సద్భిః సంగః (సత్పురుషుల సహవాసము)
సతం సంగమః (సత్పురుషులతో కలియుట)
మహత్సంగము (మహాత్ములతో కలిసియుండుట)
సజ్జన సమాగమః (సజ్జనులతో సహవాసము).
“సాధుసంగంబుసకలార్థ సాధనంబు”
(సాధువులతో పొత్తు సకలార్థములను - అన్ని పనులను - సాధించునది. ధర్మార్థకామమోక్షములను నాఉగు విధముల పురుషార్థములను సాధిచునది)
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 23 - 809)
(జీవులు ఒకరితోనొకరు కలిసిన వారి పాపపుణ్యములు వీరికి, వీరి పాపపుణ్యములు వారికి అలవడును - అట్లే సత్పురుషుల సాంగత్యము సద్గతికి (మోక్షమునకు) కారణమగును).
విచారః పరమం జ్ఞానం శమశ్చ పరమం సుఖం
(సంతోషము గొప్పలాభము - సత్సంగము గొప్ప ధనము, వేదార్థ వాక్యముల విచారము గొప్ప జ్ఞానము, శమము, గొప్ప సుఖము).
(మానవ జన్మ, మోక్షము, మహాపురుషుల సంగమము - ఈ మూడును దొరుకుట చాలా కష్టము - ఇవి దేవుని కటాక్షమువలననే కలుగును).
“లభ్యతే(అ)పి తత్కృపయైవ” (నారద భక్తి సూత్రములు - 40)
(మహాత్ముల సహవాసము లభించుట కష్టమైనది, అలవికానిది, అమోఘము - అవి భగవంతుని దయవలననే కలుగును).
తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠప్రియ దర్శనం” (శ్రీమద్భాగవతం - 11 - 2 - 19)
(మానవులకు క్షణభంగురము అగు మానుషదేహము దొరుకుట కష్టము. ఆ మానవజన్మ దొరికినను సత్పురుషుల (విష్ణు భక్తుల) దర్శనము దొరుకుట కష్టము).
భగవత్సంగి సంగస్య మర్త్యానా కిముతా శషః ||“. (శ్రీమద్భాగవతం - 1 - 11 - 13)
(భగవత్భక్తులతోడి సంగముతో స్వర్గముకాని, మోక్షముకాని లేశమాత్రము తులతూగలేవు - సాటిరావు).
పరంపదం ప్రయాంత్యేవ మహద్భిరవలోకితాః |
కళేబరం వా తద్భస్మ తద్ధూమం వాపి సత్తామ |
యది పశ్యతి పుణ్యాత్మా స ప్రయాతి పరంగతిం ||“.
(పంచమహాపాతకములు చేసిన వారైనను ఉప్పాతకములు చేసినవారైనను వారిని మహాపురుషులు చూచినట్లైన పరమపదమును (మోక్షమును) పొందుదురు. మహాపురుషుల కళేబరముకాని, వాటి పొఘకాని, వారి భస్మముకాని చూచిన పుణ్యాత్ములు పరమపదము పొందుదురు).
(సత్పురుషుల సంగముచేత భగవంతుని గుఱించి అయిన కథలందు, భగవంతుని నామములందు, భగవంతునియందు ప్రీతి కలిగి యుండుటయందు - భక్తి కలిగియుండుట, సదాచారమందు, శాస్త్రమందు, వివేకమందు, వైరాగ్యమందు, మంచి అభ్యాసమునందు, భగవంతుని సేవయందు, సరలతయందు, నమ్రతయందు, క్షేమమందు, తితిక్షయందు, శౌచమందు, దయయందు, అహింసయందు, సత్యమందు, బ్రహ్మచర్యమందు, నిరభిమానమందు శాంతి మొదలగువాటియందు ప్రవృతి కలుగును - ఒఇంతేకాక మనుష్యుడు సదాచార పరాయణుడు, పరమ భక్తుడు అగును)
(సత్సంగము పురుషులకు ఏమి చేయదో చెప్పుము - అనగా అన్నింటిని కలుగచేయునని అర్థము)
(మనుష్యులలో సత్పురుషులు, అసత్పురుషులు కలుగుటలో వృద్దులుకాని, నీచాతి నీచులుగాని అగుటలో యీ చెప్పబడిన పది వస్తువులు కారణమగుచున్నవి :- స్థానము, అన్నము, జలము, పరివారము, ప్రతిదేశదృశ్యము - సాహిత్యము, ఆలోచన, ఆజీవికాకార్యము, ఉపాసన, ఈ వస్తువులన్నియు సాత్వికములైనచో, అప్పుడు వీటిని సేవించుటచేత సాత్వికత వృద్ధిపొందును; (ఏతేషామేవ సేవనా సత్సంగః) వీటిని సేవించుటయే సత్సంగము)
నప్పుడ బంధంబులన్నియు దెగిపోవు, బంధమోక్షంబైన బ్రాప్తమగును
సత్సంగమంబు; సత్సంగమంబున నీదు భక్తి సిద్ధించు, నీ భక్తివలన
సన్ముక్తియగు - - - “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 10 - పూ.భా. - 1665)
వివేకపాదపన్యైవ భోగ మోక్షౌ ఫలేస్మృతౌ ||“. (యోగవాశిష్టము - 11 - 3)
(ఎప్పుడు సాధువులతో - సత్పురుషులతో, సజ్జనులతో సంగము చేసిన అప్పుడు వివేకముదయించును - భోగము, మోక్షము అని రెండును వివేకమను వృక్షముయొక్క ఫలములు)
sadbhiḥ saṃgaḥ (satpuruṣula sahavāsamu)
sataṃ saṃgamaḥ (satpuruṣulatō kaliyuṭa)
mahatsaṃgamu (mahātmulatō kalisiyuṃḍuṭa)
sajjana samāgamaḥ (sajjanulatō sahavāsamu).
