(అంతటను ముఖములు గలవాడు - అనేకమైన ముఖములు గలవాడు)
(ప్రాణులందఱు ఇతని - భగవంతుని - రూపములేకనుక సర్వతో ముఖుడు) - (సర్వ ప్రాణుల ముఖములు భగవంతునివే)
(ప్రపంచమంతయు తన రూపమే యగుటవలన, ప్రపంచములోని రూపములన్నియు తన రూపములే యగుటవలన ఆ రూపముల ముఖములు తనవే యగుటవలన అంతటను ముఖములు కలవాడు)
(నృసింహతాపిన్యుపనిషత్).
(తాను స్వయముగ నింద్రియములు లేనివాడైనను తన మహిమ చేత సమస్త లోకములను, సనస్త దేవతలను, సమస్త ఆత్మలను, సమస్త భూతములను, అంతట, అన్నింటిని చూచు చున్నాడు, అంతట వినుచున్నాడు, అన్ని ప్రదేశములను (అన్ని శరీరములను) పొందుచున్నాడు - అందుచేత సర్వతో ముఖుడని చెప్పబడుచున్నాడు).
(విరాడ్రూపుడు - అనేక విధములుగా, అనేక రూపములతో ప్రకాశించువాడు - కనుక సర్వతో ముఖుడు - ఇంద్రియములు లేనివాడైనను అన్ని రూపములను, అంతట నుండు రూపములను చూచుచున్నాడు, అట్లే అంతటను కలుగు శబ్దములను వినుచున్నాడు, అన్ని చోట్లకు వెళ్ళుచున్నాడు - చేతులు కాళ్ళు కలవాడుగ ప్రవర్తించుచున్నాడు - అన్నింటిలోనుండువాడు కనుకను, విభుడైనందువలనను, అన్ని దిక్కులలోను, అన్ని రూపములతో నుండువాడు).
సర్వతో (అ)క్షి శిరోముఖః = (చూడుము - సర్వతః పాణిపాదం; “విశ్వాక్షం విశ్వశంభవం” (మంత్ర పుష్పం)
“సహస్రాక్షః సహస్ర పాద్” (పురుషుసూక్తం), “సహస్ర పాదా క్షిశిరోరు బాహవే”.
(aṃtaṭanu mukhamulu galavāḍu - anēkamaina mukhamulu galavāḍu)
(prāṇulaṃdaṟu itani - bhagavaṃtuni - rūpamulēkanuka sarvatō mukhuḍu) - (sarva prāṇula mukhamulu bhagavaṃtunivē)
(prapaṃcamaṃtayu tana rūpamē yaguṭavalana, prapaṃcamulōni rūpamulanniyu tana rūpamulē yaguṭavalana ā rūpamula mukhamulu tanavē yaguṭavalana aṃtaṭanu mukhamulu kalavāḍu)
(nṛsiṃhatāpinyupaniṣat).
(tānu svayamuga niṃdriyamulu lēnivāḍainanu tana mahima cēta samasta lōkamulanu, sanasta dēvatalanu, samasta ātmalanu, samasta bhūtamulanu, aṃtaṭa, anniṃṭini cūcu cunnāḍu, aṃtaṭa vinucunnāḍu, anni pradēśamulanu (anni śarīramulanu) poṃducunnāḍu - aṃducēta sarvatō mukhuḍani ceppabaḍucunnāḍu).
(virāḍrūpuḍu - anēka vidhamulugā, anēka rūpamulatō prakāśiṃcuvāḍu - kanuka sarvatō mukhuḍu - iṃdriyamulu lēnivāḍainanu anni rūpamulanu, aṃtaṭa nuṃḍu rūpamulanu cūcucunnāḍu, aṭlē aṃtaṭanu kalugu śabdamulanu vinucunnāḍu, anni cōṭlaku veḷḷucunnāḍu - cētulu kāḷḷu kalavāḍuga pravartiṃcucunnāḍu - anniṃṭilōnuṃḍuvāḍu kanukanu, vibhuḍainaṃduvalananu, anni dikkulalōnu, anni rūpamulatō nuṃḍuvāḍu).
sarvatō (a)kṣi śirōmukhaḥ = (cūḍumu - sarvataḥ pāṇipādaṃ; “viśvākṣaṃ viśvaśaṃbhavaṃ” (maṃtra puṣpaṃ)
“sahasrākṣaḥ sahasra pād” (puruṣusūktaṃ), “sahasra pādā kṣiśirōru bāhavē”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.