← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వ యోనిః sarva yōniḥ

Original — తెలుగు
  1. సర్వేషాం యోనిః, కారణం సర్వస్య కారణ భూతః -

(అన్నింటికి కారణమైనది - పుట్టుక చోటయినది).

  1. సర్వ యోనిః - జగత్ యస్మాత్ జాతం సః సర్వస్య యోనిః -

(జగత్తు అతని నుండి పుట్టినది కనుక జగత్తులోని వస్తువులన్నింటికి యోని - పుట్టిన చోటు అయినది - జన్మస్థానము అయినది).

  1. “మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం |

సంభవః సర్వ భూతానాం తతో భవతి భారత ||

సర్వ యోనిషు కౌంతేయ, మూర్తయః సంభవంతి యాః |

తాసాం బ్రహ్మ మహద్యోని రహం బీజ ప్రదః పితా ||“. (శ్రీమద్భగవద్గీత - 14 - 34)

(ప్రకృతి, లేక, చతుర్ముఖ బ్రహ్మ నా యోని. దాని యందు నేను గర్భము కలుగ చేయుచున్నాను. దాని నుండి సమస్త భూతములు పుట్టుచున్నవి. అది మహద్యోని, గొప్పదగు యోని. సృష్టిలో ఏ వస్తువులోనుండి అయినను ఇంకొక వస్తువు పుట్టిన యడల ఆ మొదటి వస్తువు దానిలో నుండి పుట్టున వస్తువునకు యోని - జన్మ స్థానము - అని చెప్పబడును. ఇట్టి యోనులని చెప్పబడుచున్న వాటినుండి పుట్టుచున్న అన్ని వస్తువులకు ప్రకృతి - లేక - చతుర్ముఖ బ్రహ్మ మహద్యోని (గొప్ప యోని) (ఆది యోని) అని చెప్పబడుచున్నది. అట్లు పుట్టుచున్న వస్తువులన్నింటికినేను బీజమును. (మొక్క మొలచుటకు విత్తనము వంటి వాడను. అనగా, ప్రకృతిలో - చతుర్ముఖ బ్రహ్మలో భగవంతుడు తన చిచ్చక్తితో (చైతన్య శక్తితో) ప్రవేశించిన ఆ చైతన్యశక్తి యను బీజము వలన గర్భము ధరించి - చైతన్యవంతమై - మఱియొక వస్తువు తనలోనుండి పుట్టునట్లు చేయుచున్నది. ఈ ప్రకారముగా ప్రకృతిలోనుండి పుట్టునట్లు చేయుచున్నది. ఈ ప్రకారముగా ప్రకృతిలోనుండి పుట్టిన మహత్తత్త్వము మొదలు గడ్డి పోచ వఱకు గల సమస్త వస్తువులలో భగవంతుని చైతన్యశక్తి - అంశయు, ప్రకృతి అంశయు గలవు. అందుచేత సృష్టిలోని వస్తువులన్నింటికి ప్రకృతి మహద్యోని (తల్లి), భగవంతుడు తన చిచ్చక్తి రూపములో బీజ ప్రదుడు - తండ్రి).

  1. భూమిరాపో (అ)నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ |

అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా |

అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం ||

జీవ భూతాం మహా బాహో, యయేదం, ధార్యతే జగత్ |

ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపథారయా |

అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా || (శ్రీమద్భగవ్ద్గీత - 7 - 4 to 6)

