← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వాత్మా sarvātmā

Original — తెలుగు
  1. సర్వేషాం ఆత్మ భూతః

(అందఱికి ఆత్మ అయినవాడు).

  1. సర్వశ్చాసా వాత్మా చ ఇతి సర్వాత్మా, సర్వేషాం ఆత్మా ఇతివా.

(అన్ని వస్తువులు తానే అయినవాడు, వాటి ఆత్మ అయినవాడు, లేక, అందఱి యొక్క ఆత్మ అయినవాడు).

  1. సర్వేషాం ప్రాణి నామాత్మా, అంతర్యామీ -

(ప్రాణులందఱి ఆత్మ అయినవాడు - ప్రాణులందఱిలోను అంతరాత్మగా నుండువాడు - సంచరించువాడు).

  1. సర్వస్య ఆత్మా స్వరూపం సర్వాత్మా -

(అన్నింటి రూపము తానే అయినవాడు).

  1. సర్వం ఆత్మా శరీరం యస్య సః - శరీర వాచక శబ్దానాం శరీర పర్యంతత్వ నియమాత్ సర్వ శబ్ద వాచ్య త్వం కుర్వార్త్మత్వే హేతుః -

(అన్ని వస్తువులు శరీరముగా గలవాడు - శరీరము అనగా శరీరము వఱకు గల అన్ని వస్తువులు సర్వము అని చెప్పబడినవి - అందుచేత సర్వాత్మ-)

  1. అంతః ప్రవిష్టః శాస్తా జనానాం సర్వాత్మా -

(సమస్త జనుల లోపల ప్రవేశించి వాటిని శాసించువాడు).

  1. చేతనా చేతనాత్మకః -

(చేతనములకు అచేతనములకు ఆత్మ అయినవాడు - ఈ రెండు తానే అయినవాడు).

  1. “విశ్వంబెల్ల విశ్వేశ్వర నియమ్యంబగుటం జేసి ఈశ్వరునకు విశ్వాత్మకత్వము”.

  2. “సర్వస్యాత్మా చేతయితా, సర్వాంతర్యామీ,సర్వ చేత యితృత్వేన పరమేశ్వరత్వం ఉక్తం.”

(అన్నింటికి ఆత్మ అయినవాడు, అనగా, అన్నింటిని చేతనవంతముగా చేయువాడు - అందుచేత సర్వాత్మా).

  1. దేవాది శరీరేషు జీవవత్ చేతనా చత్మక సర్వ ప్రపంచాంతర్యామీ.

(దేవతలు మొదలగువాటి శరీరములందు జీవుడు వలె చేతనములు, అచేతనములతో నిండియున్న ప్రపంచమంతటిలోను అంతర్యామిగా సంచరించువాడు).

  1. సర్వకార్య ప్రపంచాను ప్రవేశాత్ సర్వాత్మా.

(కార్య వస్తువులన్నింటిలోను ప్రవేశించి యుండుటవలన సర్వాత్మ యని చెప్పబడుచున్నాడు).

  1. “చిన్మాత్ర జ్యోతిషా సర్వాః సర్వ దేహేషం బుద్ధయః |

మయా యస్మాత్ ప్రకాశ్యంతే సర్వస్యాత్మా తతోహ్య హం ||“. (ఉపదేశ సాహస్రి)

(చైతన్య మాత్రములు జ్యోతీ రూపములు అగు సూర్యుడు మొగలగు ప్రకాశించునవియు, అన్ని దేమకులలో నుండు బుద్ధి నా వలననే ప్రకాశించుచున్నవి కనుక అన్నింటికి ఆత్మ అయినవాడను).

  1. “సర్వమక్షరమేవా తస్సర్వ స్యాత్మాక్షరం త్వహం” (ఉపదేశ సాహస్రి)

(అంతయు, అన్నియు అక్షరుడైన పరబ్రహ్మమే, అందుచేత అక్షరుడైన నేను సర్వాత్మ - అన్నింటి ఆత్మ - శరీరము అయినవాడను).

