావేన భారత ||“. (శ్రీమద్భగవద్గీత - 15 - 18)
“పురుషోత్తమం మాం క్షరా క్షరాభ్యాం అవ్యయ స్వభావతయా వ్యాపన వ్యాసన భరణైశ్వర్యాది యోగేన చ విస జాతీయం జానాతి, సః సర్వవిత్ మత్ప్రాప్త్యుపాయతయా యద్వేదితవ్యం తత్సర్వం వేద” (శ్రీమాన్ రామానుజః)
(క్షరాక్షర పురుషులిరువురు కంటెను అతీతుడై యుండుటవలన పరమాత్మ పురుషోత్తముడని ప్రసిద్ధి కెక్కెను - ఈ ప్రకారముగ ఎవడు అజ్ఞానము లేనివాడై పురుషోత్తమునెఱుగునో అతడు సమస్తమును ఎఱిగినవాడు - సర్వవిత్. ఇప్పటి కాలపు శాస్త్రములెన్ని చదివినను, వాటి ప్రకారము ఎన్ని కళలను అభ్యసించి వాటిలో పాండిత్యము సంపాదించినను పురుషుడు సర్వమును తెలిసినవాడు కానేరడు. ఎందుచేతననగా ఈ సృష్టిలో మనకు ఇప్పటికి పాశ్చాత్య విజ్ఞానమువలన తెలిసిన శాస్త్రములే కాక ఇంకను ఎన్నియో కలవు. పరబ్రహ్మ ఈ సృష్టి చేసెను - పరబ్రహ్మ గుఱించి తెలిసినవానికి ఆ పరబ్రహ్మ ఎట్లు చేసెనో తెలియును. ఇప్పుడు తెలియని శాస్త్రములన్నియు అప్పుడు తెలియనగును - అందుచేత బ్రహ్మను తెలిసినవాడు సర్వమును తెలిసినవాడగును). “బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి” (బ్రహ్మను తెలుసుకొనినవాడు బ్రహ్మయే అగును. అందుచేత సర్వజ్ఞత్వమనగా బ్రహ్మజ్ఞానమే. “యస్మత్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి”. (ఎవరిని తెలుసుకొనినచో ఈ ప్రపంచమంతయు తెలిసినట్లగును - అనగా ఈ ప్రపంచములోని శాస్త్రములన్నియు తెలిసినట్లగును).
(ఛాందోగ్యోపనిషత్ - 6 - 1 - 4)
(సౌమ్యుడా? ఒక మట్టి ముద్ద చూచిన మట్టితో చేయబడినదంతయు తెలియబడును - కుండ, మూకుడు మట్టితో చేయబడినను అవి పేరుకి మాత్రమే కుండ, మూకుడు. యధార్థముగా అవి మట్టియే. ఆ కుండ మూకుడు పగిలిపోయిన యడల కుండ కనబడదు, మూకుడు కనబడదు, మిగిలినది మట్టియే. మట్టి ఎన్ని మార్పులు చెందినను, ఎన్ని రూపములుగా వేఱి వేఱు పేర్లతో చేయబడినను అవన్నియు నిజముగా మట్టియే. అట్లే భగవంతుని నుండి పుట్టిన ప్రపంచములోని వస్తువులన్నియు భగవంతుని రూపములే. ఆ రూపములన్నియు నశించినను భగవంతుడు నిలిచి యుండును. భగవంతుని తెలుసుకొనిన ఈ ప్రపంచములోని వస్తువులన్నియు తెలిసినవే యగును. అందుచేత బ్రహ్మజ్ఞానమే సర్వజ్ఞానము, బ్రహ్మను తెలిసినవాడే సర్వజ్ఞుడు - సర్వవిత్).
(aṃtayu, anniṃṭini telisinavāḍu).
(viśēṣamugā anniṃṭini telisinavāḍu)
(anniṃṭi svarūpamunu anni prakāramuluganu telisina vāḍu).
(sarvamunu telisinavāḍu - dēhamu, iṃdriyamulu, manassu prāṇamu modalagu vāṭini telisina vāḍu)
(anniṃṭini poṃdiyuṃḍu vāḍu - anniṃṭilōnuṃḍu vāḍu).
(anni cōṭla anniṃṭini poṃdi yuṃḍuvāḍu).
(tanu kānidi asaṃbhavamu ani telisina vāḍu).
(ī prapaṃcamaṃtayu nēnē ani svabhāvamu valana telusukoninavāḍu sarvajñuḍu - “sarvajñuḍu, sarvavit” ani śruti ceppucunnadi. anaṃta sukhamunu. śāśvata sukhamunu mōkṣamunu anubhaviṃcinavāḍē sarvavit).
