← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వవ్యాపీ sarvavyāpī

Original — తెలుగు
  1. ఆకాశవత్ సర్వత్ర వ్యాప్య వర్తమానః -

(ఆకాశమువలె అంతటను వ్యాపించియుండువాడు)

  1. సర్వత్ర పరిపూర్ణః

(అంతటను పూర్తిగా నిండియుండువాడు - ప్రతి వస్తువులోను పూర్తిగా నిండియుండువాడు - ఉప్పు కణములో ఉప్పు రసము పూర్తిగా నిండియుండునట్లు).

  1. “సర్వ వ్యాపకుండవైన నిన్ను నిర్మలాంతఃకరణులైనవారలాకాశంబు పగిది నవలోకింతురు”.

(శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - ఉ.భా. -)

  1. “శ్లో ||. యథా సమస్త భూతేషు నభోగ్నిః పృధివీ జలం |

వాయుశ్చాత్మా తదైవా సౌ సర్వమివస్థితః ||“. (విష్ణుపురాణే)

(సమస్త భూతములందు ఆకాశము, అగ్ని, భూమి, జలము, వాయువు, ఆత్మ ఎట్లు వ్యాపించియున్నవో అట్లే అన్నింటినీ భగవంతుడు వ్యాపించియున్నాడు).

  1. విష్ణుః, - వ్యాపనశీలః -

(అన్నింటిలోను వ్యాపించియుండు శీలము, గుణము, శక్తి కలవాడు కనుక విష్ణువు అని భగవంతుడు చెప్పబడుచున్నాడు).

  1. “యచ్చ కించిజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పితా |

అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః ||“. (మంత్ర పుష్పము)

(మన కంటికి కనబడుచున్నది, ఇంకా ఉన్నది, ఇతరులు చెప్పగా విన్నది యగు ఈ ప్రపంచమెంత గలదో దాని అంతటిని. లోపల బైటా భగవంతుడు వ్యాపించియున్నాడు).

  1. “సర్వత్రగం యతో వ్యాపి సర్వకారనమద్వయం”. (గీతాభావప్రకాశము - 12 - 25)

(అద్వయుడు, అన్నింటికి కారణమైనవాడు అయిన భగవంతుడు అన్నింటిలో నున్నాడు - అన్నింటిలోను వ్యాపించియున్నాడు).

  1. “ద్యావా పృధివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వ యైకేన దిశశ్చ సర్వాః” (శ్రీమద్భగవద్గీత - 11 - 20)

(ఆకాశము, భూమి - వీటికి మధ్యనున్నదంతటిలోను నీవు (విశ్వరూపుడవు) వ్యాపించియున్నావు).

  1. “త్వయా తతం విశ్వ మనంతరూప”. (శ్రీమద్భగవద్గీత - 11 - 38)

(అంతములేని రూపముగల నీవు ఈ ప్రపంచమంతను - విశ్వమంతను వ్యాపించియున్నావు).

  1. “మయాతతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా” (శ్రీమద్భగవద్గీత - 9 - 4)

(కంటికి కనబడని రూపముగల నేను ఈ జగత్తు అంతటినీ వ్యాపించియున్నాను).

  1. “మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ”. (శ్రీమద్భవద్గీత - 7 - 7)

(దారముతో మణులు గుచ్చబడియున్నట్లు ఈ ప్రపంచమంతటినీ నేను వ్యాపించి దానిని కట్టి పెట్టి యుంచినాను).

  1. “ఓత ప్రోత సమస్త వస్తు నిచయం” (శ్రీరామకర్ణామృతం - 1 - 50)

(బట్టలోని వడుగు పేక దారము వలె సమస్త వస్తువులలోను - సమస్త వస్తువులుగల ఈ ప్రపంచములో పూర్తిగా వ్యాపించి యుండువాడు) (బట్టలోని పడుగు పేకదారములే బట్ట అయినట్లు - ప్రపంచమంతయు భగవంతుఇని రూపములే అయిన వస్తువులతోనే ప్రపంచమయినట్లు).

