← Back to ష · Booklets 51–60 (digitized file 6)

షట్కమలములు ṣaṭkamalamulu

Original — తెలుగు
  1. ఆరు ఆధార చక్రములు - (ఆధారకమలములు)

  2. “మూలాధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తుమేహనం |

నాభిస్తు మణిపూరాఖ్యం, హృదయాబ్జమనాహతం |

తాలుమూలం విశుద్ధాఖ్యం, ఆజ్ఞాఖ్యం నిటలాంబుజం |

సహస్రారం బ్రహ్మరంధ్ర మిత్యాగమ విదో విదుః ||“.

(గుదస్థానమందున్నది మూలాధారము - మిగిలిన నాడీ చక్రములకు ఆధారమైనది; లింగస్థానముననున్నది స్వాధిష్ఠానము; నాభియందున్నది మణిపూరకము; హృదయమున నున్నది అనాహతము; కంఠమున నున్నది విశుద్ధాఖ్యము; కనుబొమలనడుమ నున్నది ఆజ్ఞాచక్రము; బ్రహ్మరంధ్రమున (శిరస్సులో) నున్నది సహస్రారము - వీటికి అధిదేవతలు గనపతి, బ్రహ్మ, విష్ణువు, శివుడు, సదాశివుడు (మాయాధీశుడైన శివుడు - మాయనతిక్రమించిన శివుడు)

Transliteration
  1. āru ādhāra cakramulu - (ādhārakamalamulu)

  2. “mūlādhāraṃ gudasthānaṃ, svādhiṣṭhānaṃ tumēhanaṃ |

nābhistu maṇipūrākhyaṃ, hṛdayābjamanāhataṃ |

tālumūlaṃ viśuddhākhyaṃ, ājñākhyaṃ niṭalāṃbujaṃ |

sahasrāraṃ brahmaraṃdhra mityāgama vidō viduḥ ||“.

(gudasthānamaṃdunnadi mūlādhāramu - migilina nāḍī cakramulaku ādhāramainadi; liṃgasthānamunanunnadi svādhiṣṭhānamu; nābhiyaṃdunnadi maṇipūrakamu; hṛdayamuna nunnadi anāhatamu; kaṃṭhamuna nunnadi viśuddhākhyamu; kanubomalanaḍuma nunnadi ājñācakramu; brahmaraṃdhramuna (śirassulō) nunnadi sahasrāramu - vīṭiki adhidēvatalu ganapati, brahma, viṣṇuvu, śivuḍu, sadāśivuḍu (māyādhīśuḍaina śivuḍu - māyanatikramiṃcina śivuḍu)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.