(శ్రుతులన్నింటి యొక్కయు, స్మృతులన్నింటి యొక్కయు పర్యాచనవలన, సమస్త జగత్తును సృష్టించుట మొదలగు చేయుటవలనను, సర్వజ్ఞుడగుటవలనను, తనుకాక మఱియొక అధిపతి లేకుండుటవలనను చతుర్ముఖబ్రహ్మకు జ్ఞానము (బ్రహ్మజ్ఞానము - సృష్టిచేయుట మొదలగు వాటి గుఱించి జ్ఞానము -) ఉపదేశించుటవలనను, తన కృప లేనిదే తనను తెలుసుకొనుట యతి కష్టమగుటవలనను తనకు స్వంత ప్రయోజనము కలుగవలెనను ఉద్దేశము లేకయే, కేవలము లీల కొఱకు వలెనే జగత్తుని సృష్టించు పనిని పూనుకొనుటవలనను, తను మట్టుకు నిత్య నిరస్తేంద్రజాలముతో సత్య మహిమ కలిగియుండుటవలనను, దుఃఖమనునది లేనిది, నిత్యమైనదిన్నీ, నిరతిశయమైనదిన్నీ అయిన ఆనందానుభవరూపము గలిగి యుండుటచేతనున్నూ, శ్రీమహావిష్ణువు సర్వగుణ పరిపూర్ణుడు).
(బ్రహ్మ అను శబ్దము - మాత - ఏవో కొన్ని గుణముల పేర్లుకాదు - జగత్తు పుట్టుటకు కారణమగు గుణము అఖిల గుణములను సాధించుట చేతను, ఇంకొక రీతిగా చెప్పుటకు వీలు కానందున).
(śrutulanniṃṭi yokkayu, smṛtulanniṃṭi yokkayu paryācanavalana, samasta jagattunu sṛṣṭiṃcuṭa modalagu cēyuṭavalananu, sarvajñuḍaguṭavalananu, tanukāka maṟiyoka adhipati lēkuṃḍuṭavalananu caturmukhabrahmaku jñānamu (brahmajñānamu - sṛṣṭicēyuṭa modalagu vāṭi guṟiṃci jñānamu -) upadēśiṃcuṭavalananu, tana kṛpa lēnidē tananu telusukonuṭa yati kaṣṭamaguṭavalananu tanaku svaṃta prayōjanamu kalugavalenanu uddēśamu lēkayē, kēvalamu līla koṟaku valenē jagattuni sṛṣṭiṃcu panini pūnukonuṭavalananu, tanu maṭṭuku nitya nirastēṃdrajālamutō satya mahima kaligiyuṃḍuṭavalananu, duḥkhamanunadi lēnidi, nityamainadinnī, niratiśayamainadinnī ayina ānaṃdānubhavarūpamu galigi yuṃḍuṭacētanunnū, śrīmahāviṣṇuvu sarvaguṇa paripūrṇuḍu).
(brahma anu śabdamu - māta - ēvō konni guṇamula pērlukādu - jagattu puṭṭuṭaku kāraṇamagu guṇamu akhila guṇamulanu sādhiṃcuṭa cētanu, iṃkoka rītigā ceppuṭaku vīlu kānaṃduna).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.