భూమ్యాని పంచభూతాని సూక్ష్మావస్థాత్మికానిహి |

తన్మాత్రా ణ్యేవ లక్ష్యంతే మనో (అ)హంకార ఇష్యతే |

బుద్ధిశబ్దాన్మ హత్తత్వమహంకారస్య కారణం |

అవిద్యాత్మక మవ్యక్తం వాసనానంత వాసితం |

అహంకారవదేనోక్తం సర్వ కారణ కారణం |

ఇత్యేవ ముక్తరీత్యేయం సాక్షి భాస్యతయా క్షగా |

శక్తిః పరమ ధర్మాభ్యా (అ)నిర్వాచ్యా త్రిగుణాత్మికా |

పరాకరై రష్టభిర్భేధమాగతా - పారమేశ్వరీ |

అంతర్భూతోత్ర సర్వోపి జడవర్గః ప్రపంచగః |

ప్రకృతేః క్షేత్ర రూపాయాః అస్యాస్తత్వం వదన్ హరిః |

క్షేత్రజ్ఞ లక్షణాం ప్రాహి ప్రకృతిం చిగ్ఘనాం పరాం |

అష్టధోక్తా నికృష్టేయం ప్రకృతిర్మలినా స్మృతా |

సంసార బంధ రూపత్యాత్ పరార్థత్వా జ్జడత్వతః |

ఇతో (అ)న్యాం ప్రకృతిం శుద్ధాం ప్రకృష్టాం చేతనాత్మికాం |

మమాత్మ భూతాం జానీహి పరం క్షేత్రజ్ఞ లక్షణాం |

యయా క్షేత్రజ్ఞ రూపిణ్యా సర్వస్యాంతః ప్రవిష్టయా |

జగజ్జడమిదం సర్వం ధార్యతే విశరారవం |

ఏతే పరాపరే ప్రోక్తే క్షత్ర క్షేత్రజ్ఞ లక్షణే |

ప్రకృతీ యోని రస్త్యేషాం ఏతద్యోనీని తానివై |

చరా చరాణి సర్వాణి భూతానీత్యుపధారయ |

ఏవం చోపాధి భూతే మే క్షేత్ర క్షేత్రజ్ఞ లక్షణే |

జగతః ప్రకృతీ యస్మాత్ తద్ద్వారాహం తతో హరిః |

సర్వజ్ఞో అనంత శక్తిశ్చ మాయోపాధి రధీశ్వరః |

సర్వస్య కార్య వర్గస్య జగతో జన్మ కారణం |

వినాశ కారణం తద్వత్ స్థిర జంగమ రూపిణః |

స్వాత్మిక స్యేవ విశ్వస్య మాయి కస్యాస్య సర్వతః |

ఉపాదానం తథా ద్రష్టా మాయపి త్వాదహం హరిః ||.

