← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వః sarvaḥ

Original — తెలుగు
  1. సర్వరూపః; ప్రపంచరూపః -

(అన్నింటి రూపములు తానే అయినవాడు - ప్రపంచమే రూపముగా గలవాడు - సర్వ స్వరూపుడు)

  1. “సమస్తం సర్వం సదసచ్చ, చేతనా చేతనా త్మకం యదస్తి తత్సర్వం హరేర్నావ్యత్, తచ్ఛరీరకతయా, సర్వదా తదపృథక్ సిద్ధ్యా తదాత్మకతయా తతః అన్యన్న సర్వమపి తదాత్మకమేవ”.

(సద్వస్తువులు, అసద్వస్తువులు, చేతనములు - అచేతనములు, ఇవన్నియు, ఇదంతయు (ఇవన్నియు కలిసి యున్నదంతయు) భగవంతుని కంటె వేరు కాదు - ఇదంతయు అతని శరీరమే కాని వేరు కానిదగుటచేత, ఏదియు అతని కంటె వేరు కాదు).

  1. సర్వాత్మా

(అన్నింటియొక్క ఆత్మ తానే అయినవాడు - అన్నింటికి శరీరము తానే అయినవాడు).

  1. స్వస్య మాయయా సర్వః -

(తన మాయ చేత అన్నియు తానే అయినవాడు)

  1. “శ్లో ||. అనతశ్చ సతశ్చైవ సర్వస్య ప్రభవా వ్యయాత్ |

సర్వస్య సర్వదా జ్ఞానాత్ సర్వమేవం ప్రచక్షతే ||”

ఇతి భగవద్వ్యాస వచనాత్ సర్వః. (శ్రీ శంకరః) (ఉపదేశ సాహస్రి)

(సద్వస్తువులు, అసద్వస్తువులు - అనగా, నిత్యమైనవి, నిత్యము కానివి - వీటి అన్నింటికీ సృష్టి వినాశములు చేయువాదగుతచేత, అన్నింటికీ సృష్టి వినాశములు చేయువాడగుటచేత, అన్నింటిని ఎల్లపుడు తెలుసుకొని యుండువాడగుటచేత, భగవంతుడు సర్వుడు అని చెప్పబడుచున్నాడు).

  1. సర్వం సమస్త జగత్ సమ్యక్ ఏకేన ఆత్మనా వ్యాప్నోతి యతః తస్మాత్ సర్వః-, త్వయా వినా భూతం నకించిదస్తి ఇత్యర్థః -

(జగత్తు అంతటిలోను - జగత్తులోని వస్తువులన్నింటిలోను ఒకే ఆత్మగా వ్యాపించి యున్నవాడు; అతను లేని భూతము లేదు - అందుచేత అంతయు అతనే కనుక సర్వుడు).

  1. “యతః సర్వం సమాప్నో షి, ఏకీ భావేన ఆసమం తాత్ వ్యాప్నోషి తతః హేతోః సర్వః ఇతినామ”.

(అన్నింటిలోను పూర్తిగా వ్యాపించియుండువాడవు - అన్నింటిని ఒకటిగా చేసి వాటి అన్నింటిలోను పూర్తిగా వ్యాపించియుండు వాడవు కనుక సర్వుడు - అను పేరు కలిగినది)

“సర్వం సమాప్నోషి తతోపి సర్వః” (శ్రీమద్భవద్గీత - 11 - 40)

“సర్వం సమస్తం జగత్ సమాప్నోషి, సమ్యక్ ఏకేన సద్రూపేణ ఆప్నోషి, సర్వాత్మనా వ్యాప్నోషి, తతః తస్మాత్ సర్వో అపి, త్వ ద్వ్యతిరిక్తం కిమపినా స్తీత్యర్థః”

(ఒకటే యగు సద్రూపముతో వ్యాపించియుండువాడవు - అన్నింటికి ఆత్మగా వ్యాపించి యుండువాడవు. అందుచేత సర్వుడవైతివి - అనగా నీకంటె వ్యతిరేకమైనది, వేరైనది లేదు అని అర్థము -).