  1. “క. అవికారుండయ్యు కనకము

వివిధాభరణములైన విధమున నతడే

దివియై, భివియై, రవియై,

కవియై సర్వాత్ముడై ప్రకాశించు తగన్“. (శ్రీసీతారామాంజనేయ సంవాదము - 1 - 78)

  1. సర్వత్ర సంచార శక్తిః

(అన్ని చోట్ల, అంతట, అన్నింటిలోను సంచరించు శక్తి గలవాడు)

  1. సర్వత్ర ఆత్మ దృష్టీ

(అంతట, అన్నింటిలోను ఆత్మను చూచువాడు - అన్నింటినీ ఆత్మగానే చూచువాడు).

  1. “ఏష బ్రహ్మైష ఏవేంద్ర ఏష ఏవ ప్రజాపతిః |

ఏష షాతా విథాతా చ సర్వాత్మా సర్వ వర్జితః ||“. (లైంగ వాసిష్టే)

(ఇతనే బ్రహ్మ, ఇతనే ఇంద్రుడు, ఇతనే ప్రజాపతి, ధాత, విధాథ సర్వాత్ముడు, సర్వ వర్జితుడు).

  1. “అమ్మహాత్ముడు సృష్ట్యాది కార్య భేదంబుల కొఱకు మాయా గుణావతారంబులందు బహు శక్తి ధారణుండైన భగవంతుడు సర్గాదిని తపస్వులును, నేను, ఋషిగణంబులు, నవప్రజాపతులునై యవతరించి విశ్వోత్పాదనంబు గావించుచుండు. ధర్మంబును, విష్ణుండును, యజ్ఞంబులును, మనువులును, నింద్రాది దేవగణంబులును ధాత్రీపతులును నయి యవతరించి జగంబుల రక్షించుచుండు. అధర్మంబును, రుద్రుండును, మహోరగంబులును, రాక్షసాసీకంబులునునై యవతరించి విలయంబు నొందించుచుండు - ఇత్తెఱుంగున పరమేశ్వరుండును సర్వాత్మకుండును నైన హరి విశ్వోత్పత్తి స్థితిలయ హేతు భూతుండై విలసిల్లు”. (శ్రీమదాంధ్రమహాభాగవతము -)
  1. “ఏకం సమస్తం యది హాస్తి కించిత్ తదుచ్యతో నాస్తి పరం తతో (అ)న్యత్ |

సోహం స చ త్వం సచ సర్వమేతత్ ఆత్మస్వరూపం త్యజ భేద మోహం ||“.

(ఈ ప్రపంచమంతయు దానిలో ఏ ఒక్కటి అయినను ఉన్నదంతా ఒక్కటే అది అచ్యుతునికంటె వేరైనదికాదు - అదే నేను, అదే నువ్వు, అదే అన్నియు - అదే ఆత్మస్వరూపము - అదివేఱు ఇదివేఱు అను మోహమువలన కలుగు భేదము - భేద బుద్ధి విడువుము).

  1. “స్థావరజంగమంబైన దృష్టుత్వాది క్రియాయుతం |

సర్వ మక్షర మేవాత స్సర్వస్యాత్మా క్షరం త్వహం ||“. (ఉపదేశసాహస్రికాయాం)

(ద్రష్టు దృశ్యము మొదలగునవి కల యీ స్థావరజంగమాత్మకమైన జగత్తు అంతయు అక్షరుడు (వినాశరహితుడు) అయిన భగవంతుడే. కాబట్తి అట్తి అక్షరుడైన సర్వాత్మ నేనే).

