← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వజ్ఞః sarvajñaḥ

Original — తెలుగు
  1. సర్వం జానాతీతి సర్వజ్ఞః - సర్వ విషయక జ్ఞానవాన్.

(అన్నీ తెలిసినవాడు - అన్ని విషయములగుఱించి అయిన జ్ఞానము కలవాడు).

  1. సామాన్యతః సర్వం జానాతీతి సర్వజ్ఞః -

(సామాన్యముగా అన్నియు తెలిసినవాడు)

  1. అశేషజ్ఞః

(ఏదియు మిగలకుండగ అన్నింటిని తెలిసినవాడు)

  1. “సర్వమిదం స్వరూపతః ప్రకారతశ్చ వీత్తీత్యర్థః”. (శ్రీకూరనారాయణః)

(ఈ ప్రపంచమునంతను దాని గుఱించిన అన్ని విషయములను యధార్థముగాను, అన్ని ప్రకారముల తెలిసినవాడు).

  1. “సర్వస్థ సర్వభదావస్థో జ్ఞాతేత్యేష సర్వజ్ఙః -”. (శ్రీశంకరః)

(అన్నింటియొక్క అన్ని విధములైన అవస్థలను తెలిసినవాడు).

  1. ‘సర్వశ్చాసౌ జ్ఞశ్చ సర్వజ్ఞః’ (శ్రీ శంకరః)

(అన్నియు తానే అయినవాడున్నూ, జ్ఞాని అయినవాడున్నూ కనుక సర్వజ్ఞః).

  1. సర్వో భూత్వా సర్వం జానాతీతి సర్వజ్ఞః -

(అన్ని వస్తువులు తానే అయి వాటి అన్నింటి గుఱించి తెలిసినవాడు).

  1. వస్తుతః సర్వం భూత భవిష్యాది జానాతీతి సర్వజ్ఞః -

(ఇదివరకు జరిగినవి, ముందు జరుగబోవునవి యగు విషయములను అన్నింటిని వాస్తవముగా తెలిసినవాడు - భూత భవిష్యద్వర్తమానకాలజ్ఞానము కలవాడు).

  1. “ఏ కార్యంబునైన నెఱుంగు సామర్ధ్యంబు గకుటంజేసి సర్వజ్ఞత్వము”.

  2. తస్య ఉపాధిభూత మాయాయాః శుద్ధ సత్వ గుణ ప్రథానత్వాత్ సర్వజ్ఞత్వ సిద్ధిః -

(తనకు ఉపాధి అయిన మాయగల పరబ్రహ్మకు శుద్ధ సత్వగుణమే ప్రథానముగా కలిగియుండిటవలన పరబ్రహ్మకు సర్వజ్ఞత్వము సిద్ధించినది)

  1. “తదక్షరం వేదయతే యస్తు. సౌమ్య, స సర్వజ్ఞః” - (ప్రశ్నోపనిషత్)

“సర్వైః దేవైః వాగీంద్రియైస్సహ ముఖ్య ప్రానాని, భూతాని చ జీవాత్మా చ యత్ర ప్రతిష్ఠంతి తాదృశం శుభా అక్షరం నిర్వికారం పరమాత్మానం యోజనాతి స సర్వజ్ఞః -”. (శ్రీరంగ రామనుజః)

(అక్షరుడగు - క్షీణించనివాడగు - పరబ్రహ్మను తెలుసుకొనినవాడు సర్వజ్ఞుడు)

(వాక్కు మొదలగు ఇంద్రియములతోను, వాటి అధిదేవతలుతోను కొడిన ముఖ్యప్రాణములు, భూతములు. మహా భూతములు, జీవాత్మ దేనిలో ప్రతిష్టించియున్నవో, అటువంటి అక్షరుడగు పరబ్రహ్మను తెలిసినవాడు సర్వజ్ఞుడు)

  1. సర్వకారణత్వాత్ - యో యత్కర్తా స తజ్ఞః, యథాకులాలః ఇతి స్థితం -

(కుమ్మరివాడు కుండలను చేయుట యెలిసినవాడు - ఎవడు దేనిని చేసినవాడు దాని జ్ఞానము కలవాడు. అట్లే సమస్త ప్రపంచమును సృష్టించుటవలన - దానికి కారణమగుటవలన భగవంతుడు సర్వమును తెలిసినవాడు కనుక సర్వజ్ఞుడు).

