(సూర్య చంద్రులు నేత్రములుగా గలవాడు)
(చంద్రునివలె చల్లగాను, సూర్యునివలె తపింపచేయునదిగను నుండు కండ్లు గలవాడు. అనగా, తనకు అనుకూలురగు - భక్తులగు - దేవతలు మొదలగు తనకు నమస్కరించువారలను అనుగ్రహించుట, ఇందుకు విపరీతమైన అసురులు - రాక్షసలు - మొదలగువారిని తపింపచేయుట అను రెండు విధములైన స్వభావములు రెండు కన్నులవలె కలిగియుండువాడు - భక్తులయడల అనుగ్రహము, భక్తులుకానివారియడల నిగ్రహము (ఆగ్రహము) కనపఱచువాడు).
(“నేనే యజ్ఞము” అను మొదలగు వాటివలె, సూర్యచంద్రులు నేత్రముగా గలవాడు అనునది కూడ వ్యవహరించుకొనవలెను. యజ్ఞరూపములో భగవంతుని ఉపాసించవలెను - అది తన విభూతి కనుక. అట్లే భగవంతుడు సూర్యచంద్రులు నేత్రములుగా గలవాడు అనునది ఉపాసనకొఱకు చెప్పబడీంది. “భగవంతుని మనస్సునుండి చంద్రుడు పుట్టెను, కండ్లనుండి సూర్యుడు పుట్టెను” అని చెప్పబడినది.)
(‘సూర్యచంద్రులు నేత్రములుగా గలవాడు’ అని చెప్పుటచేత సూర్యచంద్రులు భగవంతుని నేత్రములని అభిప్రాయముకాదు, పరబ్రహ్మకు రూపమే లేనందున కండ్ల గుఱించి చెప్పనవకాశమే లేదు - పరబ్రహ్మ నిరాకార నిరవయము - పరబ్రహ్మకు రూపమున్నదను పక్షమున అది విశ్వరూపము - ప్రపంచమ్నతా అతని రూపమే, లెక్కలేనన్ని కండ్లు గలవాడు విశ్వరూపుడు - ‘విశాక్షం’ - చంద్ర సూర్యులే అని రెండు నేత్రములే ఏమిటి అట్టి విశ్వరూపములో కూడ కొన్ని చోట్ల చంద్రుని పోలినవి, కొన్ని చోట్ల సూర్యుని పోలినవి కండ్లు గలవని చెప్పుటకు వీలుకానందున అన్నింటికీ ఈ ఉభయ విధములు వర్తింపచేయవలయును).
(ఆదిమధ్యాంతములు - జననమరణములు లేనివాడు, అంతములేని వీర్యము - శక్తిసామర్థ్యములు - కలవాడు, సూర్య చంద్రులు నేత్రములుగా గలవాడు సూర్య చంద్రులవంటి కండ్లు గలవాడుగా, నిన్ను చూచుచున్నాను)
(sūrya caṃdrulu nētramulugā galavāḍu)
(caṃdrunivale callagānu, sūryunivale tapiṃpacēyunadiganu nuṃḍu kaṃḍlu galavāḍu. anagā, tanaku anukūluragu - bhaktulagu - dēvatalu modalagu tanaku namaskariṃcuvāralanu anugrahiṃcuṭa, iṃduku viparītamaina asurulu - rākṣasalu - modalaguvārini tapiṃpacēyuṭa anu reṃḍu vidhamulaina svabhāvamulu reṃḍu kannulavale kaligiyuṃḍuvāḍu - bhaktulayaḍala anugrahamu, bhaktulukānivāriyaḍala nigrahamu (āgrahamu) kanapaṟacuvāḍu).
(“nēnē yajñamu” anu modalagu vāṭivale, sūryacaṃdrulu nētramugā galavāḍu anunadi kūḍa vyavahariṃcukonavalenu. yajñarūpamulō bhagavaṃtuni upāsiṃcavalenu - adi tana vibhūti kanuka. aṭlē bhagavaṃtuḍu sūryacaṃdrulu nētramulugā galavāḍu anunadi upāsanakoṟaku ceppabaḍīṃdi. “bhagavaṃtuni manassunuṃḍi caṃdruḍu puṭṭenu, kaṃḍlanuṃḍi sūryuḍu puṭṭenu” ani ceppabaḍinadi.)
(‘sūryacaṃdrulu nētramulugā galavāḍu’ ani ceppuṭacēta sūryacaṃdrulu bhagavaṃtuni nētramulani abhiprāyamukādu, parabrahmaku rūpamē lēnaṃduna kaṃḍla guṟiṃci ceppanavakāśamē lēdu - parabrahma nirākāra niravayamu - parabrahmaku rūpamunnadanu pakṣamuna adi viśvarūpamu - prapaṃcamnatā atani rūpamē, lekkalēnanni kaṃḍlu galavāḍu viśvarūpuḍu - ‘viśākṣaṃ’ - caṃdra sūryulē ani reṃḍu nētramulē ēmiṭi aṭṭi viśvarūpamulō kūḍa konni cōṭla caṃdruni pōlinavi, konni cōṭla sūryuni pōlinavi kaṃḍlu galavani ceppuṭaku vīlukānaṃduna anniṃṭikī ī ubhaya vidhamulu vartiṃpacēyavalayunu).
(ādimadhyāṃtamulu - jananamaraṇamulu lēnivāḍu, aṃtamulēni vīryamu - śaktisāmarthyamulu - kalavāḍu, sūrya caṃdrulu nētramulugā galavāḍu sūrya caṃdrulavaṃṭi kaṃḍlu galavāḍugā, ninnu cūcucunnānu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.