  1. “యస్మిన్ సర్వం, యతస్సర్వం, యస్సర్వం, సర్వతశ్చయః |

యశ్చ సర్వమయో దేవస్తస్మై సర్వాత్మనే నమః ||“. (మహాభారతము)

(ఎవనియందు ఈ సమస్త ప్రపంచము ఇమిడియున్నదో ఎవనివల్ల ఈ సమస్త ప్రపంచము పుట్టినదో, ఈ ప్రపంచమంతయు నెవడో, అంతటను అన్నింటిలోనుండువాడెవడో, ఎవడన్నింటిలోను నిండియున్నాడో అట్టి సర్వాత్ముడైన భగవంతుని కొఱకు నమస్కరించుచున్నాను).

  1. “పరస్య బ్రహ్మణస్య సర్వజ్ఞస్య సత్య సంకల్పస్య స్థూల సూక్ష్మావస్థ సర్వచేతనా చేతనా వస్తు శరీరతయా సర్వ ప్రకారత్వేన సర్వాత్మత్వం, సకలేతర విలక్షణత్వం చా విరుద్ధమితి స్థాపితం - ఇదానీం సత్య సంకల్పస్య పరస్య బ్రహ్మణః సంకల్ప మాత్రేణ విచిత్ర సృష్టియోగో న విరుద్ధః స్థాప్యతే ||”. (శ్రీమాన్ రామానుజః)

(పరుడు, అన్నింటికంటె అధికుడు, ఉత్కృష్టుడు, సర్వజ్ఞుడు, సత్య సంకల్పుడు అయిన పరబ్రహ్మ స్థూల రూపముతోనున్న సమస్త చేతనాచేతనముల యొక్క శరీరము తానే యగుటవలన అన్ని విధముల సర్వాత్మ అయి యున్నాడు. మరియు అన్నింటికంటె వేఱు లక్షణములు కలవాడు అను విషయము సిద్ధమే. సంకల్ప మాత్రముచేత - తలచినంత మాత్రమున చిత్ర విచిత్రమైన ఈ జగత్తును పరబ్రహ్మ సృష్టి చేయుటవలన కూడా సర్వాత్మయే).

  1. “సీ. అఖిల భూతములందు నాత్మ రూపంబున నీశుండు హరియుండు నెల్ల ప్రొద్దు

బుద్ధ్యాది లక్షణంబుల గానబడును - - -“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 2 - 2 - 36)

  1. “సర్వ ప్రపంచాధిష్ఠానత్వాత్ సర్వాత్మకః”

(ప్రపంచమంతటికి అధిష్ఠానమై యుండుటచేత సర్వాత్మ).

Transliteration
  1. sarvēṣāṃ ātma bhūtaḥ

(aṃdaṟiki ātma ayinavāḍu).

  1. sarvaścāsā vātmā ca iti sarvātmā, sarvēṣāṃ ātmā itivā.

(anni vastuvulu tānē ayinavāḍu, vāṭi ātma ayinavāḍu, lēka, aṃdaṟi yokka ātma ayinavāḍu).

  1. sarvēṣāṃ prāṇi nāmātmā, aṃtaryāmī -

(prāṇulaṃdaṟi ātma ayinavāḍu - prāṇulaṃdaṟilōnu aṃtarātmagā nuṃḍuvāḍu - saṃcariṃcuvāḍu).

  1. sarvasya ātmā svarūpaṃ sarvātmā -

(anniṃṭi rūpamu tānē ayinavāḍu).

  1. sarvaṃ ātmā śarīraṃ yasya saḥ - śarīra vācaka śabdānāṃ śarīra paryaṃtatva niyamāt sarva śabda vācya tvaṃ kurvārtmatvē hētuḥ -

(anni vastuvulu śarīramugā galavāḍu - śarīramu anagā śarīramu vaṟaku gala anni vastuvulu sarvamu ani ceppabaḍinavi - aṃducēta sarvātma-)

  1. aṃtaḥ praviṣṭaḥ śāstā janānāṃ sarvātmā -

(samasta janula lōpala pravēśiṃci vāṭini śāsiṃcuvāḍu).

  1. cētanā cētanātmakaḥ -

(cētanamulaku acētanamulaku ātma ayinavāḍu - ī reṃḍu tānē ayinavāḍu).