  1. “అస్య మహతో భూతస్య నిఃస్వసితమేవ ఏత ద్యదృగ్వేదో, యజుర్వేదః సామవేదః అధర్వాంగిర స” ప్రకాశన శక్తిత్వాత్, కార్య గతశక్తిత్వా ద్వా ప్రదీప గతి శక్తి వత్ ఇతి వేదో పాదానత్వేన బ్రహ్మణః స్వసంబందా శేషార్థ ప్రకాశన సామర్థ్య రూపం సర్వసాక్షిత్వం సిద్ధ్యతి - యద్వా, యథా అధ్యేతారః పూర్వ క్రమం జ్ఞాత్వా వేదం కుర్వంతి, తథా విచిత్రగుణ మాయా సహాయో అనావృతానంత స్వప్రకాశ చిద్రూపః పరమేశ్వరః స్వకృత పూర్వ కల్పీయ సజాతీయ క్రమవంతం వేదరాశిం తదార్థాంశ్చ యుగపత్ జ్ఞానన్నేవ కరోతీతి. న వేదస్య పౌరుషేయతా - యత్రహి అర్థజ్ఞాన పూర్వకం వాక్యజ్ఞానం వాక్యనృష్టౌ కారణం తత్ర పౌరుషేయతా. అత్రచ యోగ పద్యాన్నసా. అతో వేదకర్తా వేదమివ తదర్థమపి స్వ సంబంద్ధం నాంతరీయకతయా జానా తీతి సర్వజ్ఞ ఇతి సిద్ధాంతః -.

(ఈ మహాభూతమైన పరబ్రహ్మయొక్క నిశ్వాసమే ఈ ఋగ్వేదము. యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము).

దీపములో ప్రకాశించునట్టియు ప్రకాశింప చేయునట్టి శక్తియు యున్నట్లు బ్రహ్మకు తనను గుఱించి (తనకు సంబంధించిన) అనేక విషయములను ప్రకాశింపచేయు (ప్రకటన చేయ గలుగు) సామర్థ్యము అన్నింటికి సాక్షి యగుట సిద్ధించినది, అధ్యేతలు పూర్వక్రమమును తెలుసుకొని వేదమును చెప్పునట్లు విచిత్ర గుణములు గల మాయ సహాయముతో అనంతుడు, స్వప్రకాశుడు, చిద్రూపుడు అయిన పరమేశ్వరుడు పూర్వ కల్పములో తాను చేసిన వేదములను వాటి అర్థములతో కూడ తెలిసిన వాడగుటచేత వేదములను చేసినందున వేదములు పౌరుషేయములు కావు. వాక్యమును సృష్టించుటలో వాక్యము యొక్క అర్థమును ముందుగా తెలిసియుండుట ముందుగా సంభవించినచో పౌరుషేయమగును. వేదము విషయములో అటువంటిది సంభవించలేదు - వేదము వలెనే వేదార్థము కూడా పూర్తిగా ఇతర సంబంధము లేకనే తెలిసినవాడు కనుక పరమేశ్వరుడు సర్వజ్ఞుడని సిద్ధాంతము చేయబడినది - నిశ్చయముగా చెప్పబడినది).

  1. మహతః ఋగ్వేదాదేః శాస్త్రస్య అనేక విద్యా స్థానోప బృంహితస్య ప్రదీప వత్సర్వార్ధావ ద్యోతినః, సర్వజ్ఞ కల్పస్య యోనిః కారణం బ్రహ్మ నహీదృశస్య శాస్త్రస్య ఋగ్వేదాది లక్షణస్య.సర్వజ్ఞ గుణాన్వితస్య సర్వజ్ఞా దన్యతః సంభవో అస్తి యద్యద్వస్తరార్థం శాస్త్రం. యస్మాత్పురుష విశేషాత్ సంభవతి - యధా వ్యాకరణాది పాణిన్యాదేః జ్ఞేయైనదేశార్థమపి సతతో అప్యధికతర విజ్ఞానః ఇతి ప్రసిద్ధం లోకే, కిమువక్తవ్యం అనేక శాఖా బేద భిన్నస్య దేవతిర్యఙ్మనుష్య వర్ణాశ్రమాది ప్రవిభాగ హేతోః ఋగ్వేదా వ్యాఖ్యస్య సర్వజానాకరస్య అప్రయత్నేనైవ లీలాన్యాయేన పురుష నిశ్వాసవద్యస్మాన్ మహతో భూతాద్యోనేః సంభవః - “అస్య మహతో భూతస్య నిశ్వసిత మేవ ఏదద్యదృగ్వేదో యజుర్వేద సామవేదా ఇత్యాది శ్రుతేః తస్య మహతో భూతస్య నిరతిశయం సర్వజ్ఞత్వం, స్వశక్తి మత్వంచ ఇతి”.