(భగవంతుడనైన నా ప్రకృతి (ప్రథమం కృతం = సృష్టి ప్రారంభములో చేయ బడినది - సృష్టించబడినది) సృష్టించబడిన వాటిలో మొదటిది ఎనిమిది విధములుగా నున్నది - సూక్ష్మావస్థలోనున్న పంచ భూతములు అయిన భూమి, నీరు, అగ్ని, వాయువు, అకాశము అను తన్మాత్రలు - పంచీకరణము కానివి, ఒకదానితో నొకటి కలియని స్థితిలో నున్నవి - ఇవి అయిదున్నూ, మనస్సు అనగా అహంకారమున్నూ, బుద్ధి అనగా, అహంకారమునకు కారణమైన మహత్తత్త్వమున్నూ, అను ఈ మూడింటితో కలిసి ఎనిమిదిన్నీ అష్టవిధములైన ప్రకృతి, ఒకటే అయిన ప్రకృతి ఈ ఎనిమిది విధములుగ నున్నది. అవ్యక్తము, అవిద్య అనాది వాసనా మయము - అనేక జన్మల వాసనతో నిండియుండునది, కారణ వస్తువులన్నింటికి కారణమైనది అహంకారమని చెప్పబడినది. ఈ ప్రకృతి ఇటువంటిది అని చెప్పుటకు - నిర్వచించుటకు - అలవికానిది, సత్వరజస్తమములను మూడు గుణములు కలది. ఈ జడవర్గ ప్రపంచమంతయు ఈ ప్రకృతిలో అంతర్గతమై యున్నది. ఈ లక్షణములు గల ప్రకృతిని క్షేత్రమందురు - పండించు పొలము వంటిదని అందురు - ఇది జడమగుటవలన, సంసారములో బంధించునది అగుటవలన, నికృష్టమైనది యగుటవలన, మలినత్వము గలది, దీని కంటె వేరైనది శుద్ధసత్వము గలది ప్రకృష్టమైనది, చైతన్య ఘనమైనది, భగవంతుని పరాశక్తి అయినది ఇంకొకటి కలదు. ఈ పరాశక్తి (పరాప్రకృతి) జగత్తులో సమస్త జడవర్గములోను ప్రవేశించి దాని నంతను - దానిలో నుండు నన్నింటిని - ధరించుచున్నది. క్షేత్ర లక్షణము గల అపరా ప్రకృతి (జడప్రకృతి) లో ప్రవేశించి దానిలో (ప్రపంచ) బీజము నుంచినట్లు దానిని చైతన్యవంతము చేసి దానిలో నుండి (క్షేత్రమునుండి - పొలములోనుండి) మొలక పుట్టుకొని వచ్చినట్లు ప్రపంచము బైటకు వచ్చునట్లు చేయునది - ప్రపంచ సృష్టి చేయునది. అందుచేత ఈ పరాప్రకృతి (పరాశక్తి) క్షేత్రజ్ఞుడు అని చెప్పబడినది - భూమి సారము నెఱిగి అందులో బీజము నాటి పంట పండించువాడు క్షేత్రజ్ఞుడు -, అపరా ప్రకృతి క్షేత్రము, పొలము, భగవంతుడు - పరాప్రకృతి - క్షేత్రజ్ఞుడు - బీజము; చరా చర రూపములైన ఈ సమస్త భూతములు ఆ అపరాశక్తియగు క్షేత్రము నుండి పుట్టుచున్నవి, కనుక వాటి అన్నింటికి యీ అపరాప్రకృతి యోని (పుట్టుచోటు). ఈ రెండు శక్తులు - అపరాప్రకృతి, పరాప్రకృతి - నాకు ఉపాధులు. వీటిలో నేనుండి నేను వాటి చేత పని చేయించుచున్నాను - సర్వజ్ఞుడను - అంతములేని శక్తి గలవాడను. మాయ ఉపాధిగా గలవాడను, అన్నింటికీ అధికారిని, అన్నింటిని సంహరించువాడను అయిన నేను సమస్త కార్య వస్తువుల సముదాయమైన ఈ జగత్తు అంతయు పుట్టుటకు కారణమైన వాడను. ఆ ప్రకారముగానే చరా చర వస్తువులన్నింటికి నశించుటకు - వాటిని సంహరించుటకు - కారణమైనవాడను. స్వప్నము వలె నుండు - స్థిరముగా నుండని - యథార్థముగా లేనిది యగు - ఈ విశ్వమునకు (ప్రపంచమునకు) - నేనే మాయ గలవాడనగుటచేత - ఉపాదాన కారణము (material cause)న్నూ, ద్రష్ట (వేరుగా నుండి ఊరక చూచు చుండువాడనున్నూ) అగుచున్నాను).

  1. “సలోకాన సృజత” (భగవంతుడు లోకములను సృజించెను); “యతస్సర్వాణి భూతాని జాయంతే” (ఎవనివలన సమస్త భూతములు పుట్టుచున్నవో) అని చెప్పబడి యుండుటవలన ‘సర్వ యోనిః’ అనగా భగవంతుడే “జన్మాద్యన్యయతః” (ఈ జగత్తునకు సృష్టి స్థితి లయములు ఎవని వలన కలుగుచున్నవో అతను బ్రహ్మ యని చెప్పబడుటవలన, ఈ జగత్తులోని వస్తువులన్నియు భగవంతునిలోనుండియే పుట్టినవగుటచేత, వాటి అన్నింటికి భగవంతుడు ‘యోని’. (సర్వయోని = అన్నింటికీ పుట్టుచోటు).
Transliteration
  1. sarvēṣāṃ yōniḥ, kāraṇaṃ sarvasya kāraṇa bhūtaḥ -

(anniṃṭiki kāraṇamainadi - puṭṭuka cōṭayinadi).