  1. సర్వం విశ్వం సమ్యక్ అంతర్బహిశ్చ సమాప్నోషి, వ్యాప్నోషి - సువర్ణమివ కటక కుండలాది స్వకార్యం వ్యాప్య వర్తనే, తతః సర్వ రూపోసి.

(ప్రంచమంతటను, లోపలను, బైటను, పూర్తిగా వ్యాపించియున్నావు. బంగారము తన కార్యములైన కటక కుండలములలో వ్యాపించియుండునట్లు వ్యాపించియున్నావు. అందుచేత అన్ని రూపములు నీవే అయి యున్నావు - అందుచేత సర్వః).

  1. సర్వాసు దిక్షుస్థితత్వాత్ సర్వః -

“వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః” (శ్రీమద్భగవద్గీత - 11 - 20)

(అన్ని దిక్కులందు నుండుటవలన సర్వుడవు).

  1. “సకల చేతనా చేతనాంతర్యామి యైన సర్వేశ్వరుండు సర్వశబ్దవాచ్యుండు - గావున సకల జంతు నివాసంబులకు బుద్ధీంద్రియ మనః ప్రాణ శరీరంబులను సృజియించి చేతన వర్గంబునకు జ్ఞానప్రదుండగు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. - 1203). (10.2 - 1203)

  2. సర్వ స్వరూపః, క్షితి సలిల హతవహ పవన గగన హిమకర దినమణి య జ మానాత్మభిః అష్టాభిః మూర్తి భిః సర్వం వ్యాప్యస్థితః -

(అన్నింటి రూపములు తానే అయినవాడు - భూమి, జలము, అగ్ని, గాలి, ఆకాశము, చంద్రుడు, రవి, యజమానుడు అను యెనిమిది మార్పులతో (రూపములతో) అన్నింటిలోను వ్యాపించియుండువాడు - అందుచేత సర్వస్వరూపుడు కనుక సర్వుడు).

  1. “కలి పురుషుండెరుద్రత్వంబువల్ల పంచమహాభూతాలకున్నూ బీజ భూతుండు, రజోగుణం వల్ల హిరణ్యగర్భుండు కర్మేంద్రియ బీజ భూతుండు, సత్వగుణం వల్ల విరాట్పురుషుండె విష్ణువు జ్ఞానేంద్రియబీజ భూతుండు, రాజస సత్వ సం యోగం, వలన అంతఃకరణ బీజభూతుండై జగద్బీజ భావ యుక్తుండాయెను -” మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం“అని శ్రుతి”.

(బ్రహ్మవిద్యా సుధార్ణవము - 1)

  1. “జ్యోతీం షి విష్ణుర్భువనాని విష్ణుర్వనాని విష్ణుర్గిరయో దిశశ్చ |

నద్య స్సముద్రాశ్చ స ఏవ సర్వం యదస్తి యన్నాస్తి చ విప్రవర్య ||“. (విష్ణుపురాణము)

(జ్యోతిస్వరూపములైన సూర్యుడు మొదలగునవి విష్ణువే; లోకములు విష్ణువే; అడవులు, కొండలు, దిక్కులు, నదులు, సముద్రములు - అన్నియు, ఉన్నవి, లేనివి, కనబడుచున్నవి, కనబడనివి - విష్ణువే).

  1. “త్వమర్కస్త్వం సోమ స్త్వమపి పవన స్త్వం హుతవహః |

త్వమాపస్త్వం వ్యోమ త్వం ధరణి రాత్మాత్వమితి చ |

పరిఛ్ఛిన్నా మేవత్వయి పరిణతాం చిభ్రతిగిరం |

నవిద్మ స్తత్వం వయమిహతు యత్త్వం న భవసి ||“.