(శ్రీ శంకరః - బ్రహ్మ సూత్రభాష్యే)

(అనేక విద్యాసాధనములతో ఉపబృంహితమైనదిన్నీ, గొప్పదైనదిన్నీ, దీపమువలె సర్వార్థములను బోధించునది - సమస్తమైన జ్ఞానమును బోధించునది - అయిన ఋగ్వేదము మొదలగు శాస్త్రమునకు పరబ్రహ్మ కారణము - కర్త. ఋగ్వేదము మొదలగు లక్షణముగల సర్వజ్ఞ గుణములు కలిగియున్న ఇటువంటి శాస్త్రము సర్వజ్ఞుడు కానివానివలన సంభవింపదు - శాస్త్రమును విస్తరించి ఏ పురుషుడైనను చెప్పినచో - ఉదాహరణకు, పాణిని వ్రాసిన వ్యాకరణ శాస్త్రము మొదలగునవి - లోకములో అది ఒకే ఒక విషయము గుఱించినదగుటచేత అధికజ్ఞానము కలిగించునది అని ప్రఖ్యాతి. అట్టి విషయములో అనేక శాఖ భేదములు కలిగి దేవ తిర్యఙ్మనుష్య వర్ణాశ్రమములు మొదలగు వేరు వేరు భాగములు గలిగిన ఋగ్వేదము మొదలగు సమస్తమైన జ్ఞానమునకు ఆకరము అయిన వేదము పురుషుడు, మహాభూతము అయిన భగవంతుని వల నిశ్వాసము వలె కలిగినది. ఈ విషయము శ్రుతిలో ఈ ప్రకారముగ చెప్పబడుచున్నది - “ఈ మహాద్భూతము యొక్క నిశ్వాసమే ఈ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము” దీని వలన ఆ మహాభూతమైన పరబ్రహ్మ యొక్క నిరతిశయమైన సర్వజ్ఞత్వము, సర్వ శక్తిత్వము తెలియబడుచున్నది).

  1. “శాస్త్రస్య ఋగ్వేదాదేః సర్వజ్ఞకల్పస్య యోనిః కారణం తస్య భావః తత్వం తస్మాత్ వేదకర్తృత్వాత్ సర్వజ్ఞత్వం”. (బ్రహ్మతత్వ ప్రకాశికా)

(సర్వజ్ఞకల్పమైన ఋగ్వేదము మొదలగు శాస్త్రమునకు కారణము బ్రహ్మ - వేదమును చేయుటచేత పరబ్రహ్మ సర్వజ్ఞుడు).

  1. “జగతః కర్తా ఈశ్వరః, జగత్స్వయం నోత్పన్నం - కర్తారం వినా యది జగద్భవేత్ తదా కులాల మంతరేణాసి ఘటో జాయతే. అతః జగతః కర్తా కశ్చిదస్తి; స చ కర్తా సర్వజ్ఞః - యో యస్య కార్యస్య కర్తా సః తత్కార్యం తదుపాదాన కారణం చ జ్ఞాత్వా ఏవ కరోతి - తస్మాత్ జగతః కర్తాపి జగత్, తదుపాదాన కారణాం చ జ్ఞాత్వా ఏవ జగదుత్పాదయతి. ఇత్థం, యస్మాత్ జగతః కర్తా జగదుత్పాదన కారణం చ జానాతి, తస్మాత్ సః సర్వజ్ఞః” -

(ఈ జగత్తునకు కర్త - సృష్టించినవాడు - భగవంతుడు. జగత్తు దానంతట అదే పుట్టి యుండలేదు. కర్త లేకుండగ జగత్తు పుట్టియున్నచో కుమ్మరివాడు లేకుండగనే కుండ అయి యుండవలెను - అందుచేత జగత్తునకు కర్త ఒకడున్నాడు - ఆ కర్త సర్వజ్ఞుడు - ఎవడు ఏ కార్యమునకు కర్తయో అతడు ఆ కార్యమును, దాని ఉపాదాన కరణమును తెలుసుకొనియే ఆ కార్యము చేయును. అందుచేత జగత్తును సృష్టించినవాడు జగత్తును, దాని ఉపాదాన కారణమును తెలిసియే జగత్తును సృష్టించెను. అందుచేత జగత్తును, జగత్తును పుట్టించుటకు ఉపాదానకారణమును తెలిసినవాడు కనుక పరబ్రహ్మ సర్వజ్ఞుడు).

  1. “యః సర్వజ్ఞః సర్వవిత్”.

(జగత్తును సృష్టించుటకు కావలసిన జ్ఞానము కలవాడగుటచేత సరజ్ఞుడు - “పశ్యత్యచక్షు, స శ్రుణోత్యకర్ణః” (పరబ్రహ్మ అవయవములు లేనివాడు - కన్నులు లేనివాడైనను చూచుచున్నాడు, చెవులు లేనివాడైనను వినుచున్నాడు - అని శ్రుతి వాక్యము - (ప్రతి శరీరములోను అంతరాత్మగా నుండి అది చేసే పనులను చూచుచు, ఆడిన మాటలు వినుచుండువాడు).