(parabrahma anniṃṭilōnu vyāpiṃciyuṃḍuvāḍu kanuka parabrahmanu telisina yaḍala sarvamunu telisinaṭlē yagunu - brahma viduḍagunu. brahmanu telisinavāḍu brahmamē yagunu - “brahma vidbrahmaiva bhavati”).
trikāla bhāvinō bhavān sthūlān sūkṣmāna śēṣataḥ |
aṇavō caiva jānaṃti māyā bhavamalāvṛtaḥ |
asatsvapi ca sarvēṣu sarvārtha jñāna hētuṣu |
yadyadhāvasthitaṃ vastu tattadaiva sadāśivaḥ |
ayatnē naiva jānāti tasmātsarvajña ucyatē ||“. (vāyavīya saṃhita)
(śabdamula - padamula - arthajñānamu labhiṃcuṭaku bhūta bhaviṣyadvartamāna kālamulaṃduṃḍu sūkṣma bhāvamulanu niśśēṣamugā telusukonuṭaku, aṇuvulu māya valana kaligina malamu cēta āvariṃcabaḍinavai śakti lēnivi yai yunnavi. samasta vastuvulu eppuḍu ēdi yēlāguṃḍunō sadāśivuḍu prayatnamu cēya kuṃḍaganē telusukonagalaḍu - aṃducēta sadāśivuḍu sarvajñuḍu, lēka, ‘sarvavit’ ani ceppabaḍucunnāḍu).
atōsmi lōkē vēdē ca prathitaḥ puruṣōttamaḥ |
yō māmēvamasammūḍō jānāti puruṣōttamaṃ |
sa sarva vidbhajati māṃ sarva bhāvēna bhārata ||“. (śrīmadbhagavadgīta - 15 - 18)
“puruṣōttamaṃ māṃ kṣarā kṣarābhyāṃ avyaya svabhāvatayā vyāpana vyāsana bharaṇaiśvaryādi yōgēna ca visa jātīyaṃ jānāti, saḥ sarvavit matprāptyupāyatayā yadvēditavyaṃ tatsarvaṃ vēda” (śrīmān rāmānujaḥ)
(kṣarākṣara puruṣuliruvuru kaṃṭenu atītuḍai yuṃḍuṭavalana paramātma puruṣōttamuḍani prasiddhi kekkenu - ī prakāramuga evaḍu ajñānamu lēnivāḍai puruṣōttamuneṟugunō ataḍu samastamunu eṟiginavāḍu - sarvavit. ippaṭi kālapu śāstramulenni cadivinanu, vāṭi prakāramu enni kaḷalanu abhyasiṃci vāṭilō pāṃḍityamu saṃpādiṃcinanu puruṣuḍu sarvamunu telisinavāḍu kānēraḍu. eṃducētananagā ī sṛṣṭilō manaku ippaṭiki pāścātya vijñānamuvalana telisina śāstramulē kāka iṃkanu enniyō kalavu. parabrahma ī sṛṣṭi cēsenu - parabrahma guṟiṃci telisinavāniki ā parabrahma eṭlu cēsenō teliyunu. ippuḍu teliyani śāstramulanniyu appuḍu teliyanagunu - aṃducēta brahmanu telisinavāḍu sarvamunu telisinavāḍagunu). “brahmavit brahmaiva bhavati” (brahmanu telusukoninavāḍu brahmayē agunu. aṃducēta sarvajñatvamanagā brahmajñānamē. “yasmat vijñātē sarvamidaṃ vijñātaṃ bhavati”. (evarini telusukoninacō ī prapaṃcamaṃtayu telisinaṭlagunu - anagā ī prapaṃcamulōni śāstramulanniyu telisinaṭlagunu).
(chāṃdōgyōpaniṣat - 6 - 1 - 4)
(saumyuḍā? oka maṭṭi mudda cūcina maṭṭitō cēyabaḍinadaṃtayu teliyabaḍunu - kuṃḍa, mūkuḍu maṭṭitō cēyabaḍinanu avi pēruki mātramē kuṃḍa, mūkuḍu. yadhārthamugā avi maṭṭiyē. ā kuṃḍa mūkuḍu pagilipōyina yaḍala kuṃḍa kanabaḍadu, mūkuḍu kanabaḍadu, migilinadi maṭṭiyē. maṭṭi enni mārpulu ceṃdinanu, enni rūpamulugā vēṟi vēṟu pērlatō cēyabaḍinanu avanniyu nijamugā maṭṭiyē. aṭlē bhagavaṃtuni nuṃḍi puṭṭina prapaṃcamulōni vastuvulanniyu bhagavaṃtuni rūpamulē. ā rūpamulanniyu naśiṃcinanu bhagavaṃtuḍu nilici yuṃḍunu. bhagavaṃtuni telusukonina ī prapaṃcamulōni vastuvulanniyu telisinavē yagunu. aṃducēta brahmajñānamē sarvajñānamu, brahmanu telisinavāḍē sarvajñuḍu - sarvavit).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.