  1. “సత్తస్ఫూర్తి స్వరూపేణ త్వయా వ్యాప్తమిదం జగత్ |

స్వతః సత్తాది శూన్యం తద్విశ్వం కార్యం హి మాయికం |

త్వయి మాయిక సంబంధాత్ స్థితికాలే (అ)స్త్, సర్వగ ||“. (గీతాభావప్రకాశము - 11 - 159,160)

(ఈ జగత్తు స్వతః సత్తా లేనిది - జడము - ఇది కార్య వస్తువు; నువ్వు చేసినది. అందుచేత మాయికము. స్థితికాలమందు నీవు అందులో నీ సత్తా స్ఫూర్తితో నుండుటవలన దానికి నీ సత్తా కలిగియున్నది. అందుచేత జగత్తు అంతయును నీవు నీ సత్తాస్ఫూర్తితో నిండియున్నావు).

  1. భగవతా సద్రూపేణ. స్ఫురణరూపేణచ కారణేన తతం వ్యాప్తం ఇదం స్వతః సత్తా స్ఫూర్తి శూన్యం విశ్వం.

(ఈ ప్రపంచమంతయు భగవంతుడు తన సద్రూపముతో వ్యాపించియున్నాడు. ఈ ప్రపంచము స్వతఃగా సత్తా లేనిది, కార్యరూపము - మాయి - మాయ గలవాడు - అగు భగవంతుని సంబంధముచేత స్థితికాలమందు దానిలో భగవంతుడు తన సత్తా స్ఫూర్తితో వ్యాపించియున్నందున ఉన్నట్లు కనబడుచున్నది - చైతన్యము కలిగి యున్నట్లు కనబడుచున్నది).

  1. “అదావగ్నిశ్చ వాయుశ్చ సూర్యా చంద్ర మసా వు భౌ |

నక్షత్రాణిచ విద్యుచ్చ యచాస్తిత్వేన భాసతే |

యచ్చ నాస్తితయా భాతి సర్వం తస్మిన్ సమాహితం |

తతః సర్వాశ్రయః శంభుః సర్వ వ్యాపీ స్వ భావతః“. (సూత సంహితాయాం)

(అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, విద్యుత్, మఱియు యేదు కలదో, ఏది లేదో ఇవన్నియు శివునియందే సమాహితమైయున్నవి. అందుచేత శివుడు అన్నింటికీ ఆశ్రయమైనవాడు - స్వభావముచేత అన్నింటిలోను వ్యాపించియున్నవాడు).

  1. “స్వా విద్యా పద వ్యష్ట్యాది సూక్ష్మాం శోపాధిక తైజస సూత్రాను జ్ఞా త్రాత్మనా సర్వేషాం ఆ బ్రహ్మ స్తంబ పర్యంత భూతానాం హృదయ విలసిత లింగ శరీరాశ్రయః తత్ప్రవృత్తి నిమిత్త సూత్ర రూపత్వత్, తథా స్వావిద్యా పద వ్యష్టాది బీజాంశ యోగతః ప్రాజ్ఞ బీజాను జ్ఞైక రసాత్మనా సర్వతో వ్యాప్తం శీలమస్య ఇతి సర్వవ్యాపీ”.

(అవిద్యా రూపమైన సకల వ్యష్టి శరీరములందు ప్రాజ్ఞుడుగాను, చతుర్ముఖ బ్రహ్మ మొదలు స్తంబమువరకు గల సమస్త భూతముల లింగ శరీరములో హృదయమందుటంజేసి అన్నింటిలోను వ్యాపించియుండు స్వభావము కలవాదగుటచేసి సర్వవ్యాపి).

