బ్రహ్మది స్తంబాంత ప్రాణి పటల పాణి పాదాః అస్యైవ పాణి పాదాః ఇతి సర్వతః పాణి పాదం -
(చతుర్ముఖ బ్రహ్మ మొదలు స్తంబము వతకు గల అన్ని ప్రాణుల యొక్క చేతులు, కాళ్ళు భగవంతుని యొక్క చేతులు కాళ్ళు అగుటవలన “సర్వతః పాణిపాదం” - (అంతటను చేతులు కాళ్ళు గలవాడు) అని చెప్పబడినది. సమస్త ప్రాణులు భగవంతునిలోనుండి పుట్టినవే కనుక అవన్నియు భగవంతుని రూపములే. అందుచేత ఆ సమస్త రూపములయొక్క చేతులు కాళ్ళు పరబ్రహ్మవే అని చెప్పబడినవి).
“తత్ సృష్ట్వా తదేవాను ప్రావిశత్, తదను ప్రవిశ్య సచ్చత్యాచ్చా భవేత్” ఇతి శ్రుతేః. (దాని సృష్టించి - అనగా “స లోకాన సృజత” (అతను - భగవంతుడు లోకములను సృష్టించెను). సృష్టించి తర్వాత దానిలోనే - అట్లు సృష్టించిన లోకములలోనే దానిలోనే ప్రవేశించెను - సృష్టించినపుడే దానిలో తాను ప్రవేశించి యుండెను. ఏ వస్తువైనను సృష్టింపబడినపుడు - జన్మించినపుడు - దానిలో భగవంతుడుండుటవలననే సృష్టింపబడును. ఇట్లు ప్రపంచమును సృష్టించి, దానిలో ప్రవేశించి అ ప్రపంచములోని వస్తువులన్నియు - సూక్ష్మ వస్తువులు, స్థూల వస్తువులు, ఆత్మ వస్తువులు, అనాత్మ వస్తువులు తానే ఆయెను - అందుచేత సృష్టిలోని ప్రాణులన్నియు భగవంతుని రూపములే. ఆ రూపముల అవయవములు - పాణి పాదములు మొదలగు అవయవములన్నియు తనవే - అందుచేత అన్నిచోట్ల పాణిపాదములు గలవాడని శ్రుతి చెప్పుచున్నది, పాణిపాదములని చెప్పుటవలన మిగిలిన అవయవములు కూడా అతనివే). “సర్వ జంతూనాం ప్రసిద్ధాః పాణ్యాదయస్త స్యేతి సర్వాత్మ త్వోక్తిః” సమస్త జంతువుల యొక్క పాణిపాదములు అతనివే - భగవంతునివే - అని చెప్పుటవలన భగవంతుడు సర్వాత్మ - అన్నింటి ఆత్మ తానే అయినవాడు అని చెప్పబడినది).
brahmadi staṃbāṃta prāṇi paṭala pāṇi pādāḥ asyaiva pāṇi pādāḥ iti sarvataḥ pāṇi pādaṃ -
(caturmukha brahma modalu staṃbamu vataku gala anni prāṇula yokka cētulu, kāḷḷu bhagavaṃtuni yokka cētulu kāḷḷu aguṭavalana “sarvataḥ pāṇipādaṃ” - (aṃtaṭanu cētulu kāḷḷu galavāḍu) ani ceppabaḍinadi. samasta prāṇulu bhagavaṃtunilōnuṃḍi puṭṭinavē kanuka avanniyu bhagavaṃtuni rūpamulē. aṃducēta ā samasta rūpamulayokka cētulu kāḷḷu parabrahmavē ani ceppabaḍinavi).
“tat sṛṣṭvā tadēvānu prāviśat, tadanu praviśya saccatyāccā bhavēt” iti śrutēḥ. (dāni sṛṣṭiṃci - anagā “sa lōkāna sṛjata” (atanu - bhagavaṃtuḍu lōkamulanu sṛṣṭiṃcenu). sṛṣṭiṃci tarvāta dānilōnē - aṭlu sṛṣṭiṃcina lōkamulalōnē dānilōnē pravēśiṃcenu - sṛṣṭiṃcinapuḍē dānilō tānu pravēśiṃci yuṃḍenu. ē vastuvainanu sṛṣṭiṃpabaḍinapuḍu - janmiṃcinapuḍu - dānilō bhagavaṃtuḍuṃḍuṭavalananē sṛṣṭiṃpabaḍunu. iṭlu prapaṃcamunu sṛṣṭiṃci, dānilō pravēśiṃci a prapaṃcamulōni vastuvulanniyu - sūkṣma vastuvulu, sthūla vastuvulu, ātma vastuvulu, anātma vastuvulu tānē āyenu - aṃducēta sṛṣṭilōni prāṇulanniyu bhagavaṃtuni rūpamulē. ā rūpamula avayavamulu - pāṇi pādamulu modalagu avayavamulanniyu tanavē - aṃducēta annicōṭla pāṇipādamulu galavāḍani śruti ceppucunnadi, pāṇipādamulani ceppuṭavalana migilina avayavamulu kūḍā atanivē). “sarva jaṃtūnāṃ prasiddhāḥ pāṇyādayasta syēti sarvātma tvōktiḥ” samasta jaṃtuvula yokka pāṇipādamulu atanivē - bhagavaṃtunivē - ani ceppuṭavalana bhagavaṃtuḍu sarvātma - anniṃṭi ātma tānē ayinavāḍu ani ceppabaḍinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.