(సూర్యుడు, చంద్రుడు వాయువు, అగ్ని, నీరు, ఆకాశము, భూమి, ఆత్మా. ఇవన్నియు నీవే. ఇవన్నియు నీలోనే వేరు వేరుగా నున్నవాటిని భరించుచున్నావు. మేము నీ తత్వమును తెలుసుకొనలేకున్నాము)

  1. “భూరంభాస్యనలో (అ)నిలో (అ)oబర మహర్నాధో హిమాంశుః |

పుమానిత్యాభాతి చరా చరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం |

నాన్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ వరస్మాద్విభోస్త స్మై |

శ్రీగురుమూర్తయే నమః ఇదం శ్రీదక్షిణామూర్తయే ||“.

(భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, పురుషుడు అను ఎనిమిది రూపములతో ఈ చరా చర రూపముగా ప్రకాశించుచుండు వాడును, తనకంటె ఉత్కృష్టమైన వస్తువు మరొకటి లేనటువంటివాడును, గురువు అయిన శ్రీదక్షణామూర్తి గురించి నమస్కరించుచున్నాను).

  1. “సర్వో వైరుద్రః” ఇతి శ్రుతిః -

(అన్నియు రుద్రుడే - భగవంతుడే - అని శ్రుతి చెప్పుచున్నది).

  1. “సర్వం విష్ణు మయం జగత్”

హరిమయము విశ్వమంతయు - - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2-1 -17)

(ఈ జగత్తు అంతయు విష్ణువుతో నిండియున్నది).

  1. “యథా శంభు తయా సర్వం, విభాతి స్వత ఏవహి |

శంబురేవ సదా భాతి సర్వకారేణ నాపరః ||“. (సూతసంహితాయాం)

(ఈ ప్రపంచమంతయు ఈశ్వరుడు వలననే ప్రకాశించుచున్నది - అన్నింటి రూపములతో ఈశ్వరుడే ఎల్లపుడూ ప్రకాశించు చున్నాడు). (ఈ ప్రపంచములోని వస్తువులన్నియు ఈశ్వరుని ఆకారములే).

  1. “సర్వ రూపాయ ప్రపంచ రూపాయ” - యధా మనుష్యాది శరీరేషు ఆత్మతయా అను ప్రవిష్టః జీవః దేవోయమితి వ్యపదిశ్యతే - తద్వత్పరమాత్మా చిద చిదంతరాత్మతయా అవస్థితః తద్వ్యేవ దేశేన వ్యపదిశ్యతే. తత్తదంతరా త్మత్వమేన వ్యపదేశ హేతుత్వం. యద్వా, ఆత్మన్ శబ్దః కారణత్వపరః, కారణం హి మృద్ద్రవ్యం కారణాత్మనా పరిణతం మృత్ అయం ఘటః ఇతి కార్య భేదేన వ్యపదిశ్యతే. తథా సూక్ష్మ చిద చిద్విశిష్టః కారణభూతః పరమాత్మా స్థూల చిదచిద్విశిష్ట బ్రహ్మ రూప ప్రపంచ వ్యపదేశ వ్యపదేశ్యః ఇతి యుక్తంకారణాత్మత్వస్య సర్వత్వ వ్యపదేశ హేతుత్వే .

(అన్ని రూపములు తనవే (తనే) అయినవాడు - అనగా ప్రపంచమే తన రూపముగా గలవాడు. దేవతలు, మనుష్యులు మొదలగుగా గల వాటియందు ఆత్మగా ప్రవేశించినవాడై జీవుడు దేవుడని వ్యపదేశింపబడుచున్నట్లు పరమాత్మ చిద్వస్తువులందు అచిద్వస్తువులందు అంతరాత్మగా ప్రవేశించి వ్యపదేశింపబడుచున్నాడు - ఆత్మ కార్యవస్తువునకు కారణము, మట్టి అను ద్రవ్యము కారణము. ఇదే కుండ యను కార్యరూపముగా వ్యపదేశింపబడుచున్నది సూక్ష్మ చిదచిద్విశిష్టుడై కారణ భూతుడైన పరమాత్మ సూక్ష్మ చిద చిద్విశిష్ట బ్రహ్మ రూపమైన ప్రపంచముగా వ్యపదేశింపబడుచున్నాడు).