“sādhusaṃgaṃbusakalārtha sādhanaṃbu”
(sādhuvulatō pottu sakalārthamulanu - anni panulanu - sādhiṃcunadi. dharmārthakāmamōkṣamulanu nāugu vidhamula puruṣārthamulanu sādhicunadi)
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 23 - 809)
(jīvulu okaritōnokaru kalisina vāri pāpapuṇyamulu vīriki, vīri pāpapuṇyamulu vāriki alavaḍunu - aṭlē satpuruṣula sāṃgatyamu sadgatiki (mōkṣamunaku) kāraṇamagunu).
vicāraḥ paramaṃ jñānaṃ śamaśca paramaṃ sukhaṃ
(saṃtōṣamu goppalābhamu - satsaṃgamu goppa dhanamu, vēdārtha vākyamula vicāramu goppa jñānamu, śamamu, goppa sukhamu).
(mānava janma, mōkṣamu, mahāpuruṣula saṃgamamu - ī mūḍunu dorukuṭa cālā kaṣṭamu - ivi dēvuni kaṭākṣamuvalananē kalugunu).
“labhyatē(a)pi tatkṛpayaiva” (nārada bhakti sūtramulu - 40)
(mahātmula sahavāsamu labhiṃcuṭa kaṣṭamainadi, alavikānidi, amōghamu - avi bhagavaṃtuni dayavalananē kalugunu).
tatrāpi durlabhaṃ manyē vaikuṃṭhapriya darśanaṃ” (śrīmadbhāgavataṃ - 11 - 2 - 19)
(mānavulaku kṣaṇabhaṃguramu agu mānuṣadēhamu dorukuṭa kaṣṭamu. ā mānavajanma dorikinanu satpuruṣula (viṣṇu bhaktula) darśanamu dorukuṭa kaṣṭamu).
bhagavatsaṃgi saṃgasya martyānā kimutā śaṣaḥ ||“. (śrīmadbhāgavataṃ - 1 - 11 - 13)
(bhagavatbhaktulatōḍi saṃgamutō svargamukāni, mōkṣamukāni lēśamātramu tulatūgalēvu - sāṭirāvu).
paraṃpadaṃ prayāṃtyēva mahadbhiravalōkitāḥ |
kaḷēbaraṃ vā tadbhasma taddhūmaṃ vāpi sattāma |
yadi paśyati puṇyātmā sa prayāti paraṃgatiṃ ||“.
(paṃcamahāpātakamulu cēsina vārainanu uppātakamulu cēsinavārainanu vārini mahāpuruṣulu cūcinaṭlaina paramapadamunu (mōkṣamunu) poṃduduru. mahāpuruṣula kaḷēbaramukāni, vāṭi poghakāni, vāri bhasmamukāni cūcina puṇyātmulu paramapadamu poṃduduru).
(satpuruṣula saṃgamucēta bhagavaṃtuni guṟiṃci ayina kathalaṃdu, bhagavaṃtuni nāmamulaṃdu, bhagavaṃtuniyaṃdu prīti kaligi yuṃḍuṭayaṃdu - bhakti kaligiyuṃḍuṭa, sadācāramaṃdu, śāstramaṃdu, vivēkamaṃdu, vairāgyamaṃdu, maṃci abhyāsamunaṃdu, bhagavaṃtuni sēvayaṃdu, saralatayaṃdu, namratayaṃdu, kṣēmamaṃdu, titikṣayaṃdu, śaucamaṃdu, dayayaṃdu, ahiṃsayaṃdu, satyamaṃdu, brahmacaryamaṃdu, nirabhimānamaṃdu śāṃti modalaguvāṭiyaṃdu pravṛti kalugunu - oiṃtēkāka manuṣyuḍu sadācāra parāyaṇuḍu, parama bhaktuḍu agunu)
(satsaṃgamu puruṣulaku ēmi cēyadō ceppumu - anagā anniṃṭini kalugacēyunani arthamu)
(manuṣyulalō satpuruṣulu, asatpuruṣulu kaluguṭalō vṛddulukāni, nīcāti nīculugāni aguṭalō yī ceppabaḍina padi vastuvulu kāraṇamagucunnavi :- sthānamu, annamu, jalamu, parivāramu, pratidēśadṛśyamu - sāhityamu, ālōcana, ājīvikākāryamu, upāsana, ī vastuvulanniyu sātvikamulainacō, appuḍu vīṭini sēviṃcuṭacēta sātvikata vṛddhipoṃdunu; (ētēṣāmēva sēvanā satsaṃgaḥ) vīṭini sēviṃcuṭayē satsaṃgamu)
nappuḍa baṃdhaṃbulanniyu degipōvu, baṃdhamōkṣaṃbaina brāptamagunu
satsaṃgamaṃbu; satsaṃgamaṃbuna nīdu bhakti siddhiṃcu, nī bhaktivalana
sanmuktiyagu - - - “. (śrīmadāṃdhramahābhāgavatamu - 10 - pū.bhā. - 1665)
vivēkapādapanyaiva bhōga mōkṣau phalēsmṛtau ||“. (yōgavāśiṣṭamu - 11 - 3)
(eppuḍu sādhuvulatō - satpuruṣulatō, sajjanulatō saṃgamu cēsina appuḍu vivēkamudayiṃcunu - bhōgamu, mōkṣamu ani reṃḍunu vivēkamanu vṛkṣamuyokka phalamulu)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.