  1. “వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున |

భవిష్యాణి చ భూతాని, మాంతు వేద న కశ్చన ||“. (శ్రీమద్భగవద్గీత - 7 - 26)

“అహం సర్వేశ్వరో లోకాన్ మాయయా మోహ యన్నపి |

అతిక్రాతాని భూతాని వర్తమానాని సర్వశః |

భవిష్యాణి చ జానామి కలతయే గతాస్యపి |

అతః పరమ సర్వజ్ఞో మాయావీ పరమేశ్వరః ||“. (గీతాభావప్రకాశము - 7 - 183; 184)

(నేను సర్వేశ్వరుడను, లోకములము మోహింప చేయుదును - జరిగిపోయిన కాలమందలి భూతములను - ఇప్పుడు జరుగుచున్నకాలమందుండు భూతములను. ముందు రాబోవు కాలములో నుండు భూతములను - మూడు కాలములలో నుండు భూతములను - నాకు తెలుసును - అందుచేత మాయావి అయిన సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు).

  1. బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున |

తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ||. (శ్రీమద్భగవద్గీత - 4 - 5)

అతి క్రాంతాని జన్మాని స్వోచ్చే పాంత వ పూమ్షిమే |

బహూని పరమేశస్య వాసుదేవస్య సద్విజోః |

తవ చా జ్ఞానిశః |

కర్మ నిర్మితాని తవార్జున _ - -

తాని జన్మాని సర్వాణి సర్వజ్ఞోహం మహేశ్వరః |

విజానామి త్వదీయాని మదీయా నీ లుప్త దృక్ |

సత్వం వేత్థ తిరోభూత జ్ఞానశక్తికతయాజ్ఞః ||. (గీతాభావప్రకాశము - 4 - 28 to 31)

(నా ఇష్టానుసారము నాకు కలిగిన శరీరములు అనేకములు గడిచి పోయినవు. అట్లే నీ జన్మలు కర్మ వలన కలిగినవి - నీవు అజ్ఞానివి. మన ఇద్దరి జన్మలు గతించినవన్నియు నాకు తెలుసును - నేను సర్వజ్ఞుడను కనుక నా దృష్టికి, నా జ్ఞానమునకు అడ్డు లేదు కనుక - నీ జ్ఞానము తిరోభూతమైనది - మాయమైనది - అందుచేత నీ జన్మల గుఱించి నీకు తెలియదు).

  1. ప్రపంచము సృష్టించుటలో అనేక శాస్త్రములు తెలియవలసియున్నది - భూగోళ శాస్త్రము, ఖగోళ శాస్త్రము, జంతుశాస్త్రము, వృక్షశాస్త్రము, ఖనిజశాస్త్రము మొదలగునవన్నియు ఆధినిక శాస్త్రజ్ఞులకు తెలిసినవే కాక, ఇంకను అనేక విషయముల గుఱించి వస్తువుల గుఱించి, వాటి మార్పుల గుఱించి తెలియని విషయములెన్నియో సృష్టిలో గలవు - ఇప్పటికి తెలిసినవి, తెలియకున్నవి అగు విషయముల గుఱించి సృష్టి చేసినవానికి తప్ప మానవ మాత్రునకు తెలియుట కష్టము - అదంతయు సృష్టి చేసినవానికే తెలియును - కనుక, సృష్టి చేసినవాడు భగవంతుడు కనుక అతనే సర్వజ్ఞుడు. శాస్త్రములన్నియు వేదములోనే యున్నవి. వేదము చేసినవాడు భగవంతుడు కనుక భగవంతుడు సర్వజ్ఞుడు).

  2. “ప్రథానాద్యవిద్యా విర్భావ లయసాక్షీ”.

(ప్రథానము మొదలగు అవిద్య యొక్క ఆవిర్భాగము, లయములకు సాక్షి అయినవాడు).

  1. “కస్మిన్ను, భగవో, విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి” (ముండకోపనిషత్)

(భగవంతుడా ! దేని నెఱింగిన సమస్తమును - ఈ సృష్టి అంతయు - ఎఱిగినట్లగును? అను ప్రశ్నకు ఉత్తరము - భగవంతుని తెలుసుకొనిన సర్వమును తెల్సుసుకొనినట్లగును - భగవంతుడే సర్వమును కనుక. అందుచేత భగవంతు నెఱిగినవాడు (బ్రహ్మజ్ఞాని) అన్నింటిని ఎఱింగినవాడు. అట్టివాడు సర్వజ్ణుడు).

  1. సకల పరిమాణ్వాది సూక్ష్మ వస్తు దర్శిత్వాత్ సర్వజ్ఞత్వం -“సర్వజ్ఞః సర్వ విత్” ఇతాగమోపి తత్ర ప్రమాణం -

(భగవంతుడు సర్వజ్ఞుడు అని వేదము చెప్పుచున్నందున వేదమే ప్రమాణము).

