← Back to ష · Booklets 51–60 (digitized file 6)

షట్చక్రములు ṣaṭcakramulu

Original — తెలుగు

శరీరములోని ఆరు చక్రములు - చక్రాకారముగనున్న నాడుల సమూహము. వీటినే కమలాకారముగ నుండుటవలన షట్కమలములందురు - (చూడుము - షట్కమలములు)

(మూలాధార చక్రములోనున్న కుండలినీ శక్తిని - మీదకు ప్రసరింపచేసి ఒక్కొక్క చక్రము మీదుగా శిరస్సులోనున్న సహస్రారమునకు తీసుకొనిపోయిన అక్కడనుండు బ్రహ్మరంధ్రముద్వారా జీవుడు శరీరమును విడిచి మోక్షమును పొందును. (తిరుపతి కొండలు ఏడును ఈ చక్రములను సూచించును. ఏడవకొండమీదనున్న శ్రీ వేంకటేశ్వరుని దర్శించుటకు క్రింద ఆరు కొండలను ఎక్కవలెను - ఈ ఏడు కొండలు సప్త కుల పర్వతములకు ప్రతీకములు). ఈ చక్రములలో - చక్ర రూపములోనున్న నాడులలో - భగవంతుదు తన చైతన్య శక్తి రూపములో నున్నాడని యోగుల నమ్మకము - శరీరమంతటకు శక్తి రూపముతో (చిచ్ఛక్తి రూపముతో) నుండు భగవంతుడు శరీరములోని ఈ చక్రాకారము గల నాడీ భాగములో నున్నాడనుటకు ఆక్షేపణ లేదు)

Transliteration

śarīramulōni āru cakramulu - cakrākāramuganunna nāḍula samūhamu. vīṭinē kamalākāramuga nuṃḍuṭavalana ṣaṭkamalamulaṃduru - (cūḍumu - ṣaṭkamalamulu)

(mūlādhāra cakramulōnunna kuṃḍalinī śaktini - mīdaku prasariṃpacēsi okkokka cakramu mīdugā śirassulōnunna sahasrāramunaku tīsukonipōyina akkaḍanuṃḍu brahmaraṃdhramudvārā jīvuḍu śarīramunu viḍici mōkṣamunu poṃdunu. (tirupati koṃḍalu ēḍunu ī cakramulanu sūciṃcunu. ēḍavakoṃḍamīdanunna śrī vēṃkaṭēśvaruni darśiṃcuṭaku kriṃda āru koṃḍalanu ekkavalenu - ī ēḍu koṃḍalu sapta kula parvatamulaku pratīkamulu). ī cakramulalō - cakra rūpamulōnunna nāḍulalō - bhagavaṃtudu tana caitanya śakti rūpamulō nunnāḍani yōgula nammakamu - śarīramaṃtaṭaku śakti rūpamutō (cicchakti rūpamutō) nuṃḍu bhagavaṃtuḍu śarīramulōni ī cakrākāramu gala nāḍī bhāgamulō nunnāḍanuṭaku ākṣēpaṇa lēdu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.