  1. దూరస్థోపి నదూరస్థః పిండత్షః పిండవర్జితః |

విమల స్సర్వదా సర్వవ్యాపీ నిరంజనః ||. (ఉత్తరగీతాయాం)

(“ఆజ్ఞస్య పరోక్షవత్ స్థితో(అ)పి న దూరస్థః, పరోక్షః స్థితో న భవతి, కింతు సర్వదా అపరోక్ష ఇత్యర్థః | పిండస్థోపి శరీర సంబంధా ధ్యాసాత్ పరిచ్ఛిన్నవత్ అవభాస మానోపి పిండవర్జితః శరీర సంబంధా ధ్యాన రహితః తత్ర హేతుః విమలః, నిర్మలః, ఆర్వవ్యాపీ, సర్వత్ర పరిపూర్ణః. నిరంజనః, స్వయం ప్రకాశశ్చ ఏవ మత్మాధ్యేయ ఇత్యర్థః -”)

(అజ్ఞానికి - బ్రహ్మజ్ఞానము లేనినానికి - పరోక్షముగా నుండినట్లున్నను పరోక్షుడు కాడు, ఎప్పుడును అపరోక్షుడుగానే యున్నాడు. శరీరములో నుండుటవలన వేఱు వేఱుగా నున్నాడనిపించినను శరీర సంబంధము లేనివాడు - దీనికి కారణమేమనగా భగవంతుడు నిర్మలుడు - శుద్ధ సత్వమయుడు, సర్వవ్యాపీ - అంతటను వ్యాపించియుండువాడు, నిరంజనుడు, స్వయముగా ప్రకాశించువాడు - ఈ ప్రకారముగా ధ్యానము చేయతగినవాడు)

  1. ఆకాశము, కాలము, దిక్కులు, ఆత్మ, సర్వమును వ్యాపించి యుండునది.

  2. యధా స్నేహన సాది వి కారః శాంత మూలం, మూలతః పృథక్ కృతం పలల పిండం ఓత ప్రోతం అనుప్రాప్య వ్యతిరిక్తః తత్స మగ్రం వ్యాప్య వర్తతే, తథా అయమాత్మా స్వేన రూపేణ సర్వాన్ లోకాన్ వ్యాప్నోతీతి సర్వ వ్యాపీ.

(స్నేహ వసాది వికారము శాంతమూలమైనట్లు, మూలము కంటె వేఱు అయినట్లు పలల పిండము అంతటను వ్యాపించి వ్యతిరిక్తమై దానంతత వ్యాపించి యుండునట్లే ఈ ఆత్మ తన స్వరూపముతో లోకములన్నింటిలోను వ్యాపించియున్నాడు).

Transliteration
  1. ākāśavat sarvatra vyāpya vartamānaḥ -

(ākāśamuvale aṃtaṭanu vyāpiṃciyuṃḍuvāḍu)

  1. sarvatra paripūrṇaḥ

(aṃtaṭanu pūrtigā niṃḍiyuṃḍuvāḍu - prati vastuvulōnu pūrtigā niṃḍiyuṃḍuvāḍu - uppu kaṇamulō uppu rasamu pūrtigā niṃḍiyuṃḍunaṭlu).

  1. “sarva vyāpakuṃḍavaina ninnu nirmalāṃtaḥkaraṇulainavāralākāśaṃbu pagidi navalōkiṃturu”.

(śrīmadāṃdhramahābhāgavatamu - 10 - u.bhā. -)

  1. “ślō ||. yathā samasta bhūtēṣu nabhōgniḥ pṛdhivī jalaṃ |

vāyuścātmā tadaivā sau sarvamivasthitaḥ ||“. (viṣṇupurāṇē)

(samasta bhūtamulaṃdu ākāśamu, agni, bhūmi, jalamu, vāyuvu, ātma eṭlu vyāpiṃciyunnavō aṭlē anniṃṭinī bhagavaṃtuḍu vyāpiṃciyunnāḍu).

  1. viṣṇuḥ, - vyāpanaśīlaḥ -

(anniṃṭilōnu vyāpiṃciyuṃḍu śīlamu, guṇamu, śakti kalavāḍu kanuka viṣṇuvu ani bhagavaṃtuḍu ceppabaḍucunnāḍu).

  1. “yacca kiṃcijjagat sarvaṃ dṛśyatē śrūyatē pitā |

aṃtarbahiśca tatsarvaṃ vyāpya nārāyaṇa sthitaḥ ||“. (maṃtra puṣpamu)

(mana kaṃṭiki kanabaḍucunnadi, iṃkā unnadi, itarulu ceppagā vinnadi yagu ī prapaṃcameṃta galadō dāni aṃtaṭini. lōpala baiṭā bhagavaṃtuḍu vyāpiṃciyunnāḍu).

