← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వగతం బ్రహ్మ sarvagataṃ brahma

Original — తెలుగు
  1. సాక్షాత్ పరమాత్మా ఖ్యాత్ అక్షరాత్ పురుషాత్ నిశ్వాసాత్ సముద్భూతం బ్రహ్మ (వేదం) తస్మాత్ సర్వార్థ ప్రకాశకత్వాత్ సర్వగతం బ్రహ్మ.

(సాక్షాత్ పరమాత్మ యని చెప్పబడు అక్షర పురుషుని నిశ్వాసము వలన వేదము పుట్టినది, అందుచేత అది బ్రహ్మమే యని చెప్పబడినది. సర్వార్థములను ప్రకాశము చేయునది కనుక అది బ్రహ్మవలె సర్వమును పొందినది).

  1. అక్షర శబ్ద నిర్దిష్టో జీవాత్మా అన్నపానాది నా తృప్తాక్షరా ధిష్టితం శరీరం కర్మణే ప్రభవతి ఇతి కర్మ సాధన భూతం శరీరం అక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ సర్వాధికార గతం శరీరం.

(అక్షరుడు - వినాశము లేనివాడు అని చెప్పబడు జీవాత్మ అన్నము, పానము మొదలగువాటిచేత తృప్తి పొందినవాడై అక్షరాధిష్ఠితమైన శరీరమును కర్మయందు వర్తింపచేయుచున్నాడు - అందుచేత కర్మ చేయుటకు సాధనమైన శరీరము అక్షర సముద్భవము, అందుచేత సర్వగతము - సర్వాధికారము గల వివేదము).

Transliteration
  1. sākṣāt paramātmā khyāt akṣarāt puruṣāt niśvāsāt samudbhūtaṃ brahma (vēdaṃ) tasmāt sarvārtha prakāśakatvāt sarvagataṃ brahma.

(sākṣāt paramātma yani ceppabaḍu akṣara puruṣuni niśvāsamu valana vēdamu puṭṭinadi, aṃducēta adi brahmamē yani ceppabaḍinadi. sarvārthamulanu prakāśamu cēyunadi kanuka adi brahmavale sarvamunu poṃdinadi).

  1. akṣara śabda nirdiṣṭō jīvātmā annapānādi nā tṛptākṣarā dhiṣṭitaṃ śarīraṃ karmaṇē prabhavati iti karma sādhana bhūtaṃ śarīraṃ akṣara samudbhavaṃ. tasmāt sarvagataṃ brahma sarvādhikāra gataṃ śarīraṃ.

(akṣaruḍu - vināśamu lēnivāḍu ani ceppabaḍu jīvātma annamu, pānamu modalaguvāṭicēta tṛpti poṃdinavāḍai akṣarādhiṣṭhitamaina śarīramunu karmayaṃdu vartiṃpacēyucunnāḍu - aṃducēta karma cēyuṭaku sādhanamaina śarīramu akṣara samudbhavamu, aṃducēta sarvagatamu - sarvādhikāramu gala vivēdamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.