  1. sarva yōniḥ - jagat yasmāt jātaṃ saḥ sarvasya yōniḥ -

(jagattu atani nuṃḍi puṭṭinadi kanuka jagattulōni vastuvulanniṃṭiki yōni - puṭṭina cōṭu ayinadi - janmasthānamu ayinadi).

  1. “mama yōnirmahadbrahma tasmin garbhaṃ dadāmyahaṃ |

saṃbhavaḥ sarva bhūtānāṃ tatō bhavati bhārata ||

sarva yōniṣu kauṃtēya, mūrtayaḥ saṃbhavaṃti yāḥ |

tāsāṃ brahma mahadyōni rahaṃ bīja pradaḥ pitā ||“. (śrīmadbhagavadgīta - 14 - 34)

(prakṛti, lēka, caturmukha brahma nā yōni. dāni yaṃdu nēnu garbhamu kaluga cēyucunnānu. dāni nuṃḍi samasta bhūtamulu puṭṭucunnavi. adi mahadyōni, goppadagu yōni. sṛṣṭilō ē vastuvulōnuṃḍi ayinanu iṃkoka vastuvu puṭṭina yaḍala ā modaṭi vastuvu dānilō nuṃḍi puṭṭuna vastuvunaku yōni - janma sthānamu - ani ceppabaḍunu. iṭṭi yōnulani ceppabaḍucunna vāṭinuṃḍi puṭṭucunna anni vastuvulaku prakṛti - lēka - caturmukha brahma mahadyōni (goppa yōni) (ādi yōni) ani ceppabaḍucunnadi. aṭlu puṭṭucunna vastuvulanniṃṭikinēnu bījamunu. (mokka molacuṭaku vittanamu vaṃṭi vāḍanu. anagā, prakṛtilō - caturmukha brahmalō bhagavaṃtuḍu tana ciccaktitō (caitanya śaktitō) pravēśiṃcina ā caitanyaśakti yanu bījamu valana garbhamu dhariṃci - caitanyavaṃtamai - maṟiyoka vastuvu tanalōnuṃḍi puṭṭunaṭlu cēyucunnadi. ī prakāramugā prakṛtilōnuṃḍi puṭṭunaṭlu cēyucunnadi. ī prakāramugā prakṛtilōnuṃḍi puṭṭina mahattattvamu modalu gaḍḍi pōca vaṟaku gala samasta vastuvulalō bhagavaṃtuni caitanyaśakti - aṃśayu, prakṛti aṃśayu galavu. aṃducēta sṛṣṭilōni vastuvulanniṃṭiki prakṛti mahadyōni (talli), bhagavaṃtuḍu tana ciccakti rūpamulō bīja praduḍu - taṃḍri).

  1. bhūmirāpō (a)nalō vāyuḥ khaṃ manō buddhirēva ca |

ahaṃkāra itīyaṃ mē bhinnā prakṛtiraṣṭadā |

aparēyamitastvanyāṃ prakṛtiṃ viddhi mē parāṃ ||

jīva bhūtāṃ mahā bāhō, yayēdaṃ, dhāryatē jagat |

ētadyōnīni bhūtāni sarvāṇītyupathārayā |

ahaṃ kṛtsnasya jagataḥ prabhavaḥ pralayastathā || (śrīmadbhagavdgīta - 7 - 4 to 6)