(పరమాణువు మొదలగు సూక్ష్మ వస్తువులను చూడ గలుగుటవలన సర్వజ్ఞత్వము)

  1. “శాస్త్ర యోనిత్వాత్” (బ్రహ్మ సూత్రములు - 1 -1 - 3)

(వేదమునకు కారణమైనవాడు కనుక పరబ్రహ్మ - దీనిని బట్టి అనేక శాఖలు గలిగి దేవ తిర్యఙ్మనుష్య వర్ణాశ్రమాది విభాగములు కలిగి సర్వ జ్ఞానమును బోధించిన దానికి - వేదమునకు - కారణమైనవాడు పరబ్రహ్మ కనుక పరబ్రహ్మ సర్వజ్ఞుడు).

  1. సర్వజ్ఞత్వాదులు = య స్సర్వజ్ఞః సర్వ విత్ | ఇత్యాది.

(పరబ్రహ్మ సర్వజ్ఞుడు అను మొదలగు బ్రహ్మ గుఱించి చెప్పెడి - బ్రహ్మపరములైన - వాక్యములు).

Transliteration
  1. sarvaṃ jānātīti sarvajñaḥ - sarva viṣayaka jñānavān.

(annī telisinavāḍu - anni viṣayamulaguṟiṃci ayina jñānamu kalavāḍu).

  1. sāmānyataḥ sarvaṃ jānātīti sarvajñaḥ -

(sāmānyamugā anniyu telisinavāḍu)

  1. aśēṣajñaḥ

(ēdiyu migalakuṃḍaga anniṃṭini telisinavāḍu)

  1. “sarvamidaṃ svarūpataḥ prakārataśca vīttītyarthaḥ”. (śrīkūranārāyaṇaḥ)

(ī prapaṃcamunaṃtanu dāni guṟiṃcina anni viṣayamulanu yadhārthamugānu, anni prakāramula telisinavāḍu).

  1. “sarvastha sarvabhadāvasthō jñātētyēṣa sarvajṅaḥ -”. (śrīśaṃkaraḥ)

(anniṃṭiyokka anni vidhamulaina avasthalanu telisinavāḍu).

  1. ‘sarvaścāsau jñaśca sarvajñaḥ’ (śrī śaṃkaraḥ)

(anniyu tānē ayinavāḍunnū, jñāni ayinavāḍunnū kanuka sarvajñaḥ).

  1. sarvō bhūtvā sarvaṃ jānātīti sarvajñaḥ -

(anni vastuvulu tānē ayi vāṭi anniṃṭi guṟiṃci telisinavāḍu).

  1. vastutaḥ sarvaṃ bhūta bhaviṣyādi jānātīti sarvajñaḥ -

(idivaraku jariginavi, muṃdu jarugabōvunavi yagu viṣayamulanu anniṃṭini vāstavamugā telisinavāḍu - bhūta bhaviṣyadvartamānakālajñānamu kalavāḍu).

  1. “ē kāryaṃbunaina neṟuṃgu sāmardhyaṃbu gakuṭaṃjēsi sarvajñatvamu”.

  2. tasya upādhibhūta māyāyāḥ śuddha satva guṇa prathānatvāt sarvajñatva siddhiḥ -

(tanaku upādhi ayina māyagala parabrahmaku śuddha satvaguṇamē prathānamugā kaligiyuṃḍiṭavalana parabrahmaku sarvajñatvamu siddhiṃcinadi)

  1. “tadakṣaraṃ vēdayatē yastu. saumya, sa sarvajñaḥ” - (praśnōpaniṣat)

“sarvaiḥ dēvaiḥ vāgīṃdriyaissaha mukhya prānāni, bhūtāni ca jīvātmā ca yatra pratiṣṭhaṃti tādṛśaṃ śubhā akṣaraṃ nirvikāraṃ paramātmānaṃ yōjanāti sa sarvajñaḥ -”. (śrīraṃga rāmanujaḥ)

(akṣaruḍagu - kṣīṇiṃcanivāḍagu - parabrahmanu telusukoninavāḍu sarvajñuḍu)

(vākku modalagu iṃdriyamulatōnu, vāṭi adhidēvatalutōnu koḍina mukhyaprāṇamulu, bhūtamulu. mahā bhūtamulu, jīvātma dēnilō pratiṣṭiṃciyunnavō, aṭuvaṃṭi akṣaruḍagu parabrahmanu telisinavāḍu sarvajñuḍu)

  1. sarvakāraṇatvāt - yō yatkartā sa tajñaḥ, yathākulālaḥ iti sthitaṃ -

(kummarivāḍu kuṃḍalanu cēyuṭa yelisinavāḍu - evaḍu dēnini cēsinavāḍu dāni jñānamu kalavāḍu. aṭlē samasta prapaṃcamunu sṛṣṭiṃcuṭavalana - dāniki kāraṇamaguṭavalana bhagavaṃtuḍu sarvamunu telisinavāḍu kanuka sarvajñuḍu).