  1. “viśvaṃbella viśvēśvara niyamyaṃbaguṭaṃ jēsi īśvarunaku viśvātmakatvamu”.

  2. “sarvasyātmā cētayitā, sarvāṃtaryāmī,sarva cēta yitṛtvēna paramēśvaratvaṃ uktaṃ.”

(anniṃṭiki ātma ayinavāḍu, anagā, anniṃṭini cētanavaṃtamugā cēyuvāḍu - aṃducēta sarvātmā).

  1. dēvādi śarīrēṣu jīvavat cētanā catmaka sarva prapaṃcāṃtaryāmī.

(dēvatalu modalaguvāṭi śarīramulaṃdu jīvuḍu vale cētanamulu, acētanamulatō niṃḍiyunna prapaṃcamaṃtaṭilōnu aṃtaryāmigā saṃcariṃcuvāḍu).

  1. sarvakārya prapaṃcānu pravēśāt sarvātmā.

(kārya vastuvulanniṃṭilōnu pravēśiṃci yuṃḍuṭavalana sarvātma yani ceppabaḍucunnāḍu).

  1. “cinmātra jyōtiṣā sarvāḥ sarva dēhēṣaṃ buddhayaḥ |

mayā yasmāt prakāśyaṃtē sarvasyātmā tatōhya haṃ ||“. (upadēśa sāhasri)

(caitanya mātramulu jyōtī rūpamulu agu sūryuḍu mogalagu prakāśiṃcunaviyu, anni dēmakulalō nuṃḍu buddhi nā valananē prakāśiṃcucunnavi kanuka anniṃṭiki ātma ayinavāḍanu).

  1. “sarvamakṣaramēvā tassarva syātmākṣaraṃ tvahaṃ” (upadēśa sāhasri)

(aṃtayu, anniyu akṣaruḍaina parabrahmamē, aṃducēta akṣaruḍaina nēnu sarvātma - anniṃṭi ātma - śarīramu ayinavāḍanu).

  1. “ka. avikāruṃḍayyu kanakamu

vividhābharaṇamulaina vidhamuna nataḍē

diviyai, bhiviyai, raviyai,

kaviyai sarvātmuḍai prakāśiṃcu tagan”. (śrīsītārāmāṃjanēya saṃvādamu - 1 - 78)

  1. sarvatra saṃcāra śaktiḥ

(anni cōṭla, aṃtaṭa, anniṃṭilōnu saṃcariṃcu śakti galavāḍu)

  1. sarvatra ātma dṛṣṭī

(aṃtaṭa, anniṃṭilōnu ātmanu cūcuvāḍu - anniṃṭinī ātmagānē cūcuvāḍu).

  1. “ēṣa brahmaiṣa ēvēṃdra ēṣa ēva prajāpatiḥ |

ēṣa ṣātā vithātā ca sarvātmā sarva varjitaḥ ||“. (laiṃga vāsiṣṭē)

(itanē brahma, itanē iṃdruḍu, itanē prajāpati, dhāta, vidhātha sarvātmuḍu, sarva varjituḍu).

  1. “ammahātmuḍu sṛṣṭyādi kārya bhēdaṃbula koṟaku māyā guṇāvatāraṃbulaṃdu bahu śakti dhāraṇuṃḍaina bhagavaṃtuḍu sargādini tapasvulunu, nēnu, ṛṣigaṇaṃbulu, navaprajāpatulunai yavatariṃci viśvōtpādanaṃbu gāviṃcucuṃḍu. dharmaṃbunu, viṣṇuṃḍunu, yajñaṃbulunu, manuvulunu, niṃdrādi dēvagaṇaṃbulunu dhātrīpatulunu nayi yavatariṃci jagaṃbula rakṣiṃcucuṃḍu. adharmaṃbunu, rudruṃḍunu, mahōragaṃbulunu, rākṣasāsīkaṃbulununai yavatariṃci vilayaṃbu noṃdiṃcucuṃḍu - itteṟuṃguna paramēśvaruṃḍunu sarvātmakuṃḍunu naina hari viśvōtpatti sthitilaya hētu bhūtuṃḍai vilasillu”. (śrīmadāṃdhramahābhāgavatamu -)
  1. “ēkaṃ samastaṃ yadi hāsti kiṃcit taducyatō nāsti paraṃ tatō (a)nyat |

sōhaṃ sa ca tvaṃ saca sarvamētat ātmasvarūpaṃ tyaja bhēda mōhaṃ ||“.