bhūmyāni paṃcabhūtāni sūkṣmāvasthātmikānihi |

tanmātrā ṇyēva lakṣyaṃtē manō (a)haṃkāra iṣyatē |

buddhiśabdānma hattatvamahaṃkārasya kāraṇaṃ |

avidyātmaka mavyaktaṃ vāsanānaṃta vāsitaṃ |

ahaṃkāravadēnōktaṃ sarva kāraṇa kāraṇaṃ |

ityēva muktarītyēyaṃ sākṣi bhāsyatayā kṣagā |

śaktiḥ parama dharmābhyā (a)nirvācyā triguṇātmikā |

parākarai raṣṭabhirbhēdhamāgatā - pāramēśvarī |

aṃtarbhūtōtra sarvōpi jaḍavargaḥ prapaṃcagaḥ |

prakṛtēḥ kṣētra rūpāyāḥ asyāstatvaṃ vadan hariḥ |

kṣētrajña lakṣaṇāṃ prāhi prakṛtiṃ cigghanāṃ parāṃ |

aṣṭadhōktā nikṛṣṭēyaṃ prakṛtirmalinā smṛtā |

saṃsāra baṃdha rūpatyāt parārthatvā jjaḍatvataḥ |

itō (a)nyāṃ prakṛtiṃ śuddhāṃ prakṛṣṭāṃ cētanātmikāṃ |

mamātma bhūtāṃ jānīhi paraṃ kṣētrajña lakṣaṇāṃ |

yayā kṣētrajña rūpiṇyā sarvasyāṃtaḥ praviṣṭayā |

jagajjaḍamidaṃ sarvaṃ dhāryatē viśarāravaṃ |

ētē parāparē prōktē kṣatra kṣētrajña lakṣaṇē |

prakṛtī yōni rastyēṣāṃ ētadyōnīni tānivai |

carā carāṇi sarvāṇi bhūtānītyupadhāraya |

ēvaṃ cōpādhi bhūtē mē kṣētra kṣētrajña lakṣaṇē |

jagataḥ prakṛtī yasmāt taddvārāhaṃ tatō hariḥ |

sarvajñō anaṃta śaktiśca māyōpādhi radhīśvaraḥ |

sarvasya kārya vargasya jagatō janma kāraṇaṃ |

vināśa kāraṇaṃ tadvat sthira jaṃgama rūpiṇaḥ |

svātmika syēva viśvasya māyi kasyāsya sarvataḥ |

upādānaṃ tathā draṣṭā māyapi tvādahaṃ hariḥ ||.