  1. “sarvatragaṃ yatō vyāpi sarvakāranamadvayaṃ”. (gītābhāvaprakāśamu - 12 - 25)

(advayuḍu, anniṃṭiki kāraṇamainavāḍu ayina bhagavaṃtuḍu anniṃṭilō nunnāḍu - anniṃṭilōnu vyāpiṃciyunnāḍu).

  1. “dyāvā pṛdhivyōridamaṃtaraṃ hi vyāptaṃ tva yaikēna diśaśca sarvāḥ” (śrīmadbhagavadgīta - 11 - 20)

(ākāśamu, bhūmi - vīṭiki madhyanunnadaṃtaṭilōnu nīvu (viśvarūpuḍavu) vyāpiṃciyunnāvu).

  1. “tvayā tataṃ viśva manaṃtarūpa”. (śrīmadbhagavadgīta - 11 - 38)

(aṃtamulēni rūpamugala nīvu ī prapaṃcamaṃtanu - viśvamaṃtanu vyāpiṃciyunnāvu).

  1. “mayātatamidaṃ sarvaṃ jagadavyaktamūrtinā” (śrīmadbhagavadgīta - 9 - 4)

(kaṃṭiki kanabaḍani rūpamugala nēnu ī jagattu aṃtaṭinī vyāpiṃciyunnānu).

  1. “mayi sarvamidaṃ prōtaṃ sūtrē maṇigaṇā iva”. (śrīmadbhavadgīta - 7 - 7)

(dāramutō maṇulu guccabaḍiyunnaṭlu ī prapaṃcamaṃtaṭinī nēnu vyāpiṃci dānini kaṭṭi peṭṭi yuṃcinānu).

  1. “ōta prōta samasta vastu nicayaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 1 - 50)

(baṭṭalōni vaḍugu pēka dāramu vale samasta vastuvulalōnu - samasta vastuvulugala ī prapaṃcamulō pūrtigā vyāpiṃci yuṃḍuvāḍu) (baṭṭalōni paḍugu pēkadāramulē baṭṭa ayinaṭlu - prapaṃcamaṃtayu bhagavaṃtuini rūpamulē ayina vastuvulatōnē prapaṃcamayinaṭlu).

  1. “sattasphūrti svarūpēṇa tvayā vyāptamidaṃ jagat |

svataḥ sattādi śūnyaṃ tadviśvaṃ kāryaṃ hi māyikaṃ |

tvayi māyika saṃbaṃdhāt sthitikālē (a)st, sarvaga ||“. (gītābhāvaprakāśamu - 11 - 159,160)

(ī jagattu svataḥ sattā lēnidi - jaḍamu - idi kārya vastuvu; nuvvu cēsinadi. aṃducēta māyikamu. sthitikālamaṃdu nīvu aṃdulō nī sattā sphūrtitō nuṃḍuṭavalana dāniki nī sattā kaligiyunnadi. aṃducēta jagattu aṃtayunu nīvu nī sattāsphūrtitō niṃḍiyunnāvu).

  1. bhagavatā sadrūpēṇa. sphuraṇarūpēṇaca kāraṇēna tataṃ vyāptaṃ idaṃ svataḥ sattā sphūrti śūnyaṃ viśvaṃ.

(ī prapaṃcamaṃtayu bhagavaṃtuḍu tana sadrūpamutō vyāpiṃciyunnāḍu. ī prapaṃcamu svataḥgā sattā lēnidi, kāryarūpamu - māyi - māya galavāḍu - agu bhagavaṃtuni saṃbaṃdhamucēta sthitikālamaṃdu dānilō bhagavaṃtuḍu tana sattā sphūrtitō vyāpiṃciyunnaṃduna unnaṭlu kanabaḍucunnadi - caitanyamu kaligi yunnaṭlu kanabaḍucunnadi).