  1. ఆద్యంతాలు వడ్లైనాను నడుమ కసవు గలిగినట్టె, ఆద్యంతాన బ్రహ్మమైనా నడుమ ప్రపంచాకారం భాసిస్తున్నది. కనుక సర్వమున్నూ బ్రహ్మమనే చెప్పవలెను - “సర్వం ఖిల్విదం బ్రహ్మ” అనిన్నీ “ఆత్మై వేదం సర్వం” అనిన్నీ శ్రుతి పలెకెడిని .

(బ్రహ్మవిధ్యా సుధార్ణవము - 6)

(ప్రపంచ సృష్టికి ముందు పరబ్రహ్మ ఉండెను. ప్రపంచము నశించిన పిదప మరల పరబ్రహ్మ గానే ఉండును. ఈ మధ్యకాలములో ప్రపంచరూపముతో నుంటున్నాడు కనుక అంతయు పరబ్రహ్మమే - “ఇదంతయు బ్రహ్మమే - ఈ కనబడునదంతయు - ప్రపంచమంతయు - పరబ్రహ్మమే అనిన్నీ,” ఈ సర్వము ఆత్మయే యని శ్రుతి చెప్పుచున్నదికదా).

  1. “పురుష ఏ వేదం సర్వం” -

(ఈ సర్వ ప్రపంచమూ పురుషుడే - పరబ్రహ్మే - అందుచేత సర్వుడు) (“విశ్వమే వేదం పురుషః) (మంత్రపుష్పము)

  1. “సర్వం సమాప్నోషి తతోపి సర్వః” - (శ్రీమద్భగవద్గీత - 11 - 40)

(చూడుము - 7).

  1. “సీ. - - -

- - - నీ యధీన

ఆ. మాయ చేత నెఱుక మాలిన వారలు

పెక్కు గతుల నిన్ను పేరుకొందు

రెఱుగ నేర్చిన విభుధు లేక చిత్తంబున

నిఖిలమూర్తులెల్ల నీవయండ్రు ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 89)

  1. “న తదస్తి వినాయత్ స్యాత్ మయా భూతం చరాచరం”. (శ్రీమద్భగవద్గీత - 10 - 39)

“హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు” (చూడుము - 17).

“న పృధక్ మత్తః కించిదస్తి చరాచరం |

మదాత్మనా తతం సర్వం చరాచరమిదం జగత్“. (గీతాభావప్రకాశము - 10 - 165)

(నేను కానిది - నాకంటె వేఱైన భూతములు - చరములు గాని, అచరములుగాని లేవు. ఎందుచేతననగా ఈ చరాచర రూపమైన జగత్తు అంతయు నా ఆత్మగానే, నా శరీరముగానే వ్యాపించియున్నది.

“మయా తతమిదం సర్వం” (శ్రీమద్భగవద్గీత - 9 - 4)

“ఓత ప్రోత సమస్త వస్తు నిచయం” (శ్రీరామకర్ణామృతం - 2 - 50)

  1. “మాయాంతు ప్రకృతిం విద్ధి మాయినంతు మహేశ్వరం |

తస్యావయవ భూతేన వ్యాప్తం సర్వమిదం జగయ్ ||“.

(మాయ యనగా ప్రకృతి. మాయీ - మాయ కలవాడు - మహేశ్వరుడు - పరబ్రహ్మ. ఈ జగత్తు అంతయు అతని అవయవములుగా వ్యాపించియున్నది).

  1. “తత్సర్వ రూపం రఘునాధ మీళే” - (శ్రీరామకర్ణామృతం - 2 - 29)

(సమస్త రూపములు తానే అయిన శ్రీరామచంద్రుని స్తోత్రము చేయుచున్నాను -).