(bhagavaṃtuḍanaina nā prakṛti (prathamaṃ kṛtaṃ = sṛṣṭi prāraṃbhamulō cēya baḍinadi - sṛṣṭiṃcabaḍinadi) sṛṣṭiṃcabaḍina vāṭilō modaṭidi enimidi vidhamulugā nunnadi - sūkṣmāvasthalōnunna paṃca bhūtamulu ayina bhūmi, nīru, agni, vāyuvu, akāśamu anu tanmātralu - paṃcīkaraṇamu kānivi, okadānitō nokaṭi kaliyani sthitilō nunnavi - ivi ayidunnū, manassu anagā ahaṃkāramunnū, buddhi anagā, ahaṃkāramunaku kāraṇamaina mahattattvamunnū, anu ī mūḍiṃṭitō kalisi enimidinnī aṣṭavidhamulaina prakṛti, okaṭē ayina prakṛti ī enimidi vidhamuluga nunnadi. avyaktamu, avidya anādi vāsanā mayamu - anēka janmala vāsanatō niṃḍiyuṃḍunadi, kāraṇa vastuvulanniṃṭiki kāraṇamainadi ahaṃkāramani ceppabaḍinadi. ī prakṛti iṭuvaṃṭidi ani ceppuṭaku - nirvaciṃcuṭaku - alavikānidi, satvarajastamamulanu mūḍu guṇamulu kaladi. ī jaḍavarga prapaṃcamaṃtayu ī prakṛtilō aṃtargatamai yunnadi. ī lakṣaṇamulu gala prakṛtini kṣētramaṃduru - paṃḍiṃcu polamu vaṃṭidani aṃduru - idi jaḍamaguṭavalana, saṃsāramulō baṃdhiṃcunadi aguṭavalana, nikṛṣṭamainadi yaguṭavalana, malinatvamu galadi, dīni kaṃṭe vērainadi śuddhasatvamu galadi prakṛṣṭamainadi, caitanya ghanamainadi, bhagavaṃtuni parāśakti ayinadi iṃkokaṭi kaladu. ī parāśakti (parāprakṛti) jagattulō samasta jaḍavargamulōnu pravēśiṃci dāni naṃtanu - dānilō nuṃḍu nanniṃṭini - dhariṃcucunnadi. kṣētra lakṣaṇamu gala aparā prakṛti (jaḍaprakṛti) lō pravēśiṃci dānilō (prapaṃca) bījamu nuṃcinaṭlu dānini caitanyavaṃtamu cēsi dānilō nuṃḍi (kṣētramunuṃḍi - polamulōnuṃḍi) molaka puṭṭukoni vaccinaṭlu prapaṃcamu baiṭaku vaccunaṭlu cēyunadi - prapaṃca sṛṣṭi cēyunadi. aṃducēta ī parāprakṛti (parāśakti) kṣētrajñuḍu ani ceppabaḍinadi - bhūmi sāramu neṟigi aṃdulō bījamu nāṭi paṃṭa paṃḍiṃcuvāḍu kṣētrajñuḍu -, aparā prakṛti kṣētramu, polamu, bhagavaṃtuḍu - parāprakṛti - kṣētrajñuḍu - bījamu; carā cara rūpamulaina ī samasta bhūtamulu ā aparāśaktiyagu kṣētramu nuṃḍi puṭṭucunnavi, kanuka vāṭi anniṃṭiki yī aparāprakṛti yōni (puṭṭucōṭu). ī reṃḍu śaktulu - aparāprakṛti, parāprakṛti - nāku upādhulu. vīṭilō nēnuṃḍi nēnu vāṭi cēta pani cēyiṃcucunnānu - sarvajñuḍanu - aṃtamulēni śakti galavāḍanu. māya upādhigā galavāḍanu, anniṃṭikī adhikārini, anniṃṭini saṃhariṃcuvāḍanu ayina nēnu samasta kārya vastuvula samudāyamaina ī jagattu aṃtayu puṭṭuṭaku kāraṇamaina vāḍanu. ā prakāramugānē carā cara vastuvulanniṃṭiki naśiṃcuṭaku - vāṭini saṃhariṃcuṭaku - kāraṇamainavāḍanu. svapnamu vale nuṃḍu - sthiramugā nuṃḍani - yathārthamugā lēnidi yagu - ī viśvamunaku (prapaṃcamunaku) - nēnē māya galavāḍanaguṭacēta - upādāna kāraṇamu (material cause)nnū, draṣṭa (vērugā nuṃḍi ūraka cūcu cuṃḍuvāḍanunnū) agucunnānu).

  1. “salōkāna sṛjata” (bhagavaṃtuḍu lōkamulanu sṛjiṃcenu); “yatassarvāṇi bhūtāni jāyaṃtē” (evanivalana samasta bhūtamulu puṭṭucunnavō) ani ceppabaḍi yuṃḍuṭavalana ‘sarva yōniḥ’ anagā bhagavaṃtuḍē “janmādyanyayataḥ” (ī jagattunaku sṛṣṭi sthiti layamulu evani valana kalugucunnavō atanu brahma yani ceppabaḍuṭavalana, ī jagattulōni vastuvulanniyu bhagavaṃtunilōnuṃḍiyē puṭṭinavaguṭacēta, vāṭi anniṃṭiki bhagavaṃtuḍu ‘yōni’. (sarvayōni = anniṃṭikī puṭṭucōṭu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.