  1. “adāvagniśca vāyuśca sūryā caṃdra masā vu bhau |

nakṣatrāṇica vidyucca yacāstitvēna bhāsatē |

yacca nāstitayā bhāti sarvaṃ tasmin samāhitaṃ |

tataḥ sarvāśrayaḥ śaṃbhuḥ sarva vyāpī sva bhāvataḥ”. (sūta saṃhitāyāṃ)

(agni, vāyuvu, sūryuḍu, caṃdruḍu, nakṣatramulu, vidyut, maṟiyu yēdu kaladō, ēdi lēdō ivanniyu śivuniyaṃdē samāhitamaiyunnavi. aṃducēta śivuḍu anniṃṭikī āśrayamainavāḍu - svabhāvamucēta anniṃṭilōnu vyāpiṃciyunnavāḍu).

  1. “svā vidyā pada vyaṣṭyādi sūkṣmāṃ śōpādhika taijasa sūtrānu jñā trātmanā sarvēṣāṃ ā brahma staṃba paryaṃta bhūtānāṃ hṛdaya vilasita liṃga śarīrāśrayaḥ tatpravṛtti nimitta sūtra rūpatvat, tathā svāvidyā pada vyaṣṭādi bījāṃśa yōgataḥ prājña bījānu jñaika rasātmanā sarvatō vyāptaṃ śīlamasya iti sarvavyāpī”.

(avidyā rūpamaina sakala vyaṣṭi śarīramulaṃdu prājñuḍugānu, caturmukha brahma modalu staṃbamuvaraku gala samasta bhūtamula liṃga śarīramulō hṛdayamaṃduṭaṃjēsi anniṃṭilōnu vyāpiṃciyuṃḍu svabhāvamu kalavādaguṭacēsi sarvavyāpi).

  1. dūrasthōpi nadūrasthaḥ piṃḍatṣaḥ piṃḍavarjitaḥ |

vimala ssarvadā sarvavyāpī niraṃjanaḥ ||. (uttaragītāyāṃ)

(“ājñasya parōkṣavat sthitō(a)pi na dūrasthaḥ, parōkṣaḥ sthitō na bhavati, kiṃtu sarvadā aparōkṣa ityarthaḥ | piṃḍasthōpi śarīra saṃbaṃdhā dhyāsāt paricchinnavat avabhāsa mānōpi piṃḍavarjitaḥ śarīra saṃbaṃdhā dhyāna rahitaḥ tatra hētuḥ vimalaḥ, nirmalaḥ, ārvavyāpī, sarvatra paripūrṇaḥ. niraṃjanaḥ, svayaṃ prakāśaśca ēva matmādhyēya ityarthaḥ -”)

(ajñāniki - brahmajñānamu lēnināniki - parōkṣamugā nuṃḍinaṭlunnanu parōkṣuḍu kāḍu, eppuḍunu aparōkṣuḍugānē yunnāḍu. śarīramulō nuṃḍuṭavalana vēṟu vēṟugā nunnāḍanipiṃcinanu śarīra saṃbaṃdhamu lēnivāḍu - dīniki kāraṇamēmanagā bhagavaṃtuḍu nirmaluḍu - śuddha satvamayuḍu, sarvavyāpī - aṃtaṭanu vyāpiṃciyuṃḍuvāḍu, niraṃjanuḍu, svayamugā prakāśiṃcuvāḍu - ī prakāramugā dhyānamu cēyataginavāḍu)

  1. ākāśamu, kālamu, dikkulu, ātma, sarvamunu vyāpiṃci yuṃḍunadi.

  2. yadhā snēhana sādi vi kāraḥ śāṃta mūlaṃ, mūlataḥ pṛthak kṛtaṃ palala piṃḍaṃ ōta prōtaṃ anuprāpya vyatiriktaḥ tatsa magraṃ vyāpya vartatē, tathā ayamātmā svēna rūpēṇa sarvān lōkān vyāpnōtīti sarva vyāpī.

(snēha vasādi vikāramu śāṃtamūlamainaṭlu, mūlamu kaṃṭe vēṟu ayinaṭlu palala piṃḍamu aṃtaṭanu vyāpiṃci vyatiriktamai dānaṃtata vyāpiṃci yuṃḍunaṭlē ī ātma tana svarūpamutō lōkamulanniṃṭilōnu vyāpiṃciyunnāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.