  1. “asya mahatō bhūtasya niḥsvasitamēva ēta dyadṛgvēdō, yajurvēdaḥ sāmavēdaḥ adharvāṃgira sa” prakāśana śaktitvāt, kārya gataśaktitvā dvā pradīpa gati śakti vat iti vēdō pādānatvēna brahmaṇaḥ svasaṃbaṃdā śēṣārtha prakāśana sāmarthya rūpaṃ sarvasākṣitvaṃ siddhyati - yadvā, yathā adhyētāraḥ pūrva kramaṃ jñātvā vēdaṃ kurvaṃti, tathā vicitraguṇa māyā sahāyō anāvṛtānaṃta svaprakāśa cidrūpaḥ paramēśvaraḥ svakṛta pūrva kalpīya sajātīya kramavaṃtaṃ vēdarāśiṃ tadārthāṃśca yugapat jñānannēva karōtīti. na vēdasya pauruṣēyatā - yatrahi arthajñāna pūrvakaṃ vākyajñānaṃ vākyanṛṣṭau kāraṇaṃ tatra pauruṣēyatā. atraca yōga padyānnasā. atō vēdakartā vēdamiva tadarthamapi sva saṃbaṃddhaṃ nāṃtarīyakatayā jānā tīti sarvajña iti siddhāṃtaḥ -.

(ī mahābhūtamaina parabrahmayokka niśvāsamē ī ṛgvēdamu. yajurvēdamu, sāmavēdamu, adharvaṇavēdamu).

dīpamulō prakāśiṃcunaṭṭiyu prakāśiṃpa cēyunaṭṭi śaktiyu yunnaṭlu brahmaku tananu guṟiṃci (tanaku saṃbaṃdhiṃcina) anēka viṣayamulanu prakāśiṃpacēyu (prakaṭana cēya galugu) sāmarthyamu anniṃṭiki sākṣi yaguṭa siddhiṃcinadi, adhyētalu pūrvakramamunu telusukoni vēdamunu ceppunaṭlu vicitra guṇamulu gala māya sahāyamutō anaṃtuḍu, svaprakāśuḍu, cidrūpuḍu ayina paramēśvaruḍu pūrva kalpamulō tānu cēsina vēdamulanu vāṭi arthamulatō kūḍa telisina vāḍaguṭacēta vēdamulanu cēsinaṃduna vēdamulu pauruṣēyamulu kāvu. vākyamunu sṛṣṭiṃcuṭalō vākyamu yokka arthamunu muṃdugā telisiyuṃḍuṭa muṃdugā saṃbhaviṃcinacō pauruṣēyamagunu. vēdamu viṣayamulō aṭuvaṃṭidi saṃbhaviṃcalēdu - vēdamu valenē vēdārthamu kūḍā pūrtigā itara saṃbaṃdhamu lēkanē telisinavāḍu kanuka paramēśvaruḍu sarvajñuḍani siddhāṃtamu cēyabaḍinadi - niścayamugā ceppabaḍinadi).

  1. mahataḥ ṛgvēdādēḥ śāstrasya anēka vidyā sthānōpa bṛṃhitasya pradīpa vatsarvārdhāva dyōtinaḥ, sarvajña kalpasya yōniḥ kāraṇaṃ brahma nahīdṛśasya śāstrasya ṛgvēdādi lakṣaṇasya.sarvajña guṇānvitasya sarvajñā danyataḥ saṃbhavō asti yadyadvastarārthaṃ śāstraṃ. yasmātpuruṣa viśēṣāt saṃbhavati - yadhā vyākaraṇādi pāṇinyādēḥ jñēyainadēśārthamapi satatō apyadhikatara vijñānaḥ iti prasiddhaṃ lōkē, kimuvaktavyaṃ anēka śākhā bēda bhinnasya dēvatiryaṅmanuṣya varṇāśramādi pravibhāga hētōḥ ṛgvēdā vyākhyasya sarvajānākarasya aprayatnēnaiva līlānyāyēna puruṣa niśvāsavadyasmān mahatō bhūtādyōnēḥ saṃbhavaḥ - “asya mahatō bhūtasya niśvasita mēva ēdadyadṛgvēdō yajurvēda sāmavēdā ityādi śrutēḥ tasya mahatō bhūtasya niratiśayaṃ sarvajñatvaṃ, svaśakti matvaṃca iti”.

