“నామరూపాత్మకమై నానా భేదములతో గాన వచ్చు నీ ప్రపంచమంతయు పరబ్రహ్మనుండియే జనించినది, దానియందే నిలిచి సర్వ వ్యవహారముల నాచరించుచున్నది, అదే అంతము లయము నొందుచున్నది. ఈ కారణమువలన ఈ ప్రపంచమంతయు బ్రహ్మమే”
“యధా అవికృతాత్ మృత్పిండాత్ వికృతాః ఉదయాస్తమయే (ఉత్పత్తి లయౌ) ఉది తాః ఘటశరావాది వికారాః (రూపాః) మృత్ ఏవ, తద నన్యాః భవంతి, తథా అజోపలబ్ధః (మాయా దుదితం) ఏతత్ జగత్ (ఇదం) బ్రహ్మ ఏవ బృహతః సత్యస్య ఉదయాస్తమయే (ఉత్పత్తి లయే) సర్వోపాదానత్వాత్. అస్మాత్ సర్వం ఖిల్విదం బ్రహ్మ”.
(అవికృతమైన - మార్పు లేనిదైన - మట్టిముద్దనుండి వికృతములు - కుండ, మూకుడు మొదలగునవి పుట్టి - కరిగి - లయమైపోవుచున్నవి - లేకుండ పోవుచున్నవి. మట్టిగానే మిగిలి యుంటున్నవి. అందుచేత అవి మట్టేగాని వేఱు పదార్థము కాదు. మాయ వలన కలిగిన యీ జగత్తు (నామరూపములతోనుండు వస్తువులు గలది). అంతయు బ్రహ్మమే, సత్యుడు (అన్ని కాలము లందుండు వాడు) అయిన బ్రహ్మ, పుట్టుట, అలయమగుట, ఆన్ని వస్తువులకు తాను ఉపాదానమగుటవలన. అందుచేత సర్వం ఖిల్విదం బ్రహ్మ ” (ఈ ప్రంచమంతయు బ్రహ్మమే).
(అవశేషతయా బ్రహ్మణ సర్వోప సంహారేణ వ్యవస్థిత యా జగత్కారణత్వాత్ ఉపలబ్దం (సృష్టికాలే ఆవిర్భూతం ఉత్పన్నం) ఏతత్ జగత్ బృహత్ (బ్రహ్మ) ఇతి అవయంతి (ఆమనంతి) శ్రుతయః (జానంతి) బృహతః సర్వస్య ఉదయాస్తమయే (ఉత్పత్తిలయౌ సర్వోపాదానత్వాత్ - యధా తావ దవికృతా పిండాకార మృత్ ఘటశరావాది రూప వికృతా, తదనన్యాః తద్వత్).
(జగత్తును సృష్టించి, స్థితి కాలములో దానిని రక్షించి (పోషించి) ప్రళయకాలమందు దానిని సంహరించి తర్వాత మిగిలియుండువాడు పరబ్రహ్మ కనుక బ్రహ్మమే జగత్తు. అందుచేత ఈ కనబడు జగత్తు అంతయు బ్రహ్మమే అని చెప్పబడినది.మట్టితో చేయబడిన కుండ, మూకుడు మొదలగునవి మట్టి యొక్క వికారములే, రూపములే, కాని మట్టికంటె వేఱుకానట్లు).
(అవికృద్యతో యస్మాత్ వికృతేః కార్యస్య ఉదయాస్తమయే సా వికృతిః తదనన్యామృదివ యధా, తావ దవికృతాత్ మృత్పిండాత్ ఉదితా ఘతశరావాది రూపామృత్, తద నన్యా తద్వ దిత్యర్థః).