  1. “అఖిల రూపములు తన రూపమైనవాడు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 8 - 3 - 19)

  2. “బహూనాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే |

వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 19)

(“ఈ ప్రపంచమంతయు వాసుదేవుడే” అను జ్ఞానము కలవాడు - బ్రహ్మజ్ఞాని - అనేక జన్మల తర్వాత నిట్టి జ్ఞానము కలవాడు నన్ను చేరును - మోక్షము పొందును - అట్టి మహాత్ముడు దొరుకుట బహు కష్టము).

Transliteration
  1. sarvarūpaḥ; prapaṃcarūpaḥ -

(anniṃṭi rūpamulu tānē ayinavāḍu - prapaṃcamē rūpamugā galavāḍu - sarva svarūpuḍu)

  1. “samastaṃ sarvaṃ sadasacca, cētanā cētanā tmakaṃ yadasti tatsarvaṃ harērnāvyat, taccharīrakatayā, sarvadā tadapṛthak siddhyā tadātmakatayā tataḥ anyanna sarvamapi tadātmakamēva”.

(sadvastuvulu, asadvastuvulu, cētanamulu - acētanamulu, ivanniyu, idaṃtayu (ivanniyu kalisi yunnadaṃtayu) bhagavaṃtuni kaṃṭe vēru kādu - idaṃtayu atani śarīramē kāni vēru kānidaguṭacēta, ēdiyu atani kaṃṭe vēru kādu).

  1. sarvātmā

(anniṃṭiyokka ātma tānē ayinavāḍu - anniṃṭiki śarīramu tānē ayinavāḍu).

  1. svasya māyayā sarvaḥ -

(tana māya cēta anniyu tānē ayinavāḍu)

  1. “ślō ||. anataśca sataścaiva sarvasya prabhavā vyayāt |

sarvasya sarvadā jñānāt sarvamēvaṃ pracakṣatē ||”

iti bhagavadvyāsa vacanāt sarvaḥ. (śrī śaṃkaraḥ) (upadēśa sāhasri)

(sadvastuvulu, asadvastuvulu - anagā, nityamainavi, nityamu kānivi - vīṭi anniṃṭikī sṛṣṭi vināśamulu cēyuvādagutacēta, anniṃṭikī sṛṣṭi vināśamulu cēyuvāḍaguṭacēta, anniṃṭini ellapuḍu telusukoni yuṃḍuvāḍaguṭacēta, bhagavaṃtuḍu sarvuḍu ani ceppabaḍucunnāḍu).

  1. sarvaṃ samasta jagat samyak ēkēna ātmanā vyāpnōti yataḥ tasmāt sarvaḥ-, tvayā vinā bhūtaṃ nakiṃcidasti ityarthaḥ -

(jagattu aṃtaṭilōnu - jagattulōni vastuvulanniṃṭilōnu okē ātmagā vyāpiṃci yunnavāḍu; atanu lēni bhūtamu lēdu - aṃducēta aṃtayu atanē kanuka sarvuḍu).

  1. “yataḥ sarvaṃ samāpnō ṣi, ēkī bhāvēna āsamaṃ tāt vyāpnōṣi tataḥ hētōḥ sarvaḥ itināma”.

(anniṃṭilōnu pūrtigā vyāpiṃciyuṃḍuvāḍavu - anniṃṭini okaṭigā cēsi vāṭi anniṃṭilōnu pūrtigā vyāpiṃciyuṃḍu vāḍavu kanuka sarvuḍu - anu pēru kaliginadi)

“sarvaṃ samāpnōṣi tatōpi sarvaḥ” (śrīmadbhavadgīta - 11 - 40)

“sarvaṃ samastaṃ jagat samāpnōṣi, samyak ēkēna sadrūpēṇa āpnōṣi, sarvātmanā vyāpnōṣi, tataḥ tasmāt sarvō api, tva dvyatiriktaṃ kimapinā stītyarthaḥ”

(okaṭē yagu sadrūpamutō vyāpiṃciyuṃḍuvāḍavu - anniṃṭiki ātmagā vyāpiṃci yuṃḍuvāḍavu. aṃducēta sarvuḍavaitivi - anagā nīkaṃṭe vyatirēkamainadi, vērainadi lēdu ani arthamu -).