(śrī śaṃkaraḥ - brahma sūtrabhāṣyē)

(anēka vidyāsādhanamulatō upabṛṃhitamainadinnī, goppadainadinnī, dīpamuvale sarvārthamulanu bōdhiṃcunadi - samastamaina jñānamunu bōdhiṃcunadi - ayina ṛgvēdamu modalagu śāstramunaku parabrahma kāraṇamu - karta. ṛgvēdamu modalagu lakṣaṇamugala sarvajña guṇamulu kaligiyunna iṭuvaṃṭi śāstramu sarvajñuḍu kānivānivalana saṃbhaviṃpadu - śāstramunu vistariṃci ē puruṣuḍainanu ceppinacō - udāharaṇaku, pāṇini vrāsina vyākaraṇa śāstramu modalagunavi - lōkamulō adi okē oka viṣayamu guṟiṃcinadaguṭacēta adhikajñānamu kaligiṃcunadi ani prakhyāti. aṭṭi viṣayamulō anēka śākha bhēdamulu kaligi dēva tiryaṅmanuṣya varṇāśramamulu modalagu vēru vēru bhāgamulu galigina ṛgvēdamu modalagu samastamaina jñānamunaku ākaramu ayina vēdamu puruṣuḍu, mahābhūtamu ayina bhagavaṃtuni vala niśvāsamu vale kaliginadi. ī viṣayamu śrutilō ī prakāramuga ceppabaḍucunnadi - “ī mahādbhūtamu yokka niśvāsamē ī ṛgvēdamu, yajurvēdamu, sāmavēdamu adharvaṇavēdamu” dīni valana ā mahābhūtamaina parabrahma yokka niratiśayamaina sarvajñatvamu, sarva śaktitvamu teliyabaḍucunnadi).

  1. “śāstrasya ṛgvēdādēḥ sarvajñakalpasya yōniḥ kāraṇaṃ tasya bhāvaḥ tatvaṃ tasmāt vēdakartṛtvāt sarvajñatvaṃ”. (brahmatatva prakāśikā)

(sarvajñakalpamaina ṛgvēdamu modalagu śāstramunaku kāraṇamu brahma - vēdamunu cēyuṭacēta parabrahma sarvajñuḍu).

  1. “jagataḥ kartā īśvaraḥ, jagatsvayaṃ nōtpannaṃ - kartāraṃ vinā yadi jagadbhavēt tadā kulāla maṃtarēṇāsi ghaṭō jāyatē. ataḥ jagataḥ kartā kaścidasti; sa ca kartā sarvajñaḥ - yō yasya kāryasya kartā saḥ tatkāryaṃ tadupādāna kāraṇaṃ ca jñātvā ēva karōti - tasmāt jagataḥ kartāpi jagat, tadupādāna kāraṇāṃ ca jñātvā ēva jagadutpādayati. itthaṃ, yasmāt jagataḥ kartā jagadutpādana kāraṇaṃ ca jānāti, tasmāt saḥ sarvajñaḥ” -

(ī jagattunaku karta - sṛṣṭiṃcinavāḍu - bhagavaṃtuḍu. jagattu dānaṃtaṭa adē puṭṭi yuṃḍalēdu. karta lēkuṃḍaga jagattu puṭṭiyunnacō kummarivāḍu lēkuṃḍaganē kuṃḍa ayi yuṃḍavalenu - aṃducēta jagattunaku karta okaḍunnāḍu - ā karta sarvajñuḍu - evaḍu ē kāryamunaku kartayō ataḍu ā kāryamunu, dāni upādāna karaṇamunu telusukoniyē ā kāryamu cēyunu. aṃducēta jagattunu sṛṣṭiṃcinavāḍu jagattunu, dāni upādāna kāraṇamunu telisiyē jagattunu sṛṣṭiṃcenu. aṃducēta jagattunu, jagattunu puṭṭiṃcuṭaku upādānakāraṇamunu telisinavāḍu kanuka parabrahma sarvajñuḍu).

  1. “yaḥ sarvajñaḥ sarvavit”.

(jagattunu sṛṣṭiṃcuṭaku kāvalasina jñānamu kalavāḍaguṭacēta sarajñuḍu - “paśyatyacakṣu, sa śruṇōtyakarṇaḥ” (parabrahma avayavamulu lēnivāḍu - kannulu lēnivāḍainanu cūcucunnāḍu, cevulu lēnivāḍainanu vinucunnāḍu - ani śruti vākyamu - (prati śarīramulōnu aṃtarātmagā nuṃḍi adi cēsē panulanu cūcucu, āḍina māṭalu vinucuṃḍuvāḍu).

  1. “vēdāhaṃ samatītāni vartamānāni cārjuna |

bhaviṣyāṇi ca bhūtāni, māṃtu vēda na kaścana ||“. (śrīmadbhagavadgīta - 7 - 26)

“ahaṃ sarvēśvarō lōkān māyayā mōha yannapi |

atikrātāni bhūtāni vartamānāni sarvaśaḥ |

bhaviṣyāṇi ca jānāmi kalatayē gatāsyapi |

ataḥ parama sarvajñō māyāvī paramēśvaraḥ ||“. (gītābhāvaprakāśamu - 7 - 183; 184)

(nēnu sarvēśvaruḍanu, lōkamulamu mōhiṃpa cēyudunu - jarigipōyina kālamaṃdali bhūtamulanu - ippuḍu jarugucunnakālamaṃduṃḍu bhūtamulanu. muṃdu rābōvu kālamulō nuṃḍu bhūtamulanu - mūḍu kālamulalō nuṃḍu bhūtamulanu - nāku telusunu - aṃducēta māyāvi ayina sarvēśvaruḍu sarvajñuḍu).

