← Back to స · Booklets 51–60 (digitized file 6)

సర్వేశ్వరః sarvēśvaraḥ

Original — తెలుగు
  1. సర్వస్యాధిపతిః, సర్వేషాం నియంతా -

(అన్నింటికి అధిపతి అయినవాడు; అందఱిని నియమించువాడు).

  1. సర్వస్య చేతనా చేతనాత్మకస్య జగతః ఈశ్వరో నియంతా.

(చేతనా చేతనములుగల జగత్తు అంతటికి ఈశ్వరుడు, నియంత - నియమించువాడు)

  1. “సర్వైశ్యర్యేణ సంపన్నో నామ్నా సర్వేశ్వర స్వయం” (వాయువీయసంహిత)

(అన్నివిధముల ఐశ్వర్యము - ఈశ్వరత్వము, నియమనశక్తి గలవాడు కనుక సర్వేశ్వరుడు).

  1. “త్వం కర్తా సర్వలోకానాం భర్తా, హర్తా నియామకః |

భుక్తిదో ముక్తిదశ్చత్వం సిద్ధి ద సిద్ధ వందితః |

సర్వైశ్వర్యేణ సంపన్నో నామ్నా సర్వేశరః శ్రుతః ||“. (స్కాందే)

(లోకములన్నింటికి కర్తవు, భర్తవు, సంహరించువాడవు, నియమించువాడవు - ముక్తిని, భుక్తిని సిద్ధిని ఇచ్చువాడవు - సిద్ధులచేత నమస్కరింపబడువాడవు - అన్ని విధములైన ఐశ్వర్యము - ఈశ్వరత్వము కలవాడవు - కనుక సర్వేశ్వరుడవని చెప్పబడుచున్నావు)

  1. శృతి స్మృతీ హి మమైవాజ్ఞా, సాచ అన్యైః అనువర్తనీయా, న చ మే నియంత్యత్వంతరమస్తి యదధీన ప్రత్యవాయ భయాత్ కుర్యామి ఇతి భావః.

(శ్రుతులు స్మృతులు నా ఆజ్ఞయే - వాటిని ఇతరులు పాటించవలెను, వాటిలో చెప్పిన ప్రకారము ప్రవర్తింపవలెను - ఇతరులవలని భయముతో నేను పనులను చేయుటకు నాకొక నియంత లేడు - నన్ను నా పనులలో నియమించువాడు లేడు)

  1. అధ్యాత్మాధి దైవిక భేదజాతస్య సర్వస్య ఏష ఏవ ఈశ్వవరః - సర్వేశ్వరః -

(అధ్యాత్మికము, ఆధి దైవికము అను భేదములతోనుండు ఈ ప్రపంచమంతటికీ ఇతనే ఈశ్వరుడు. అందుచేత ఈతను సర్వేశ్వరుడు).

  1. “కాలస్య హి చ మృత్యోశ్చ జంగమ స్థావరస్య చ |

ఈశతే భగవాన్ ఏకః సత్యమేవ బ్రలీమితే ||“. (భారతము - ఉద్యోగపర్వము -)

(కాలమునకు మృత్యువునకు, చరాచరవస్తువులను శాసించువాడు ఒక్కడే భగవంతుడు - సర్వేశ్వరుడు - ఇది నిజమే -).

  1. “వేఱే మఱియొక ప్రకారంబున జేయరాని యందువలన మనుష్యుండు సమర్థుండు గాకుండుటం జేసి ఈశ్వరునకు సర్వేశ్వరత్వంబు”

(వివేకచింతామణి - 1)

  1. “వ. - - - ఉపాదాన భూతంబైన ద్రవ్యంబును, ద్రివిధంబైన కర్మంబును గల కాష్టాద్యుపాధి భిన్నంబయిన కాలంబును, జ్ఞానాదికంబగు జీవ స్వభావంబును భోక్తయగు జీవుండెవ్వని యనుగ్రహంబునం జేసి వర్తించుచుండు, నెవ్వని యుపేక్షం జేసి వర్తింపకుండు నట్టి ప్రభావంబుగల సర్వేశ్వరుండు దానేకమయ్యు ననేకంబుగా దలంచి - - - ||”. (శ్రీమదాంధ్రమహాభాగవతము 2 - 10 - 268)

  2. “ప్రాజ్ఞ దృష్టి వికల్పిత పంచ బ్రహ్మాత్మనా సృష్ట్యాది పంచ కృత్య సంపన్నః సర్వశ్చా సావీశ్వరః ఇతి సర్వేశ్వరః”.

(ప్రాజ్ఞ దృష్టి వికల్పిత పంచ బ్రహ్మలు తానే అయి సృష్టి ప్రారంభమునపంచ కృత్యలు గలవాడును, అన్నింటికి ఈశ్వరుడైనవాడు సర్వేశ్వరుడు).

  1. సర్వేషా మీశ్వరాణామీశ్వరః సర్వేశ్వరః -

(ఈశ్వరులందఱికి ఈశ్వరుడైనవాడు - ప్రభువులైనవారందఱికి ప్రభువైనవాడు).

  1. “తమీశ్వరాణాం పరమం మహేశ్వరం న తత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే” ఇతి వాక్యయుగళార్థే వివక్షితః.