  1. sarvaṃ viśvaṃ samyak aṃtarbahiśca samāpnōṣi, vyāpnōṣi - suvarṇamiva kaṭaka kuṃḍalādi svakāryaṃ vyāpya vartanē, tataḥ sarva rūpōsi.

(praṃcamaṃtaṭanu, lōpalanu, baiṭanu, pūrtigā vyāpiṃciyunnāvu. baṃgāramu tana kāryamulaina kaṭaka kuṃḍalamulalō vyāpiṃciyuṃḍunaṭlu vyāpiṃciyunnāvu. aṃducēta anni rūpamulu nīvē ayi yunnāvu - aṃducēta sarvaḥ).

  1. sarvāsu dikṣusthitatvāt sarvaḥ -

“vyāptaṃ tvayaikēna diśaśca sarvāḥ” (śrīmadbhagavadgīta - 11 - 20)

(anni dikkulaṃdu nuṃḍuṭavalana sarvuḍavu).

  1. “sakala cētanā cētanāṃtaryāmi yaina sarvēśvaruṃḍu sarvaśabdavācyuṃḍu - gāvuna sakala jaṃtu nivāsaṃbulaku buddhīṃdriya manaḥ prāṇa śarīraṃbulanu sṛjiyiṃci cētana vargaṃbunaku jñānapraduṃḍagu”. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. - 1203). (10.2 - 1203)

  2. sarva svarūpaḥ, kṣiti salila hatavaha pavana gagana himakara dinamaṇi ya ja mānātmabhiḥ aṣṭābhiḥ mūrti bhiḥ sarvaṃ vyāpyasthitaḥ -

(anniṃṭi rūpamulu tānē ayinavāḍu - bhūmi, jalamu, agni, gāli, ākāśamu, caṃdruḍu, ravi, yajamānuḍu anu yenimidi mārpulatō (rūpamulatō) anniṃṭilōnu vyāpiṃciyuṃḍuvāḍu - aṃducēta sarvasvarūpuḍu kanuka sarvuḍu).

  1. “kali puruṣuṃḍerudratvaṃbuvalla paṃcamahābhūtālakunnū bīja bhūtuṃḍu, rajōguṇaṃ valla hiraṇyagarbhuṃḍu karmēṃdriya bīja bhūtuṃḍu, satvaguṇaṃ valla virāṭpuruṣuṃḍe viṣṇuvu jñānēṃdriyabīja bhūtuṃḍu, rājasa satva saṃ yōgaṃ, valana aṃtaḥkaraṇa bījabhūtuṃḍai jagadbīja bhāva yuktuṃḍāyenu -” mayyēva sakalaṃ jātaṃ mayi sarvaṃ pratiṣṭhitaṃ”ani śruti”.

(brahmavidyā sudhārṇavamu - 1)

  1. “jyōtīṃ ṣi viṣṇurbhuvanāni viṣṇurvanāni viṣṇurgirayō diśaśca |

nadya ssamudrāśca sa ēva sarvaṃ yadasti yannāsti ca vipravarya ||“. (viṣṇupurāṇamu)

(jyōtisvarūpamulaina sūryuḍu modalagunavi viṣṇuvē; lōkamulu viṣṇuvē; aḍavulu, koṃḍalu, dikkulu, nadulu, samudramulu - anniyu, unnavi, lēnivi, kanabaḍucunnavi, kanabaḍanivi - viṣṇuvē).

  1. “tvamarkastvaṃ sōma stvamapi pavana stvaṃ hutavahaḥ |

tvamāpastvaṃ vyōma tvaṃ dharaṇi rātmātvamiti ca |

parichchinnā mēvatvayi pariṇatāṃ cibhratigiraṃ |

navidma statvaṃ vayamihatu yattvaṃ na bhavasi ||“.