(కార్య వస్తువులు. వికృతులు, పుట్టుట నశించుట కలవి కనుక అవికృతి అయిన కారణవస్తువు నుండి పుట్టు కారణవస్తువులో లయమై పోవునవి, అవి వాటి కారణము కంటె వేరు కానివి. మట్టివలన పుట్టిన కుండ, మూకుడు మొదలగునవి మట్టికంటె వేఱు కానట్లే. పరబ్రహ్మనుండి జగత్తు అంతయు పుట్టినది కనుక జగత్తు పరబ్రహ్మముకంటె వేఱుకాదు, పరబ్రహ్మమే -)
శివస్వరూపమేవా హురిదం సర్వం విచక్షణాః |
సర్వ స్వరూప మజ్ఞానాత్ దృశ్యతే నతు వస్తుతః |
ఏష ఏవహి మంత్రార్థః సత్యాసత్యం న చాన్యథా |
వేదాః సర్వే పురాణాని స్మృతయో భారతం తథా |
అన్యాన్యానపి చ శాస్త్రాణి తథా తర్కాశ్చ సర్వశః |
శైవాగ మాశ్చ వివిధా ఆగమా వైష్ణవా అపి |
అన్యాగమాశ్చ విదుషామను భూతి స్తధైవచ |
అస్మిన్నర్థే స్వ సంవేద్యే పర్యవ స్యంతినాన్యథా |
బాధ్య బాధక తాం యాంతి వ్యవహారే పరస్పరం |
సముద్ర ఇవ కల్లోలా ఇతి వేదార్థ నిశ్చయః ||. (సూతసంహితాయాం)
(విస్తరించి చెప్పుటవలన ఏమి ఫలము? శివుని కంటె వేరైనది లేదు. విచక్షణులు ఈ ప్రపంచమంతయు శివుని స్వరూపమే యని చెప్పియుండిరి. ఈ కనబడు రూపములన్నియు అజ్ఞానము చేతనే వేఱు వేఱు రూపములుగా కనబడుచున్నవి - యధార్థముగా కాదు. ఇదియే యీ మంత్రము యొక్క అర్థము. వేదములు. పురాణములు, స్మృతులు, భారతము ఇతర శాస్త్రములు, తర్క శాస్త్రములు, శైవాగమములు, వైష్ణవాగమములు, ఇతర ఆగమములు, పండితుల అనుభవము చెప్పునదిదియే - వాటిలో చెప్పబడిన పర్యవసానమిదియే).
జ్జాలము దైవమున్, గురువు, సాంఖ్యము, మంత్రము, నగ్ని యాహుతుల్
వేళలు, విప్రులుం జననవృద్ధి లయంబు హేతుభూతముల్
లీలలు దానయై దగ వెలింగెడు నెక్కటి తేజమీశుడున్“. (శ్రీమదాంధ్రమాహా భాగవతము - 10 - ఉ.భా - 778)
(చూడుము - బ్రహ్మ)
“nāmarūpātmakamai nānā bhēdamulatō gāna vaccu nī prapaṃcamaṃtayu parabrahmanuṃḍiyē janiṃcinadi, dāniyaṃdē nilici sarva vyavahāramula nācariṃcucunnadi, adē aṃtamu layamu noṃducunnadi. ī kāraṇamuvalana ī prapaṃcamaṃtayu brahmamē”
“yadhā avikṛtāt mṛtpiṃḍāt vikṛtāḥ udayāstamayē (utpatti layau) udi tāḥ ghaṭaśarāvādi vikārāḥ (rūpāḥ) mṛt ēva, tada nanyāḥ bhavaṃti, tathā ajōpalabdhaḥ (māyā duditaṃ) ētat jagat (idaṃ) brahma ēva bṛhataḥ satyasya udayāstamayē (utpatti layē) sarvōpādānatvāt. asmāt sarvaṃ khilvidaṃ brahma”.
(avikṛtamaina - mārpu lēnidaina - maṭṭimuddanuṃḍi vikṛtamulu - kuṃḍa, mūkuḍu modalagunavi puṭṭi - karigi - layamaipōvucunnavi - lēkuṃḍa pōvucunnavi. maṭṭigānē migili yuṃṭunnavi. aṃducēta avi maṭṭēgāni vēṟu padārthamu kādu. māya valana kaligina yī jagattu (nāmarūpamulatōnuṃḍu vastuvulu galadi). aṃtayu brahmamē, satyuḍu (anni kālamu laṃduṃḍu vāḍu) ayina brahma, puṭṭuṭa, alayamaguṭa, ānni vastuvulaku tānu upādānamaguṭavalana. aṃducēta sarvaṃ khilvidaṃ brahma ” (ī praṃcamaṃtayu brahmamē).