(ఈశ్వరులు, ప్రభువులైనందఱిలోను ఉత్కృష్టమైనవాడు మహేశ్వరుడు. అతనితో సమానమైన వాడు లేడు. అతని కంటె గొప్పవాడు లేడు - అను ఈ రెండు వాక్యములవలన అతను సర్వేశ్వరుడు).

Transliteration
  1. sarvasyādhipatiḥ, sarvēṣāṃ niyaṃtā -

(anniṃṭiki adhipati ayinavāḍu; aṃdaṟini niyamiṃcuvāḍu).

  1. sarvasya cētanā cētanātmakasya jagataḥ īśvarō niyaṃtā.

(cētanā cētanamulugala jagattu aṃtaṭiki īśvaruḍu, niyaṃta - niyamiṃcuvāḍu)

  1. “sarvaiśyaryēṇa saṃpannō nāmnā sarvēśvara svayaṃ” (vāyuvīyasaṃhita)

(annividhamula aiśvaryamu - īśvaratvamu, niyamanaśakti galavāḍu kanuka sarvēśvaruḍu).

  1. “tvaṃ kartā sarvalōkānāṃ bhartā, hartā niyāmakaḥ |

bhuktidō muktidaścatvaṃ siddhi da siddha vaṃditaḥ |

sarvaiśvaryēṇa saṃpannō nāmnā sarvēśaraḥ śrutaḥ ||“. (skāṃdē)

(lōkamulanniṃṭiki kartavu, bhartavu, saṃhariṃcuvāḍavu, niyamiṃcuvāḍavu - muktini, bhuktini siddhini iccuvāḍavu - siddhulacēta namaskariṃpabaḍuvāḍavu - anni vidhamulaina aiśvaryamu - īśvaratvamu kalavāḍavu - kanuka sarvēśvaruḍavani ceppabaḍucunnāvu)

  1. śṛti smṛtī hi mamaivājñā, sāca anyaiḥ anuvartanīyā, na ca mē niyaṃtyatvaṃtaramasti yadadhīna pratyavāya bhayāt kuryāmi iti bhāvaḥ.

(śrutulu smṛtulu nā ājñayē - vāṭini itarulu pāṭiṃcavalenu, vāṭilō ceppina prakāramu pravartiṃpavalenu - itarulavalani bhayamutō nēnu panulanu cēyuṭaku nākoka niyaṃta lēḍu - nannu nā panulalō niyamiṃcuvāḍu lēḍu)

  1. adhyātmādhi daivika bhēdajātasya sarvasya ēṣa ēva īśvavaraḥ - sarvēśvaraḥ -

(adhyātmikamu, ādhi daivikamu anu bhēdamulatōnuṃḍu ī prapaṃcamaṃtaṭikī itanē īśvaruḍu. aṃducēta ītanu sarvēśvaruḍu).

  1. “kālasya hi ca mṛtyōśca jaṃgama sthāvarasya ca |

īśatē bhagavān ēkaḥ satyamēva bralīmitē ||“. (bhāratamu - udyōgaparvamu -)

(kālamunaku mṛtyuvunaku, carācaravastuvulanu śāsiṃcuvāḍu okkaḍē bhagavaṃtuḍu - sarvēśvaruḍu - idi nijamē -).

  1. “vēṟē maṟiyoka prakāraṃbuna jēyarāni yaṃduvalana manuṣyuṃḍu samarthuṃḍu gākuṃḍuṭaṃ jēsi īśvarunaku sarvēśvaratvaṃbu”

(vivēkaciṃtāmaṇi - 1)

  1. “va. - - - upādāna bhūtaṃbaina dravyaṃbunu, drividhaṃbaina karmaṃbunu gala kāṣṭādyupādhi bhinnaṃbayina kālaṃbunu, jñānādikaṃbagu jīva svabhāvaṃbunu bhōktayagu jīvuṃḍevvani yanugrahaṃbunaṃ jēsi vartiṃcucuṃḍu, nevvani yupēkṣaṃ jēsi vartiṃpakuṃḍu naṭṭi prabhāvaṃbugala sarvēśvaruṃḍu dānēkamayyu nanēkaṃbugā dalaṃci - - - ||”. (śrīmadāṃdhramahābhāgavatamu 2 - 10 - 268)

  2. “prājña dṛṣṭi vikalpita paṃca brahmātmanā sṛṣṭyādi paṃca kṛtya saṃpannaḥ sarvaścā sāvīśvaraḥ iti sarvēśvaraḥ”.

(prājña dṛṣṭi vikalpita paṃca brahmalu tānē ayi sṛṣṭi prāraṃbhamunapaṃca kṛtyalu galavāḍunu, anniṃṭiki īśvaruḍainavāḍu sarvēśvaruḍu).

  1. sarvēṣā mīśvarāṇāmīśvaraḥ sarvēśvaraḥ -

(īśvarulaṃdaṟiki īśvaruḍainavāḍu - prabhuvulainavāraṃdaṟiki prabhuvainavāḍu).

  1. “tamīśvarāṇāṃ paramaṃ mahēśvaraṃ na tatsamaścābhyadhikaśca dṛśyatē” iti vākyayugaḷārthē vivakṣitaḥ.

(īśvarulu, prabhuvulainaṃdaṟilōnu utkṛṣṭamainavāḍu mahēśvaruḍu. atanitō samānamaina vāḍu lēḍu. atani kaṃṭe goppavāḍu lēḍu - anu ī reṃḍu vākyamulavalana atanu sarvēśvaruḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.