(ī prapaṃcamaṃtayu dānilō ē okkaṭi ayinanu unnadaṃtā okkaṭē adi acyutunikaṃṭe vērainadikādu - adē nēnu, adē nuvvu, adē anniyu - adē ātmasvarūpamu - adivēṟu idivēṟu anu mōhamuvalana kalugu bhēdamu - bhēda buddhi viḍuvumu).

  1. “sthāvarajaṃgamaṃbaina dṛṣṭutvādi kriyāyutaṃ |

sarva makṣara mēvāta ssarvasyātmā kṣaraṃ tvahaṃ ||“. (upadēśasāhasrikāyāṃ)

(draṣṭu dṛśyamu modalagunavi kala yī sthāvarajaṃgamātmakamaina jagattu aṃtayu akṣaruḍu (vināśarahituḍu) ayina bhagavaṃtuḍē. kābaṭti aṭti akṣaruḍaina sarvātma nēnē).

  1. “yasmin sarvaṃ, yatassarvaṃ, yassarvaṃ, sarvataścayaḥ |

yaśca sarvamayō dēvastasmai sarvātmanē namaḥ ||“. (mahābhāratamu)

(evaniyaṃdu ī samasta prapaṃcamu imiḍiyunnadō evanivalla ī samasta prapaṃcamu puṭṭinadō, ī prapaṃcamaṃtayu nevaḍō, aṃtaṭanu anniṃṭilōnuṃḍuvāḍevaḍō, evaḍanniṃṭilōnu niṃḍiyunnāḍō aṭṭi sarvātmuḍaina bhagavaṃtuni koṟaku namaskariṃcucunnānu).

  1. “parasya brahmaṇasya sarvajñasya satya saṃkalpasya sthūla sūkṣmāvastha sarvacētanā cētanā vastu śarīratayā sarva prakāratvēna sarvātmatvaṃ, sakalētara vilakṣaṇatvaṃ cā viruddhamiti sthāpitaṃ - idānīṃ satya saṃkalpasya parasya brahmaṇaḥ saṃkalpa mātrēṇa vicitra sṛṣṭiyōgō na viruddhaḥ sthāpyatē ||”. (śrīmān rāmānujaḥ)

(paruḍu, anniṃṭikaṃṭe adhikuḍu, utkṛṣṭuḍu, sarvajñuḍu, satya saṃkalpuḍu ayina parabrahma sthūla rūpamutōnunna samasta cētanācētanamula yokka śarīramu tānē yaguṭavalana anni vidhamula sarvātma ayi yunnāḍu. mariyu anniṃṭikaṃṭe vēṟu lakṣaṇamulu kalavāḍu anu viṣayamu siddhamē. saṃkalpa mātramucēta - talacinaṃta mātramuna citra vicitramaina ī jagattunu parabrahma sṛṣṭi cēyuṭavalana kūḍā sarvātmayē).

  1. “sī. akhila bhūtamulaṃdu nātma rūpaṃbuna nīśuṃḍu hariyuṃḍu nella proddu

buddhyādi lakṣaṇaṃbula gānabaḍunu - - -“. (śrīmadāṃdhramahābhāgavatamu - 2 - 2 - 36)

  1. “sarva prapaṃcādhiṣṭhānatvāt sarvātmakaḥ”

(prapaṃcamaṃtaṭiki adhiṣṭhānamai yuṃḍuṭacēta sarvātma).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.