(sūryuḍu, caṃdruḍu vāyuvu, agni, nīru, ākāśamu, bhūmi, ātmā. ivanniyu nīvē. ivanniyu nīlōnē vēru vērugā nunnavāṭini bhariṃcucunnāvu. mēmu nī tatvamunu telusukonalēkunnāmu)

  1. “bhūraṃbhāsyanalō (a)nilō (a)obara maharnādhō himāṃśuḥ |

pumānityābhāti carā carātmakamidaṃ yasyaiva mūrtyaṣṭakaṃ |

nānyat kiṃcana vidyatē vimṛśatāṃ yasmāt varasmādvibhōsta smai |

śrīgurumūrtayē namaḥ idaṃ śrīdakṣiṇāmūrtayē ||“.

(bhūmi, nīru, agni, vāyuvu, ākāśamu, sūryuḍu, caṃdruḍu, puruṣuḍu anu enimidi rūpamulatō ī carā cara rūpamugā prakāśiṃcucuṃḍu vāḍunu, tanakaṃṭe utkṛṣṭamaina vastuvu marokaṭi lēnaṭuvaṃṭivāḍunu, guruvu ayina śrīdakṣaṇāmūrti guriṃci namaskariṃcucunnānu).

  1. “sarvō vairudraḥ” iti śrutiḥ -

(anniyu rudruḍē - bhagavaṃtuḍē - ani śruti ceppucunnadi).

  1. “sarvaṃ viṣṇu mayaṃ jagat”

harimayamu viśvamaṃtayu - - (śrīmadāṃdhramahābhāgavatamu - 2-1 -17)

(ī jagattu aṃtayu viṣṇuvutō niṃḍiyunnadi).

  1. “yathā śaṃbhu tayā sarvaṃ, vibhāti svata ēvahi |

śaṃburēva sadā bhāti sarvakārēṇa nāparaḥ ||“. (sūtasaṃhitāyāṃ)

(ī prapaṃcamaṃtayu īśvaruḍu valananē prakāśiṃcucunnadi - anniṃṭi rūpamulatō īśvaruḍē ellapuḍū prakāśiṃcu cunnāḍu). (ī prapaṃcamulōni vastuvulanniyu īśvaruni ākāramulē).

  1. “sarva rūpāya prapaṃca rūpāya” - yadhā manuṣyādi śarīrēṣu ātmatayā anu praviṣṭaḥ jīvaḥ dēvōyamiti vyapadiśyatē - tadvatparamātmā cida cidaṃtarātmatayā avasthitaḥ tadvyēva dēśēna vyapadiśyatē. tattadaṃtarā tmatvamēna vyapadēśa hētutvaṃ. yadvā, ātman śabdaḥ kāraṇatvaparaḥ, kāraṇaṃ hi mṛddravyaṃ kāraṇātmanā pariṇataṃ mṛt ayaṃ ghaṭaḥ iti kārya bhēdēna vyapadiśyatē. tathā sūkṣma cida cidviśiṣṭaḥ kāraṇabhūtaḥ paramātmā sthūla cidacidviśiṣṭa brahma rūpa prapaṃca vyapadēśa vyapadēśyaḥ iti yuktaṃkāraṇātmatvasya sarvatva vyapadēśa hētutvē .

(anni rūpamulu tanavē (tanē) ayinavāḍu - anagā prapaṃcamē tana rūpamugā galavāḍu. dēvatalu, manuṣyulu modalagugā gala vāṭiyaṃdu ātmagā pravēśiṃcinavāḍai jīvuḍu dēvuḍani vyapadēśiṃpabaḍucunnaṭlu paramātma cidvastuvulaṃdu acidvastuvulaṃdu aṃtarātmagā pravēśiṃci vyapadēśiṃpabaḍucunnāḍu - ātma kāryavastuvunaku kāraṇamu, maṭṭi anu dravyamu kāraṇamu. idē kuṃḍa yanu kāryarūpamugā vyapadēśiṃpabaḍucunnadi sūkṣma cidacidviśiṣṭuḍai kāraṇa bhūtuḍaina paramātma sūkṣma cida cidviśiṣṭa brahma rūpamaina prapaṃcamugā vyapadēśiṃpabaḍucunnāḍu).

