“ఇంద్రియములైదని వాటియొక్క విషయములైన శబ్దాదులైదని లోకములో ప్రసిద్ధములై యున్నవి, కాని, ఆరవ ఇంద్రియము దానియొక్క విషయము మఱియొకటి కలదని ప్రసిద్ధిలేదు - అందువలన అవి మిధ్యాభూతములు - అటువలెనే అంతఃకరణాధ్యనాత్మ పదార్థములునూ మిధ్యాభూతములే”-
“స్వయంప్రకాశమైన ఆత్మచైతన్యమునందు అవివేకము చేత అధ్యసింపబడినందున అంతఃకరణవృత్తులు స్వయంగా భాసించుటలేదు - ఇట్టి అంతఃకరణవృత్తులయందు సంబంధించినందున ఘటాది విషయములు అపరోక్షముగా నున్నవి. కేవలము జడములైనందున వాస్తవముగా అపరోక్షములు కావుకనుక శ్రుతులచేతను తదనుకూలయుక్తుల చేతను బుద్ధ్యాది విషయములు మిధ్యగా నిశ్చయింప బడినందున అవి షష్టేంద్రియగోచర తుల్యములే -”.
“iṃdriyamulaidani vāṭiyokka viṣayamulaina śabdādulaidani lōkamulō prasiddhamulai yunnavi, kāni, ārava iṃdriyamu dāniyokka viṣayamu maṟiyokaṭi kaladani prasiddhilēdu - aṃduvalana avi midhyābhūtamulu - aṭuvalenē aṃtaḥkaraṇādhyanātma padārthamulunū midhyābhūtamulē”-
“svayaṃprakāśamaina ātmacaitanyamunaṃdu avivēkamu cēta adhyasiṃpabaḍinaṃduna aṃtaḥkaraṇavṛttulu svayaṃgā bhāsiṃcuṭalēdu - iṭṭi aṃtaḥkaraṇavṛttulayaṃdu saṃbaṃdhiṃcinaṃduna ghaṭādi viṣayamulu aparōkṣamugā nunnavi. kēvalamu jaḍamulainaṃduna vāstavamugā aparōkṣamulu kāvukanuka śrutulacētanu tadanukūlayuktula cētanu buddhyādi viṣayamulu midhyagā niścayiṃpa baḍinaṃduna avi ṣaṣṭēṃdriyagōcara tulyamulē -”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.