  1. bahūni mē vyatītāni janmāni tava cārjuna |

tānyahaṃ vēda sarvāṇi na tvaṃ vēttha paraṃtapa ||. (śrīmadbhagavadgīta - 4 - 5)

ati krāṃtāni janmāni svōccē pāṃta va pūmṣimē |

bahūni paramēśasya vāsudēvasya sadvijōḥ |

tava cā jñāniśaḥ |

karma nirmitāni tavārjuna _ - -

tāni janmāni sarvāṇi sarvajñōhaṃ mahēśvaraḥ |

vijānāmi tvadīyāni madīyā nī lupta dṛk |

satvaṃ vēttha tirōbhūta jñānaśaktikatayājñaḥ ||. (gītābhāvaprakāśamu - 4 - 28 to 31)

(nā iṣṭānusāramu nāku kaligina śarīramulu anēkamulu gaḍici pōyinavu. aṭlē nī janmalu karma valana kaliginavi - nīvu ajñānivi. mana iddari janmalu gatiṃcinavanniyu nāku telusunu - nēnu sarvajñuḍanu kanuka nā dṛṣṭiki, nā jñānamunaku aḍḍu lēdu kanuka - nī jñānamu tirōbhūtamainadi - māyamainadi - aṃducēta nī janmala guṟiṃci nīku teliyadu).

  1. prapaṃcamu sṛṣṭiṃcuṭalō anēka śāstramulu teliyavalasiyunnadi - bhūgōḷa śāstramu, khagōḷa śāstramu, jaṃtuśāstramu, vṛkṣaśāstramu, khanijaśāstramu modalagunavanniyu ādhinika śāstrajñulaku telisinavē kāka, iṃkanu anēka viṣayamula guṟiṃci vastuvula guṟiṃci, vāṭi mārpula guṟiṃci teliyani viṣayamulenniyō sṛṣṭilō galavu - ippaṭiki telisinavi, teliyakunnavi agu viṣayamula guṟiṃci sṛṣṭi cēsinavāniki tappa mānava mātrunaku teliyuṭa kaṣṭamu - adaṃtayu sṛṣṭi cēsinavānikē teliyunu - kanuka, sṛṣṭi cēsinavāḍu bhagavaṃtuḍu kanuka atanē sarvajñuḍu. śāstramulanniyu vēdamulōnē yunnavi. vēdamu cēsinavāḍu bhagavaṃtuḍu kanuka bhagavaṃtuḍu sarvajñuḍu).

  2. “prathānādyavidyā virbhāva layasākṣī”.

(prathānamu modalagu avidya yokka āvirbhāgamu, layamulaku sākṣi ayinavāḍu).

  1. “kasminnu, bhagavō, vijñātē sarvamidaṃ vijñātaṃ bhavati” (muṃḍakōpaniṣat)

(bhagavaṃtuḍā ! dēni neṟiṃgina samastamunu - ī sṛṣṭi aṃtayu - eṟiginaṭlagunu? anu praśnaku uttaramu - bhagavaṃtuni telusukonina sarvamunu telsusukoninaṭlagunu - bhagavaṃtuḍē sarvamunu kanuka. aṃducēta bhagavaṃtu neṟiginavāḍu (brahmajñāni) anniṃṭini eṟiṃginavāḍu. aṭṭivāḍu sarvajṇuḍu).

  1. sakala parimāṇvādi sūkṣma vastu darśitvāt sarvajñatvaṃ -“sarvajñaḥ sarva vit” itāgamōpi tatra pramāṇaṃ -

(bhagavaṃtuḍu sarvajñuḍu ani vēdamu ceppucunnaṃduna vēdamē pramāṇamu).

(paramāṇuvu modalagu sūkṣma vastuvulanu cūḍa galuguṭavalana sarvajñatvamu)

  1. “śāstra yōnitvāt” (brahma sūtramulu - 1 -1 - 3)

(vēdamunaku kāraṇamainavāḍu kanuka parabrahma - dīnini baṭṭi anēka śākhalu galigi dēva tiryaṅmanuṣya varṇāśramādi vibhāgamulu kaligi sarva jñānamunu bōdhiṃcina dāniki - vēdamunaku - kāraṇamainavāḍu parabrahma kanuka parabrahma sarvajñuḍu).

  1. sarvajñatvādulu = ya ssarvajñaḥ sarva vit | ityādi.

(parabrahma sarvajñuḍu anu modalagu brahma guṟiṃci ceppeḍi - brahmaparamulaina - vākyamulu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.