  1. ādyaṃtālu vaḍlainānu naḍuma kasavu galiginaṭṭe, ādyaṃtāna brahmamainā naḍuma prapaṃcākāraṃ bhāsistunnadi. kanuka sarvamunnū brahmamanē ceppavalenu - “sarvaṃ khilvidaṃ brahma” aninnī “ātmai vēdaṃ sarvaṃ” aninnī śruti palekeḍini .

(brahmavidhyā sudhārṇavamu - 6)

(prapaṃca sṛṣṭiki muṃdu parabrahma uṃḍenu. prapaṃcamu naśiṃcina pidapa marala parabrahma gānē uṃḍunu. ī madhyakālamulō prapaṃcarūpamutō nuṃṭunnāḍu kanuka aṃtayu parabrahmamē - “idaṃtayu brahmamē - ī kanabaḍunadaṃtayu - prapaṃcamaṃtayu - parabrahmamē aninnī,” ī sarvamu ātmayē yani śruti ceppucunnadikadā).

  1. “puruṣa ē vēdaṃ sarvaṃ” -

(ī sarva prapaṃcamū puruṣuḍē - parabrahmē - aṃducēta sarvuḍu) (“viśvamē vēdaṃ puruṣaḥ) (maṃtrapuṣpamu)

  1. “sarvaṃ samāpnōṣi tatōpi sarvaḥ” - (śrīmadbhagavadgīta - 11 - 40)

(cūḍumu - 7).

  1. “sī. - - -

- - - nī yadhīna

ā. māya cēta neṟuka mālina vāralu

pekku gatula ninnu pērukoṃdu

reṟuga nērcina vibhudhu lēka cittaṃbuna

nikhilamūrtulella nīvayaṃḍru ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 89)

  1. “na tadasti vināyat syāt mayā bhūtaṃ carācaraṃ”. (śrīmadbhagavadgīta - 10 - 39)

“harimayamu gāni dravyamu paramāṇuvu lēdu” (cūḍumu - 17).

“na pṛdhak mattaḥ kiṃcidasti carācaraṃ |

madātmanā tataṃ sarvaṃ carācaramidaṃ jagat”. (gītābhāvaprakāśamu - 10 - 165)

(nēnu kānidi - nākaṃṭe vēṟaina bhūtamulu - caramulu gāni, acaramulugāni lēvu. eṃducētananagā ī carācara rūpamaina jagattu aṃtayu nā ātmagānē, nā śarīramugānē vyāpiṃciyunnadi.

“mayā tatamidaṃ sarvaṃ” (śrīmadbhagavadgīta - 9 - 4)

“ōta prōta samasta vastu nicayaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 50)

  1. “māyāṃtu prakṛtiṃ viddhi māyinaṃtu mahēśvaraṃ |

tasyāvayava bhūtēna vyāptaṃ sarvamidaṃ jagay ||“.

(māya yanagā prakṛti. māyī - māya kalavāḍu - mahēśvaruḍu - parabrahma. ī jagattu aṃtayu atani avayavamulugā vyāpiṃciyunnadi).

  1. “tatsarva rūpaṃ raghunādha mīḷē” - (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 29)

(samasta rūpamulu tānē ayina śrīrāmacaṃdruni stōtramu cēyucunnānu -).

  1. “akhila rūpamulu tana rūpamainavāḍu” (śrīmadāṃdhramahābhāgavatamu - 8 - 3 - 19)

  2. “bahūnāṃ janma nāmaṃtē jñānavān māṃ prapadyatē |

vāsudēvaḥ sarvamiti samahātmā sudurlabhaḥ ||“. (śrīmadbhagavadgīta - 7 - 19)

(“ī prapaṃcamaṃtayu vāsudēvuḍē” anu jñānamu kalavāḍu - brahmajñāni - anēka janmala tarvāta niṭṭi jñānamu kalavāḍu nannu cērunu - mōkṣamu poṃdunu - aṭṭi mahātmuḍu dorukuṭa bahu kaṣṭamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.