(avaśēṣatayā brahmaṇa sarvōpa saṃhārēṇa vyavasthita yā jagatkāraṇatvāt upalabdaṃ (sṛṣṭikālē āvirbhūtaṃ utpannaṃ) ētat jagat bṛhat (brahma) iti avayaṃti (āmanaṃti) śrutayaḥ (jānaṃti) bṛhataḥ sarvasya udayāstamayē (utpattilayau sarvōpādānatvāt - yadhā tāva davikṛtā piṃḍākāra mṛt ghaṭaśarāvādi rūpa vikṛtā, tadananyāḥ tadvat).
(jagattunu sṛṣṭiṃci, sthiti kālamulō dānini rakṣiṃci (pōṣiṃci) praḷayakālamaṃdu dānini saṃhariṃci tarvāta migiliyuṃḍuvāḍu parabrahma kanuka brahmamē jagattu. aṃducēta ī kanabaḍu jagattu aṃtayu brahmamē ani ceppabaḍinadi.maṭṭitō cēyabaḍina kuṃḍa, mūkuḍu modalagunavi maṭṭi yokka vikāramulē, rūpamulē, kāni maṭṭikaṃṭe vēṟukānaṭlu).
(avikṛdyatō yasmāt vikṛtēḥ kāryasya udayāstamayē sā vikṛtiḥ tadananyāmṛdiva yadhā, tāva davikṛtāt mṛtpiṃḍāt uditā ghataśarāvādi rūpāmṛt, tada nanyā tadva dityarthaḥ).
(kārya vastuvulu. vikṛtulu, puṭṭuṭa naśiṃcuṭa kalavi kanuka avikṛti ayina kāraṇavastuvu nuṃḍi puṭṭu kāraṇavastuvulō layamai pōvunavi, avi vāṭi kāraṇamu kaṃṭe vēru kānivi. maṭṭivalana puṭṭina kuṃḍa, mūkuḍu modalagunavi maṭṭikaṃṭe vēṟu kānaṭlē. parabrahmanuṃḍi jagattu aṃtayu puṭṭinadi kanuka jagattu parabrahmamukaṃṭe vēṟukādu, parabrahmamē -)
śivasvarūpamēvā huridaṃ sarvaṃ vicakṣaṇāḥ |
sarva svarūpa majñānāt dṛśyatē natu vastutaḥ |
ēṣa ēvahi maṃtrārthaḥ satyāsatyaṃ na cānyathā |
vēdāḥ sarvē purāṇāni smṛtayō bhārataṃ tathā |
anyānyānapi ca śāstrāṇi tathā tarkāśca sarvaśaḥ |
śaivāga māśca vividhā āgamā vaiṣṇavā api |
anyāgamāśca viduṣāmanu bhūti stadhaivaca |
asminnarthē sva saṃvēdyē paryava syaṃtinānyathā |
bādhya bādhaka tāṃ yāṃti vyavahārē parasparaṃ |
samudra iva kallōlā iti vēdārtha niścayaḥ ||. (sūtasaṃhitāyāṃ)
(vistariṃci ceppuṭavalana ēmi phalamu? śivuni kaṃṭe vērainadi lēdu. vicakṣaṇulu ī prapaṃcamaṃtayu śivuni svarūpamē yani ceppiyuṃḍiri. ī kanabaḍu rūpamulanniyu ajñānamu cētanē vēṟu vēṟu rūpamulugā kanabaḍucunnavi - yadhārthamugā kādu. idiyē yī maṃtramu yokka arthamu. vēdamulu. purāṇamulu, smṛtulu, bhāratamu itara śāstramulu, tarka śāstramulu, śaivāgamamulu, vaiṣṇavāgamamulu, itara āgamamulu, paṃḍitula anubhavamu ceppunadidiyē - vāṭilō ceppabaḍina paryavasānamidiyē).
jjālamu daivamun, guruvu, sāṃkhyamu, maṃtramu, nagni yāhutul
vēḷalu, vipruluṃ jananavṛddhi layaṃbu hētubhūtamul
līlalu dānayai daga veliṃgeḍu nekkaṭi tējamīśuḍun”. (śrīmadāṃdhramāhā bhāgavatamu - 10 - u.bhā - 778)
(cūḍumu - brahma)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.