← Back to స · Booklets 51–60 (digitized file 6)

సత్సమృద్ధి satsamṛddhi

Original — తెలుగు

“ఘటమున్నది, పటమున్నది” ఇత్యాది వ్యవహారమున ఘటాదులయందే నామరూపములచేతనగు భేదము తోచుచిన్నది, ‘ఉన్నది’ అని చెప్పబడిన సర్పదార్థమగు ఉనికియందు నామరూపభేదము కాన్పించుటలేదు - కనుక ఘటాదులయందు మాయాకల్పితమగు నామరూపభేదము సత్యముకాదు. ఈ ఘటాదులన్నింటియందును సద్రూపముచేత (ఉనికిచేత) నిండియున్న బ్రహ్మము సత్ సమృద్ధము అని చెప్పబడుచున్నది.

(దీని యర్థము ఈ క్రింది విధముగ తెలియనగుచున్నది. ప్రతి వస్తువులోను ప్రకృతి అంస భగవంతుని చైతన్యశక్తియొక్క అంశ కలిగియున్నది. భగవంతుని శక్తి అంశమాత్రముగా అయినను లేనిదే ప్రపంచములో ఏ వస్తువైనను ప్రకాశింపదు - ‘ఉన్నది’ అనిపించుకొనదు - ప్రకృతి పరిణామములకు వస్తువులన్నియు భగవంతునియొక్క (సత్పదార్థముయొక్క) అంశతో పూర్తిగా నిండియున్నవి. అందుచేతనే సత్ (చైతన్యశక్తి) అన్నింటిలోను సమృద్ధిగా నున్నది. –

“క. హరిమయము విశ్వమంతయు

హరి విశ్వమయుండు సంసయము పనిలేదా

హరిమయము గాని ద్రవ్యము

పరమాణువు లేదు, వంశపావన వింటే“. (శ్రీమదాంధ్రమహాభాగవతము -)

Transliteration

“ghaṭamunnadi, paṭamunnadi” ityādi vyavahāramuna ghaṭādulayaṃdē nāmarūpamulacētanagu bhēdamu tōcucinnadi, ‘unnadi’ ani ceppabaḍina sarpadārthamagu unikiyaṃdu nāmarūpabhēdamu kānpiṃcuṭalēdu - kanuka ghaṭādulayaṃdu māyākalpitamagu nāmarūpabhēdamu satyamukādu. ī ghaṭādulanniṃṭiyaṃdunu sadrūpamucēta (unikicēta) niṃḍiyunna brahmamu sat samṛddhamu ani ceppabaḍucunnadi.

(dīni yarthamu ī kriṃdi vidhamuga teliyanagucunnadi. prati vastuvulōnu prakṛti aṃsa bhagavaṃtuni caitanyaśaktiyokka aṃśa kaligiyunnadi. bhagavaṃtuni śakti aṃśamātramugā ayinanu lēnidē prapaṃcamulō ē vastuvainanu prakāśiṃpadu - ‘unnadi’ anipiṃcukonadu - prakṛti pariṇāmamulaku vastuvulanniyu bhagavaṃtuniyokka (satpadārthamuyokka) aṃśatō pūrtigā niṃḍiyunnavi. aṃducētanē sat (caitanyaśakti) anniṃṭilōnu samṛddhigā nunnadi. –

“ka. harimayamu viśvamaṃtayu

hari viśvamayuṃḍu saṃsayamu panilēdā

harimayamu gāni dravyamu

paramāṇuvu lēdu, vaṃśapāvana viṃṭē”. (śrīmadāṃdhramahābhāgavatamu -)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.